స్టింగ్‌ కేసులో కేంద్ర మంత్రి కుమారస్వామి పేరు | Kumaraswamy office link emerges in sting probe Bengaluru | Sakshi
Sakshi News home page

స్టింగ్‌ కేసులో కేంద్ర మంత్రి కుమారస్వామి పేరు

Nov 2 2026 11:39 AM | Updated on Nov 2 2026 11:51 AM

Kumaraswamy office link emerges in sting probe Bengaluru

కర్ణాటక: సంచలనాత్మక మాజీ సీఎం సిద్దరామయ్య మీద విడుదలైన స్టింగ్‌ ఆపరేషన్‌ వీడియో కేసులో కేంద్రమంత్రి హెచ్‌డీ.కుమారస్వామి పేరును బెంగళూరు నగర పోలీస్‌ కమిషనర్‌ సీమంత్‌కుమార్‌సింగ్‌ ప్రస్తావించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో నిందితుడు రితేశ్‌ పాండే , కేంద్రమంత్రి హెచ్‌డీ.కుమారస్వామికి చెందిన ఇంటిలో నివసిస్తున్నాడని తెలిపారు. మరో నిందితుడు ప్రజ్వల్‌ప్రసాద్‌ ఇచ్చిన సూచనమేరకు ఈ వీడియోను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారన్నారు. అంతేగాక రితేశ్‌పాండే , ప్రజ్వల్‌ ప్రసాద్‌ మధ్య ఆర్థిక వ్యవహారాలు జరిగినట్లు తేలిందని చెప్పారు.  
 
సినిమా బాకీ ఉంది: హోంమంత్రి  
మాజీ సీఎం సిద్దరామయ్యపై స్టింగ్‌ ఆపరేషన్‌ కేసులో కేంద్ర పరిశ్రమల మంత్రి హెచ్‌డీ.కుమారస్వామి ఇంట్లో నిందితుడు మొబైల్‌ఫోన్‌ మార్చినట్లు దర్యాప్తులో తెలిసిందని హోంమంత్రి ప్రియాంక్‌ఖర్గే చెప్పారు. ఆదివారం కలబుర్గి నగరంలో విలేకరులతో మాట్లాడుతూ ఇది ట్రైలర్‌ మాత్రమే, సినిమా ఇంకా ఉంది అని కుమారస్వామిని హెచ్చరించారు. స్టింగ్‌ ఆపరేషన్‌కు పాల్పడిన వ్యక్తులు విచారణకు హాజరుకాకుండా దాక్కున్నారని ఆరోపించారు. దర్యాప్తునకు కుమారస్వామి సన్నిహితులు సహకరించాలన్నారు.  

ఇదీ చదవండి: పూజారి దారుణ హత్య!.. 130 తులాల బంగారంతో పరార్‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement