అదృష్టం చెప్పిరాదు, దురదృష్టం చెప్పిపోదు అనేది సామెత. కొన్ని సంఘటనల గురించి విన్నప్పుడు గానీ, చూసినప్పుడు గానీ అదృష్టం అనే మాట తప్పకుండా వస్తుంది. అదృష్టం అనేది ఎప్పుడు ఎవరి ఎలా వరిస్తుందో ఊహించలేం. విలువైన డబ్బు రూపంలో రావొచ్చు లేదా అమూల్యమైన ప్రాణాలు నిలబడడం కావొచ్చు.. మరేదైనా అవొచ్చు. ఘోర విపత్తులు, భారీ ప్రమాదాలు జరిగినప్పుడు కొంతమంది ప్రాణాలతో బయటపడుతుంటారు. అదృష్టవశాత్తు బతికి బట్టకట్టామని ప్రమాదాల నుంచి బయటపడిన వారు చెబుతుంటారు. ఇలాంటి ఘటన గురించే మనమిప్పుడు మాట్లాడుకోబోతున్నాం. దీని కంటే ఈ వీడియోను ఒకసారి చూడండి.
A bus driver in Colombia accidentally left the door open. Seconds later, a speeding motorcyclist collided with the bus and was flung straight through the open doorway instead of crashing into its side.
Sometimes, a mistake becomes a miracle! pic.twitter.com/TGKwaHznF8— Harsh Goenka (@hvgoenka) September 9, 2026
అసలేం జరిగిందో అర్థం కాలేదా? రహదారిపై ఓ బస్సు వేగంగా వెళులోంది. డ్రైవర్‌గా ఏమరుపాటుగా బస్సు తలుపును తెరిచివుంచాడు. కొద్ది నిమిషాల తర్వాత తెరివుంచిన తలుపులోంచి ఓ వ్యక్తి అమాంతంగా మెరుపు వేగంతో బస్సులోకి వచ్చి పడ్డాడు. ఏం జరిగిందో తెలియక బస్సు డ్రైవర్ అవాక్కయ్యాడు. తెలిశాక గర్వంగా ఫీలయ్యేవుంటాడు!
ఈ సంఘటన కొలంబియాలోని బూగా నగరంలో ఆగస్టు 30న జరిగిట్టు సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. హెల్మెట్ లేకుండా అతివేగంతో బైకుపై దూసుకొచ్చిన ఓ వ్యక్తి రెడ్ సిగ్నల్‌ను పట్టించుకోకుండా మినీ బస్సును ఢీకొట్టాడు. నేరుగా తలుపు వద్ద బస్సును ఢీకొననడంతో అతడు ఎరిగి బస్సులోపలికెళ్లి పడ్డాడు. బస్సు డ్రైవర్ ఏమరుపాటుగా తలుపు తెరిచివుంచడం బైకర్ పాలిట లక్‌గా మారింది. ఈ సంఘటనకు సంబంధించిన రెండు సీసీటీవీల ఫుటేజీ వైరల్ కావడంతో దీని గురించి ప్రపంచమంతా తెలిసింది.
తాజాగా ఈ వీడియోను మన దేశానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయాంక ఎక్స్‌లో షేర్ చేశారు. కొన్నిసార్లు పొరపాటు కూడా అద్భుతంగా మారుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వీడియోపై నెటిజనులు సరదా కామెంట్లు పెడుతున్నారు.
పొరపాటుతో మిరాకిల్!
కొలంబియా అధికారులు పౌరులను ప్రజా రవాణాను ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది కేవలం ప్రజా ప్రయోజన ప్రకటన మాత్రమే అంటూ ఓ నెటిజన్ సరదా వ్యాఖ్య పెట్టారు. అతడు చాలా అదృష్టవంతుడు ఎందుకంటే సురక్షితంగా బస్సులో దేన్ని గుద్దుకోకుండా సీట్ల మధ్యలో పడ్డాడని మరో నెటిజన్ పేర్కొన్నారు. కొన్నిసార్లు మనం తెలియకుండా చేసే పొరపాట్ల వల్ల కూడా మంచి జరుగుతుందని చెప్పడానికి ఈ ఘటన నిదర్శనమని ఇంకొకరు అన్నారు. దేవుడు సర్వత్రా ఉన్నాడనడానికి రుజువు ఈ అద్భుత ఘటన అని ఒక నెటిజన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: మడతపెట్టే ఐఫోన్‌పై పేలుతున్న మీమ్స్


