సైకో సతాయింపులకు బీటెక్‌ విద్యార్థిని బలి | BTech Student Hima Incident | Sakshi
Sakshi News home page

సైకో సతాయింపులకు బీటెక్‌ విద్యార్థిని బలి

Nov 2 2026 11:17 AM | Updated on Nov 2 2026 11:37 AM

BTech Student Hima Incident

కర్ణాటక: ప్రేమించాలంటూ పోకిరీ నానా విధాలుగా వేధించడంతో తట్టుకోలేక ఉజ్వల భవిత ఉన్న యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద సంఘటన హాసన్‌ జిల్లా సకలేశపుర తాలూకా బాళగోడు గ్రామంలో జరిగింది. వివరాలు.. భవిత–నాగేశ్‌ దంపతుల కూతురు హిమా (23), హిమా మంగళూరులో బీటెక్‌ చివరి ఏడాది చదువుతోంది. గ్రామంలో ఆమెకు బాల్య మిత్రుడైన నౌషాద్‌ ప్రేమించాలని వేధించేవాడు. 

గతంలో షికార్లకు వెళ్లినప్పుడు తీసుకున్న ఫోటోలను చూపిస్తూ బెదిరింపులకు పాల్పడసాగాడు. కొన్ని ఫోటోలను ఇంటర్నెట్‌లో పోస్టు చేయగా, వాటిని తొలగించాలని హిమా వేడుకొంది. కానీ అతడు పట్టించుకోకుండా సతాయించసాగాడు. దీంతో విరక్తి చెందిన హిమా ఇంటిలో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఉన్న ఒక్క  కుమార్తెను పోగొట్టుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎమ్మెల్యే సిమెంట్‌ మంజు ఆమె మృతదేహాన్ని దర్శించి తల్లిదండ్రులను ఓదార్చారు. నిందితునిపై కఠిన  చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పోలీసులకు సూచించారు. 

ఇదీ చదవండి: మహిళా ఉద్యోగులే టార్గెట్‌.. సిరిసిల్లలో వేధింపుల బాగోతం!


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement