ప్రియునికి భలే మర్యాద | Love Incident In Karnataka | Sakshi
Sakshi News home page

ప్రియునికి భలే మర్యాద

Nov 2 2026 11:23 AM | Updated on Nov 2 2026 11:39 AM

Love Incident In Karnataka

యువకులను కట్టేసి దాడి చేస్తున్న జనం

ప్రియురాలిని తీసుకెళ్దామని వచ్చిన ప్రియున్ని గ్రామస్తులు స్తంభానికి కట్టేసి చితకబాదారు. ఈ సంఘటన హావేరి జిల్లా రట్టిహళ్లి తాలూకా బత్తికొప్ప గ్రామంలో జరిగింది. వివరాలు.. రట్టిహళ్లికి చెందిన ప్రమోద్, బత్తికొప్పవాసి భావన ప్రేమించుకున్నారు. పెద్దలు వ్యతిరేకించడంతో గతంలో ఇద్దరూ ఇళ్లు వదిలి వెళ్లిపోయి రిజిస్టర్‌ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే భావన తల్లిదండ్రులు కుమార్తెకు సర్దిచెప్పి ఇంటికి తీసుకువచ్చారు. 

ఇప్పుడు మరోసారి పెళ్లి చేసుకుందాం అని ప్రేయసీ ప్రియుడు సమాచారం ఇచ్చుకున్నారు. ప్రమోద్‌ ఇద్దరు స్నేహితులతో కలిసి బత్తికొప్ప గ్రామానికి వచ్చాడు. ఇది  తెలుసుకున్న భావన తల్లిదండ్రులు గ్రామస్తులతో కలిసి వారిని స్తంభానికి కట్టేసి దుస్తులు చించేసి తీవ్రంగా కొట్టారు. సమాచారం అందుకున్న హంసభావి పోలీసులు గ్రామానికి వచ్చి ప్రమోద్, స్నేహితులను రక్షించారు. దాడిచేసిన వారిపై కేసు నమోదు చేసుకున్నారు. 
-కర్ణాటక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement