రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకుంటాను– సంతోష్‌ శోభన్‌  | Sakshi
Sakshi News home page

రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకుంటాను– సంతోష్‌ శోభన్‌ 

Published Fri, Aug 18 2023 1:02 AM

Prem Kumar movie Releasingon18 Aug, 2023 - Sakshi

‘‘వందేళ్ల ఇండియన్‌ సినిమాల్లో ఎన్నో పాత్రలు, ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే ఇప్పటివరకూ చెప్పని కథ, ఎవరూ చేయని పాత్రను ఎలివేట్‌ చేయటం అనేది ఓ ఆర్టిస్ట్‌కి కొత్తగా ఉంటుంది. అలా పెళ్లి మండపంపై మిగిలిపోయేవాడి కథే ‘ప్రేమ్‌ కుమార్‌’’ అని హీరో సంతోష్‌ శోభన్‌ అన్నారు. సంతోష్‌ శోభన్, రాశీ సింగ్, రుచితా సాధినేని హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రేమ్‌ కుమార్‌’.అభిషేక్‌ మహర్షి దర్శకత్వంలో శివ ప్రసాద్‌ పన్నీరు నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజవుతోంది.

ఈ సందర్భంగా సంతోష్‌ శోభన్‌ మాట్లాడుతూ–‘‘అభిషేక్‌ కొన్ని సినిమాల్లో నటుడిగా చేశాడు. దర్శకుడు కావాలనుకున్నప్పుడు ‘ప్రేమ్‌ కుమార్‌’ కథ రాసుకుని, చక్కగా తీశాడు. వరుసగా వరుడు, పెళ్లి వంటి సినిమాలు చేస్తున్నాను. అయితే నిజ జీవితంలో నేను రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకుంటాను (నవ్వుతూ). నేనిప్పటి వరకు మంచి డైరెక్టర్స్‌తో సినిమాలు చేశాను. అయితే నేను చేసిన సినిమాలన్నీ కరెక్ట్‌గానే ఎంచుకున్నానా? అంటే లేదనే అంటాను. ‘ప్రేమ్‌ కుమార్‌’ నాకు సరైన హిట్‌ ఇస్తుందనుకుంటున్నాను’’ అన్నారు. 

Advertisement
 
Advertisement