breaking news
Register marriage
-
రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను– సంతోష్ శోభన్
‘‘వందేళ్ల ఇండియన్ సినిమాల్లో ఎన్నో పాత్రలు, ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే ఇప్పటివరకూ చెప్పని కథ, ఎవరూ చేయని పాత్రను ఎలివేట్ చేయటం అనేది ఓ ఆర్టిస్ట్‌కి కొత్తగా ఉంటుంది. అలా పెళ్లి మండపంపై మిగిలిపోయేవాడి కథే ‘ప్రేమ్ కుమార్’’ అని హీరో సంతోష్ శోభన్ అన్నారు. సంతోష్ శోభన్, రాశీ సింగ్, రుచితా సాధినేని హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రేమ్ కుమార్’.అభిషేక్ మహర్షి దర్శకత్వంలో శివ ప్రసాద్ పన్నీరు నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజవుతోంది. ఈ సందర్భంగా సంతోష్ శోభన్ మాట్లాడుతూ–‘‘అభిషేక్ కొన్ని సినిమాల్లో నటుడిగా చేశాడు. దర్శకుడు కావాలనుకున్నప్పుడు ‘ప్రేమ్ కుమార్’ కథ రాసుకుని, చక్కగా తీశాడు. వరుసగా వరుడు, పెళ్లి వంటి సినిమాలు చేస్తున్నాను. అయితే నిజ జీవితంలో నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను (నవ్వుతూ). నేనిప్పటి వరకు మంచి డైరెక్టర్స్‌తో సినిమాలు చేశాను. అయితే నేను చేసిన సినిమాలన్నీ కరెక్ట్‌గానే ఎంచుకున్నానా? అంటే లేదనే అంటాను. ‘ప్రేమ్ కుమార్’ నాకు సరైన హిట్ ఇస్తుందనుకుంటున్నాను’’ అన్నారు. -
నయనతార, విఘ్నేష్ సరోగసీ వివాదానికి తెర!
తమిళ సినిమా: ప్రముఖ సినీ నటి నయనతార, సినీ దర్శకుడు విఘ్నేష్ శివన్ దంపతులు సరోగసీ వివాదానికి పుల్‌స్టాప్ పడినట్లు కనిపిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా వారు సరోగసీ విధానంలో కవల పిల్లలకు తల్లిదండ్రులు కావడంపై దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. దీనిపై దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించేందుకు తమిళనాడు ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ విచారణ కూడా చేపట్టింది. నయనతార తన సరోగసీ విధానానికి సంబంధించిన పూర్తి ఆధారాలను కమిటీకి సమర్పించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. తాము ఆరేళ్ల క్రితమే రిజిస్టర్ మేరేజ్ చేసుకున్నట్లు ధ్రువీకరించే సర్టిఫికెట్లను నయనతార ఆ కమిటీకి అందించినట్లు సమాచారం. అదే విధంగా గత డిసెంబర్లో అద్దె గర్భం కోసం రిజిస్టర్ చేసుకుని.. ఇద్దరు మగ కవల పిల్లలకు జన్మనిచ్చినట్లు పేర్కొన్నారు. మరోవైపు సరోగసి విధానం ద్వారా తల్లిదండ్రులు కావాలంటే వివాహమై ఐదేళ్లు పూర్తి కావాల్సి ఉంది. -
బంజారాహిల్స్: పెళ్లి పేరుతో వంచింది..సహజీవనం చేసి...చివరికి
బంజారాహిల్స్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి అయిదు నెలల పాటు సహజీవనం చేసి ఉడాయించిన యువకుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు... జవహర్‌నగర్ సమీపంలోని ఎస్.కె.నగర్లో నివసించే యువతి(24) ఓ ఆస్పత్రిలో కన్సల్టెంట్‌గా పని చేస్తోంది. ఆమెకు నాలుగేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. ఇటీవల ఆమెకు ప్రకాశం జిల్లాకు చెందిన కె.ప్రసాద్(23)తో పరిచయం ఏర్పడి ప్రేమకు దారి తీసింది. పెళ్లి చేసుకుంటానని మెడలో పసుపుతాడు కట్టిన ప్రసాద్ ఆమెతో సహజీవనం చేయసాగాడు. ఇటీవల రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామని ఆమె ఒత్తిడి తీసుకొచ్చింది. రెండు నెలల గర్భం కూడా దాల్చడంతో పెళ్లి చేసుకోవాలంటూ కోరింది. సంక్రాంతి పండుగకు స్వగ్రామానికి వెళ్లిన ప్రసాద్ తిరిగి రాలేదు. ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేయడమే కాకుండా గర్భానికి కారకుడైన ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 420, 417, 493 కింద కేసులు నమోదు చేశారు. (చదవండి: పేరు మార్చి.. ఏమార్చి!) -
సంప్రదాయ వివాహానికి ముందు..రిజిస్టర్ మ్యారేజ్
Katrina Kaif And Vicky Kaushal Wedding Date: హీరోయిన్ల పెళ్లి కబురంటే ఆ సందడే వేరు. బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారనేది బజింగ్ టాక్. అయితే మీడియాకు దూరంగా ఈ వేడుకనుఎంతో రహస్యంగా ప్లాన్ చేస్తున్నారు ఈ లవ్‌బర్డ్స్. కానీ బీటౌన్ ముచ్చట్లకు మాత్రం తెరపడటం లేదు. అతిరథ మహా రథులట, ఎగ్జోటిక్ సెర్మనీ, టైగర్ సఫారీ అట, అంతేకాదండోయ్ ఈ హై-ప్రొఫైల్ వెడ్డింగ్‌కు హాజరయ్యే అతిథులకు బోలెడన్ని కండిషన్లట. 14వ శతాబ్దపు కోటలో సాంప్రదాయ పంజాబీ వివాహంతో ఒక్కటికానున్న ఈ స్టార్ జంట ఈ రోజో రేపో రిజిస్టర్డ్ మ్యారేజీ చేసుకోబోతున్నారట. ప్రత్యేక వివాహ చట్టం (1954 కులాంతర వివాహాల ప్రత్యేక వివాహ చట్టం) కింద తమ పెళ్లిని నమోదు చేసుకోనున్నారు. ఈ వేడుక ముగిసిన అనతరం గ్రాండ్ వెడ్డింగ్ కోసం రాజస్థాన్ ఎగిరి పోనున్నారు. హాట్ టాపిక్‌గా నిలుస్తోన్న క్యాట్-విక్కీ వెడ్డింగ్ అంచనాలపై ఓ లుక్కేద్దాం. View this post on Instagram A post shared by Six Senses Fort Barwara (@sixsensesfortbarwara) -
నేడు ఒక్కటి కానున్న సైనా, కశ్యప్
పదేళ్లుగా ప్రేమించుకుంటున్న భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్‌లు జంటగా మారబోతున్నారు. నేడు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోనున్నారు. హైదరాబాద్ రాయదుర్గంలోని సైనా నివాసం ‘ఒరియన్ విల్లా’లో కుటుంబ సభ్యులు, బంధువులు, అత్యంత ఆప్తుల మధ్య శుక్రవారం వీరి వివాహం జరగనుంది. ఈ వేడుకలకు గవర్నర్ నరసింహన్, విమల దంపతులు ప్రత్యేక అతిథులుగా హాజరు కానున్నారు. రిజిస్టర్మ్యారేజ్ చేసుకోనున్న సైనా, కశ్యప్‌లు రిసెప్షన్‌ను మాత్రం వైభవంగా జరుపుకోనున్నారు.ఈ నెల 16న హైటెక్ సిటీలోని నోవాటెల్ హోటల్లో జరిగే వేడుకల్లో బాలీవుడ్, టాలీవుడ్ తారలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఇప్పటికే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్,దగ్గుబాటి సురేష్‌లతో పాటు ‘అగిలే గ్రూప్ హైదరాబాద్ హంటర్స్’ చీఫ్ ఎండీవీఆర్‌కే రావు, మంత్రి కేటీఆర్, చాముండేశ్వరీనాథ్, రాజకీయ ప్రముఖులకురిసెప్షన్ ఆహ్వాన పత్రికలను అందజేశారు. హిమాయత్‌నగర్: తెలుగువారి కీర్తి, ప్రతిష్టలను, క్రీడా ప్రతిభను ప్రపంచానికి చాటిన బ్యాడ్మింటన్ స్టార్లు జంటగా నేడు ఓ ఇంటివారు కానున్నారు. పదేళ్లుగా ప్రేమలో ఉన్నామని ఇటీవల ప్రకటించిన సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ శుక్రవారం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోనున్నారు. ఇందుకు రాయదుర్గంలోని సైనా నివాసం వేదిక కానుంది. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులతో పాటు వివిధ రంగాల ప్రముఖులు కూడా హాజరవుతున్న ఈ ‘రాకెట్ స్టార్స్’ వివాహ వేడుక సవ్యసాచి ఔట్ఫిట్లో.. నోవాటెల్‌లో జరిగే రిసెప్షన్‌కి సైనా, కశ్యప్ దంపతులు సవ్యసాచి ఔట్ఫిట్తో చేసిన దుస్తులు ధరించనున్నారు. సైనా ‘లెహంగా విత్ వెల్వెట్ దుప్పాట’ దుస్తులు, డైమండ్ జ్యువెలరీతో మెరవనుంది. కశ్యప్ షేర్వానీ విత్ పెన్ జ్యువెలరీలో కనిపించనున్నారు. వీరిస్టైలిష్ట్ని ప్రముఖ డిజైనర్ శ్రావ్యవర్మ చూస్తున్నారు. లెహంగా.. కుర్తీ.. సింప్లిసిటీ.. నేడు జరగనున్న పెళ్లికి మాత్రం సైనా, కశ్యప్ చాలా సింప్లిసిటీ వస్త్రధారణలో కనిపించనున్నారు. సైనా లెహంగాను, కశ్యప్ బేబీ పింక్ కుర్తా అండ్ షేర్వానీ ధరించనున్నారు. 15వ తేదీ రాత్రి 40మంది తోటి క్రీడాకారులకు ‘కాక్టైల్ పార్టీ’ ఇవ్వనున్నారు. ఈ పార్టీలో సైనా గౌన్‌లో, కశ్యప్ పౌడర్ బ్లూ సూట్లో కనిపించనున్నట్లు స్టైలిస్ట్ శ్రావ్యవర్మ తెలిపారు. కొత్తగా కనిపిస్తారు.. సైనా, కశ్యప్లిద్దరూ పదిహేను రోజులుగా సభ్యసాచి ఔట్ఫిట్ దుస్తులు ధరించనున్నారు. ఇంతకు మునుపెన్నడూ చూడని సైనా, కశ్యప్‌లను రిసెప్షన్లో చూపించనున్నాను. – శ్రావ్యవర్మ, స్టైలిస్ట్ రిసెప్షన్‌కు సెలబ్రిటీలు నోవాటెల్‌లో జరిగే రిసెప్షన్లో బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్ సందడి చేయనున్నారు. రణ్‌వీర్‌సింగ్, దీపిక, ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ధోని, సమంత, రకూల్‌ప్రీత్ సింగ్, కీర్తిసురేష్, మిథాలీరాజ్, పీవీ సింధు, గోపీచంద్, అశ్విని పొన్నప్ప తదితరులు హాజరు కానున్నారు. -
ఇంటర్నెట్ కలిపింది ఇద్దరిని..
అన్నానగర్: ఇంటర్నెట్ ద్వారా పరిచయమైన కడలూరు ఉపాధ్యాయురాలిని అరబ్ దేశానికి చెందిన పారిశ్రామికవేత్త గురువారం హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నాడు. కడలూరుకి చెందిన గుణశేఖరన్ కుమార్తె చారులత (32). ఇంజినీర్ పట్టభద్రురాలైన ఈమెకు ఇంటర్నెట్ చాటింగ్ ద్వారా మూడేళ్ల కిందట అరబ్ దేశానికి చెందిన థామస్లూకాస్ రోహన్ స్నేహితుడిగా పరిచయం అయ్యాడు. రెండేళ్ల కిందట చారులత తన స్నేహితుడిని ఇంటికి పిలిచింది. థామస్లూకాస్ కడలూరు వచ్చి పలు స్థలాలు సందర్శించి తన దేశానికి తిరిగి వెళ్లాడు. కొన్ని నెలల తరువాత చారులత అరబ్ దేశానికి వెళ్లింది. ఆ దేశంలో ఆమెకు ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం దొరికింది. దీని తరువాత స్నేహితులు, ప్రేమికులుగా మారారు. గత మార్చి 23న అరబ్ దేశంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. తరువాత వారు హిందూ సంప్రదాయం ప్రకారం తమిళనాడులో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీని ప్రకారం థామస్ లూకాస్ రోహన్, చారులత వీరితో సహా నలుగురు కడలూరు వచ్చారు. వీరికి విరుదాచలం కొళంజియప్పర్ ఆలయంలో గురువారం ఉదయం 10.30 గంటలకు హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. -
నేనూ ప్రేమికుడినే..
‘ప్రేమ.. ఒక అద్భుతమైన భావన. అదో అందమైన అనుభూతి. కొంటెచూపుల గాయాలు...తీపి కలల గేయాలు.. నలుగురిలో ఉన్నా ఒంటరితనం. నవ్వుల బాణాల తుంటరితనం’... ప్రేమలో పడిన వారికి ఇవన్నీ అనుభవంలోకి వస్తాయి. నిజానికి ప్రేమను అనుభూతించని మనిషి ఉండడు. అసలు ప్రేమలేని ప్రపంచాన్ని ఊహించలేం. ప్రేమకు కులమతాల గోడలు అడ్డురావని కొందరు నిరూపిస్తే.. ప్రేమకు ఎల్లలే లేవని చాటిచెప్పేవారు మరికొందరు. కష్టాలొచ్చినా.. కన్నీళ్లొచ్చినా ఎదురొడ్డి నిలిచేందుకు.. ధైర్యంగా పోరాడేందుకు స్ఫూర్తినిచ్చేది ప్రేమేనని ఇంకొందరు. తొలిచూపులో పుట్టేది ఒక్కటే ప్రేమకాదని.. అది జీవితాంతం నిలిస్తేనే అసలైన ప్రేమని.. పలువురు ప్రేమను నిర్వచిస్తున్నారు. కడప కల్చరల్, న్యూస్‌లైన్: ప్రేమించి పెళ్లి చేసుకోవడం సాధారణం. కానీ పెళ్లయ్యాక ఆ ప్రేమను నిలుపుకోవడమే గొప్ప విషయమంటారు పెద్దలు. జన్మనిచ్చి, పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల ప్రేమా, పెళ్లయ్యాక భార్య ప్రేమ, పండు వయసులో పిల్లల ప్రేమను కూడా గమనించమని, గౌరవించమని సూచిస్తున్నారు. సుఖ సంతోషాలే కాదని, కష్టాలు కన్నీళ్లకు చెదరక నిలిచేదే నిజమైన ప్రేమని అంటున్నారు. ప్రేమమయ జీవితాలలో ప్రేమకు ఎనలేని గౌరవం కల్పించిన వారి గుర్తించి క్లుప్తంగా.... ఒకరికి ఒకరై.... పద్మ, హఫీజ్లది ప్రేమ వివాహం. అతను ఆర్మీ నుంచి వచ్చాక ప్రైవేటు ఉద్యోగం చేశాక అదే వీధిలోని ఆమె పరి చయం అయింది. చాలా ఏళ్లు ఒకరినొకరు అవగాహన చేసుకున్నాక కష్టాలు, కన్నీళ్లు ఉంటాయని తెలిసి కూడా కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి చేసుకుంటామని పెద్దలకు చెప్పారు. ఆమె నాన్న అభ్యంతరం చెప్పినా అన్నలు, ఇతర కుటుంబ సభ్యుల ప్రోత్సాహాంతో రిజిష్టర్ వివాహం చేసుకున్నారు. తర్వాత భర్త మత సాంప్రదాయాల ప్రకారం ‘నిఖా’ చేసుకున్నారు. బదిలీపై హఫీజ్ అప్పటికే వేరే ఊరికి వెళ్లారు. పెళ్లాయ్యాక అక్కడే కాపురం పెట్టారు. తర్వాత ఆమె నాన్న కూడా ఆదరించడంతో ఒకరి కుటుంబాలను మరొకరు గౌరవించుకుంటూ ఒకరికొకరుగా జీవించారు. అతను ఉద్యోగం చేస్తూ శ్రీమతిని విద్యాపరంగా ప్రోత్సహించాడు. బీఈడీ పూర్తి చేయించాడు. ఆమె కూడా ప్రైవేటు సంస్థలో చేరి భర్తకు ఆర్థికంగా తోడుగా నిలిచింది. ఇద్దరి కృషి ఫలితంగా ఆమెకు ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం లభించింది. 26 ఏళ్లుగా ఒకరికొకరు అన్నట్లుగా వారి జీవితం సాగుతోంది. ఏ నిర్ణయం తీసుకున్నా, ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ కలిసే. అంతేకాదు ఇద్దరూ వీలున్నప్పుడు సామాజిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆ కుటుంబం సర్వమత సమ్మేళనం ప్రొద్దుటూరు: మావనహక్కుల వేదిక జిల్లా కన్వీనర్ కాకమాని జయ శ్రీ, అఖతాబ్ బాషా కుటుంబం ప్రేమకు మతాలు, ఎల్లలూ అడ్డురావని నిరూపిస్తోంది. మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ కాకమాని జయశ్రీ, పట్టణానికి చెందిన అఖ్తాబ్బాషాను 1981 లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆర్యవైశ్యులలో ప్రముఖ వ్యాపారిగా ఉన్న సోడా బంగారయ్య కుమార్తె అయిన జయశ్రీ స్థానిక ఆర్ట్స్ కళాశాలలో చదువుతూ తన సీనియర్ ముస్లిం కుటుంబానికి చెందిన అఖ్తాబ్ బాషాతో స్నేహం ఏర్పడింది. కాలక్రమంలో అది ప్రేమగా మారి వివాహానికి దారితీసింది. కుల ప్రభావం పడకూడదనే లక్ష్యంతో తమ కుమారుడు అనోష్రాజ్కు ఎక్కడా ఇంటి పేరు కానీ, కులం పేరుకానీ ప్రస్తావించలేదు. అనోష్‌రాజ్ పాఠశాల రికార్డుల్లో ఇంటి పేరు, కులం పేరు లేదు. ఇండియన్ అనే రాయడం విశేషం. అమెరికా అమ్మాయితో.. అనోష్‌రాజ్ నాలుగేళ్ల ఎంఎస్ కోర్సును అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నగరంలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో లా చదువుతున్న ఎమిస్టార్ మార్గేన్ స్టన్‌తో పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల తర్వాత ఒకరినొకరు ఇష్టపడిన వీరు పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం అనోష్‌రాజ్ గుగూల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తుండగా ఎమిస్టార్ లా ప్రాక్టీస్ చేస్తోంది. ప్రేమ పొదరిల్లు.. నందలూరు: ప్రేమ వివాహానికి ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలేకానీ.. కులాలు, మతాలు అడ్డుగోడలుగా నిలవవని అంటున్నారు నాగిరెడ్డిపల్లె గ్రామపంచాయతీకి చెందిన నాయనపల్లి రవికుమార్. ‘ 1983లో నెల్లూరులో డిగ్రి చదివే సమయంలో వెంకట అనంత లక్ష్మి (భార్య) ఒక సంవత్సరము జూనియర్‌గా ఉండేది. ఆమెతో పరిచయం ఏర్పడి చివరికి అది ప్రేమగా మారింది. 1985లో వివాహం చేసుకున్నాం. ప్రస్తుత కడప సెంట్రల్ జైలులో హెడ్ వార్డన్‌గా పనిచేస్తున్నా.మా ఇద్దరు కొడుకులైన అవినాష్ జయసింహా, అనుదీప్ జయసింహాలకు వారు నచ్చిన అమ్మాయిలు కులాలు వేరైనా వారికే ఇచ్చి పెళ్లి చేసినా. - రవికుమార్, ‘అల్లుకున్న’ ప్రేమ బంధం... అంధుడైన తన భర్త సుబ్బయ్యకు చేయిపట్టి నడిపిస్తున్న ఈమె పేరు ఉత్తమ్మ. రాజంపేట పట్టణానికి చెందిన జక్కా సుబ్బయ్యకు మూడేళ్ల వయసులో కళ్లుపోయాయి. అప్పటి నుంచి తల్లి సంరక్షణలో పెరిగాడు. సుబ్బయ్య తన 20వ ఏట వైరు మంచాలు, కుర్చీల అల్లికలు నేర్చుకునేందుకు అనంతపురంలోని ఓ శిక్షణా కేంద్రంలో చేరాడు. అక్కడే శిక్షణ నేర్చుకునేందుకు వచ్చిన ఉత్తమ్మను తొలి పలకరింపులోనే మనసుపడ్డాడు. శిక్షణా కాలం పూర్తవుతున్న దశలో సుబ్బన్న తన మనసులోని ప్రేమ భావాన్ని ఉత్తమ్మ వద్ద వ్యక్తం చేయడమేగాక..వివాహం చేసుకుంటే ఎలా చూసుకుంటాననేది సవివరంగా చెప్పాడు. సుబ్బయ్యలోని నిజాయితీ ముందు అంధత్వం చిన్నబోయింది. వారిద్దరి మధ్య ప్రేమ బంధం అల్లుకుపోయింది. అందరిలాగే ఉత్తమ్మ కుటుంబ సభ్యులు వీరి ప్రేమను నిరాకరించారు. అయినా ఆమె వారిని ఎదిరించి దేవునికడపలోని శ్రీ లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయంలో సుబ్బయ్యను వివాహం చేసుకుంది. సుబ్బయ్య తల్లి బతికున్నంత వరకు కుండలు విక్రయించే వ్యాపారం చేసుకొని జీవించిన వీరు...ఇప్పుడు యాచన చేసుకుంటూ బతుకుబండిని సంతోషంగా సాగిస్తున్నారు.‘ప్రేమకు మేం పేదలంకాం’ అంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. -న్యూస్‌లైన్, రాజంపేట టౌన్


