‘చంద్రబాబు దాన్ని తన గొప్పతనంగా చెప్పుకుంటున్నారు’ | Putha Siva Shankar on Chandrababu Statements | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు దాన్ని తన గొప్పతనంగా చెప్పుకుంటున్నారు’

Nov 10 2026 4:45 PM | Updated on Nov 10 2026 6:54 PM

Putha Siva Shankar on Chandrababu Statements

తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గత పాలనలో పెట్టుబడులు, అభివృద్ధి, సంక్షేమం పెద్ద ఎత్తున జరిగాయని పార్టీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ గుర్తుచేశారు. అంతకుముందు చంద్రబాబు పాలనలో ఏఈఐ (ఆక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్) 10వ ప్లేసులో ఉందని, ఆ తర్వాత వైఎస్‌ జగన్ ప్రభుత్వం వచ్చాక నం.3 ప్లేస్‌కు వచ్చిందని తెలిపారు.

చంద్రబాబు ఇప్పుడు దాన్ని తన గొప్పతనంగా చెప్పుకుంటున్నారని పుత్తా శివశంకర్  విమర్శించారు. బాబు పాలనలో రాష్ట్ర ఆదాయాలు పూర్తిగా తగ్గిపోయాయని తెలిపారు. రోజుకు రూ.450 కోట్ల చొప్పున చంద్రబాబు అప్పు చేస్తున్నారని, ఇప్పటికే రాష్ట్రంపై రూ.11 లక్షల కోట్ల అప్పుల భారం మోపారని చెప్పారు. 

ఒక్కొక్కరిపై దాదాపు రూ.2.11 లక్షల చొప్పున భారం పడిందని తెలిపారు. వైఎస్‌ జగన్ పాలనలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నంబర్ 1 ప్లేసులో ఉందని, కానీ ఇప్పుడు 8వ ప్లేసుకు పడిపోయిందని మండిపడ్డారు. అంటే రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడం శ్రేయస్కరం కాదని పారిశ్రామిక వేత్తలు భయపడుతున్నారని వివరించారు. చంద్రబాబు, లోకేశ్‌ దెబ్బకు పారిశ్రామిక వేత్తలు పారిపోతున్నారని అన్నారు. అయినప్పటికీ 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామంటూ పచ్చి అబద్దాలు చెబుతున్నారని తెలిపారు. స్థానిక ఎన్నికల ఎఫెక్టుతో డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement