15 లక్షల మంది, రూ. 1200 కోట్లు : డిజిటల్ యాప్‌ స్కాం సంచలనం | Gujarat app drew investors nationwide Rs 1200 crore fraud | Sakshi
Sakshi News home page

15 లక్షల మంది, రూ. 1200 కోట్లు : డిజిటల్ యాప్‌ స్కాం సంచలనం

Nov 2 2026 3:17 PM | Updated on Nov 2 2026 3:43 PM

Gujarat app drew investors nationwide  Rs 1200 crore fraud

Gujarat SD Pay Scam గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలో  రూ. 1,200 కోట్ల డిజిటల్ వాలెట్ యాప్‌  భారీ స్కాం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తక్కువ పెట్టుబడితో రోజు వారీ భారీ లాభాలు ఆశజూపి, లక్షలాది మందిని మోసం చేసిన వైనాన్ని పోలీసులు గుర్తించారు. మల్టీ-లెవల్ మార్కెటింగ్ ద్వారా ఈ ఆపరేషన్  నడిపి ఇన్వెస్టర్లను నట్టేట ముంచేశారు. చివరికి యాప్‌ను తొలగించడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది.

సైబర్ క్రైమ్ పోలీసుల వివరాల ప్రకారం గుజరాత్‌కు చెందిన 'SD Pay' (అప్నా పే) డిజిటల్ వ్యాలెట్ యాప్ ద్వారా ఇన్వెస్టర్లను మోసం చేసి రూ. 1,200 కోట్ల సైబర్ స్కామ్‌కి పాల్పడ్డారు.  సెమినార్లు, జూమ్ కాల్‌లు , వివిధ మార్కెటింగ్ పద్ధతుల ద్వారా వారిని నమ్మించి, వారి పొదుపు సొమ్మును కాజేసింది.  వడోదరకు చెందిన 48 ఏళ్ల ఉపాధ్యాయిని సింగిల్‌ మదర్‌. ఆమెకు కాలేజీలో చదివే ఒక కొడుకు ఉన్నాడు.  ఈ యాప్‌ మాయలో పడి తన 2025లో 1BHK అపార్ట్‌మెంట్‌ను  అమ్మి మరీ రూ. 9.5 లక్షలను అప్నా పే డిజిటల్ వాలెట్ యాప్‌లో పెట్టుబడిగా పెట్టారు.  అంతేకాదు మరో 31 మంది  స్నేహితులను, బంధువులను కూడా ఇందులో చేర్పించింది. 2026 మధ్యకాలానికి ఆమె డిజిటల్ వాలెట్‌లో రూ. 50 లక్షలకు చేరినట్టు చూపింంచింది. అంతలోనే  2026 మధ్యలో ఆ యాప్ మూసి వేశారు. దీంతో తాను మోస పోయినట్టు గ్రహించారు.

గతంలో  నెట్‌వర్క్ మార్కెటింగ్ వ్యాపారం చేసేఈమె, 2025 జూలైలో వడోదరలో 'SD Pay'ని నిర్వాహకుణ్నిని కలిశారు. మొదట ఆమె ఈ ఆప్‌లో చేరేందుకు నిరాకరించింది.  కానీ   'ఎస్క్రో వాలెట్' (escrow wallet) , కొన్ని పత్రాలను చూపించారు. అయినా ఆమె ఒప్పుకోలేదు. ఇక చివరి అస్త్రంగా సంతకం చేసిన ఒక ఖాళీ చెక్కును ఇచ్చి,నమ్మకం లేకపోతే,  ఇందులో  కావలసిన మొత్తాన్ని రాసుకుని ఎప్పుడైనా నగదు తీసు కోవచ్చు అని చెప్పారు. అంతే  ఆమె పూర్తిగా వారి మాయలో పడిపోయానని చెప్పుకొచ్చారు.   చివరికి ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) ప్రారంభిస్తుందని పెట్టుబడిదారులను నమ్మించారు.

మరో కేసులో, సురేంద్రనగర్‌కు చెందిన  ఒకరు ఈ లాభాలతో  రాబడులతో ఇల్లు కొనుగోలు చేయాలనే ఆశతో,  పర్సనల్‌ లోన్‌, గోల్డ్‌ లోన్‌ తీసుకొని మరీ  రూ. 60 లక్షలు పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. సూరత్‌కు చెందిన ఒక పెట్టుబడిదారుడు తన ప్రారంభ  రూ. 1,000 పెట్టుబడిని  రూ కోటిగా మార్చి, సుమారు 1.6 లక్షల మంది పెట్టుబడిదారులతో కూడిన సిఫార్సుల నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. 

ఇదీ చదవండి: పెళ్లికి ఆహ్వానించిన యువకుడు : బెంజ్‌కార్‌ గిఫ్ట్‌, నెటిజన్లు క్యూ!

ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన ధవల్ పటేల్, 2024లో ఈ మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించాడు.  దీని ద్వారా ఉచిత బిల్లు చెల్లింపులు, మొబైల్ రీచార్జ్‌ల పేరుతో ఎక్కువ లాభాలు ఇస్తామని నమ్మించింది. సెమినార్లు, జూమ్ కాల్స్‌తో ఆకట్టు కోవడంతో పాటు, బాధితులకు ఖాళీ సంతకం చేసిన చెక్కులు ఇచ్చి కూడా నమ్మకం కలిగించారు. దాదాపు 15 లక్షల మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. అలా సుమారు 6.52 లక్షల బ్యాంకు ఖాతాల ద్వారా  రూ. 1,211 కోట్లు కాజేశారు.

2026 సెప్టెంబర్‌లో అమ్రేలి జిల్లాలో ఈ కుంభకోణం బయటపడింది. బాధితుల ఫిర్యాదు మేరకు 18 కేసులు నమోదు  చేశారు.  12 మంది నిందితులను అరెస్టు చేసి, గుర్తించారు.  ఇప్పటివరకు రూ. 1,200 కోట్లకు పైగా మోసం జరిగినట్లు నిర్ధారణ అయింది.  వీరి మెసాలు పలు రాష్ట్రాలకు విస్తరించినట్టు గుర్తించారు.  ఆరు కంపెనీలకు చెందిన 38 బ్యాంకు ఖాతాలను, 16 మంది కంపెనీ డైరెక్టర్లు నిర్వహిస్తున్న మరో 72 ఖాతాలను కూడా గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement