Surgical Strike 2
-
పాక్ మ్యూజియంలో అభినందన్ బొమ్మ
కరాచీ: భారత్‌పై విషప్రచారం చేయడంలో ఏ అవకాశాన్నీ వదులుకోని పాకిస్తాన్ మరో దుశ్చర్యకు పాల్పడింది. కరాచీలోని పాకిస్తాన్ వైమానికదళ యుద్ధ మ్యూజియంలో భారత వైమానికదళ వింగ్‌కమాండర్ వర్ధమాన్ బొమ్మను ప్రదర్శించింది. వర్ధమాన్ చుట్టూ పాక్‌సైనికులు చుట్టుముట్టి ఉండగా, ఎడమ పక్క ఒక టీ కప్పును కూడా ఉంచింది. ఫిబ్రవరిలో జరిగిన బాలాకోట్ వైమానిక దాడుల సమయంలో వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్ యుద్ధ విమానాలను వెంబడించాడు. ఈ ప్రక్రియలో అతను నడుపుతున్న యుద్ధవిమానం పాకిస్తాన్ భూభాగంలో కూలిపోయింది. అతను సురక్షితంగా బయటపడినప్పటికీ పాక్ సైన్యం అతన్ని అదుపులోకి తీసుకుంది. రెండు రోజుల అనంతరం అభినందన్‌ను తిరిగి భారత్‌కు అప్పగించింది. ఈ ఘటనపై అప్పట్లో సామాజిక మాధ్యమాల్లోనూ పాకిస్తాన్ వ్యంగ్య ప్రచారాన్ని చేసింది. తాజాగా అభినందన్ బొమ్మను మ్యూజియంలో ప్రదర్శించింది. దీనిని పాకిస్తాన్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకుడు అన్వర్‌లోధీ ట్విట్టర్లో పోస్టు చేశారు. ‘అభినందన్ బొమ్మ చేతిలో ఒక టీ కప్పు ఉంచితే బొమ్మకు మరింత పరిపూర్ణత వచ్చేది’అని లోధీ వ్యాఖ్యానించాడు. అభినందన్ పాకిస్తాన్ అదుపులో ఉన్నప్పుడు పాక్ సైన్యం విడుదల చేసిన ఒక వీడియోలో అభినందన్ టీ తాగుతున్నట్టుగా చూపించడంతో లోధీ ఈ వ్యాఖ్యలు చేశారు. -
బాలాకోట్ ఉగ్రశిబిరం మొదలైంది
చెన్నై: బాలాకోట్ ఉగ్రశిబిరాలపై భారతవైమానిక దళాల దాడితో ధ్వంసమైన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ఉగ్ర స్థావరాలు తిరిగి ప్రారంభమయ్యాయని భారత సైనికాధిపతి బిపిన్‌రావత్ చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో వెల్లడించారు. పుల్వామా దాడికి సమాధానంగా భారత వైమానికదళం దాడుల్లో «ధ్వంసమైన బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలను పాకిస్తాన్ ఇటీవలే తిరిగి ప్రారంభించిందని ఆయన తెలిపారు. పుల్వామాలో భారత సైనిక వాహనంపై ఉగ్రవాదుల దాడి 40 మంది భారత సైనికులను పొట్టనపెట్టుకున్న సంగతిని ఆయన గుర్తుచేశారు. ఏడు నెలలక్రితం బాలాకోట్‌పై భారత్ దాడితో ఉగ్రవాదులు అక్కడినుంచి వెళ్ళిపోయారని తెలిపారు. తిరిగి మళ్ళీ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు బాలాకోట్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించారని ఆయన వెల్లడించారు. గతంలో జరిపిన దాడికి మించి ఈసారి దాడులు చేసే అవకాశముందన్నా రు. మంచుకరుగుతున్న ప్రాం తాల గుండా, మంచు తక్కువగా ఉన్న ప్రాంతాలైన జమ్మూ కశ్మీర్‌లోని ఉత్తరభాగంనుంచి భారత్‌లోకి చొరబడేందుకు 500 మంది ఉగ్రమూకలు వేచిఉన్నారనీ, ఈ సంఖ్య సమయానుకూలంగా మరవచ్చుననీ బిపిన్ రావత్ స్పష్టం చేశారు. కశ్మీర్ లోయలో ఏదో జరుగుతోందని కొందరు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారనీ, కానీ కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఆంక్షలను క్రమంగా ఎత్తివేస్తున్నామనీ, ఇప్పుడిప్పుడే అక్కడి పరిస్థితి చక్కబడుతోందనీ ఆయన వెల్లడించారు. నియంత్రణ రేఖ వెంబడి మోహరించిన సైన్యం ఉగ్రవాదులను చొరబాట్లను తీవ్రంగా అడ్డుకుంటోందనీ అయితే అంతర్జాతీయ సరిహద్దుల్లోని కొన్ని ప్రాంతాలను ఉగ్రవాదులు తమ కార్యకలాపాలకు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు బిపిన్ రావత్ ఆరోపించారు. కాగా, కథువా జిల్లాలో 40 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు సైన్యం ప్రకటించింది. కశ్మీర్లో ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్ జమ్ము: బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతల హత్య సహా నాలుగు ఉగ్రవాద ఘటనలతో సంబంధమున్న ముగ్గురు హిజ్బుల్ ముజాహిదీన్ ముష్కరులను పోలీసులు అరెస్టు చేశారు. కిష్త్వార్ జిల్లాకు చెందిన నిస్సార్ అహ్మద్ షేక్, నిషాద్ అహ్మద్, ఆజాద్ హుస్సేన్‌లు కలిసి బీజేపీ నేత అనిల్ పరిహార్, ఆయన సోదరుడు అజిత్ పరిహార్‌లను గత ఏడాది కాల్చి చంపారు. ఏప్రిల్ 9వ తేదీన ఆర్ఎస్ఎస్ నేత చందర్‌కాంత్ శర్మ, ఆయన అంగరక్షకుడిని కాల్చి చంపారని జమ్మూ జోన్ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ ముకేశ్ సింగ్ వెల్లడించారు. హింసాత్మక ఘటనలకు పాల్పడిన అనంతరం వీరంతా షేక్ హుస్సేన్ ఇంట్లో తలదాచుకునే వారని ముకేశ్ వెల్లడించారు. మరోవైపు, జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి చొరబాటుదారులను అడ్డుకునేందుకు భారత రక్షణ బలగాలకు పూర్తి స్థాయి అధికారాలు కట్టబెట్టారు. ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం భారత్‌లోని కీలకమైన నగరాలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆర్మీని బలగాలను అలర్ట్ చేసినట్లు పేర్కొన్నారు. -
అభినందన్ వర్ధమాన్‌కు వీరచక్ర
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌కు చెందిన శత్రు విమానాన్ని కూల్చేసిన అనంతరం మూడు రోజులపాటు పాక్‌లో బందీగా ఉన్న భారత వాయుసేన (ఐఏఎఫ్) వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌కు వీరచక్ర శౌర్య పురస్కారం లభించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సైనిక పురస్కారాలను రక్షణ శాఖ ప్రకటించింది. ఆర్మీలో రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన సప్పర్ ప్రకాశ్ జాధవ్‌కు ఆయన మరణానంతరం రెండో అత్యున్నత శౌర్య పురస్కారమైన కీర్తి చక్రను కేంద్రం ఇచ్చింది. ఫిబ్రవరి 27న పాకిస్తాన్‌తో భారత్ ఆకాశంలో తలపడినప్పుడు స్క్వాడ్రన్ లీడర్‌గా ఉండి విమానాలను నియంత్రించిన మింటీ అగర్వాల్‌కు యుద్ధ సేవా పతకం దక్కనుంది. వాయుసేనకు 5 యుద్ధ సేవ, 7 వాయుసేన పతకాలు సహా మొత్తం 13 పురస్కారాలు దక్కనున్నాయి. ఫిబ్రవరి 26న పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన ఐదుగురు యుద్ధ పైలట్లకు పురస్కారాలు లభించాయి. ఆర్మీకి 8 శౌర్య చక్ర పురస్కారాలు, 98 సేనా పతకాలు దక్కాయి. నౌకాదళానికి ఒక శౌర్య చక్ర పురస్కారం లభించింది. పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉన్న జైషే మహ్మద్ ఉగ్రసంస్థ శిక్షణా శిబిరంపై ఫిబ్రవరి 26న భారత వాయుసేన దాడులు చేయడంతో మరుసటి రోజే పాక్ ప్రతిదాడికి ప్రయత్నించడం తెలిసిందే. ఆ సమయంలో పాక్‌కు చెందిన ఎఫ్–16 విమానాన్ని వర్ధమాన్ కూల్చేశారు. తాను నడుపుతున్న మిగ్–21 విమానం దాడికి గురవ్వడంతో ఆయన కిందకు దూకేసి ప్రాణాలతో బయటపడినప్పటికీ పాకిస్తాన్లో దిగారు. దీంతో ఆయనను పాకిస్తాన్ మూడురోజులపాటు బందీగా ఉంచుకున్న అనంతరం భారత్‌కు అప్పగించింది. ముంబైలో జాతీయ జెండాతో సినీ నటి నిత్యా మీనన్ -
బాలాకోట్ నుంచి బిచాణా ఎత్తేశారు!
న్యూఢిల్లీ: పాకిస్తాన్లో ఉగ్రవాద సంస్థలు ప్రస్తుతం అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లోకి మకాం మార్చాయి. పాక్‌లోని బాలాకోట్ ఉగ్ర శిక్షణ శిబిరంపై ఫిబ్రవరిలో భారత వైమానిక దళం దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడుల అనంతరం ఉగ్రసంస్థలు తమ మకాంను అఫ్గానిస్తాన్‌లోకి మార్చేశాయి. జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా సంస్థలు కునార్, నంగర్హార్, నూరిస్తాన్, కాందహార్‌లలో శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేశాయి. దీంతో భారత నిఘా వర్గాలు కాబూల్, కాందహార్‌లలో ఉన్న దౌత్య కార్యాలయాలను అప్రమత్తం చేశాయి. అఫ్గాన్ తాలిబన్, హక్కానీ నెట్‌వర్క్‌తో చేతులు కలిపిన జైషే మొహమ్మద్, లష్కరే తోయిబాలు పాక్–అఫ్గాన్ సరిహద్దు డ్యూరాండ్ రేఖ వెంబడి శిక్షణ శిబిరాలను నెలకొల్పి, ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 14వ తేదీన కశ్మీర్‌లోని పుల్వామాలో జైషే మొహమ్మద్ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగా అదే నెలలో భారత వైమానిక దళం బాలాకోట్‌పై బాంబు దాడులు జరిపింది. అంతర్జాతీయ ఒత్తిడులకు లొంగిన పాక్ ప్రభుత్వం ఈ నెల మొదటి వారంలో లష్కరే తోయిబాకు చెందిన 15 మంది నేతలను అదుపులోకి తీసుకుంది. అయితే, ఇవన్నీ కంటి తుడుపు చర్యలేనని భారత్ అంటోంది. నిర్దిష్టమైన చర్యలతో ఉగ్రమూకలను కట్టడి చేయాలని కోరుతోంది. మరోవైపు, పాక్ ఉగ్ర సంస్థలకు దన్నుగా ఉంటోందంటూ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) సంస్థ ఆర్థిక సాయం నిలిపివేసింది. దీంతో ఆర్థికంగా కుంగిపోయిన పాక్‌పై ఒత్తిడి తీవ్రమైంది. ఈ నేపథ్యంలోనే ఉగ్ర సంస్థలు పాక్ నుంచి తమ మకాంను అఫ్గానిస్తాన్‌కు మార్చాయని భారత్ నిఘా వర్గాలు అంటున్నాయి. అయితే, ఈ పరిణామంతో అఫ్గాన్ రాజధాని కాబూల్‌తోపాటు కాందహార్‌లో ఉన్న భారత దౌత్య కార్యాలయాలకు ఉగ్ర ముప్పు పెరిగిందని హెచ్చరిస్తున్నాయి. జైషే మొహమ్మద్ ఉగ్రవాదులతోపాటు, పేలుడు పదార్థాలు అమర్చిన వాహనాలతో కాబూల్ ఎంబసీపై కారివరి గుల్ అనే ఉగ్ర సంస్థ దాడులకు దిగే ప్రమాదముందని అనుమానిస్తున్నాయి. కాందహార్‌లోని ఇండియస్ ఎంబసీపై తాలిబన్లు కూడా దాడులకు పాల్పడే ప్రమాదముందని అంటున్నాయి. తాలిబన్, హక్కానీ నెట్‌వర్క్‌లు జైషే మొహమ్మద్ అధిపతి మసూద్ అజార్‌కు ఆశ్రయం కల్పించేందుకు ఫిబ్రవరిలో ముందుకు వచ్చినా పాక్‌లోని భావల్పూర్లో సైనిక రక్షణ మధ్య ఉండటమే శ్రేయస్కరమని అతడు ఆ ఆఫర్‌ను తిరస్కరించాడు. అంతేకాకుండా, కాబూల్, కాందహార్ల్లో ఉన్న భారత కార్యాలయాలపై ఈ ఉగ్ర సంస్థలు నిఘా వేసి ఉంచాయి. జనవరిలో సెదిక్ అక్బర్, అతావుల్లా అనే ఇద్దరు ఉగ్రవాదులను అఫ్గాన్ బలగాలు అదుపులోకి తీసుకుని, విచారించగా ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి. అమెరికా బలగాలకు ముప్పు లష్కరే తోయిబా కూడా తన అనుచరులను నంగర్హార్, నూరిస్తాన్, కునార్, హెల్మండ్, కాందహార్ ప్రావిన్సుల్లోని శిక్షణ శిబిరాలకు తరలించింది. పెషావర్‌లో ఉన్న సభ్యుల మకాంను కాబూల్‌కు మార్చింది. తాలిబన్ సాయంతో విధ్వంసక, విద్రోహ చర్యలపై శిక్షణ ఇస్తోంది. మరోవైపు, అఫ్గానిస్తాన్‌లో ఉన్న 300 మంది జైషే మొహమ్మద్ ఉగ్రవాదులతో అమెరికా, సంకీర్ణ బలగాలకు ముప్పు ఉననట్లు అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ కూడా తన నివేదికలో పేర్కొంది. తాలిబన్, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖైబర్–పక్తున్వా మధ్య రాజీ కుదర్చడంలో జైషే మొహమ్మద్ పాత్ర ఉందని తెలిపింది. -
నిఘా కోసం చైనా డ్రోన్లు
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని బాలాకోట్‌లో జైషే ఉగ్రవాద శిక్షణ శిబిరంపై భారత వైమానిక దళం మెరుపుదాడి చేయడంతో పాకిస్తాన్‌కు రక్షణ పరంగా తన వైఫల్యాలేమిటో తెలిసి వచ్చింది. దాంతో భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తపడుతోంది. భారత్ విషయంలో ఇంత వరకు అనుసరిస్తున్న వ్యూహాలను మార్చుకుంటోంది. సైనిక స్థావరాల వద్ద భద్రతను పటిష్టం చేయడం, సరిహద్దులో నిఘాను పెంచడం వంటి చర్యలు తీసుకుంటున్నట్టు భారత నిఘా వర్గాలు పసిగట్టాయి. ఏ మాత్రం దొరక్కుండా, రాడార్లకు కూడా చిక్కకుండా భారత్ దాడి చేయడం, ఆ తర్వాత భారత్‌పై దాడికి చేసిన యత్నం విఫలమవడాన్ని పాక్ సైన్యం జీర్ణించుకోలేకపోతోందని భారత నిఘావర్గాల భోగట్టా. అత్యాధునిక ఆయుధాలు, నిఘా వ్యవస్థలను సత్వరమే సమకూర్చుకోవాలని, సరిహద్దులో నిఘాను పెంచాలని నిర్ణయించింది. వాస్తవాధీన రేఖ, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లలో నిఘాకోసం మరిన్ని డ్రోన్లను ఉపయోగించాలని, వాటిని చైనా నుంచి కొనాలని నిర్ణయించింది. అలాగే, సరిహద్దులో చైనా తయారీ మధ్యంతర క్షిపణులను మోహరించాలని కూడా ఆలోచిస్తోంది. అత్యాధునిక రైన్బో డ్రోన్లు, యూఏవీల కొనుగోలుకు చైనాతో ఒప్పందాలు కుదుర్చుకుంది. మరోవైపు ఉగ్ర సంస్థలకు కూడా జాగ్రత్తలు చెబుతోంది. ఆయుధాలను బహిరంగంగా ప్రదర్శించవద్దని, వాస్తవాధీన రేఖకు దూరంగా శిబిరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించినట్టు నిఘా వర్గాల సమాచారం. అలాగే, ఉగ్రవాదులంతా పాక్ సైనిక యూనిఫాంలు లేకుండా బయట తిరగవద్దని కూడా స్పష్టం చేసింది. భారత్‌పై దాడుల కోసం ఉగ్రవాదుల కన్సార్టియం ఏర్పాటుకు ఐఎస్ఐ ప్రయత్నిస్తోందని తెలిసింది. ఇందుకోసం జైషే, హఖానీ, తాలిబన్, ఐసిస్ వంటి ఉగ్ర సంస్థల మధ్య సమావేశాలు ఏర్పాటు చేస్తోందని నిఘా వర్గాలు పసిగట్టాయి. -
కలవరపెట్టిన పాక్ సబ్‌మెరైన్
న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉన్న జైషే మొహమ్మద్ ఉగ్రస్థావరంపై భారత్ ఫిబ్రవరి 26న వైమానికదాడులు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పాకిస్తాన్‌కు చెందిన అత్యాధునిక సబ్‌మెరైన్ ఒకటి భారత అధికారులను తీవ్రంగా కలవరపెట్టింది. చాలాకాలం నుంచి భారత్ పాక్ నేవీ కదలికలపై నిఘా ఉంచుతోంది. ఈ క్రమంలో బాలాకోట్ దాడుల తర్వాత పాక్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడకుండా 60కిపైగా యుద్ధనౌకలు, విమానవాహక యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యను అంతర్జాతీయ సముద్ర జలాల్లో మోహరించింది. ఈ నేపథ్యంలో పాక్ నేవీకి చెందిన అగొస్టా క్లాస్ సబ్‌మెరైన్ ‘పీఎన్ఎస్ సాద్’ కరాచీకి సమీపంలో అదృశ్యమైపోయింది. ‘ఎయిర్ ఇండిపెండెంట్ ప్రపల్షన్’ సాంకేతికత ఉన్న ఈ పీఎన్ఎస్ సాద్ మిగతా సబ్మెరైన్ల కంటే ఎక్కువరోజులు సముద్రగర్భంలో ఉండిపోగలదు. దీంతో భారత్‌పై దాడికి పాక్ పీఎన్ఎస్ సాద్ ను పంపిందన్న అనుమానం భారత అధికారుల్లో బలపడింది. పీఎన్ఎస్ సాద్ గుజరాత్ తీరానికి 3 రోజుల్లో, ముంబైకి 4 రోజుల్లో చేరుకోగలదని నేవీ నిపుణులు అంచనా వేశారు. దాన్ని అడ్డుకునేందుకు అణు సబ్‌మెరైన్ ఐఎన్ఎస్ చక్ర, ఐఎన్ఎస్ కల్వరితో పాటు పీ–8ఐ విమానాలను రంగంలోకి దించారు. వీటితోపాటు ఉపగ్రహాల సాయంతో 21 రోజుల పాటు గాలించారు. భారత జలాల్లో ప్రవేశించి లొంగిపోకుంటే సాద్‌ను పేల్చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. చివరికి 21 రోజుల తర్వాత పాక్‌కు పశ్చిమాన ఉన్న సముద్రజలాల్లో పీఎన్ఎస్ సాద్‌ను భారత నేవీ గుర్తించింది. ఈ విషయమై నేవీ అధికార ప్రతినిధి కెప్టెన్ డీకే శర్మ మాట్లాడుతూ.. భారత్‌తో యుద్ధం తలెత్తితే రహస్యంగా దాడి చేసేందుకు పాక్ సాద్‌ను వ్యూహాత్మకంగా అక్కడ మోహరించిందని తెలిపారు. కానీ భారత దూకుడు, అంతర్జాతీయ ఒత్తిడిలతో పాక్ తోకముడిచిందని వెల్లడించారు. దీంతో మక్రాన్ తీరంలోనే ïసాద్ అగిపోయిందని పేర్కొన్నారు. -
నాడు 170 మంది ఉగ్రవాదులు హతం
న్యూఢిల్లీ: బాలాకోట్‌లోని జైషే ఉగ్రస్థావరంపై భారత వాయుసేన(ఐఏఎఫ్) చేసిన దాడిలో ఎవ్వరూ చనిపోలేదని బుకాయిస్తున్న పాకిస్తాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఏడాది ఫిబ్రవరి 26న తెల్లవారుజామున ఐఏఎఫ్ చేపట్టిన వైమానికదాడిలో 130 నుంచి 170 జైషే ఉగ్రవాదులు చనిపోయారని ఇటాలియన్ జర్నలిస్ట్ ఫ్రాన్సెక్సా మారినో తెలిపారు. ఐఏఎఫ్ దాడిలో ఘటనాస్థలిలోనే భారీ సంఖ్యలో ఉగ్రవాదులు చనిపోగా, మరికొందరు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారని వెల్లడించారు. ఈ దాడిలో గాయపడ్డ ఉగ్రమూకలకు పాక్ మిలటరీ డాక్టర్లు వైద్యం చేశారని పేర్కొన్నారు. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ మారినో రాసిన కథనాన్ని ‘స్ట్రింగర్ ఆసియా’ అనే వెబ్సైట్ ప్రచురించింది. మృతుల కుటుంబాలకు పరిహారం.. ఫిబ్రవరి 26 తెల్లవారుజామున ఐఏఎఫ్ యుద్ధవిమానాలు బాలాకోట్‌లోని ఉగ్రస్థావరంపై బాంబుల వర్షం కురిపించాయని మారినో తెలిపారు. ‘ఈ దాడిలో 11 మంది శిక్షకులు సహా 170 మంది వరకూ చనిపోయారు. దాడి జరిగిన కొద్దిసేపటికే అక్కడకు చేరుకున్న పాక్ ఆర్మీ క్షతగాత్రులను షింకియారీ ప్రాంతంలో ఉన్న హర్కతుల్ ముజాహిదీన్ క్యాంప్‌కు తరలించింది. స్థానికుల సమాచారం ప్రకారం ఇంకా 45 మంది ఉగ్రవాదులు ఇక్కడ చికిత్స పొందుతున్నారు. కోలుకున్నవారిని ఆర్మీ అదుపులోకి తీసుకుంది. ఈ మొత్తం విషయం బయటకు పొక్కకుండా జైషే నేతలు మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించారు. ఇప్పుడు జైషే క్యాంపును తాలిమున్ ఖురాన్(మదర్సా)గా మార్చేశారు. ప్రస్తుతం స్థానిక పోలీసులకు కూడా ఇక్కడ అనుమతి లేదు’ అని చెప్పారు. అవసరమైతే బాలాకోట్‌లో భారత జర్నలిస్టులను అనుమతిస్తామని పాక్ ప్రకటించిన నేపథ్యంలో మారినో ఈ కథనం రాయడం గమనార్హం. -
‘రాహుల్ మెడకు బాంబు కట్టి విసిరేయాలి’
ముంబై : ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీలు.. భద్రతా దళాలను వాడకోకూడదంటూ ఈసీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కానీ నాయకులు మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో బీజేపీ నాయకురాలు పంకజ ముండే సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మీద పేలుడు పదార్థాలు ప్రయోగిస్తే.. సర్జికల్ స్ట్రైక్స్ గురించి అనుమానం వ్యక్తం చేసేవారు నోరు ముస్తారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జల్నా లోక్‌సభ నియోజకవర్గంలో పర్యటించారు పంకజ ముండే. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘మన సైనికుల మీద దాడి చేసిన ఉగ్రవాదులపై సర్జికల్ దాడులు జరిపాము. కానీ కొందరు ‘అసలు దాడులు ఎక్కడ జరిపారు.. ఆధారాలేవ’ని ప్రశ్నిస్తున్నారు. వారికి అర్థమవ్వాలంటే ఒకటే దారి.. రాహుల్ గాంధీ మెడలో బాంబు కట్టి.. వేరే దేశానికి పంపించాలి’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పంకజ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఆమెపై ఈసీ చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. -
ప్రతిపక్షాలపై ‘వీడియో’ అస్త్రాలు
న్యూఢిల్లీ: బాలాకోట్ ఉగ్రవాద స్థావరాలపై సైన్యం దాడులను ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలకు దీటుగా సమాధానం చెప్పేందుకు బీజేపీ యానిమేటెడ్ వీడియోలను రూపొందించింది. రాహుల్, ఇతర ప్రతిపక్షాల విమర్శలకు సమాధానంగా ప్రధాని మోదీని హీరోగా చూపుతూ క్రీడా నేపథ్యంలో తయారుచేసిన వీడియోలను ఆదివారం బీజేపీ విడుదల చేసింది. క్రికెట్, కబడ్డీ, చెస్ ఆటల క్లిప్పింగ్‌లను ఈ వీడియోలకోసం తీసుకున్నామని, పార్టీ అధికారిక ట్విట్టర్ సైట్లో ప్రకటించారు. దాదాపు అన్ని వీడియోలలోనూ మోదీ హీరోగా, ప్రతిపక్షాలపై ఒంటరిగా, అజేయంగా పోరాడుతున్నట్టుగా రూపొందించారు. క్రికెట్ నేపథ్యంలో రూపొందించిన ఒక వీడియోలో మోదీ సిక్సర్ కొట్టి మ్యాచ్ గెలిపించినట్టుగా, ప్రతిపక్షాలు అంపైర్‌ను ఆ విజయానికి సాక్ష్యం చూపమని అడుగుతున్నట్టుగా ఉంది. ఈ వీడియోను ట్యాగ్చేస్తూ అరుణ్ జైట్లీ ‘భారత్ విజయానికి ఎవరు సాక్ష్యాలు అడుగుతారు, అపజయానికి కారణాలు వెతుక్కునే వారే ఈ విజయానికి రుజువులు కావాలని అడుగుతారు’అని చెప్పారు. కబడ్డీ వీడియోలో ప్రతిపక్షాలన్నింటినీ మోదీ ఒక్కడే మట్టి కరిపించినట్టుగా ఉంది. ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని ఓటర్లకు సులభంగా అర్థమయ్యేలా చెప్పడమే లక్ష్యంగా వీటిని తయారుచేసినట్లు బీజేపీ తెలిపింది. -
పాకిస్తాన్‌కు వార్నింగ్ ఇచ్చా
పటన్/జైపూర్: పాకిస్తాన్‌కు తాము చేసిన తీవ్ర హెచ్చరికల ఫలితంగానే భారత వైమానిక దళ(ఐఏఎఫ్) పైలట్ వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్‌ను సురక్షితంగా వెనక్కి పంపించిందని ప్రధాని మోదీ తెలిపారు. దేశంలో ఉగ్రవాదం అంతం కావాలంటే బీజేపీకే ఓటేయాలని ప్రజలను కోరారు. గుజరాత్‌లోని అన్ని స్థానాల్లోనూ బీజేపీనే గెలిపించాలని, లేకుంటే దేశవ్యాప్తంగా అదే పెద్ద చర్చకు దారి తీస్తుందని పేర్కొన్నారు. గుజరాత్‌లోని పటన్, రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని ప్రసంగించారు. బాలాకోట్ దాడి అనంతరం పాక్ ప్రతీకార యత్నం, ఆ దేశ ఎఫ్–16 విమానాన్ని కూల్చివేసే క్రమంలో అభినందన్ పాక్ సైన్యానికి పట్టుబడటం, ఆ తర్వాత విడుదలైన తీరును ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘అభినందన్ శత్రుదేశానికి పట్టుబడటంపై ప్రతిపక్షాలు నన్ను ప్రశ్నించడం మొదలుపెట్టాయి. దీంతో ప్రధాని పదవి ఉన్నా పోయినా ఒకటే. అయితే నేనైనా ఉండాలి లేదా ఉగ్రవాదులైనా ఉండాలని నిర్ణయించుకున్నా. అందుకే, మీడియా సమావేశం పెట్టి, మా పైలట్‌కు ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలుంటాయని, ఆ తర్వాత మోదీ ఏం చేశాడో మీరు ప్రపంచానికి చెప్పుకోవాల్సి ఉంటుందని పాక్‌ను హెచ్చరించా. ‘పాక్‌పై దాడి చేసేందుకు మోదీ వద్ద 12 క్షిపణులు సిద్ధంగా ఉన్నాయి. దాడి జరిగితే పరిణామాలు దారుణంగా ఉంటాయి’ అంటూ ఆ మరునాడే అమెరికా ఉన్నతాధికారి ఒకరు ప్రకటించారు. దీంతో దిగివచ్చిన పాక్, అభినందన్‌ను వెనక్కి పంపుతున్నట్లు ప్రకటించింది. లేకుంటే పాక్‌కు ఆ రాత్రి కాళరాత్రే అయి ఉండేది’ అని మోదీ వ్యాఖ్యానించారు. ‘పుల్వామా ఘటన అనంతరం ప్రజలు మోదీ నుంచి ఏం ఆశించారు? ముంబై ఉగ్రదాడుల తర్వాత మన్మోహన్సింగ్ మాదిరిగా వ్యవహరించి ఉంటే దేశం నన్ను క్షమించేదా? అందుకే సైన్యానికి పూర్తి అధికారాలిచ్చా. పాకిస్తాన్ కూడా అన్ని ఏర్పాట్లు చేసుకుంది. కానీ, హనుమాన్ భక్తుల్లాగా మన వాళ్లు బాలాకోట్‌పై విరుచుకుపడి, వాళ్ల అంతు చూశారు’ అని తెలిపారు. బాలాకోట్ దాడి ప్రతిపక్షాలకు అసౌకర్యంగా మారిందన్న ప్రధాని..భారత్ తమపై దాడి చేసిందంటూ పాక్ పదేపదే చెబుతుంటే మన ప్రతిపక్షాలు కూడా బాలాకోట్ భారత్‌లోనే ఉందన్నట్టుగా ఆధారాలు చూపాలంటూ గగ్గోలు పెట్టాయని ఆరోపించారు. ప్రధాని మోదీ ఎప్పుడు ఎలా స్పందిస్తారోనని తనకు భయంగా ఉందన్న ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్ వ్యాఖ్యలను ఆయన ప్రస్తావిస్తూ.. ‘రేపు మోదీ ఏం చేస్తాడో శరద్ పవార్‌కే తెలియనప్పుడు పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఎలా తెలుస్తుంది’ అంటూ వ్యాఖ్యానించారు. శరద్‌పవార్ తనకు రాజకీయ గురువు అని గతంలో ప్రధాని మోదీ ప్రకటించారు. కమలంతో ఉగ్రవాదం అంతం ‘కష్ట సమయంలో శ్రీలంక ప్రజలకు తోడుగా ఉంటాం. వారికి అవసరమైన సాయం అందించేందుకు సిద్ధం’ అని ప్రకటించారు. ‘మీరు పోలింగ్ బూత్‌కు వెళ్లి, కమలం(బీజేపీ ఎన్నికల చిహ్నం) గుర్తు మీట నొక్కేటప్పుడు.. అది ఉగ్రవాదాన్ని అంతం చేసే మీట అని గుర్తుంచుకోండి. మీ వేలికి అంతటి శక్తి ఉంది. మీరు మీట నొక్కడం ద్వారా ఉగ్రవాదంపై పోరాడాలన్న నా సంకల్పం బలపడుతుంది’ అని అన్నారు. అన్ని సీట్లూ నాకే ఇవ్వండి బీజేపీని గెలిపించాలని గుజరాత్ ప్రజలను కోరిన ప్రధాని.. ‘ఈ గడ్డపై పుట్టిన బిడ్డ యోగక్షేమాలు చూసుకోవడం నా సొంత రాష్ట్రం ప్రజల ధర్మం. రాష్ట్రంలోని 26 లోక్‌సభ స్థానాలను నాకు ఇవ్వండి. మీ సహకారంతో నా ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుంది. ఒకవేళ మీరు బీజేపీకి 26 సీట్లు ఇవ్వకుంటే ఎందుకలా జరిగిందంటూ మే 23వ తేదీ(ఎన్నికల ఫలితాల రోజు)న టీవీల్లో చర్చలు మొదలవుతాయి’ అని పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లో అభిమానులు బహూకరించిన తన చిత్తరువుతో ప్రధాని మోదీ -
తిరిగి విధుల్లోకి అభినందన్!?
న్యూఢిల్లీ : పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని కూల్చి భారతావని నీరాజనాలు అందుకున్న భారత వాయుసేన పైలట్ అభినందన్ వర్థమాన్ త్వరలోనే తిరిగి విధుల్లో చేరనున్నారు. అయితే గతంలో ఆయన పనిచేసిన శ్రీనగర్ ఎయిర్‌బేస్‌లో కాకుండా మరో చోట పోస్టింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు... ‘ ధైర్యసాహసాలు ప్రదర్శించిన వింగ్ కమాండర్‌కు పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేశాం. పాక్ సరిహద్దులోని ఓ ఎయిర్‌బేస్‌లో తను విధులు నిర్వర్తించే అవకాశం ఉంది. అయితే అది శ్రీనగర్లోనా.. మరే ఇతర చోటా అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాం. త్వరలోనే అతడు తన విధుల్లో చేరతాడు’ అని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కాగా పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో.. పాక్ వైమానిక దాడులను తిప్పి కొట్టే క్రమంలో అభినందన్ విమానం కూలిపోగా...ఆయన పాక్ భూభాగంలో దిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అనేక పరిణామాల అనంతరం జెనీవా ఒప్పందం ప్రకారం ఆయన భారత్‌కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో శత్రు సైన్యం చెర నుంచి విముక్తి పొందిన అభినందన్ మానసిక స్థితిని విశ్లేషించేందుకు డీబ్రీఫింగ్ సెషన్(తీవ్రమైన ఒత్తిడికి గురైన సైనికుడికి నిర్వహించే వైద్య పరీక్షలు) నిర్వహించారు. ఇందులో భాగంగా కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆయన తిరిగి విధుల్లో చేరనున్నారు. -
‘పాక్ సైన్యానికి.. స్థానికులకు హానీ జరగలేదు’
న్యూఢిల్లీ : బాలాకోట్ దాడి వల్ల పాక్ సైన్యానికి.. స్థానికులకు ఎలాంటి హాని జరగలేదని కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ దాడి వల్ల మాకు చిన్న గాయం కూడా కాలేదని పాకిస్తాన్ ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో సుష్మా స్వరాజ్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. బీజేపీ మహిళా కార్యకర్తలతో సమావేశమైన సుష్మా స్వరాజ్ ఈ సందర్భంగా బాలాకోట్ దాడిలో పాకిస్తాన్ సైన్యానికి గానీ, స్థానికులకు గానీ ఎలాంటి హాని జరగలేదని పేర్కొన్నారు. ‘భద్రతా బలగాలను కేవలం జైషే ఉగ్ర స్థావరాల మీద దాడి చేయడానికి మాత్రమే అనుమతించారు. ఎందుకంటే పుల్వామా దాడికి పాల్పడింది జైషే ఉగ్రవాదులు కాబట్టి.. వారి స్థావరాలను నాశనం చేయాలని ఆదేశించారు. దాని ప్రకారమే మన బలగాలు ఉగ్ర స్థావరాలపై దాడి చేసి వెనుతిరిగాయ’ని ఆమె పేర్కొన్నారు. అంతేకాక మనపై శత్రువులు దాడి చేస్తే మనం కూడా ప్రతి దాడి చేసి ఆత్మరక్షణ చేసుకోగలమని ప్రపంచానికి చాటి చెప్పడం కోసమే ఈ దాడులకు పాల్పడ్డాం అని వివరించారు. ఈ దాడులను ప్రపంచ దేశాలు కూడా సమర్థించాయని పేర్కొన్నారు. -
మేం కూల్చింది ఎఫ్16నే
న్యూఢిల్లీ: పాకిస్తాన్ వైమానిక దళం(పీఏఎఫ్)కు చెందిన ఎఫ్–16 కూల్చివేతపై వస్తున్న అనుమానాలను భారత వైమానిక దళం(ఐఏఎఫ్) మరోసారి కొట్టిపారేసింది. ఫిబ్రవరి 27వ తేదీన జరిగిన ఘటనలో తాము కూల్చింది ఎఫ్–16 యుద్ధ విమానమే అనేందుకు బలమైన ఆధారాలున్నాయని పేర్కొంది. సోమవారం రక్షణ శాఖ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎయిర్ వైస్ మార్షల్ ఆర్.జి.కపూర్ మాట్లాడారు. ‘ఫిబవరి 27వ తేదీన జరిగిన ఘటనలో పీఏఎఫ్ ఎఫ్–16ను వినియోగిం చడం మాత్రమే కాదు, దానిని ఐఏఎఫ్ మిగ్–21 బైసన్ విమానం కూల్చి వేసిందడానికి కూడా తిరుగులేని ఆధారాలున్నాయి’ అని తెలిపారు. ‘ఫిబ్రవరి 27వ తేదీన రెండు విమానాలు పరస్పరం తలపడిన విషయం సుస్పష్టం. అందులో ఒకటి పీఏఎఫ్‌కు చెందిన ఎఫ్–16 కాగా మరొకటి ఐఏఎఫ్‌కు చెందిన మిగ్–21 బైసన్ రకం విమానం. ఈ విషయాన్ని ఎలక్ట్రానిక్, రాడార్ వ్యవస్థలు కూడా పసిగట్టాయి’ అని వివరించారు. అయితే, భద్రతా కారణాల రీత్యా మిగతా వివరాలను తాము బహిరంగ పర్చలేక పోతున్నామన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎయిర్‌బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్(అవాక్స్)కు సంబంధించిన చిత్రాలను ప్రదర్శించారు. ఫిబ్రవరి 27న ఎఫ్–16ను కూల్చివేసిన అనంతరం వింగ్ కమాండర్ అభినందన్ నడుపుతున్న మిగ్ విమానాన్ని పీఏఎఫ్ కూల్చివేయడంతో ఆయన పాక్ భూభాగంలో దిగటం, తర్వాత విడుదల తెల్సిందే. -
‘ఉగ్రవాదులపై దాడి చేస్తే.. వారికి నిద్ర పట్టడం లేదు’
లక్నో : భారత్ ఉగ్రవాదులకు వారి భాషలోనే సమాధానం చెప్పడం కొందరికి నచ్చడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యనించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మోదీ ప్రతిపక్షాల మీద విమర్శల వర్షం కురిపించారు. ఈ క్రమంలో శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మోదీ ప్రసంగిస్తూ.. ఉగ్రదాడి జరిగాక నేను మౌనంగా ఉండలా.. లేదా ప్రతి దాడి చేయాలా అంటూ పుల్వామా ఉగ్రదాడిని ఉద్దేశిస్తూ జనాలను ప్రశ్నించారు. అనంతరం ఆయన కొనసాగిస్తూ.. ‘ఉగ్రవాదులకు వారి భాషలోనే సమాధానం చెప్పాం. కానీ భారత దేశ చర్యల వల్ల కొందరికి నిద్ర కరువయ్యింది. పాకిస్తాన్ భారత్ చేసిన మెరుపు దాడుల గురించి ప్రపంచ దేశాల ముందు చర్చించినప్పుడు వీరు పాక్‌కు మద్దతుగా మాట్లాడారు’ అని ఆరోపించారు. అంతేకాక కాంగ్రెస్ కావచ్చు.. ఎస్పీ, బీఎస్పీ పార్టీ ఏదైనా సరే వారు ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో మాయావతి, అఖిలేశ్ యాదవ్‌లు ఉగ్రవాదులుగా అనుమానించబడే వ్యక్తులను విడుదల చేశారని ఆరోపించారు. తాను అధికారంలో ఉన్న ఐదేళ్లలో దేశం తలవంపులకు గురయ్యే పని ఒక్కటి కూడా చేయలేదని మోదీ స్పష్టం చేశారు. ఈ క్రమంలో యూఏఈ ప్రభుత్వం తనకు బహుకరించిన జాయేద్ మెడల్ గురించి మాట్లాడుతూ.. ఇది కేవలం మోదీకి దక్కిన గౌరవం కాదు.. ఇది భారత ప్రజలకు దక్కిన గౌరవంగా పేర్కొన్నారు. -
విమానాల కూల్చివేతపై తొలిసారి ఒప్పుకున్న పాక్
ఇస్లామాబాద్: బాలాకోట్‌పై ఐఏఎఫ్ దాడి అనంతరం ఎఫ్–16 విమానాలను వినియోగించలేదని ఇప్పటిదాకా బుకాయించిన పాకిస్తాన్.. తాజాగా మాట మార్చింది. తమ ఎఫ్–16 యుద్ధ విమానాలే భారత్ విమానాలను కూల్చేశాయని మొదటిసారిగా అంగీకరించింది. పాక్ సైన్యం అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ఫిబ్రవరి 27వ తేదీన నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ వైమానిక దళం(పీఏఎఫ్) పాక్ గగనతలం నుంచే దాడులకు దిగింది. ఆ సమయంలో మా భూభాగంలోకి ప్రవేశించిన రెండు ఐఏఎఫ్ విమానాలను పీఏఎఫ్ కూల్చివేసింది. మేం మోహరించిన విమానాల్లో ఎఫ్–16లు కూడా ఉన్నాయి. ఆత్మరక్షణ కోసం ఏ విధంగానైనా స్పందించే హక్కు మాకుంది’ అని ఆయన ప్రకటించారు. ‘ఆ ఘటన గత చరిత్ర. మా వద్ద ఉన్న ఎఫ్–16 విమానాలను మాత్రం ఐఏఎఫ్ కూల్చలేదు’ అని కూడా ఆయన తెలిపారు. కానీ, గత నెలలో జేఎఫ్–17 రకం విమానాన్ని మాత్రమే వాడినట్లు గఫూరే ప్రకటించారు. బాలాకోట్‌లోని ఉగ్ర శిబిరాలపై ఐఏఎఫ్ దాడికి ప్రతీకారంగా పాక్ వైమానిక దళం కూడా దాడికి యత్నించిన విషయం తెలిసిందే. కానీ, ఈ సందర్భంగా అమెరికా తయారీ ఎఫ్–16ను ఐఏఎఫ్ కూల్చివేయడం కలకలం రేపింది. ఈ విమానాలను మూడో దేశంపై ఉపయోగించరాదని విక్రయ ఒప్పందంలో అమెరికా పేర్కొంది. కానీ, ఈ షరతులను పాక్ ఉల్లంఘించిందంటూ భారత్ అమెరికాకు సాక్ష్యాధారాలు అందజేయడం తెల్సిందే. -
ఆ 22 చోట్ల ఉగ్ర శిబిరాలే లేవు!
ఇస్లామాబాద్: ఉగ్ర శిబిరాలున్నాయంటూ భారత్ చెబుతున్న 22 ప్రాంతాల్లో అందుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని పాకిస్తాన్ తెలిపింది. పుల్వామా ఆత్మాహుతి దాడితో జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్‌కు సంబంధం ఉందనే విషయం భారత్ అందించిన నోటీసులో లేదంది. తాము నిర్బంధంలోకి తీసుకున్న వారిలో 54 మందికి పుల్వామా ఘటనతో సంబంధం లేదని పాక్ చెప్పింది. అంతర్జాతీయంగా వచ్చిన తీవ్ర ఒత్తిడులకు తలొగ్గిన పాకిస్తాన్.. భారత్ అందజేసిన వివరాల మేరకు దర్యాప్తు చేపట్టడంతో పాటు వివిధ నిషేధిత ఉగ్ర సంస్థలకు చెందిన 120 మందిని నిర్బంధంలోకి తీసుకుంది. అయితే, తమ దర్యాప్తులో భారత్ ఆరోపణలకు తగిన రుజువులు లభించలేదనీ, మరిన్ని వివరాలు అందించాలని బుధవారం కోరింది. ఆ దేశ అంతరంగిక శాఖ కార్యదర్శి ఆజం సులేమాన్ ఖాన్, విదేశాంగ శాఖ ప్రతినిధి ముహమ్మద్ ఫైజల్ గురువారం వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. ‘జైషే మొహమ్మద్ అధినేత అజార్ కొడుకు హమ్మద్, సోదరుడుసహా 120 మందిని నిర్బంధంలోకి తీసుకున్నాం. వీరిలో 54 మందికి పుల్వామా దాడితో సంబంధం ఉన్నట్లుగా ఆధారాలు లేవు. ఉగ్ర శిబిరాలున్నట్లుగా పేర్కొన్న 22 ప్రాంతాల్లో సోదాలు జరపగా అటువంటివేమీ లేనట్లు తేలింది. కావాలంటే భారత్ తనిఖీ చేసుకోవచ్చు’ అని అన్నారు. ‘పుల్వామా ఘటన మా పనే’ అంటూ జైషే మొహమ్మద్ నేత ఆదిల్ దార్ ప్రకటిస్తున్నట్లుగా ఉన్న వీడియోల వంటి వాటిపైనా దర్యాప్తు చేపట్టాం’ అని వివరించారు. పాక్‌లో ఉగ్ర స్థావరాలున్నాయని చూపేందుకు మరిన్ని సాక్ష్యాలు కావాలంటూ పాక్ ఇచ్చిన సమాధానంపై భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. పుల్వామా దాడిని ఉగ్ర ఘటనగా గుర్తించేందుకు కూడా పాక్ సిద్ధంగా లేకపోవడాన్ని ఆయన ఖండించారు. -
‘బాలాకోట్’ రిపీట్‌కు పాక్ యత్నం!
న్యూఢిల్లీ: ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ శిక్షణా శిబిరాలపై భారత వైమానిక దళం బాంబులు జారవిడిచిన మరుసటి రోజు అదే తరహాలో భారత భూభాగంలో దాడులకు పాకిస్తాన్ విఫలయత్నం చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా అదే నెల 26న పాకిస్తాన్ భూభాగంలోని బాలాకోట్‌లో భారత వైమానిక దళం దాడులు నిర్వహించి ముష్కరులకు భారీగా నష్టం కలిగించినట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తరువాతి రోజు అంటే ఫిబ్రవరి 27న పాకిస్తాన్ ప్రతీకార దాడుల్ని తిప్పికొట్టే క్రమంలో వింగ్ కమాండర్ అభినందన్ పాకిస్తాన్ సైన్యానికి చిక్కారు. వార్తా సంస్థ ఏఎన్ఐ కథనం ప్రకారం..ఆ రోజు పాకిస్తాన్ సుమారు 20 యుద్ధ విమానాలతో భారత్‌పై బాలాకోట్ తరహా దాడికి ప్రయత్నించినట్లు తెలిసింది. అమెరికా నుంచి కొనుగోలు చేసిన ఎఫ్–16తో పాటు ఫ్రెంచ్ మిరాజ్–3, చైనీస్ జేఎఫ్–17 విమానాల సాయంతో సుమారు 1000 కిలోల బాంబులను పూంచ్, దాని సమీపంలోని మూడు చోట్ల భారత ఆర్మీ శిబిరాల వైపు విసిరింది. సరిహద్దుకు 50 కిలో మీటర్ల పరిధిలోని తన భూభాగం నుంచే పాకిస్తాన్ ఆర్మీ ఈ దాడులకు పాల్పడింది. అయితే భారత యుద్ధ విమానాలు సకాలంలో స్పందించడంతో పాకిస్తాన్ లక్ష్యం నెరవేరలేదు. దీంతో ఆ బాంబులను అక్కడికక్కడే వదిలి వెళ్లిపోయారని పేరు వెల్లడించడానికి ఇష్టపడని అధికారి ఒకరు చెప్పారు. కశ్మీర్‌లోని ఓ సైనిక స్థావరంపై బాంబులు జారవిడిచినప్పుడు అక్కడ ఉన్న పెద్ద చెట్టు అడ్డుకుందని తెలిపారు. ఆ సమయంలో అదే భవనంలో సీనియర్ అధికారులు ఉన్నట్లు చెప్పారు. -
మరోసారి అంకిత భావం చాటుకున్న అభినందన్
న్యూఢిల్లీ : పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని కూల్చి భారతావని నీరాజనాలు అందుకున్న భారత వాయుసేన పైలట్ అభినందన్ వర్థమాన్ మరోసారి దేశ సేవ పట్ల తనకున్న అంకిత భావాన్ని చాటుకున్నారు. నాలుగు వారాల పాటు సెలవులు లభించినప్పటికీ ఇంట్లో గడపకుండా తన స్క్వాడ్రాన్‌తో కలిసి ఉండటానికే మొగ్గు చూపారు. ఈ క్రమంలో ఆయన శ్రీనగర్‌లోని వాయుదళం చెంతకు చేరుకున్నట్లు సమాచారం. పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో.. పాక్ వైమానిక దాడులను తిప్పి కొట్టే క్రమంలో అభినందన్ విమానం కూలిపోగా...ఆయన పాక్ భూభాగంలో దిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అనేక పరిణామాల అనంతరం జెనీవా ఒప్పందం ప్రకారం ఆయన భారత్‌కు చేరుకున్నారు.(చదవండి : ఎవరీ విక్రమ్ అభినందన్?) ఈ నేపథ్యంలో శత్రు సైన్యం చెర నుంచి విముక్తి పొందిన అభినందన్ మానసిక స్థితిని విశ్లేషించేందుకు డీబ్రీఫింగ్ సెషన్(తీవ్రమైన ఒత్తిడికి గురైన సైనికుడికి నిర్వహించే వైద్య పరీక్షలు) నిర్వహించారు. ఇందులో భాగంగా కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకోవాలని అభినందన్‌కు వైద్యులు సూచించారు. ఆర్మీ ఆసుపత్రిలో నిపుణులైన వైద్యుల బృందం ఆధ్వర్యంలో దాదాపు రెండు వారాల పాటు వైద్య పరీక్షలన్నీ పూర్తైన అనంతరం 12 రోజుల క్రితం ఆయనకు సెలవు ఇచ్చారు. ఈ క్రమంలో కుటుంబంతో గడిపేందుకు అభినందన్ చెన్నైకి వెళ్లాల్సి ఉంది. అయితే చెన్నైకి వెళ్లకుండా తన స్క్వాడ్రాన్, మిషన్లతో కలిసి పనిచేయడమే తనకు ఇష్టమని ఆయన చెప్పినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.(చదవండి : ‘అభినందన్ దగ్గర గన్ లేకుంటే కొట్టి చంపేవాళ్లం’) కాగా ప్రస్తుతం అభినందన్ అభీష్టం ప్రకారం ఆయన శ్రీనగర్ చేరుకున్నప్పటికీ నాలుగు వారాల సిక్ పీరియడ్ పూర్తైన తర్వాత మెడికల్ బోర్డు ఆయనకు మరోసారి ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తుంది. వీటి ఫలితంపైనే అభినందన్ యుద్ధ విమానాన్ని నడపగలరా లేదా అన్న విషయం ఆధారపడి ఉంటుంది.(పాక్ విమానాన్ని అభినందన్ నేలకూల్చాడిలా..!) -
‘కాంగ్రెస్ గెలిస్తే.. పాక్‌లో దీపావళి’
గాంధీనగర్ : 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గనుక గెలిస్తే.. పాక్ దీపావళి పండుగ జరుపుకుంటుందని బీజేపీ సీనియర్ నేత, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఆరోపించారు. బాలాకోట్‌లో జరిగిన మెరుపు దాడులకు సంబంధించి ఆధారాలు చూపాలంటూ శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఆదివారం బీజేపీ పార్టీ అధ్వర్యంలో జరిగిన ‘విజయ్ సంకల్ప్’ ర్యాలీ ప్రారంభోత్సవానికి హాజరైన విజయ్ రూపానీ మాట్లాడుతూ.. ‘పాకిస్తాన్ ఉగ్రవాదులకు పుట్టినిల్లు అనే విషయం ప్రపంచానికంతటికి తెలుసు. కానీ రాహుల్ గాంధీ టీచర్ శామ్ పిట్రోడా మాత్రం ఎవరో పది మంది ఉగ్రవాదులు చేసిన పనికి పాకిస్తాన్‌ను నిందించడం సరికాదంటూ ఆ దేశం తరఫున వకల్తా పుచ్చుకుంటారు. పైగా సర్జికల్ స్ట్రైక్స్‌కు సంబంధించిన ఆధారాలను చూపించమంటూ డిమాండ్ చేస్తారు. దేశం కోసం ప్రాణాలర్పించే సాయుధ బలగాలను పదే పదే అవమానించడం విపక్షాలకు అలవాటుగా మారిందం’టూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక ‘ఒక వేళ మే 23న గనుక కాంగ్రెస్ పార్టీ గెలిస్తే.. పాక్ దీపావళి చేసుకుంటుంది. ఎందుకంటేం పాక్, కాంగ్రెస్ ఎల్లప్పుడు కలిసే ఉంటాయి’ అంటూ విమర్శల వర్షం కురిపించారు. మోదీ భాయ్ భారత్‌ను రామ రాజ్యంగా మార్చలనుకుంటున్నారన్నారు. కానీ కాంగ్రెస్, కమ్యూనిస్ట్‌లు, టెర్రరిస్ట్‌లు, నక్సలైట్లు, అవినీతిపరులు, మాయావతి, మమతా బెనర్జీ, అఖిలేష్, చంద్రబాబు లాంటి స్వార్థ ప్రతిపక్ష నేతలు మోదీని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అయితే జనాలు వారి ఆటలు సాగనివ్వరని తెలిపారు. పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పాలంటే మోదీనే మరోసారి గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. -
పాక్‌పై ఐఏఎఫ్ దాడి తప్పు
న్యూఢిల్లీ: పుల్వామా ఘటనకు ప్రతీకారంగా పాక్‌పై ఐఏఎఫ్ జరిపిన దాడులను కాంగ్రెస్ ఓవర్సీస్ విభాగం అధ్యక్షుడు శామ్ పిట్రోడా తప్పుపట్టారు. బాలాకోట్‌లోని ఉగ్ర శిక్షణ శిబిరాలపై దాడికి సంబంధించి మరిన్ని వివరాలను ముఖ్యంగా మృతుల సంఖ్యను వెల్లడించాలని పిట్రోడా శుక్రవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘వాళ్లు(ఐఏఎఫ్) 300 మంది ఉగ్రవాదులను చంపడం సరే. దీనిని నిరూపించేందుకు తగిన ఆధారాలు చూపగలరా?. సరిహద్దు అవతలి నుంచి కొందరు ఇక్కడికి వచ్చి దాడులు చేశారు. ఇంతకు ముందు ఇలాంటివి ఎన్ని జరగలేదు? ఎప్పుడూ జరుగుతూనే ఉన్నాయి. ముంబైలోనూ దాడి జరిగింది. దీనిపై స్పందించిన అప్పటి యూపీఏ వెంటనే సరిహద్దుల్లోకి విమానాలను పంపించలేదు. కానీ, ఒక సంఘటన ఆధారంగా ఇలా చేయడం దాడి చేయడం సరైన విధానం కాదు’ అన్నారు. ‘కొందరు ఉగ్రవాదులు జరిపిన దాడికి పాక్‌ను శిక్షించడం సరికాదు. 8మంది ఉగ్రవాదులు వచ్చి ముంబైలో దాడి చేశారు. అంతమాత్రాన పాక్‌పై విరుచుకుపడతారా? కొందరు వ్యక్తులు చేసిన పనికి దేశ ప్రజలందరినీ తప్పుపడతారా? ప్రధాని తీరు నిరాశ కలిగించింది ‘నేను కొన్ని వివరాలు మాత్రమే అడిగా. అదీ వ్యక్తిగతంగానే, ఇందులో కాంగ్రెస్ ప్రమేయమేమీ లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరికీ ప్రశ్నించే హక్కుంది. దానిపై అంతగా స్పందించాల్సిన అవసరం లేదు. అదీకూడా ప్రధానిస్థాయి వ్యక్తి. ఆయన సమాధానంతో నిరాశ చెందా’ అన్నారు. ‘మోదీ ప్రభుత్వ వైఫల్యం కారణంగానే పుల్వామా ఘటన చేసుకుంది. బాలాకోట్‌పై ఐఏఎఫ్ జరిపిన దాడి మన బలగాల సాహసానికి ప్రతీక. ప్రధాని మోదీ, బీజేపీ తమ వ్యక్తిగత అభిప్రాయాలను విద్వేషాన్ని ప్రచారం చేసుకోవడానికి వాడుకోవడం ఆపాలి. సైనిక బలగాల త్యాగాలను స్వార్థానికి వాడుకోవడం మానాలి’ అని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ప్రజలు క్షమించబోరు: మోదీ శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై ప్రధాని విరుచుకుపడ్డారు. ఆయన తన మాటలతో పాక్ జాతీయ దినోత్సవాలకు అంకురార్పణ చేశారంటూ ఎద్దేవా చేశారు. ఉగ్రవాదులను క్షమించే సహజ స్థావరాలుగా మారాయంటూ ప్రతిపక్షాలను విమర్శించారు. శుక్రవారం ఆయన ట్విట్టర్లో ప్రజలు క్షమించరు(జన్తా మాఫ్ నహీ కరేగీ)అనే హ్యాష్‌ట్యాగ్‌తో స్పందించారు. ‘కాంగ్రెస్ రాచ కుటుంబానికి విశ్వాసపాత్రుడొకరు ప్రజలకు ఇప్పటికే తెలిసిన విషయాన్ని మరోసారి అంగీకరించారు. ఉగ్ర మూకల చర్యలకు దీటుగా బదులివ్వడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదు. ఉగ్రవాద చర్యలకు వారికి అర్థమయ్యే భాషలో బదులిచ్చాం. మన బలగాల త్యాగాలను అవమానిస్తూ ప్రకటనలు చేస్తున్న ప్రతిపక్ష నేతలను ప్రశ్నించాలని భారతీయులకు విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతిపక్షాల చేష్టలను 130 కోట్ల మంది భారతీయులు క్షమించబోరు, మర్చిపోరు’ అని అన్నారు. -
‘పిట్రోడా.. దేశం మిమ్మల్ని క్షమించదు’
న్యూఢిల్లీ : పాకిస్థాన్‌లోని బాలాకోట్‌పై భారత వాయుసేన జరిపిన దాడులను తప్పు పడుతూ కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా మండిపడ్డారు. భారత బలగాలను కించపరిచేలా మాట్లాడటం సిగ్గుచేటన్నారు మోదీ. శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై స్పందించిన మోదీ కాంగ్రెస్‌ను విమర్శిస్తూ వరుస ట్వీట్లు చేశారు. ‘ఉగ్రదాడికి దీటుగా బదులివ్వడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదు. ఇప్పుడు ఆ విషయాన్ని కాంగ్రెస్ రాజకుటుంబానికి అత్యంత విశ్వసనీయమైన వ్యక్తి కూడా ఒప్పుకున్నారు. ఉగ్రవాదుల పక్షాన మాట్లాడటం, మన సాయుధ బలగాలను ప్రశ్నించడం విపక్షాలకు అలవాటుగా మారింది. దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేస్తున్న జవాన్లను ప్రతిపక్ష నేతలు పదే పదే అవమానిస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిని ఈ దేశ ప్రజలు క్షమించర’ని హెచ్చరించారు. అంతేకాక ‘ఈ దేశ ప్రజలను నేను కోరేది ఒక్కటే.. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ప్రతిపక్ష నేతలను ప్రశ్నించండి. ఇలాంటి అవమానకర వ్యాఖ్యలను క్షమించబోమని వారికి అర్థమయ్యేలా వారి భాషలోనే చెప్పండి. జవాన్లకు ఈ దేశం మద్దతుగా నిలుస్తుంది’ అని మోదీ పేర్కొన్నారు. (పాక్‌పై దాడి చేయడం సరి కాదు : పిట్రోడా) Loyal courtier of Congress’ royal dynasty admits what the nation already knew- Congress was unwilling to respond to forces of terror. This is a New India- we will answer terrorists in a language they understand and with interest! https://t.co/Mul4LIbKb5 — Chowkidar Narendra Modi (@narendramodi) March 22, 2019 -
పాకిస్తాన్‌పై దాడి చేయడం మంచి పద్దతి కాదు
-
పాక్‌పై దాడి చేయడం సరి కాదు : పిట్రోడా
న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రతిపక్షాలు ఈ దాడులను ఎన్నికల జిమ్ముక్కుగా విమర్శిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శామ్ పిట్రోడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రదాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్‌పై దాడులు చేయడం మంచి పద్దతి కాదన్నారు. పుల్వామా ఉగ్రదాడిపై స్పందిస్తూ.. ‘ఈ దాడుల గురించి నాకు పూర్తిగా తెలీదు. కానీ ఇలాంటి దాడులు గతంలో జరిగాయి. ముంబైలో కూడా చోటు చేసుకున్నాయి. ఇలాంటి దాడులు జరిగిన వెంటనే ప్రతీకారంగా మనం మన విమానలను పాకిస్తానపై దాడులకు పంపడం చేస్తాం. కానీ కొందరు ఉగ్రవాదులు చేసిన పనికి మొత్తం పాకిస్తాన్‌పై దాడి చేయడం మంచి పద్దతి కాదు. ఇలాంటి దాడులు చేసే వారు ప్రపంచంతో ఎలా వ్యవహరిస్తారో నాకు అర్థం కావడం లేద’ని తెలిపారు. ఈ సందర్భంగా ముంబై దాడులను గుర్తు చేసుకుంటూ.. ‘ఓ 8 మంది వచ్చి మన దేశంలో దాడులు చేసి వెళ్లారు. ఈ చర్యలకు ఆ దేశాన్ని మొత్తం నిందించడం సరికాదు. ప్రతీకార దాడులను నేను నమ్మన’ని స్పష్టం చేశారు. (‘పుల్వామా’ను మర్చిపోం: దోవల్) Sam Pitroda,Indian Overseas Congress Chief on #PulwamaAttack:Don’t know much about attacks,it happens all the time,attack happened in Mumbai also,we could have then reacted and just sent our planes but that is not right approach.According to me that’s not how you deal with world. pic.twitter.com/QZ6yXSZXb2 — ANI (@ANI) March 22, 2019 -
కాల్పులకు దిగిన పాక్..జవాను మృతి
శ్రీనగర్ : దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి బరితెగించింది. జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీలో కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. గురువారం ఉదయం జరిగిన ఈ ఘటనలో భారత జవాను యశ్ పాల్(24 ) ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు పోలీసు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. కాగా పుల్వామా ఉగ్రదాడి, బాలాకోట్‌పై మెరుపు దాడుల నేపథ్యంలో భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి దాదాపు ప్రతిరోజూ పాకిస్తాన్ సైన్యం నియంత్రణ రేఖ వెంబడి కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఈ క్రమంలో జనవరి నాటి నుంచి ఇప్పటిదాకా మొత్తం 110 సార్లు కాల్పులకు తెగబడింది. ఇదిలా ఉండగా.. గత సోమవారం నియంత్రణ రేఖ వెంబడి అఖ్నూర్, సుందర్బనీ సెక్టార్లలో పాక్ సైన్యం బాంబులతో విరుచుకు పడినట్లు ఆర్మీ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ ఘటనలో కరమ్‌జీత్ సింగ్ అనే జవాను మరణించారని పేర్కొన్నారు. గతేడాది పాక్ 2936 సార్లు కాల్పులకు దిగిందని, గత పదిహేనేళ్లలో ఇదే అత్యధికమని తెలిపారు. -
నేను బతికే ఉన్నా.. మరేం పర్లేదు!
ఇస్లామాబాద్ : ‘నేను బతికే ఉన్నాను... పూర్తి ఆరోగ్యంగా ఉన్నా.. మరేం పర్లేదు. మాపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీతో పోలిస్తే నేను చాలా ఫిట్‌గా ఉన్నా. నాతో ఆయన ఏ ఆట ఆడతానన్నా సరే సిద్ధంగా ఉన్నా. సవాల్ విసురుతున్నా’ అంటూ ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ అధినేత మసూద్ అజహర్ తన పత్రికలో పేర్కొన్నాడు. మసూద్ మరణించాడంటూ ఇటీవల సోషల్ మీడియా, పాక్ మీడియాలలో వార్తలు ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జైషే మహ్మద్ అధికార పత్రిక ఆల్-కలాంలో సాది అనే కలం పేరిట కథనం రాసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ కథనం ప్రకారం... తన గురించి వస్తున్న వదంతులను నమ్మవద్దని మసూద్ పేర్కొన్నాడు. పుల్వామా దాడిని జైషే సాధించిన గొప్ప విజయంగా అతడు అభివర్ణించాడు. దాడికి పాల్పడి 40 మందికి పైగా భారత జవాన్లను పొట్టనబెట్టుకున్న తమ కమాండర్ ఆదిల్ అహ్మద్ దార్‌ను ప్రశంసిస్తూ.. ‘కశ్మీర్లో ఆదిల్ ఓ గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టాడు. తను రగిల్చిన మంట ఇప్పట్లో చల్లారే ప్రసక్తే లేదు’ అంటూ ద్వేషపూరిత కథనంలో పేర్కొన్నాడు. అదే విధంగా ఆఫ్గనిస్తాన్ ప్రజల పరిస్థితిపై కూడా మసూద్ ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఇందుకు సంబంధించి కచ్చితమైన సమాచారం తెలియాల్సి ఉంది.(ఇంతకు మసూద్ ఎవరు? ఎక్కడ పుట్టాడు?) కాగా కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఆత్మాహుతికి పాల్పడి ఆదిల్ అనే ఉగ్రవాది భారత జవాన్ల కాన్వాయ్‌పై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు ప్రతీకారంగా భారత వైమానిక దళం బాలాకోట్‌లోని జైషే స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. ఈ నేపథ్యంలో భారత్- పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ ఉగ్రవాదాన్ని విడనాడాలంటూ భారత్‌తో పాటు అగ్ర దేశాలన్నీ హెచ్చరిస్తున్నా పాక్ తీరు మార్చుకోవడం లేదు. తమ దేశంలో ఆశ్రయం పొందుతున్న మసూద్ అజహర్‌ను మాత్రం భారత్‌కు అప్పగించడం లేదు. మరోవైపు... జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్న భారత్‌కు ఆ దిశగా భారీ ఊరట లభించింది. మసూద్ అజర్ ఆస్తులను స్తంభింపచేస్తామని శుక్రవారం ఫ్రాన్స్ ప్రకటించింది. ఈ దిశగా ఫ్రాన్స్ దేశీయ, ఆర్థిక, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు సంయుక్త ప్రకటన చేశాయి. ఉగ్రవాదంతో ప్రమేయమున్న వ్యక్తిగా మసూద్ అజర్ పేరును ఐరోపా యూనియన్ జాబితాలో చేర్చేందుకు ఫ్రాన్స్ చొరవ చూపుతుందని అధికారిక ప్రకటన వెల్లడించింది. -
అభినందన్‌కు డీబ్రీఫింగ్, కొద్దికాలం విశ్రాంతి
న్యూఢిల్లీ : పాక్ చెర నుంచి విడుదలైన భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌కు డీబ్రీఫింగ్ సెషన్(తీవ్రమైన ఒత్తిడికి గురైన సైనికుడికి నిర్వహించే వైద్య పరీక్షలు. వీటిలో ముఖ్యంగా సైనికుడి మానసిక పరిస్థితులను విశ్లేషిస్తారు.) పూర్తయింది. కొంతకాలం పాటు అభినందన్ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఆర్మీ ఆసుపత్రిలో నిపుణులైన వైద్యుల బృందం ఆధ్వర్యంలో ఆయనకు గత కొద్దికాలంగా వైద్యపరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. ...కొద్దిరోజుల క్రితం సర్జికల్ స్ట్రైక్స్‌తో ఉలిక్కిపడ్డ పాకిస్తాన్ భారత్‌పై వైమానిక దాడులకు దిగింది. పాక్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధవిమానాలు నియంత్రణ రేఖ (ఎల్వోసీ) దాటి భారత గగనతలంలోకి ప్రవేశించగా.. అభినందన్ వర్ధమాన్ ఆర్-73 అనే మిస్సైల్ ప్రయోగించి ఓ యుద్ధవిమానాన్ని కూల్చేశారు. అదే సమయంలో అభినందన్ విమానం కూడా ప్రత్యర్థి దాడిలో నేలకూలింది. దాంతో ఆయన ప్యారాచూట్ సాయంతో పాక్ భూభాగంలో దిగాల్సి వచ్చింది. అప్పుడు కొందరు పాకిస్తాన్ ప్రజలు ఆయనపై దాడి చేశారు. ఈ దాడిలో అభినందన్ ప్రక్కటెముకతో పాటు పలుచోట్ల గాయాలయ్యాయి. కొద్ది సేపటి తర్వాత పాక్ ఆర్మీ ఆయన్ని వారినుంచి రక్షించి యుద్ధ ఖైదీగా వెంట తీసుకెళ్లింది. అలా పాకిస్తాన్ ఆర్మీ చెరలో 60 గంటల పాటు ఉన్న అభినందన్ ఆ తర్వాత భారత్‌కు తిరిగొచ్చారు. చదవండి : మానసికంగా వేధించారు -
మెరుపు దాడులపై యూపీ సీఎం సంచలన వ్యాఖ్యలు
లక్నో : పాకిస్తాన్‌లోని బాలకోట్లో జరిగిన మెరుపు దాడులను బీజేపీ రాజకీయం చేస్తోందని విపక్షాలు విమర్శలకు దిగుతున్న నేపథ్యంలో తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ వైమానిక దాడులపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. పాక్ ఉగ్ర శిబిరాలపై కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సాహస చర్యతో నరేంద్ర మోదీ ప్రభుత్వం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది, మరోసారి అధికారంలోకి వస్తుందని యోగి ఆదిత్యానాథ్ ధీమా వ్యక్తం చేశారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని మొత్తం 80 లోక్‌సభ స్ధానాలకు గాను బీజేపీ 74 స్ధానాల్లో గెలుపొందుతుందని యూపీ సీఎం ట్వీట్ చేశారు. యూపీలో అత్యధిక సీట్లు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేసిన యోగి ఓ కవితను ట్వీట్లో పొందుపరిచారు. పాక్‌లో చేపట్టిన వైమానిక దాడులపై సందేహాలు లేవనెత్తుతూ విపక్షాలు భారత సైన్యం నైతిక స్ధైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరించాయని వరుస ట్వీట్లలో ఆయన మండిపడ్డారు. కాగా మెరుపు దాడులు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయానికి ఉపకరిస్తాయని కర్ణాటక బీజేపీ నేత యడ్యూరప్ప సహా ఆ పార్టీ నేతలు పలువురు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
శవాలు కాల్చి.. నదిలో పడేసి!
న్యూఢిల్లీ: బాలాకోట్ వైమానిక దాడిలో తమవైపు పెద్దగా నష్టం జరగలేదని చెప్పుకుంటున్న పాకిస్తాన్‌ది వట్టి బుకాయింపేనని తేటతెల్లమైంది. ఫిబ్రవరి 26న భారత వైమానిక దళం ఉగ్ర శిబిరాలపై బాంబులు జారవిడిచిన తరువాత పాకిస్తాన్ ఆర్మీ రంగంలోకి దిగి ముష్కరుల మృతదేహాల్ని కాల్చివేసి సమీపంలోని నదిలో పడేసిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు వెల్లడించాడు. భారత వైమానిక దళం దాడి ఆనవాళ్లను కప్పిపుచ్చుకునేందుకు పాకిస్తాన్ చేసిన ప్రయత్నాల్ని అతడు పూసగుచ్చాడు. సుమారు 3 నిమిషాల వ్యవధి గల ఆ వీడియోను రిపబ్లిక్ టీవీ తాజాగా వెలుగులోకి తెచ్చింది. ఆధారాల్ని మాయం చేసేందుకు బాలాకోట్ గ్రామానికి వచ్చిన పాకిస్తాన్ ఆర్మీ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి వారి ఫోన్లు లాక్కున్నట్లు తెలిసింది. దాడికి సంబంధించి ఎలాంటి వీడియోలు, ఫొటోలు బయటికి రాకుండా ఇంటర్నెట్ సేవల్ని కూడా నిలిపేసినట్లు వీడియోలో ఉంది. బాలాకోట్ దాడి తరువాత ఉగ్రవాదులకు భయం పట్టుకుందని, వారంతా అఫ్గానిస్తాన్–వజీరిస్తాన్ సరిహద్దులోకి పారిపోయారని ప్రత్యక్ష సాక్షి అందులో చెప్పారు. బాలాకోట్ సమీప నివాసిగా భావిస్తున్న సదరు వ్యక్తి ఈ దాడిలో మొత్తం ఎందరు హతమయ్యారో వెల్లడించకున్నా అందులో కొందరు తనకు తెలుసని, వారి చరిత్రతో సహా పేర్లు చదివి వినిపించాడు. వీడియోలో చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే.. అమానవీయంగా వ్యవహరించిన సైన్యం.. భారత వైమానిక దళం మిగిల్చిన నష్టాన్ని కప్పిపుచ్చుకునేందుకు పాకిస్తాన్ ఆర్మీని రంగంలోకి దింపారు. బాలాకోట్‌ను పూర్తిగా తమ అదుపులోకి తీసుకున్న సైన్యం స్థానికులను భయపెట్టింది. వారి మొబైల్ ఫోన్లను లాక్కుంది. గాయపడిన ఉగ్రవాదుల పట్ల అమానవీయంగా వ్యవహరిస్తూ వారికి చికిత్స అందించడానికి వైద్యులను కూడా అనుమతించలేదు. వైద్యం అందించాలని వారు ఎంతో ప్రాధేయపడినా కనికరించలేదు. కార్ల నుంచి తీసిన పెట్రోల్‌తో చాలామటుకు శవాల్ని మూకుమ్మడిగా తగలబెట్టారు. మరి కొన్నింటిని సంచుల్లో చుట్టి సమీపంలోని కున్హర్ నదిలో పడేశారు. మృతిచెందిన ఉగ్రవాదుల్లో చాలా మంది జైషే సభ్యులే. ప్రాణాలతో బయటపడిన వారిని వెంటనే అఫ్గానిస్తాన్–వజీరిస్తాన్ సరిహద్దుకు తరలించారు. ఈ దాడితో ఐఎస్ఐ, జైషే సభ్యులను భయం పట్టుకుంది. ఫొటోలు, వీడియోలు బయటికి రాకుండా నివారించేందుకు అక్కడ మొబైల్, ఇంటర్నెట్ సేవల్ని నిలిపేశారు. అయినా కొన్ని చిత్రాలు వెలుగుచూశాయి. పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్ర శిబిరాలపై భారత్ ఇలాగే దాడికి దిగుతూ ముష్కరులను చంపుతూ ఉంటే, మాకు త్వరలోనే ఉగ్రవాదం బెడద తొలగిపోతుంది. అక్కడ 263 మంది ఉగ్రవాదులు భారత యుద్ధవిమానాలు దాడికి దిగడానికి ఐదు రోజుల క్రితం బాలాకోట్ శిబిరంలో 263 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు తెలిసింది. ఆ సమయంలో ముష్కరులకు శిక్షణ ఇచ్చేందుకు 18 మంది సీనియర్ కమాండర్లు అక్కడే ఉన్నట్లు టైమ్స్ నౌ మీడియా తెలిపింది. ప్రాథమిక శిక్షణకు 83 మంది, అడ్వాన్స్ శిక్షణకు 91 మంది, ఆత్మాహుతి దాడిలో శిక్షణకు 25 మంది ఆæ శిబిరానికి వచ్చినట్లు వెల్లడించింది. మరో 18–20 మంది దాకా వంటగాళ్లు, క్షురకులు, ఇతర సిబ్బంది ఉన్నట్లు పేర్కొంది. బాలాకోట్‌లో 263 మంది ఉగ్రవాదులు ఆవాసం పొందుతున్నట్లు ధ్రువీకరించుకున్న తరువాతే వైమానిక దళం దాడికి దిగిందని తెలిపింది. అక్కడ 300 ఫోన్లు క్రియాశీలకంగా ఉన్నాయని కేంద్ర హోం శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, వైమానిక దాడిలో కనీసం నలుగురు పాకిస్తాన్ సైనికులు కూడా మృత్యువాతపడినట్లు తెలిసింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)పోలీసులు, బాలాకోట్ మత గురువులకు ఫోన్‌చేయగా భారత వైమానిక దళం బాంబులు జారవిడిచిన సంగతి నిజమేనని చెప్పినట్లు ఇండియా టుడే టీవీ తెలిపింది. -
ఉగ్ర నీడలను పసిగడుతూ పంజా..
సాక్షి, న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు నేలకొరిగిన నేపథ్యంలో పాకిస్తాన్‌లోని బాలకోట్లో జైషే మహ్మద్ ఉగ్ర శిబిరంపై భారత వైమానిక దళం జరిపిన దాడుల్లో 263 మంది ఉగ్రవాదులు మరణించినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేశాయి. మృతుల్లో దాదాపు 18 నుంచి 20 మంది ఉగ్రవాదులకు సాయం అందించేందుకు వచ్చిన క్షురకులున్నారని సమాచారం. ఉగ్రవాదుల కదలికలను ఐదు రోజుల పాటు గ్రౌండ్ ఇంటెలిజెన్స్ ద్వారా పసిగట్టిన తర్వాత ఫిబ్రవరి 26న తెల్లవారుజామున మెరుపు దాడులతో విరుచుకుపడినట్టు వైమానిక దళ వర్గాలు చెబుతున్నాయి. ఉగ్ర కదలికలపై ఆరా.. బాలకోట్‌లోని జైషే మహ్మద్ ఉగ్రవాదుల శిబిరంలో నాలుగు భవనాల్లో సమావేశమైన టెర్రరిస్టుల సంఖ్యపై ఇంటెలిజెన్స్ వర్గాలు వివరాలు వెల్లడించాయి. దౌరా ఈ మౌలాత్ అనే భవనంలో 30 మంది టెర్రరిస్టులు సమావేశమయ్యారని, ఫిబ్రవరి 25న బాలకోట్లో ఉగ్రవాదులకు శిక్షణ కార్యక్రమం ప్రారంభమైనట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఆత్మాహుతి దాడులకు ప్రణాళిక దౌరా ఈ ఖాస్ అనే భవనంలో ఫిబ్రవరి 26న 91 మంది ఉగ్రవాదుల భేటీలో భారత్‌లో ఆత్మాహుతి దాడులకు పాల్పడేందుకు 25 మంది ఉగ్రవాదులకు ఈ శిబిరంలో శిక్షణ కోసం ఎంపిక చేసినట్టు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. ఇక ఫిబ్రవరి 14న పుల్వామాలో ఉగ్రదాడి అనంతరం ఇతర ప్రాంతాలకు వెళ్లి ఐదు రోజుల్లో ఫిబ్రవరి 19న తిరిగి బాలకోట్‌లోని ఉగ్ర స్ధావరానికి టెర్రరిస్టులు చేరుకున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఇదే స్ధావరంలో ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చేందుకు 18 మంది సీనియర్ కమాండర్లను ఈ శిబిరానికి జైషే చీఫ్ పంపినట్టు ఇంటెలిజెన్స్ వర్గాల పసిగట్టాయి. ఉగ్ర కదలికలపై అనుక్షణం నిఘా వేసి ఉగ్రవాదులకు భారీ నష్టం కలిగించేలా మెరుపు దాడులతో వైమానిక దళం ఫిబ్రవరి 26 తెల్లవారుజామున విరుచుకుపడింది. -
కాంగ్రెస్ నేతగా సిగ్గుపడుతున్నా..
పట్నా: ఉగ్రవాదుల స్థావరాలపై భారత వైమానిక దళం జరిపిన దాడులకు ఆధారాలు చూపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నా విషయం తెలిసిందే. దీనిపై బీజేపీనే కాక సొంత పార్టీ నేతలే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఐఎఎఫ్ దాడులపై కాంగ్రెస్ పార్టీ తీరుకు వ్యతిరేకంగా ఆపార్టీ బిహార్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ రాజీనామా చేశారు. ‘‘వైమానిక దళాలు జరిపిన దాడులకు కాంగ్రెస్ పార్టీ ఆధారాలు అడిగింనందుకు ఆపార్టీ వ్యక్తిగా సిగ్గుపడుతున్నా. పార్టీ తీరుకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నా’’అని ఆనంద్ శర్మ తెలిపారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి పంపినట్లు శర్మ వెల్లడించారు. ఐఎఎఫ్ దాడులపై బీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం సాగుతోన్న విషయం తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం పాకిస్తాన్‌లోని బాలాకోట్ ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు జరిపాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై సరైన ఆధారాలు చూపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్న విషయం విధితమే. సైనికుల త్యాగాలను ప్రధాని మోదీ రాజకీయంగా ప్రచారం చేసుకుంటున్నారని కాంగ్రెస్ విమర్శించగా.. జవాన్లను అవమానించే విధంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని బీజేపీ ప్రతివిమర్శలు చేస్తోంది. -
పాక్ డ్రోన్ పరార్
జైపూర్: పాక్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. పాక్ మిలటరీకి చెందిన డ్రోన్ శనివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో భారత భూభాగంలోకి దూసుకొచ్చేందుకు యత్నించిందని బీఎస్ఎఫ్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. రాజస్తాన్‌లోని హిందుమాల్‌కోట్‌లోకి పాక్ డ్రోన్ రావడంతో బీఎస్ఎఫ్ జవాన్లు దానిపై కాల్పులు జరిపారు. దీంతో వెంటనే ఆ డ్రోన్ వెనక్కు మళ్లింది. కాగా, నియంత్రణ రేఖ (ఎల్వోసీ) సమీపంలో శనివారం పెను ప్రమాదం తప్పింది. ఉదయం పదింటికి అఖ్నూర్ సెక్టార్లో నంద్వాల్‌చౌక్ వద్ద రోడ్డు పక్కన ఉగ్రవాదులు అమర్చిన ఇంప్రోవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్(ఐఈడీ)ను సైన్యం గుర్తించింది. వెంటనే ఆప్రాంతంలోని వారిని ఖాళీచేయించి ఐఈడీని నిర్వీర్యం చేశారు. ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో అలాంటివి ఇంకా ఏమైనా అమర్చారా అనే అనుమానంతో బలగాలు క్షుణ్నంగా తనిఖీలు చేపట్టాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాంబు అమర్చిన వారిని పట్టుకునేందుకు దర్యాప్తు చేపట్టారు. -
యుద్ధాలు అధికారానికి సోపానాలా?
ఉగ్రవాదుల ఏరివేతకు వైమానిక దళం బాలాకోట్‌పై జరిపిన దాడి నుంచి రాజకీయ లబ్ధి పొందేందుకు అధికార బీజేపీ ప్రయత్నిస్తోందంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ దాడితో లోక్‌సభ ఎన్నికల్లో తమకు మరో పాతిక సీట్లు ఎక్కువ వస్తాయని బీజేపీ నేత యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలు వీరి ఆరోపణకు బలాన్నిచ్చాయి. అయితే, సైనిక ఘర్షణలు నిజంగానే పార్టీలు అధికారంలోకి రావడానికి దోహదపడతాయా అంటే కచ్చితంగా అవునని జవాబు చెప్పలేం. అయితే, వీటి వల్ల దేశంలో రాజకీయ ముఖ చిత్రంలో మార్పులు జరిగినట్టు గత యుద్ధాలు, సైనిక ఘర్షణల తదనంతర పరిణామాలు తెలియజేస్తున్నాయి. దేశ విభజన జరిగిననాటి నుంచి ఇంత వరకు భారత్ పాకిస్తాన్‌తో నాలుగుసార్లు, చైనాతో ఒకసారి యుద్ధానికి దిగింది. శ్రీలంకలో అంతర్యుద్ధం నివారణకు సైనిక జోక్యం చేసుకుంది. వీటి తర్వాత జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీకి మళ్లీ విజయం దక్కినా దక్కకపోయినా రాజకీయ సమీకరణాలు గణనీయంగా మారాయి. ఉదాహరణకు భారత్ 1962లో చైనాతో, 1965లో పాకిస్తాన్‌తో తలపడింది. చైనా యుద్ధంలో ఓడిపోతే, పాకిస్తాన్‌పై విజయం సాధించింది. ఈ రెండు యుద్ధాలు కూడా 1962, 1967 సార్వత్రిక ఎన్నికల మధ్యనే జరిగాయి. ఆ సమయంలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ యుద్ధాల తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓట్లు, సీట్లు కూడా తగ్గాయి. 1971లో జరిగిన బంగ్లాదేశ్ కోసం భారత్, పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరిగింది. ఇందిరా గాంధీ హయాంలో జరిగిన ఈ యుద్ధం తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ బలం భారీగా పెరిగింది. వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో కార్గిల్ యుద్ధం జరిగింది. దీంట్లో భారత్ విజయం సాధించింది. తర్వాత కొన్ని నెలలకు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ అధికారం కైవసం చేసుకుంది. అయితే, సీట్లు మాత్రం ఏమీ పెరగలేదు. కేవలం యుద్ధాల వల్లే రాజకీయ పార్టీల తలరాత మారిందని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఎన్నికల్లో ఆర్థిక, సామాజికాంశాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. మూడో భారత్–పాక్ యుద్ధం(1971) బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన ఈ యుద్ధంలో భారత్ గెలిచింది. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉండగా ఈ యుద్ధం జరిగింది. 1971 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన కొన్ని నెలలకు ఈ యుద్ధం జరిగింది. తర్వాత 1977లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకంగా 158 సీట్లు కోల్పోయింది. 1971 ఎన్నికల్లో 352 సీట్లు సాధించిన కాంగ్రెస్ ఈసారి 154 సీట్లతో సరిపెట్టుకుంది. ఈ ఎన్నికల్లో జనతా పార్టీ గెలిచింది. స్వాతంత్య్రం తర్వాత కేంద్రంలో ఏర్పడ్డ తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఇది. మొదటి భారత్–పాక్ యుద్ధం(1947) కశ్మీర్ యుద్ధంగా పేరొందిన ఇది 1947 అక్టోబర్– 1948 డిసెంబర్ల మధ్య జరిగింది. ఆ తర్వాత 1952లో జరిగిన మొదటి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. భారత్–చైనా యుద్ధం (1962) 1962, అక్టోబర్ 20 నుంచి 1962 నవంబర్ 21 వరకు జరిగింది. దీంట్లో భారత్ ఓడింది. యుద్ధం సమయంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. 1962లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 361 సీట్లు సాధించింది. ఐపీకేఎఫ్ (1987) శ్రీలంకలో అంతర్యుద్ధాన్ని నివారించడం కోసం శాంతి పరిరక్షక దళాన్ని భారత్ అక్కడికి పంపి లంక సైనిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంది. నాటి ప్రధాని రాజీవ్ గాంధీ 1991లో హత్యకు గురయ్యారు. ఐపీకేఎఫ్‌ను పంపడానికి ముందు 1984లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ రికార్డు స్థాయిలో 404 సీట్లు గెలుచుకుంది. ఈ జోక్యం తర్వాత జరిగిన (1989) ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. రెండో భారత్–పాక్ యుద్ధం(1965) లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా ఉండగా, 1965లో ఈ యుద్ధం జరిగితే, రెండేళ్ల తర్వాత 1967లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి 283 సీట్లతో అధికారం దక్కించుకుంది. అయితే, అంతకుముందు ఎన్నికలతో పోలిస్తే 78 సీట్లు తక్కువ వచ్చాయి. కార్గిల్ యుద్ధం(1999) బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో కార్గిల్ యుద్ధం జరిగింది. 1999 మే నుంచి జూలై వరకు జరిగిన ఈ యుద్ధంలో భారత్‌దే గెలుపు.ఈ యుద్ధానికి ముందు 1998లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. కార్గిల్ యుద్ధం తర్వాత 2004లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 138 సీట్లు మాత్రమే వచ్చాయి. అంతకుముందు ఎన్నికల్లో వచ్చిన సీట్ల కంటే ఇవి 44 తక్కువ. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా మెజారిటీ సీట్లు సాధించలేక పోయింది. అయినా కూడా ఇతర పార్టీలతో కలిసి యూపీఏ పేరుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. -
కొత్తనీతి.. సరికొత్త రీతి
నోయిడా: బాలాకోట్ ఉగ్రదాడిపై ఆధారాలు చూపాలంటున్న ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. ఉగ్రమూకల ఏరివేత విషయంలో యూపీఏ ప్రభుత్వం ధైర్యం, తెగువ చూపలేకపోయిందని విమర్శించారు. కానీ ఎన్డీయే ప్రభుత్వం 2016లో సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా ఉగ్రమూకలకు వారికి అర్థమయ్యే భాషలోనే గుణపాఠం చెప్పిందని వ్యాఖ్యానించారు. భారత్ ఇప్పుడు ‘కొత్తనీతి–సరికొత్త రీతి’తో ముందుకుపోతోందన్నారు. ‘2008లో జరిగిన ముంబై మారణహోమాన్ని దేశం ఎన్నటికీ మర్చిపోదు. ఆ ఉగ్రదాడులకు భారత్ వెంటనే ప్రతిస్పందించి ఉంటే ప్రపంచం మొత్తం మనకు అండగా నిలిచేది. పాక్‌లో ఉగ్రసంస్థల పాత్రపై మనదగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. కానీ అప్పటి ప్రభుత్వం ధైర్యం, తెగువ చూపలేకపోయింది. ఉగ్రదుశ్చర్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి మన భద్రతాబలగాలు సిద్ధంగా ఉన్నప్పటికీ కేంద్రం మౌనం వహించింది’ అని అన్నారు. తెల్లవారుజామునే పాకిస్తాన్ ఏడ్చింది.. పాక్‌లోని బాలాకోట్‌లో జైషే ఉగ్రస్థావరంపై భారత వాయుసేన ఫిబ్రవరి 24న దాడిచేశాక తెల్లవారుజామున 5 గంటలకు ‘మోదీ మాపై దాడి చేశాడు’ అని పాక్ ఏడుపు అందుకుంది. దాడులతో ఇబ్బందిపెడుతూనే ఉండొచ్చనీ, ఇండియా ప్రతిస్పందించదని వాళ్లు భావిస్తున్నారు. 2014కు ముందున్న రిమోట్ కంట్రోల్ ప్రభుత్వం కారణంగానే శత్రువులకు ఈ అభిప్రాయం బలంగా ఏర్పడింది. ఉడీ ఘటన తర్వాత మన బలగాలు ఉగ్రవాదుల ఇళ్లలోకి దూరి వాళ్లను హతమార్చాయి. యూపీలోని కుర్జాలో, బిహార్‌లోని బుక్సారిన్‌లో రెండు థర్మల్ విద్యుత్ కేంద్రాలను ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. 50ఏళ్ల పాత సామగ్రిని వాడటంతో విద్యుత్ ఉత్పత్తి వ్యయం యూనిట్‌కు రూ.10కు చేరుకుందని ప్రధాని తెలిపారు. కానీ సౌరశక్తి ద్వారా ఇప్పుడు యూనిట్ విద్యుత్‌ను రూ.2కే ఉత్పత్తి చేయొచ్చన్నారు. ఐదేళ్లలో మూడు దాడులు: రాజ్‌నాథ్ మంగళూరు: గత ఐదేళ్లలో భారత్ మూడు సార్లు దాడులు చేసిందని హోం మంత్రి రాజ్‌నాథ్ చెప్పారు. 2016లో ఉడి ఉగ్రవాద దాడి తర్వాత చేపట్టిన దాడి, ఇటీవల జరిపిన వైమానిక దాడుల గురించి వివరించిన రాజ్‌నాథ్ మూడో దాడి వివరాలు బయటపెట్టలేదు. శనివారం కర్ణాటక బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఉడిలో నిద్రపోతున్న సైనికులపై ఉగ్రవాదులు దాడి జరిపి 17 మందిని చంపివేశారని, దీనికి ప్రతీకారంగా పీవోకే భారత్ తొలి మెరుపుదాడి చేసిందన్నారు. పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఆత్మాహుతి దాడి తర్వాత వైమానిక దాడి జరిపి జైషే ఉగ్ర శిబిరాన్ని నాశనం చేసిందన్నారు. ఈ దాడులతో భారత్ బలహీన దేశం కాదని పాకిస్తాన్‌కు గట్టి సందేశం ఇచ్చామని వెల్లడించారు. -
ఎఫ్16ను కూల్చింది అభినందనే
న్యూఢిల్లీ / వాషింగ్టన్: పాకిస్తాన్‌కు చెందిన అత్యాధునిక ఎఫ్–16 యుద్ధ విమానాన్ని భారత్ పైలెట్, వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమానే కూల్చివేశారని భారత విదేశాంగ శాఖ తెలిపింది. అభినందన్ పాక్ విమానాన్ని కూల్చడాన్ని ప్రత్యక్ష సాక్షులు చూశారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్‌కుమార్ చెప్పారు. కూల్చడంపై ఎలక్ట్రానిక్ ఆధారాలు తమవద్ద ఉన్నాయన్నారు. ఎఫ్–16 ఫైటర్ జెట్లలో వాడే అమ్రామ్ క్షిపణి శకలాలను ఇప్పటికే మీడియా ముందు ప్రదర్శించిన విషయాన్ని గుర్తుచేశారు. వీడియో సాక్ష్యాలను ఎందుకు చూపలేదు? భారత్‌కు చెందిన రెండు యుద్ధవిమానాలను కూల్చివేశామని పాక్ చెప్పడాన్ని రవీశ్ తప్పుపట్టారు. పాక్‌తో ఘర్షణ సమయంలో మనం ఒక మిగ్–21 బైసన్ యుద్ధవిమానాన్ని మాత్రమే కోల్పోయిందని, దాన్ని నడుపుతున్న అభినందన్ పాక్ సైన్యానికి చిక్కారని చెప్పారు. నిజంగానే పాక్ మరో విమానాన్ని కూల్చివేస్తే, వారం రోజులైనా ఆ సాక్ష్యాలను అంతర్జాతీయ మీడియా ముందు ఎందుకు ప్రవేశపెట్టలేదని ప్రశ్నించారు. అదే నిజమైతే ఆ రెండో విమానం శకలాలు ఎక్కడున్నాయి? దాన్ని నడుపుతున్న పైలెట్లకు ఏమైంది? అనే విషయాలను పాక్ వెల్లడించాలన్నారు. పాక్‌లోనే ఉన్నాడని అందరికీ తెలుసు.. పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ పాక్‌లో ఉన్నాడని ఐక్యరాజ్యసమితిలోని భద్రతామండలి సభ్యులకు తెలుసని రవీశ్ చెప్పారు. 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మృతికి కారకులైన జైషే ఉగ్రశిబిరాలు పాక్‌లో స్వేచ్ఛగా నడుస్తున్నాయన్న విషయం భద్రతామండలికి తెలుసని స్పష్టం చేశారు. పుల్వామా ఉగ్రదాడి, తదనంత పరిణామాలతో భారత్–పాకిస్తాన్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై అమెరికా విదేశాంగ మంత్రి పాంపియో, బ్రిటన్ జాతీయ భద్రతా సలహాదారు మార్క్‌తో చర్చించారు. -
రాజస్తాన్‌లో పాక్ డ్రోన్ కూల్చివేత
జైపూర్ : కశ్మీర్ సరిహద్దుల వెంబడి పదే పదే కాల్పులకు తెగబడుతున్న పాకిస్తాన్ మరో దుందుడుకు చర్యకు పాల్పడినట్లు సమాచారం. కశ్మీర్‌తో పాటు రాజస్తాన్‌లోని భారత్- పాకిస్తాన్ సరిహద్దుల కూడా దాయాది దేశం కవ్వింపు చర్యలకు దిగుతోంది. డ్రోన్ల ద్వారా భారత సైనిక రహస్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నించి ఇప్పటికే రెండుసార్లు విఫలమైనా పాక్ బుద్ధి మాత్రం మారలేదు. ఈ క్రమంలో శనివారం మరోసారి రాజస్తాన్‌లోని శ్రీ గంగానగర్ సెక్టార్ గుండా భారత గగనతలంలోకి పాక్ డ్రోన్ ప్రవేశించగా.. భారత సైన్యం దానిని కూల్చివేసింది.(చదవండి : తీరు మారని పాక్.. సరికొత్త నాటకాలు!!) కాగా పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్ అనంతరం భారత గగన తలంలోకి ప్రవేశించేందుకు పాక్ డ్రోన్లు ప్రయత్నించడం ఇది మూడోసారి. ఫిబ్రవరి 27న గుజరాత్‌లోని కచ్, మార్చి 4న రాజస్తాన్‌లోని బికనీర్ సరిహద్దు గుండా భారత్‌లోకి ప్రవేశించాలని చూసిన పాక్ డ్రోన్లను నేలకూల్చి భారత సైన్యం దీటుగా జవాబిచ్చిన సంగతి తెలిసిందే. -
పాక్‌లో 22 ఉగ్ర శిబిరాలు
వాషింగ్టన్/ ఇస్లామాబాద్/జాబా: పాకిస్తాన్లో ఇప్పటికీ 22 ఉగ్రవాద శిక్షణ శిబిరాలు నడుస్తున్నాయని, వాటిలో తొమ్మిది శిబిరాలు జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందినవేనని సీనియర్ భారతీయ అధికారి ఒకరు చెప్పారు. ఈ శిబిరాలపై పాక్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాషింగ్టన్లో ఉంటున్న ఆయన విలేకరుల సమావేశంలో అన్నారు. సరిహద్దు ఆవల నుంచి భారత దేశంలో మళ్లీ ఏమైనా ఉగ్రవాద సంబంధిత దాడులు జరిగితే ప్రభుత్వం బాలాకోట్ తరహా దాడులు చేస్తుందని ఆయన పాకిస్తాన్‌ను హెచ్చరించారు. ‘ఉగ్రవాదానికి అంతర్జాతీయ కేంద్రం పాకిస్తాన్. తీవ్రవాదులపై, తీవ్రవాద సంస్థలపై పాకిస్తాన్ నమ్మదగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది’అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ అధికారి అన్నారు. తన గడ్డపై 22 ఉగ్రవాద శిక్షణా శిబిరాలు నడుస్తున్నా వాటిపై ఏ చర్యా తీసుకోని పాకిస్తాన్ ప్రభుత్వం తమ దేశంలో తీవ్రవాదులు లేరని బుకాయిస్తోందని, రెండు దేశాల మధ్య యుద్ధోన్మాదాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. చట్టాలకు అనుగుణంగానే.. బాలాకోట్‌పై భారత్ దాడి ఉగ్రవాద వ్యతిరేక చర్య అని, అంతర్జాతీయ చట్టాలకు లోబడే ఈ దాడి జరిగిందని ఆయన పేర్కొన్నారు. పాక్ ప్రభుత్వం ఇటీవల పలు ఉగ్రవాద సంస్థలు, ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవడాన్ని ప్రస్తావిస్తూ.. భారత్‌లో ఉగ్రదాడి జరిగినప్పుడల్లా పాక్ ఇలాగే చేస్తుందని, ఇందులో విశేషమేమీ లేదని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులను గృహ నిర్బంధంలో ఉంచడమంటే వారికి విలాసాలు సమకూర్చడమేనని, పరిస్థితి సద్దుమణగగానే వారిని విడిచిపెడుతుందన్నారు. భారత్‌పై ఉగ్ర దాడికి పాక్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్న విషయాన్ని బాలాకోట్ దాడి ద్వారా భారత్ స్పష్టం చేసిందన్నారు. ఈ విషయంలో ట్రంప్ సర్కారు భారత్‌కు మద్దతిస్తోందన్నారు. పాక్ అభివృద్ధికి ఐఎంఎఫ్ 21 సార్లు ఆర్థిక సాయం చేస్తే ఆ దేశం ఇతర అవసరాలకు మళ్లించిందని పేర్కొన్నారు. చెట్లు కూల్చారని కేసు భారత వైమానిక దళానికి చెందిన గుర్తుతెలియని పైలట్లపై పాక్ కేసు వేసింది. బాలాకోట్‌లోని 19 చెట్లపై బాంబులు వేసి కూల్చివేసినందుకు శుక్రవారం ఈ కేసు వేసింది. జైషే మహమ్మద్ ఉగ్రసంస్థకు చెందిన శిక్షణ శిబిరంపై భారత వైమానిక దళం సర్జికల్ దాడులు చేసిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ అటవీ శాఖ ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని తెలిసింది. కాగా, బాలాకోట్‌లోని ఐఏఎఫ్ దాడి జరిపిన మదరసా, ఇతర భవనాల వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన మీడియా ప్రతినిధులను పాకిస్తాన్ భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. దాడి జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు రాయిటర్స్‌కు చెందిన ప్రతినిధులు మూడుసార్లు ప్రయత్నించినా పాక్ బలగాలు అడ్డుకున్నాయి. అప్పటి నుంచి కూడా ఆ మదరసా ఉన్న ప్రాంతానికి వెళ్లే దారులను మూసివేశారు. -
‘పాక్ పాట పాడుతున్న కాంగ్రెస్ నేతలు’
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్లో భారత్ చేపట్టిన వైమానిక దాడులపై సందేహాలు వ్యక్తం చేస్తున్న విపక్ష నేతలపై బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల ప్రకటనలపై పాకిస్తాన్ అంతటా చర్చ జరుగుతోందని, పాక్ మీడియా సైతం పాక్‌కు అనుకూలంగా మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతల ప్రకటనలను ప్రస్తావిస్తోందని ఆరోపించారు. ఉగ్రవాదంపై పాక్ వైఖరికి అనుకూలంగా, భారత ప్రయోజనాలకు విరుద్ధంగా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఉగ్రవాదానికి సంబంధించి కాంగ్రెస్ నేతల తీరు పాకిస్తాన్ పోస్టర్ బాయ్స్‌లా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై పాక్ తీరును సమర్ధించేలా దిగ్విజయ్ సింగ్, సిద్ధూ వంటి కాంగ్రెస్ నేతల ప్రకటనలున్నాయని ఆరోపించారు. కాగా, పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో జైషే ఉగ్రవాద శిక్షణా శిబిరంపై భారత వైమానిక దళం చేపట్టిన మెరుపు దాడుల్లో మరణించిన ఉగ్రవాదుల సంఖ్యపై పాలక, విపక్ష నేతల మధ్య వాగ్వాదం జరుగుతున్న నేపథ్యంలో రాంమాధవ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
‘అభినందన్‌కు పరమవీరచక్ర అవార్డు ఇవ్వాలి’
చెన్నై : పాక్ చెరలో వేధింపులు ఎదుర్కొన్ని అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌కు అత్యున్నత సైనిక పురస్కారమైన పరమవీరచక్ర అవార్డు ప్రదానం చేయాలని తమిళనాడు సీఎం పళనిస్వామి శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ప్రతికూల పరిస్థితుల్లో శత్రు సేనలకు చిక్కినా మొక్కవోని విశ్వాసం, సంయమనం పాటించిన ఐఏఎఫ్ పైలట్ అభినందన్‌కు అత్యున్నత సైనిక పురస్కారం అందించడం సముచితమని ప్రధానికి రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ సమాజం నుంచి ఎదురైన ఒత్తిడితో పాటు ప్రధాని దౌత్యపరమైన వ్యూహాలతో అభినందన్‌ను పాకిస్తాన్ విడుదల చేసిందని చెప్పారు. మాతృదేశం పట్ల అభినందన్ ప్రదర్శించిన విశ్వాసం, ప్రతికూల పరిస్థితుల్లోనూ చెదరని సంకల్పం దేశవ్యాప్తంగా కోట్లాది హృదయాలను గెలుచుకుకుందని, పరమవీరచక్ర పురస్కారంతో ఆయనను గౌరవించడం సముచితమని సీఎం పళనిస్వామి ప్రధానికి రాసిన లేఖలో సూచించారు. కాగా, పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో పాక్ వైమానిక దాడులను తిప్పి కొట్టే క్రమంలో అభినందన్ విమానం కూలిపోగా...ఆయన పాక్ భూభాగంలో దిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అనేక పరిణామాల అనంతరం జెనీవా ఒప్పందం ప్రకారం అభినందన్‌ను పాక్ భారత్‌కు అప్పగించింది. -
పాక్ సరికొత్త డ్రామా; చెట్లు కూల్చారని...
ఇస్లామాబాద్ : తమ దేశంలోని అటవీ సంపదను నాశనం చేశారంటూ మెరుపు దాడులు చేసిన భారత వైమానిక దళ పైలట్లపై పాకిస్తాన్ అటవీ శాఖ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. పుల్వామాలో ఆత్మాహుతి దాడికి పాల్పడి 40 మందికి పైగా జవాన్లను పొట్టబెట్టుకున్న జైషే ఉగ్రస్థావరాలపై భారత్ సర్జికల్ స్ట్రైక్స్ జరిపిన సంగతి తెలిసిందే. ఈ మెరుపు దాడుల ద్వారా తమ ప్రాంతంలోని 19 చెట్లను భారత పైలట్లు ధ్వంసం చేశారని పాక్ అటవీ శాఖ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. మెరుపు దాడుల గురించి ప్రస్తావించిన పాక్ క్లైమేట్ చేంజ్ మినిస్టర్ మాలిక్ అమీన్ మాట్లాడుతూ... ‘ పర్యావరణ ఉగ్రవాదానికి ఇదొక ఉదాహరణ. అక్కడ(బాలాకోట్)లో డజన్ల కొద్దీ పైన్ చెట్లు నేలకూలాయి. మేమెంతో నష్టపోయాం. ఈ విషయమై చర్యలు ఉంటాయి’ అని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో భారత్ ఎకో టెర్రరిజానికి పాల్పడుతోందంటూ ఐక్యరాజ్యసమితిలో కూడా పాకిస్తాన్ ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా అంతర్జాతీయ సమాజంలో భారత్ పరువు తీయొచ్చనే కుట్రలు పన్నుతోంది. కాగా బాలకోట్లో ఎంత మంతి ఉగ్రవాదులు హతమయ్యారో చెప్పాలంటూ ప్రతిపక్షాలు భారత ప్రభుత్వాన్ని నిలదీస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు హతమయ్యాయా లేదా చెట్లు కూలాయా అంటూ ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రస్తుతం పాక్ అటవీ శాఖ ఎఫ్ఐఆర్తో ఈ యుద్ధం మరింత ముదిరే అవకాశాలు కన్పిస్తున్నాయి. -
‘అభినందన్ దగ్గర గన్ లేకుంటే కొట్టి చంపేవాళ్లం’
న్యూఢిల్లీ : శత్రు దేశ సైన్యానికి పట్టుబడినప్పటికీ మొక్కవోని ధైర్యంతో తన కర్తవ్యాన్ని నెరవేర్చిన భారత వైమానిక దళ పైలట్ అభినందన్‌పై యావత్ భారతావని ప్రశంసలు కురిపిస్తోంది. అసలైన సైనికుడు అంటూ కొనియాడుతోంది. పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో.. పాక్ వైమానిక దాడులను తిప్పి కొట్టే క్రమంలో అభినందన్ విమానం కూలిపోగా...ఆయన పాక్ భూభాగంలో దిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అనేక పరిణామాల అనంతరం జెనీవా ఒప్పందం ప్రకారం అభినందన్ భారత్‌కు చేరుకున్నారు కూడా. అయితే పాక్ సైన్యానికి చిక్కడానికి ముందు పాక్ ఆక్రమిత కశ్మీర్లో అభినందన్ ఎదుర్కొన్న పరిస్థితుల గురించి ఇండియా టుడే ఆరా తీసింది.(అభినందన్ ఆగయా..) ఈ నేపథ్యంలో స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం... మిగ్-21 విమానం కూలిపోగానే అభినందన్ పారాచూట్ సాయంతో హోరన్ గ్రామంలో దిగారు. ఈ విషయం గురించి మహ్మద్ కమ్రాన్ అనే వ్యక్తి మాట్లాడుతూ... ‘ గాల్లో ఆరు విమానాలు తలపడటం నేను చూశాను. అందులో ఒకటి ఇండియా వైపు నుంచి వచ్చింది. నాకు తెలిసి పాకిస్తాన్ వైమానిక దళం ఆ విమానాన్ని వెంబడించింది. అప్పుడే ఆ విమానం కూలిపోయింది. అందులో నుంచి ఓ వ్యక్తి పక్షిలా కిందకు వచ్చాడు. అతడు పారాచూట్ తెరవడం నేను చూశాను. దానిపై భారత జెండా ఉంది. సమీపంలో ఉన్న కొండ మీద దిగగానే.. ఎక్కడ ఉన్నానో అన్న విషయం తెలుసుకునేందుకు ప్రయత్నించినట్టు అనిపించింది. మెల్లగా కిందకి దిగి ఇది ఇండియానా .. పాకిస్తానా అని అడిగాడు. ఇండియా అని చెప్పగానే మన ప్రధాని ఎవరు అని అడిగాడు’ అని చెప్పుకొచ్చాడు.(ఎవరీ విక్రమ్ అభినందన్?) రాళ్లతో కొట్టి చంపేవాళ్లం.. తాను శత్రు సైన్యానికి చిక్కానని గ్రహించిన అభినందన్ వెంటనే తుపాకీ బయటకు తీశారు. అంతేకాదు తన దగ్గర ఉన్న కొన్ని పత్రాలను మింగేశారు. మరికొన్నింటిని ముక్కలుగా చేసి నీటిలో కలిపేస్తూ భారత్ మాతా కీ జై అని నినదించారు. అయితే ఇదంతా గమనించిన స్థానిక యువత అభినందన్‌ను రాళ్లతో కొట్టడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పాకిస్తాన్ సైన్యం ఆయనను అదుపులోకి తీసుకుంది. ఈ విషయం గురించి చెబుతూ... ‘ భారత పైలట్ నినాదాలు చేయగానే మాకు భయం వేసింది. అతడి దగ్గర గనుక తుపాకీ లేకపోయి ఉంటే రాళ్లతో కొట్టి చంపేవాళ్లం. అంతేకాదు మాపై అతను దాడి చేయకపోవడం కూడా మంచిది అయింది. లేదంటే అక్కడున్న మూక చేతిలో హతమయ్యేవాడే. తెలివిగా ఆలోచించి తన ప్రాణాలతో పాటు మా ప్రాణాలు కూడా అపాయంలో పడకుండా చేశాడు’ అని వ్యాఖ్యానించాడు. -
‘అభినందన్ విమానాన్ని కూల్చింది వీరే’
ఇస్లామాబాద్ : పుల్వామా ఉగ్ర దాడులకు ప్రతీకారంగా భారత్.. పాకిస్థాన్ బాలాకోట్‌లోని ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు జరిపిన సంగతి తెలిసిందే. భారత్ చర్యలతో రెచ్చిపోయిన పాక్ మన సైనిక స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులకు యత్నించింది. ఈ దాడిలో మిగ్ 21 యుద్ధం విమానం కూలిపోగా.. అభినందన్ వర్థమాన్ పాక్ భూభాగంలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. కానీ పాక్ మాత్రం రెండు భారత యుద్ధ విమానాలకు కూల్చినట్లు చెప్పుకుంటుంది. తాజాగా భారత యుద్ధ విమానాలను కూల్చిన ఫైటర్ పైలెట్లను గుర్తించినట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని స్వయంగా పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి పాక్ పార్లమెంట్లో వెల్లడించారు. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. ‘పాకిస్తాన్ వైమానిక దళం రెండు భారత యుద్ధ విమానాలను కూల్చివేసింది. దానిలో ఒక భారత యుద్ధ విమానాన్ని కూల్చిన వ్యక్తి స్వ్కాడ్రన్ లీడర్ హసన్ సిద్దిఖీ కాగా మరొకరు.. నమౌన అలీ ఖాన్‌గా గుర్తించమ’న్నారు. అయితే ఈ దాడిలో పాక్ పైలెట్ హసన్ సిద్దిఖీ మరణించాడని ఖురేషి తెలిపాడు. దేశం కోసం ప్రాణాలర్పించిన సిద్దిఖీకి పాక్ పార్లమెంట్ నివాళులర్పించింది. అంతేకాక తాము కూల్చిన రెండు భారత యుద్ధ విమానల్లో ఒకటి జమ్మూకశ్మీర్‌లో కూలగా మరోటి పాక్ ఆక్రమిత్ కశ్మీర్ భూభాగంలో కూలిట్లు గతంలో పాక్ ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. (చదవండి : పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని కూల్చేశాం : భారత్) -
‘బాలాకోట్’ సాక్ష్యాలివిగో!
న్యూఢిల్లీ: పాకిస్తాన్ భూభాగం బాలాకోట్‌లో జైషే మహ్మద్ ఉగ్రవాదుల శిక్షణా శిబిరంపై జరిపిన వైమానిక దాడిలో వాటిల్లిన నష్టంపై అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ ఐఏఎఫ్ అందుకు సంబంధించిన ఆధారాల్ని కేంద్రానికి సమర్పించినట్లు తెలిసింది. ఫిబ్రవరి 26న తాము జారవిడిచిన బాంబుల్లో 80 శాతం అనుకున్న లక్ష్యాల్ని తాకినట్లు వైమానిక దళం పేర్కొంది. సంబంధించిన ఉపగ్రహ, రాడార్ చిత్రాలను సేకరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దాడులకు వైమానిక దళం వార్హెడ్లను ఉపయోగించినట్లు తెలిసింది. ఈ వివరాల్ని బుధవారం కొన్ని చానెళ్లు ప్రసారం చేశాయి. బాంబులు ఉగ్రవాదుల ఆవాసాల పైకప్పులను చీల్చుకుంటూ వెళ్లి అంతర్గతంగా అపార నష్టం మిగిల్చినట్లు ఐఏఎఫ్ వర్గాలు వెల్లడించాయి. పుల్వామా దాడికి ప్రతీకార చర్యగా జరిపిన వైమానిక దాడిలో 350 మంది ఉగ్రవాదులు హతమైనట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. కానీ నష్టం అంత తీవ్రస్థాయిలో లేదని కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. అటవీ ప్రాంతంలో చెట్లు దెబ్బ తినడం తప్ప పెద్దగా నష్టమేమీ కలగలేదని పాకిస్తాన్ ప్రకటించుకుంది. కాగా, భారత వైమానిక దళం దాడి తరువాత జైషే మహ్మద్ భవనాలకు అనుకున్నంత భారీ నష్టం జరగలేదని ప్లానెట్ ల్యాబ్స్ అనే అమెరికన్ ప్రైవేటు సంస్థ ఓ ఉపగ్రహ చిత్రం విడుదలచేసింది. ఈ విషయాన్ని రాయిటర్స్ వార్తా సంస్థ వెలుగులోకి తెచ్చింది. బాలాకోట్ ఆపరేషన్‌పై రాజకీయ పార్టీలు సందేహాలు వ్యక్తం చేస్తూ ఎందరు ఉగ్రవాదులు హతయ్యారో అధికారిక సమాచారం వెల్లడించాలని ప్రభుత్వంపై ఒత్తిడితెస్తున్నాయి. వైమానిక దళ చర్యను రాజకీయం చేస్తున్నారంటూ అధికార, ప్రతిపక్షాలు పరస్పరం విమర్శలు గుప్పించుకున్నాయి. ఈ నేపథ్యంలో వైమానిక దాడులతో నెరవేరిన లక్ష్యాలపై ఆధారాలతో వైమానిక దళం ప్రభుత్వానికి నివేదిక అందించడం గమనార్హం. 12 పేజీల విస్పష్ట ఛాయాచిత్రాలు.. బాలాకోట్‌లో జారవిడిచిన బాంబులు లక్ష్యానికి దూరంగా పడ్డాయన్న ఆరోపణల్ని తప్పని నిరూపిస్తూ వైమానిక దళం సమగ్ర వివరాల్ని క్రోడీకరించింది. దాడి తర్వాత జైషే శిబిరానికి వాటిల్లిన నష్టాన్ని అంచనా వేసేందుకు ఈ సమాచారాన్ని సేకరించినట్లు తెలిసింది. భారత గగనతలంలో ఎగురుతున్న విమానం తీసిన 12 పేజీల విస్పష్ట ఛాయాచిత్రాలు, రాడార్ ఇమేజ్‌లను కేంద్రానికి అందజేసినట్లు విశ్వసనీయవర్గాల తెలిపాయి. దాడిలో మిరాజ్ విమానాలు ఇజ్రాయెల్ స్పైస్ బాంబుల్ని అత్యంత కచ్చితత్వంతో జారవిడవగా, అందులో 80% అనుకున్న లక్ష్యాల్ని తాకాయని తెలిపాయి. మిగిలిన 20% బాంబుల విజయ శాతం కచ్చితంగా ఎంతని అంచనా వేయలేకపోయామని చెప్పాయి. -
‘ఆ శవాలు చూపిస్తేనే మా ప్రతీకారం తీరినట్టు’
లక్నో : పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా జైషే మహ్మద్ స్థావరం బాలకోట్‌పై భారత వైమానిక దాడిలో ఎంత మంది ఉగ్రవాదులు మరణించారనే అంశంపై ఇంతవరకు స్పష్టత రాలేదు. మెరుపు దాడుల్లో సుమారు 250 నుంచి 350 వరకు హతమయ్యారని ప్రభుత్వ వర్గాలు చెబుతుండగా, అందుకు సాక్ష్యాలు చూపించాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో పుల్వామా ఉగ్రదాడి బాధిత కుటుంబాలు కూడా ఇదే తరహా డిమాండ్‌తో ముందుకు వస్తున్నాయి. తమ కుటుంబాలకు జీవనాధారం లేకుండా చేసిన ఉగ్రవాదుల శవాలను చూస్తేనే తమకు శాంతి కలుగుతుందని పేర్కొంటున్నాయి. అప్పుడే ప్రతీకారం తీరినట్టు 40 మందికి పైగా జవాన్లను పొట్టబెట్టుకున్న జైషే ఉగ్రదాడిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రదీప్ కుమార్, రామ్ వకీలు అమరులయ్యారు. ఈ క్రమంలో రామ్ వకీల్ సోదరి రామ్ రక్షా మాట్లాడుతూ.. ‘ పుల్వామాలో ఒక్కో వ్యక్తి చేతులు, కాళ్లు, ఇతర శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని చూశాం. ఇందుకు బాధ్యత వహించిన ఉగ్రవాదులపై భారత్ ప్రతీకారం తీర్చుకుందనే భావిస్తున్నాం. అయితే ఇందుకు తగిన ఆధారాలు కావాలి. తమ దేశంలో ఎటువంటి నష్టం కలగలేదని పాకిస్తాన్ చెబుతోంది. కాబట్టి ఆధారాలు చూపించే వరకు మేము దీనిని అంగీకరించలేము. ఉగ్రవాదుల శవాలు చూస్తేనే మాకు శాంతి కలుగుతుంది. అప్పుడే నా సోదరుడి మృతికి ప్రతీకారం తీరినట్టు అవుతుంది’ అని ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు. ఇక ఈ విషయం గురించి ప్రదీప్ కుమార్ తల్లి మాట్లాడుతూ... ‘నా కొడుకు లాంటి ఎంతో మంది కొడుకులు కన్నుమూశారు. మెరుపు దాడులు చేశామన్న మాటలతో మాకు తృప్తి కలగడం లేదు. ఉగ్రవాదుల మృతదేహాలు చూసి తీరాల్సిందే. ప్రభుత్వమే ఆ పని చేయాలి’ అంటూ డిమాండ్ చేశారు. కాగా కశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై దాడికి పాల్పడిన ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ ప్రధాన స్థావరం బాలకోట్లో భారత వైమానిక దళం బాంబుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌లోని ఖైబర్ పంక్తువా ప్రావిన్స్‌లోని జైషే క్యాంపులపై సుమారు వెయ్యి కిలోల పేలుడు పదార్థంతో ఐఏఎఫ్ విరుచుకుపడింది. ఈ మెరుపు దాడుల్లో పన్నెండు మిరాజ్- 2000 యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. -
‘మెరుపు దాడులు గురి తప్పలేదు’
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో జైషే మహ్మద్ శిబిరాలపై జరిగిన వైమానిక దాడులు లక్ష్యాలను గురితప్పకుండా సాగాయని భారత వాయుసేన స్పష్టం చేసింది. నిర్ధేశిత లక్ష్యాలపై గురిపెట్టిన బాంబు దాడుల్లో 80 శాతం మేర లక్ష్యాలను ఢీకొన్నాయని పేర్కొంటూ దీనికి ఆధారంగా శాటిలైట్ చిత్రాలను భారత వాయు సేన ప్రభుత్వానికి అందచేసినట్టు తెలిసింది. వైమానిక దాడులు లక్ష్యానికి దూరంగా సాగాయని, వాటి గురితప్పిందని సాగుతున్న ప్రచారం అవాస్తవమని పేర్కొంటూ వాయుసేన ఓ నివేదికను కేంద్రానికి సమర్పించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. భారత్ కురిపించిన బాంబు దాడులు పాకిస్తాన్‌కు ఎలాంటి నష్టం కలిగించలేదని, కొన్ని చెట్లు కూలిపోవడం మినహా ఎలాంటి విధ్వంసం జరగలేదని పాక్ పేర్కొన్న సంగతి తెలిసిందే. బాలాకోట్ వైమానిక దాడులతో ఎలాంటి నష్టం వాటిల్లలేదని అంతర్జాతీయ మీడియా సైతం సందేహాలు వ్యక్తం చేసింది. అయితే బాలాకోట్ మెరుపు దాడుల ప్రధాన టార్గెట్ అయిన జైషే ఉగ్రవాద శిబిరం వద్దకు అంతర్జాతీయ మీడియాను పాక్ అనుమతించలేదు. కాగా వైమానిక దాడుల తీరుతెన్నులను విశ్లేషిస్తూ శాటిలైట్ చిత్రాలతో కూడిన 12 పేజీల నివేదికను వాయుసేన భారత ప్రభుత్వానికి సమర్పించింది. బాలాకోట్ వైమానిక దాడులు విజయవంతమయ్యాయని చెప్పేందుకు ఈ ఆధారాలను మోదీ సర్కార్‌కు వాయుసేన సమర్పించినట్టు చెబుతున్నారు. దాడుల్లో భాగంగా మిరేజ్ 2000 యుద్ధవిమానాలు బాలాకోట్ జైషే శిబిరంపై ఇజ్రాయిల్ స్పైస్ 2000 ప్రిసిషన్ బాంబులతో విరుచుకుపడినట్టు వాయుసేన వర్గాలు వెల్లడించాయి. ఈ బాంబులు నిర్ధేశిత భవనాల పైకప్పులను చిధ్రం చేసి లోపల భారీ పేలుడు సంభవించిందని, పైకి కనిపించని రీతిలో అంతర్గతంగా విధ్వంసం జరిగిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన నేపథ్యంలో భారత్ పీఓకేలో మెరుపు దాడులను చేపట్టిన సంగతి తెలిసిందే. -
‘పుల్వామా పెద్ద ప్రమాదం’; ఇప్పుడు ఏమంటారు మోదీజీ?!
లక్నో : పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో ప్రధాని మోదీపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఎన్నికల్లో లబ్ది పొందేందుకు మోదీ కావాలనే ఇలాంటి చర్యలకు దిగారంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ నేతలు, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇందులో భాగంగా పుల్వామా ఉగ్రదాడి కాదు.. ఒక ప్రమాదం మాత్రమే అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రధాని మోదీ సహా అధికార పార్టీ నేతలు డిగ్గీ రాజాపై విమర్శల దాడి మొదలుపెట్టారు. దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన పార్టీ నేతల తీరు.. వాళ్ల మెంటాలిటీ ఇదీ అంటూ మోదీ.. దిగ్విజయ్ సింగ్‌పై విరుచుకుపడ్డారు.(‘పుల్వామా ఉగ్రదాడి కాదు ప్రమాదం మాత్రమే’) ఈ నేపథ్యంలో బుధవారం దిగ్విజయ్ సింగ్ రీట్వీట్ చేసిన ఓ వీడియో బీజేపీ నేతలను ఇరకాటంలో పెట్టింది. ఫిబ్రవరి 21న ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత కేశవ్ ప్రసాద్ మౌర్య విలేకరులతో మట్లాడుతూ..‘పుల్వామా ఉగ్రదాడి పెద్ద ప్రమాదం మాత్రమే. ఇందులో భద్రతా వైఫల్యం ఏమీ లేదు. అయితే ఇలాంటి వాటిని ఎదుర్కొనేందుకు ప్రధాని మోదీ సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో తన అనుమతి లేకుండానే చర్యలు తీసుకునేలా వారిని ప్రోత్సహించారు అని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసిన డిగ్గీ రాజా... ‘ మౌర్యాజీ మాటలపై ఇప్పుడు మోదీ, ఆయన మంత్రులు ఏం సమాధానం చెబుతారు. అమర జవాన్ల పట్ల బీజేపీ వైఖరి ఏంటో స్పష్టమైంది’ కదా అని విమర్శలను తిప్పికొట్టారు. उत्तरप्रदेश के उपमुख्यमंत्री केशव प्रसाद मौर्य ने पुलवामा हमले को बड़ी 'दुर्घटना' बताया। तो क्या अब मौर्य जी भी देशद्रोही कहे जाएंगे? मीडिया ने दिग्विजय सिंह जी के बयान पर जो हंगामा किया वैसा ही हंगामा अब मचाएंगे या बिल में घुस जाएंगे। @digvijaya_28 pic.twitter.com/M83JLlGDrh — Yogendra Singh Parihar (@Yogendra_INC) March 5, 2019 -
భారత బాంబులపై ‘రాయ్‌టర్స్’ బాంబ్
సాక్షి, న్యూఢిల్లీ : భారత వైమానిక దళం పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకుపోయి బాలకోట్‌లోని జైషే మొహమ్మద్ ఉగ్ర స్థావరంపై బాంబుల వర్షం కురిపించిన సంఘటనపై జాతీయంగా, అంతర్జాతీయంగా భిన్న కథనాలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రపంచంలోని పలు దేశాల్లో నెట్వర్క్ కలిగిన ‘రాయటర్స్ న్యూస్ ఏజెన్సీ’ బుధవారం ఓ బాంబు పేల్చింది. బాలకోట్‌లోని ఉగ్ర స్థావరంపై భారత వైమానిక దళం దాడులు జరిపిన ఆరు రోజుల అనంతరం అంటే, మార్చి 4వ తేదీన శాన్ఫ్రాన్సిస్కోలోని ‘ప్లానెట్ లాబ్స్ ఇన్కార్పొరేటెడ్’ తీసిన బాలకోట్‌లోని జైషే మొహమ్మద్ మదర్సా శాటిలైట్ చిత్రాలను, అంతకుముందు 2018, ఏప్రిల్ నెలలో ఇదే శాటిలైట్ తీసిన ఇదే స్థావరం చిత్రాలను విడుదల చేసింది. వాటిని పోల్చి చూసి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. చదవండి....(‘బాలకోట్’లో భారత్ గురి తప్పిందా?!) బాలకోట్‌లోని భవనాల పైకప్పులపై ఎలాంటి రంధ్రాలుగానీ, కూలిన గోడలుగానీ, కాలిన గుర్తులుగానీ, బాంబులు పడ్డాయని చెప్పడానికి సంబంధించి మరెలాంటి ఆనవాళ్లు కనిపించడం లేదని స్పష్టం చేసింది. శాటిలైట్ పాత చిత్రాలకు, కొత్త చిత్రాలకు ఎలాంటి తేడా కనిపించడం లేదని పేర్కొంది. బాలకోట్‌పై జరిపిన భారత వైమానిక దాడిలో 250 నుంచి 350 వరకు జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు మరణించారని ప్రభుత్వ వర్గాలు చెబుతుండగా, అందుకు సాక్ష్యాలు చూపించాలంటూ ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న విషయం తెల్సిందే. మరోవైపు పుల్వామా ఉగ్రదాడిలో అశువులు బాసిన జవాన్ల కుటుంబాలు కూడా బాలకోట్ ఉగ్ర స్థావరంపై భారత వైమానిక దళాలు జరిగిన దాడుల్లో మృతి చెందిన ఉగ్రవాదుల మృతదేహాలు చూపించాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. అసలేం జరిగి ఉండవచ్చు! 1. ఫిబ్రవరి 26వ తేదీ తెల్లవారు జామున 3.30 గంటల ప్రారంతంలో భారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు పాక్ భాభాగంలోకి దూసుకుపోవడం నూటికి నూరు పాళ్లు నిజం. ఈ విషయాన్ని మనకంటే పాకిస్థాన్ వర్గాలే ముందుగా ప్రకటించాయి. సకాలంలో తాము అప్రమత్తమైన భారత యుద్ధ విమానాలను తరమి కొట్టామని, ఆ తొందరలో భారత యుద్ద విమానాలు లక్ష్య రహితంగా బాంబులు కురపిస్తూ పారిపోయాయని, తమవైపు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించలేదని పాక్ సైనిక వర్గాలు తెలిపాయి. బాలకోట్‌కు పది కిలోమీటర్ల ఇవతల బాంబులు పడ్డాయని, వాటి వల్ల కొన్ని చెట్లు కూలయని, కొన్ని చోట్ల గుంతలు పడ్డాయంటూ కొన్ని ఫొటోలను కూడా పాక్ సైనిక వర్గాలు ఆ తర్వాత విడుదల చేశాయి. 2. భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే ఆ తర్వాత ఓ ప్రకటన విడుదల చేశారు. బాలకోట్‌లోని జైషే మొహమ్మద్ అతిపెద్ద ఉగ్ర శిక్షణ కేంద్రంపై భారత వైమానిక దళాలు బాంబు దాడులు జరిపాయని, ఈ దాడిలో పెద్ద సంఖ్యలో టెర్రరిస్టులు, వారి శిక్షకులు, సీనియర్ కమాండర్లు, ఆత్మాహుతి బందాల సభ్యులు మరణించారని చెప్పారు. ఆ తర్వాత ఉగ్రవాదులు మతుల సంఖ్య 350 వరకు ఉండవచ్చని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. 3. భారత వైమానిక దాడులపై భిన్న కథనాలు వస్తున్న నేపథ్యంలో పలు జాతీయ, అంతర్జాతీయ జర్నలిస్టులు బాల్కోట్ పరిసర ప్రాంతాల్లోకి వెళ్లారు. వారికి స్థానికులు, పాక్ సైనికులు ‘బాంబులు వేసింది ఇక్కడే’ అంటూ కొన్ని బాంబులు పడిన గుర్తులను చూపారు. బాంబు దాడిలో ఓ పౌరుడికి గాయం అయిన విషయం వెలుగులోకి వచ్చింది. అక్కడికి సమీపంలోనే ఉన్న మదర్సా (ఉగ్రవాదుల శిక్షణా కేంద్రం)ను సందర్శించేందుకు మాత్రం పాక్ సైనికులు అనుమతించడం లేదు. దాంతో అంతర్జాతీయ మీడియా శాటిలైట్ ఛాయా చిత్రాలతో భారత్ దాడులు గురి తప్పాయంటూ పలు కథనాలను ప్రచురించాయి. బాంబు దాడుల వల్ల ఉగ్రవాదులకు అపార నష్టం వాటిల్లిందని రుజువు చేయడాని భారత వైమానిక దళం వద్ద రాడార్ చిత్రాలు, భారత సైన్యం వద్ద శాటిలైట్ చిత్రాలు ఉన్నాయంటూ కొన్ని జాతీయ మీడియాల్లో వార్తలు వచ్చాయి. రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మోదీ ప్రభుత్వం అబద్ధపు ప్రచారాన్ని సాగిస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం తక్షణం ఆ రాడార్, శాటిలైట్ చిత్రాలను విడుదల చేసి అనుమానాలను పటాపంచలు చేయాల్సిన అవసరం ఎంతైన ఉంది. -
అభినందన్‌పై అదిరిపోయే మీమ్స్..
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ మీమ్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. గతవారం పాక్ చెరలో చిక్కుకుని.. క్షేమంగా తిరిగివచ్చిన భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ ప్రదర్శించిన ధైర్యాన్ని గుర్తుచేసేలా షేర్ చేసిన మీమ్స్ వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌కు ఆమె వెడ్నెస్ డే విజ్డమ్ ట్యాగ్‌ను జత చేశారు. ‘ఇద్దరు వ్యక్తులు కలిసి పరీక్ష రాస్తుంటారు. వారిలో గ్రీన్ కలర్ టీ షర్ట్ ధరించిన వ్యక్తి పాకిస్తాన్ కాగా, పింక్ టీ షర్ట్ ధరించిన వ్యక్తి అభినందన్. పాకిస్తాన్ ఏదో అడుగుతుండగా.. అభినందన్ వెనుక నుంచి ఓ కాగితాన్ని అందజేస్తారు. అయితే ఆ కాగితాన్ని తెరచి చూసిన పాకిస్తాన్ ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే అందులో.. ఇది నేను మీకు చెప్పకూడదు(i'm not supposed to tell you this) అని రాసి ఉంటుంది’ ఇది స్మతి ఇరానీ షేర్ చేసిన మీమ్స్. అయితే అందులో చాలనే అర్థం ఉంది. అభినందన్ పాక్ చెరలో ఉన్నప్పుడు అక్కడి ఆర్మీ అధికారులు ఎన్ని ఇబ్బందులకు గురిచేసినప్పటికీ.. తాను ఎటువంటి రహస్యాలను వారికి వెల్లడించలేదు. అంతేకాకుండా ధైర్యంగా ఈ విషయాలు నేను మీతో చెప్పకూడదు అంటూ వారికి సమాధానం ఇచ్చారు. ఈ ఘటనను గుర్తుకు తెచ్చేలా స్మృతి ఈ పోస్ట్ చేసినట్టుగా అర్థమవుతుంది. View this post on Instagram #wednesdaywisdom ... 🇮🇳 A post shared by Smriti Irani (@smritiiraniofficial) on Mar 5, 2019 at 7:11pm PST -
విపక్షం లక్ష్యంగా కేంద్ర మంత్రి ‘దోమల’ ట్వీట్
సాక్షి, న్యూఢిల్లీ : పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత్ చేపట్టిన మెరుపు దాడులలో ఎంతమంది ఉగ్రవాదులు మరణించారనే దానిపై పాలక, విపక్షాల మధ్య వాగ్వాదం జరుగుతున్న క్రమంలో కేంద్ర మంత్రి వీకే సింగ్ విపక్షాలపై ఎదురుదాడికి దిగారు. ‘దోమల’ ట్వీట్‌తో విపక్షాన్ని ఎండగట్టే ప్రయత్నం చేశారు. గత రాత్రి తాను దోమలతో ఇబ్బంది పడుతూ హిట్ వాడానని..తానిప్పుడు ఎన్ని దోమలను చంపానో లెక్కించాలా..? లేక తిరిగి నిద్రపోవాలా..? అంటూ ఆర్మీ మాజీ చీఫ్ సింగ్ ట్వీట్ చేశారు. కాగా, పాక్‌లో జైషే శిబిరాలపై చేపట్టిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్యపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న విపక్షాలే లక్ష్యంగా ఆయన దోమల ట్వీట్ చేసినట్టు స్పష్టమవుతోంది. మరోవైపు పాక్‌లోని బాలాకోట్‌లో భారత్ చేపట్టిన వైమానిక దాడుల్లో ఎంత మంది ఉగ్రవాదులు మరణించారో స్పష్టంగా వెల్లడించాలని విపక్షాలు మోదీ సర్కార్‌ను డిమాండ్ చేస్తుండగా, విపక్షాలు సేనల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని పాలక పక్ష నేతలు పేర్కొంటున్నారు. -
పుల్వామా ఉగ్రదాడి కాదు.. ఓ యాక్సిడెంట్ : బీజేపీ నేత
న్యూఢిల్లీ : పుల్వామాలో జరిగింది ఉగ్రదాడి కాదని, అది ప్రమాదవశాత్తు జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దాంతో దిగ్విజయ్ పాకిస్తాన్ మద్దతుదారుడంటూ బీజేపీ సీనియర్ మంత్రులు ఆయనపై విమర్శల వర్షం కురింపించారు. ఈ వివాదం సద్దుమణగకముందే.. బీజేపీ ఎమ్మెల్యే ఒకరు పుల్వామాలో జరిగింది ఉగ్రదాడి కాదు.. ఓ యాక్సిడెంట్ మాత్రమే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బీజేపీని ఇరుకున పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్లో పోస్ట్ చేసిన దిగ్విజయ్.. ‘ఇప్పుడేమంటారు మోదీ’ అంటూ ప్రశ్నించారు. దిగ్విజయ్.. ‘పుల్వామా ఉగ్ర దాడిని నేను ప్రమాదవశాత్తు జరిగింది అంటే నా మీద విరుచుకుపడ్డారు. ఓ ముగ్గురు కేంద్ర మంత్రులైతే.. ఏకంగా నాపై పాకిస్తాన్ మద్దతుదారుడిగా ముద్ర వేశారు. మరి ఇప్పుడు మీ పార్టీ నాయకుడు.. ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ ప్రసాద్ మౌర్య కూడా పుల్వామా ఉగ్ర దాడిని ఓ యాక్సిడెంట్ అని స్పష్టం చేశారు. దీనిపై మీ స్పందన ఏంటి.. మినిస్టర్‌పై మీరు తీసుకోబోయే చర్యలేంటి మోదీజీ’ అంటూ దిగ్విజయ్ ట్వీట్ చేశారు. पुलवामा आतंकी हमले को मैंने “दुर्घटना” कह दिया तो मोदी जी से ले कर ३ केंद्रीय मंत्री जी मुझे पाकिस्तान समर्थक बताने में जुट गये। उत्तर प्रदेश में भाजपा के उप मुख्य मंत्री जी केशव देव मौर्य जी का बयान कृपया सुनें। मोदी जी व उनके मंत्रीगण मौर्य जी के बारे में कुछ कहना चाहेंगे? — digvijaya singh (@digvijaya_28) March 6, 2019 తీవ్ర దుమారం రేపిన ఈ వీడియోలో కేశవ ప్రసాద్ మౌర్య మీడియాతో మాట్లాడుతూ.. ‘ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగింది ఉగ్ర దాడి కాదు. భద్రతా లోపం వల్ల కూడా జరగలేదు. ఇది కేవలం ఓ యాక్సిడెంట్ మాత్రమే. దురదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో పలువురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. దాంతో మోదీ బలగాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఇక ఇప్పుడు బలగాలకు ఏది మంచిదనిపిస్తే దాన్నే ఆచరిస్తాయ’ని తెలిపారు. బాలాకోట్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులకు ఆధారాలు చూపించాలని కాంగ్రెస్ సీనియర్‌నేత కపిల్ సిబాల్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. उत्तर प्रदेश के उपमुख्यमंत्री @kpmaurya1 ने भी #पुलवामा हमले को सुरक्षा में चूक नहीं "दुर्घटना" कहा है। भक्तों इनको देशद्रोही कब घोषित कर रहे हो? या सेना के नाम पर केवल चुनावी रोटियां सेंकनी है? @brajeshabpnews @jarariya91 @AdityaMenon22 @shahnawazk @anandrai177 pic.twitter.com/FYTQzMnuN5 — Anshul Trivedi (@anshultrivedi47) March 5, 2019 -
‘మోదీకి మాత్రమే వ్యతిరేకం.. దేశానికి కాదు’
కోల్కత్తా: ప్రధాని నరేంద్ర మోదీపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి విమర్శల వర్షం కురిపించారు. పుల్వామా ఉగ్రదాడిని, వైమానిక దాడులను ప్రచారంగా చేసుకుని ఎన్నికల్లో మోదీ గెలవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఉగ్రదాడికి అవకాశం ఉందని ఇంటిలిజెన్స్ సమాచారం అందించినప్పటికీ సైనికుల రక్షణ కొరకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటని ఆమె ప్రశ్నించారు. ఉగ్రవాదంపై పోరులో రక్తం చిందించిన భారత సైనికుల త్యాగాలపై మోదీ రాజకీయం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశానికి, సైన్యానికి తాము వ్యతిరేకం కాదని, కేవలం మోదీ, బీజేపీకి మాత్రమే వ్యతిరేకమని మమత వివరించారు. పాక్-భారత్ సరిహద్దుల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను మోదీ రాజకీయ లబ్ధికోసం వాడుకుంటున్నారని, అది దేశానికి సిగ్గుచేటని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సైనికుల త్యాగాలను రాజకీయంగా ప్రచారం చేసుకోవాడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని మమత ప్రకటించారు. -
‘మోదీ పాక్ సాయం తీసుకుంటారు’
జైపూర్ : పుల్వామా ఉగ్ర దాడులకు ప్రతీకారంగా భారత్ మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశం మొత్తం మోదీకి మద్దతు తెలపుతుండగా.. విపక్షాలు మాత్రం మెరుపు దాడులను ఎన్నికల డ్రామా అంటూ విమర్శిస్తున్నాయి. తాజాగా రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లోత్ మెరుపు దాడులపై సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఓడిపోతామని అనిపించినప్పుడల్లా బీజేపీ, మోదీ ఇలాంటి పనులు చేస్తారని.. అందుకుగాను పాకిస్తాన్ సాయం తీసుకుంటారని ఆరోపించారు. గుజరాత్ ఎన్నికల ముందు కూడా ఇలాంటి డ్రామానే చేశారని మండిపడ్డారు. అంతేకాక దాదాపు 350 మంది ఉగ్రవాదులను హతమార్చమంటూ అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మెరుపు దాడులకు సంబంధించిన వాస్తవాలను వెల్లడించి.. తప్పుడు ప్రకటనలు చేసినందుకు మోదీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ ఆయన చేశారు. ఈ సందర్భంగా గెహ్లోత్ మాట్లాడుతూ.. ‘సైనికుల త్యాగాలను నేను ఎన్నటికి ప్రశ్నించబోను. దేశ రక్షణ కోసం శ్రమించే వారంటే నాకు చాలా గౌరవం. కానీ మెరుపు దాడుల విషయంలో బీజేపీ ప్రజలను మోసగిస్తుంది. సర్జికల్ స్ట్రైక్స్ చేసి దాదాపు 350 మంది ఉగ్రవాదులను హతం చేసినట్లు బీజేపీ ప్రకటించింది. కానీ అలా అబద్దపు ప్రకటనలు చేసినందుకు ఇప్పుడు చింతిస్తుంది. యూపీఏ హయాంలో కశ్మీర్లో 4,239 మంది ఉగ్రవాదులను హతమార్చాం. కానీ బీజేపీ కేవలం 876 మందిని మాత్రమే చంపింది. నిజంగా ఇది చాలా దారుణమైన పరిస్ధితి’ అని మండి పడ్డారు. అంతేకాక ‘ఓ వైపు అమిత్ షా మెరుపు దాడుల్లో 250 మంది మరణించారంటారు.. అటు ఐఏఎఫ్ చీఫ్ మాత్రం ఎంతమంది చచ్చారో మేం లెక్కపెట్టలేదు అంటారు.. మరో మినిస్టర్ అహ్లూవాలియా అయితే ఏకంగా మెరుపు దాడుల్లో ఎవరు మరణించలేదు.. కేవలం వారిని భయపెట్టడానికే ఇలాంటి ప్రయత్నం చేశామంటూ ఒకదానికొకటి పొంతన లేని ప్రకటనలు చేసి జనాలను కన్ఫూజ్ చేస్తున్నార’ని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఓడిపోతామని అనిపించినప్పుడల్లా బీజేపీ ఇలాంటి నాటకాలకు తెర తీస్తుంది. గుజరాత్ ఎన్నికల ముందు కూడా ఇలానే జరిగింది’ అని తెలిపారు. అంతేకాక దేశంలోని అన్ని వ్యవస్థలను మోదీ నిర్విర్యం చేస్తున్నాడని.. వాటిని తన చేతిలో పెట్టుకుని దుర్వినియోగం చేస్తున్నాడని మండిపడ్డారు. (పాఠ్యాంశంగా ‘అభినందన్’) -
పాఠ్యాంశంగా ‘అభినందన్’
జైపూర్: భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ధీరత్వం రాజస్తాన్ స్కూలు విద్యార్థులకు పాఠ్యాంశం కానుంది. ఆ రాష్ట్ర విద్యా మంత్రి గోవింద్ సింగ్ దోతస్రా అభినందన్ ధైర్యసాహసాలను పాఠ్యాంశంగా చేర్చాలని నిర్ణయించినట్టు ట్విట్టర్లో వెల్లడించారు. ‘పాకిస్తాన్ సైనికులకు చిక్కి, ప్రాణాలు పోతున్నాయని తెలిసి కూడా అభినందన్ ప్రదర్శించిన పోరాటపటిమ ప్రశంసనీయం. అది భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలి. వింగ్ కమాండర్ అభినందన్‌ను గౌరవిస్తూ ఆయన సాహసాన్ని స్కూలు సిలబస్‌లో చేర్చబోతున్నాం’ అని వెల్లడించారు. ఇటీవల పాకిస్తాన్‌కు చెందిన అత్యాధునిక ఎఫ్–16 విమానాన్ని కూల్చివేసి, శత్రుదేశానికి పట్టుబడి కూడా సాహసోపేతంగా వ్యవహరించిన అభినందన్ స్వదేశానికి సురక్షితంగా తిరిగివచ్చిన విషయం తెలిసిందే. పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల గాథలను కూడా పాఠ్యాంశాలుగా చేర్చాలని ఇటీవలే రాజస్తాన్ ప్రభుత్వం నిర్ణయించింది. -
నిర్బంధంలో అజహర్ కొడుకు, సోదరుడు
ఇస్లామాబాద్: ఉగ్ర సంస్థలపై చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి పెరుగుతున్న వేళ పాకిస్తాన్ కొరడా ఝుళిపించింది. జైషే చీఫ్ మసూద్ అజహర్ కొడుకు, సోదరుడు సహా నిషేధిత సంస్థలకు చెందిన మొత్తం 44 మందిని ముందస్తు నిర్బంధంలోకి తీసుకుంది. విచారణ నిమిత్తం జైషే చీఫ్ కొడుకు హమద్ అజహర్, సోదరుడు ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ సహా పలువురిని అదుపులోకి తీసుకున్నామని పాక్ హోం శాఖ వెల్లడించింది. అరెస్ట్ కాదు..: భారత్ ఈఅరెస్టులపై భారత్ స్పందించింది. వారిని ఉగ్రవాద వ్యతిరేక చట్టాల ప్రకారం అరెస్టు చేయలేదని, వారికి భద్రత కల్పించి కాపాడేందుకేనని భారత భద్రతా దళాధికారి ఒకరు పేర్కొన్నారు. నిషేధిత జాబితాలో జమాతే–ఉద్–దవా ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయిద్ నేతృత్వంలోని జమాత్–ఉద్–దవా, దాని అనుబంధ సంస్థ ఫాలా–ఈ–ఇన్సానియత్ ఫౌండేషన్‌ను పాక్ నిషేధిత జాబితాలో చేర్చింది. ఈ రెండు సంస్థలు వాచ్‌లిస్ట్‌లోనే ఉన్నాయని భారత మీడియాలో వార్తలు వచ్చిన మరుసటి రోజే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ప్రభుత్వ సమాచారం ప్రకారం జమాత్, ఫాలాతో కలుపుకుని మొత్తం 70 సంస్థలు నిషేధిత జాబితాలో ఉన్నాయి. జమాతే, ఫాలా సంస్థల ఆస్తుల్ని స్థంభింపజేసినట్లు పాక్ ఇది వరకే ప్రకటించింది. హఫీజ్ సయీద్‌ను అమెరికా 2012లోనే అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించి, అతని సమాచారం తెలిపిన వారికి 10 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది. -
నా యుద్ధం ఉగ్రవాదంపై... విపక్షాల దాడి నాపై
అహ్మదాబాద్/అదాలజ్/ధర్: పొరుగుదేశం నుంచి ఉగ్రవాదాన్ని తరిమివేయాలని తాను యుద్ధం చేస్తుండగా ప్రతిపక్షాలు మాత్రం తనపై దాడి చేయాలని చూస్తున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. మంగళవారం ప్రధాని గుజరాత్, మధ్యప్రదేశ్‌లలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగించారు. ‘నేను ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు ప్రయత్నిస్తుండగా వాళ్లు (ప్రతిపక్షాలు) నన్ను దెబ్బకొట్టాలని చూస్తున్నారు. పేదరికంపై నేను పోరాడుతుండగా వాళ్లు చౌకీదార్‌ను తొలగించేందుకు చూస్తున్నారు. నిజాయతీపరుడైన ఈ చౌకీదార్‌తో వాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే వాళ్లు మోదీ హఠావో అంటూ అరుస్తున్నారు’ అని చెప్పారు. పాక్‌కు బుద్ధి చెప్పాం పాక్‌లోకి ప్రవేశించి ఉగ్రశిబిరాలపై దాడులు చేయడం ద్వారా ఆ దేశానికి తగ్గిన బుద్ధి చెప్పామని ప్రధాని అన్నారు. ‘పుల్వామా ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగా పాక్‌లో ప్రవేశించి అక్కడి ఉగ్ర స్థావరాలపై దాడులు చేయడం ద్వారా ఆ దేశానికి తగిన బుద్ధి చెప్పాం. తీరు మారకుంటే తలెత్తే పరిణామాలేమిటో పాక్‌కు ముందే చెప్పాం’ అని అన్నారు. కానీ, ఎయిర్‌స్ట్రైక్ పాక్‌పై జరిగినా భారత్‌లో ఉన్న కొందరికి ఆ దెబ్బ తగిలిందని ఎద్దేవా చేశారు. ‘పుల్వామాకు ప్రతీకారంగా మనం చేసిన దాడిని ప్రపంచమంతా మద్దతు పలుకుతుండగా అత్యంత కల్తీ కూటమి(ప్రతిపక్ష మహాకూటమి) నేతలు మాత్రం పాక్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నారు’ అంటూ మండిపడ్డారు. రాహుల్ ‘ఆకలి బాధ’ వ్యాఖ్యలపై.. ఒక్క పూట కూడా ఖాళీ కడుపుతో నిద్రించని వారు మాత్రమే ఆకలి బాధ మానసికమైందని అంటారంటూ మోదీ ఎద్దేవా చేశారు. ‘పేదరికం పేరుతో ఓట్లు దండుకుని దేశాన్ని 55 ఏళ్లపాటు పాలించిన వీళ్లకు పేదరికం అనేది కేవలం మానసిక భావన’ అని 2013లో రాహుల్ చేసిన ప్రకటనను ఉదహరిస్తూ వ్యాఖ్యానించారు. అన్నీ ప్రభుత్వమే చేయాలనుకుంటున్నారు ‘ప్రభుత్వమే ప్రతీ పనినీ చేపట్టాలని ప్రజలు భావిస్తున్నారు. ఫలానా పనిని ఎందుకు చేయలేదని అడుగుతున్నారు. ఇది కొత్త ఒరవడి’ అని అన్నారు. -
బాలాకోట్; ‘ఎంత మంది చచ్చారో రేపటికి తెలుస్తుంది’
గువాహటి : బాలాకోట్‌లోని జైషే క్యాంపులపై భారత వైమానిక దళం జరిపిన మెరుపు దాడుల్లో ఎంత మంది ఉగ్రవాదులు చనిపోయారనే విషయంపై రేపటిలోగా స్పష్టత వచ్చే అవకాశం ఉందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. అసోంలోని ధుబ్రిలో బీఎఎస్ఎఫ్ ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా బాలకోట్లో ఎంత మంతి ఉగ్రవాదులు హతమయ్యారో చెప్పాలంటూ ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ ఐఏఎఫ్ దాడుల్లో ఎంత మంది చనిపోయారో చెప్పాలని కొంత మంది నేతలు, ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. ఈ ప్రశ్నలకు ఈరోజు లేదా రేపటిలోగా సమాధానం లభిస్తుంది. పాకిస్తాన్ నాయకుల హృదయానికి మాత్రమే ఎంత మంది ఉగ్రవాదులు హతమయ్యారనే విషయం తెలుస్తుంది. ఎంత మంది చచ్చారు అంటూ మనవాళ్లు పదే పదే అడగటం చూస్తుంటే.. మెరుపు దాడుల తర్వాత వైమానిక దళమే అక్కడికి వెళ్లి శవాలను లెక్కించాలని డిమాండ్ చేసేలా కనిపిస్తోంది’ అని ఎద్దేవా చేశారు.(దాడికి ముందు యాక్టివ్‌గా 300 మొబైల్ కనెక్షన్లు!!) అధికారిక సంస్థ చెప్పినా నమ్మరా? సర్జికల్ స్ట్రైక్స్‌కు ముందు బాలాకోట్‌లో 300 మొబైల్ కనెక్షన్లు యాక్టివ్‌గా ఉన్నాయని జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ(ఎన్టీఆర్ఓ) చెప్పిన వివరాలను ప్రస్తావించిన రాజ్‌నాథ్ సింగ్.. ‘ అధికారిక సంస్థ చెప్పినా కొంత మంది వ్యక్తులు నమ్మడం లేదు. చెట్లు కూలాయా అని ప్రశ్నిస్తున్నారు. చెట్లు మొబైల్ ఫోన్లు వాడతాయో లేదో నాకైతే తెలియదు. ఒకవేళ ఎన్టీఆర్ఓ చెబుతుంది అబద్ధం అనిపిస్తే నా కాంగ్రెస్ స్నేహితులు పాకిస్తాన్‌కు వెళ్లవచ్చు. మన వైమానిక దళం ఎంతమందిని అంతమొందించారో అక్కడి వాళ్లను అడిగి.. వారే శవాలను లెక్కించవచ్చు’ అని విమర్శలు గుప్పించారు.(300 మంది చనిపోయారా? లేక చెట్లు కూలాయా?) #WATCH Home Minister Rajnath Singh in Dhubri,Assam: Some people are asking how many were killed? India's respected and authentic NTRO surveillance system has said 300 mobile phones were active there(JeM terror camp in Balakot) when IAF jets dropped bombs pic.twitter.com/7jvploUBYK — ANI (@ANI) March 5, 2019 -
‘పుల్వామా ఉగ్రదాడి కాదు ప్రమాదం మాత్రమే’
సాక్షి,న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడి, భారత వైమానిక దళాల దాడులపై అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రధాని మోదీయే టార్గెట్‌గా కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. పుల్వామా ఉగ్రదాడిపై కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. పుల్వామాలో జరిగింది ఉగ్రదాడి కాదని, అది ప్రమాదవశాత్తు జరిగిందని వ్యాఖ్యానించారు. దాని ద్వారా బీజేపీ ప్రభుత్వం లబ్ధిపొందాలని ప్రయత్నిస్తోందని దిగ్గిరాజా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై తమకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.(ఆధారాలు కావాలా.. బాలాకోట్ వెళ్లండి!) బాలాకోట్‌లో భారత వైమానిక దళాలు జరిపిన మెరుపు దాడుల్లో మృతిచెందిన ఉగ్రవాదుల సంఖ్యను ప్రధాని మోదీ అధికారికంగా ఎందుకు విడుదల చేయలేదని దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు. బీజేపీలో ఒక్కొక్కరు ఒక్కో సంఖ్య ప్రకటిస్తున్నారని అన్నారు. మెరుపు దాడుల్లో 250 మంది ఉగ్రదాదులను అంతంచేశామని అమిత్ షా, 500 మంది అని యోగి ఆదిత్యానాథ్ చెప్పినట్లు గుర్తుచేశారు. కానీ ఇంతవరకు కేంద్రం మాత్రం ప్రకటించలేదని అన్నారు. ఈమేరకు బుధవారం ఆయన వరుస ట్వీట్లు చేశారు. బాలాకోట్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులకు ఆధారాలు చూపించాలని కాంగ్రెస్ సీనియర్‌నేత కపిల్ సిబాల్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. हमें हमारी सेना पर उनकी बहादुरी पर गर्व है व सम्पूर्ण विश्वास है। सेना में मैंने मेरे अनेकों परिचित व निकट के रिश्तेदारों को देखा है किस प्रकार वे अपने परिवारों को छोड़ कर हमारी सुरक्षा करते हैं। हम उनका सम्मान करते हैं। — digvijaya singh (@digvijaya_28) 5 March 2019 -
ఆధారాలు కావాలా.. బాలాకోట్ వెళ్లండి!
సాక్షి, న్యూఢిల్లీ: వైమానిక దాడులపై కట్టుకథలతో బీజేపీ దేశాన్ని తప్పుదారి పట్టిస్తోందని కాంగ్రెస్ చేస్తోన్న ఆరోపణలపై బీజేపీ తీవ్రంగా మండిపడుతోంది. ఈ నేపథ్యంలో బాలాకోట్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం చేసిన దాడులకు ఆధారాలు చూపించాలన్న కాంగ్రెస్ సీనియర్‌నేత కపిల్ సిబాల్ వ్యాఖ్యలపై కేంద్ర సమాచారమంత్రిత్వ శాఖమంత్రి రాజ్యవర్థన్ రాథోడ్ తీవ్రంగా స్పందించారు. భారత వైమానిక దళం జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసేందో లేదో తెలియాలంటే పాకిస్తాన్‌లోని బాలాకోట్‌కు వెళ్లిచూడండి అని ఘాటుగా బదులిచ్చారు. దీనిపై వారిద్దరి మధ్య ట్విటర్ వేదికగా మాటల యుద్ధం సాగింది. ‘‘గత పార్లమెంట ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయని కాంగ్రెస్ నేతలు బ్రిటన్ వెళ్లి అక్కడ ఆధారాలు ఉన్నాయంటూ తమపై ఆరోపణలు చేశారు. ఇప్పుడు కూడా అదేవిధంగా బాలాకోట్ వెళ్లి పరిశీలించి దాడులు జరిగాయో లేదో చెప్పండి. అక్కడే సరైన ఆధారాలు దొరుకుతాయి’’ అని రాథోడ్ సమాధానమిచ్చారు. బాలాకోట్ దాడులకు సరైన అధారాలు లేవని అంతర్జాతీయ మీడియా చేస్తున్న ప్రచారం మీకు (కాంగ్రెస్) చాలా ఆనందాన్ని కలిగిస్తోందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భారత సైన్యంపై కంటే విదేశీ మీడియాపైనే కాంగ్రెస్‌కు ఎక్కువ నమ్మకమని అన్నారు. కాగా వైమానిక దళ దాడులపై అధికార, విపక్ష పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరగుతోంది. బాలాకోట్ దాడులపై న్యూయార్స్ టైమ్స్, వాషింగ్టన్ డీసీ ప్రచురించిన కథనాలకు ప్రధాని మోదీ సమాధానం ఇవ్వాలని కపిల్ సిబాల్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. Kapil Sibal ji: You believe international media over own Intelligence agencies? You seem happy when media quoted by you says “no losses in strike”? ..and sir, for us you went to london🤦🏽♂️ to find evidence against EVMs, will you please also go to Balakot to check? https://t.co/JefbNnGdqP — Rajyavardhan Rathore (@Ra_THORe) 5 March 2019 -
మళ్లీ పట్టాలెక్కిన సంఝౌతా
లాహోర్: భారత్–పాక్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో రద్దయిన సంఝౌతా ఎక్స్‌ప్రెస్ లాహోర్–ఢిల్లీ మధ్య మళ్లీ పరుగులు పెడుతోంది. సంఝౌతా సర్వీసును పునరుద్ధరించినట్లు పాక్ సోమవారం ప్రకటించింది. ఇటీవల ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నేపథ్యంలో సంఝౌతా రైలు సర్వీసును ఫిబ్రవరి 28న పాక్ రద్దు చేసిన విషయం తెలిసిందే. సోమవారం దాదాపు 150 మంది ప్రయాణికులతో సంఝౌతా ఎక్స్‌ప్రెస్ లాహోర్‌లో బయలుదేరినట్లు పాక్ రేడియో ప్రకటించింది. ఈ రైలు లాహోర్ నుంచి ప్రతి సోమ, గురువారాల్లోనూ, ఢిల్లీ నుంచి ఆది, బుధవారాల్లోనూ బయలుదేరుతుంది. ఈ రైలు మన దేశంలో ఢిల్లీ నుంచి అటారీ వరకు, ఆ తర్వాత పాకిస్తాన్లో వాఘా నుంచి లాహోర్ వరకు నడుస్తుంది. సాధారణంగా ఈ రైలులో ఆక్యుపెన్సీ 70 శాతం ఉంటుండగా.. పుల్వామాలో ఫిబ్రవరి 14న జైషే మహ్మద్ ఉగ్రదాడి అనంతరం ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. 1976లో భారత్–పాక్ మధ్య కుదిరిన సిమ్లా ఒప్పందంలో భాగంగా సంఝౌతా ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసు ప్రారంభమైంది. సంఝౌతా అనే పదానికి హిందీలో ‘ఒప్పందం’అనే అర్థం. 1976లో జూలై 22న రెండు దేశాల మధ్య తొలి సర్వీసు నడిపారు. సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో 6 స్లీపర్ కోచ్‌లు, ఒక ఏసీ త్రీటైర్ కోచ్ ఉన్నాయి. -
250 అని అమిత్ షా ఎలా చెబుతున్నారు?
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం జరిపిన దాడుల్లో మరణించిన ఉగ్రవాదుల సంఖ్యపై అధికారిక ప్రకటన లేకపోవడం పట్ల అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. దాడుల్లో 250 మంది ఉగ్రవాదులు చనిపోయారన్న విషయాన్ని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా దేని ఆధారంగా చెబుతున్నారని కాంగ్రెస్ సోమవారం ప్రశ్నించింది. వైమానిక దాడులను మోదీ, బీజేపీ రాజకీయం చేసి ఎన్నికల్లో ప్రయోజనం పొందాలనుకుంటున్నాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆర్పీఎన్ సింగ్ ఆరోపించారు. రఫేల్ లేకుండా వాయుసేన బలహీనంగా ఉందన్న వ్యాఖ్యలను చేయడం ద్వారా మోదీ వాయుసేనను అవమానించారనీ, ఇందుకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చనిపోయిన ఉగ్రవాదుల సంఖ్యను ప్రధాని నరేంద్ర మోదీ లేదా ఆయన ప్రభుత్వం ఎందుకు వెల్లడించడం లేదనీ, అమిత్ షా మాత్రం ఆ సంఖ్య 250 అని ఎలా చెబుతున్నారని సీనియర్ కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ప్రశ్నించారు. దాడిలో 250 మంది చనిపోయారని ఏ ఆధారాలూ చూపకుండానే అమిత్ షా చెబుతుండటాన్ని బట్టే విషయాన్ని ఎవరు రాజకీయం చేస్తున్నారో అర్థమవుతోందని సిబల్ అన్నారు. సైన్యాన్ని అవమానించకండి: బీజేపీ వైమానిక దాడులపై బూటకపు, కట్టుకథలతో దేశాన్ని తప్పుదారి పట్టించవద్దనీ, సైన్యాన్ని అవమానించవద్దని కాంగ్రెస్‌కు సోమవారం బీజేపీ విజ్ఞప్తి చేసింది. కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మాట్లాడుతూ ‘ఉగ్రవాదులు, వారి మద్దతుదారులపై దాడులు జరుగుతోంటే కాంగ్రెస్, దాని మిత్రపక్షాలకు ఇబ్బందిగా ఉన్నట్లుంది. ఇది యాధృచ్చికమా, భాగస్వామ్యమా? సైన్యం పరాక్రమానికి సెల్యూట్ చేస్తూ దేశం మొత్తం ఒకే మాట మాట్లాడుతున్న సమయంలో, విపక్షాలు ఇలాంటి ప్రశ్నలను వేయడం దురదృష్టకరం’ అని అన్నారు. విపక్షాలది బాధ్యతారాహిత్యమనీ, ఉగ్రవాదులపై భద్రతా దళాలు తీసుకునే చర్యలను ఆ పార్టీలు స్వాగతిస్తాయన్న నమ్మకం పోయిందని నఖ్వీ పేర్కొన్నారు. రఫేల్‌ను ఎందుకు తీసుకోలేదు? దాదాపు ఐదేళ్ల పాలనలో మోదీ ప్రభుత్వం ఒక్క రఫేల్ విమానాన్ని కూడా వాయుసేనలో ఎందుకు ప్రవేశపెట్టలేదనీ, ఇన్నాళ్లూ ఏం చేశారని బీఎస్పీ అధినేత్రి మాయావతి మోదీని ప్రశ్నించారు. మోదీ, అమిత్ షాలు భద్రతా దళాలను రాజకీయ విన్యాసాల కోసం వినియోగించుకుంటున్నాయని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. దాడిలో చనిపోయిన ముష్కరుల సంఖ్యపై సైన్యం అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ, ఆ దాడుల్లో 250 మంది చనిపోయారని అమిత్ షా అంటున్నారనీ, తద్వారా సైన్యం అబద్ధం చెబుతోందని అమిత్ షా ఉద్దేశమా అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. దేశ ఐక్యతను దెబ్బతీసేలా బీజేపీ, ఆరెస్సెస్‌లు ప్రయత్నిస్తున్నాయని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. -
పాతాళంలో దాక్కున్నా వదలం
జామ్‌నగర్/అహ్మదాబాద్: ‘ఉగ్రవాదులు పాతాళంలో దాక్కున్నా వదలిపెట్టబోం. వాళ్ల స్థావరాల్లోకి చొచ్చుకెళ్లి అంతం చేయడమే మన లక్ష్యం. ఒక కార్యక్రమం పూర్తయింది కదా అని ప్రభుత్వం ఆగిపోదు. మరింత కఠిన, తీవ్రమైన మరిన్ని చర్యలకు వెనుకాడబోదు’ అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. గుజరాత్‌లోని జామ్‌నగర్, అహ్మదాబాద్‌లలో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగించారు. బాలాకోట్‌పై ఐఏఎఫ్ దాడి పైలట్‌ప్రాజెక్టు మాత్రమే.. అసలైన దాడులు ఇకపై మొదలవుతాయని ప్రధాని అన్నారు. పొరుగుదేశం నుంచి ఉగ్రవాదాన్ని రూపుమాపే దాకా ఇవి కొనసాగుతూనే ఉంటాయని స్పష్టం చేశారు. ‘పొరుగు దేశంలో ఉన్న ఉగ్ర వ్యాధి మూలాలను తొలగించి మనం ఆ వ్యాధిని నయం చేయలేమా? ఉగ్రవాదంతో భారత్‌ను నాశనం చేయాలని చూస్తున్న వారిని వేరే దేశంలో ఉన్నాసరే వదలబోం’ అని అన్నారు. బాలాకోట్ ఐఏఎఫ్ దాడికి రఫేల్ విమానాలను వాడితే ఫలితం వేరేలా ఉండేదన్న తన ప్రకటనపై పెడార్థాలు తీసేముందు విపక్ష నేతలు కాస్త విజ్ఞత ప్రదర్శించాలని సూచించారు. ‘రఫేల్ విమానాలు మనకు సకాలంలో అంది ఉంటే బాలాకోట్ దాడి ఫలితం మరోలా ఉండేదని చెప్పా. కానీ, వాళ్లు(ప్రతిపక్షాలు) మన వైమానిక దళాల సామర్థ్యాన్ని నేను అనుమానిస్తున్నానంటూ మాట్లాడుతున్నారు. దయచేసి విజ్ఞతతో మాట్లాడండి. బాలాకోట్ దాడిలో రఫేల్‌ను వాడినట్లయితే మనం ఒక్క ఫైటర్ జెట్‌ను కూడా కోల్పోయే వాళ్లం కాదు. అలాగే, ప్రత్యర్థుల విమానం ఒక్కటీ మిగిలేది కాదనేది నా ఉద్దేశం. నా మాటలను వాళ్లు అపార్థం చేసుకుంటే నేనేం చేయాలి? వాళ్ల పరిమితులు వాళ్లవి’ అని మోదీ వ్యాఖ్యానించారు. బాలాకోట్ దాడులకు ఆధారాలు బయటపెట్టాలంటూ ప్రతిపక్ష నేతలు చేస్తున్న డిమాండ్లపై ప్రధాని స్పందిస్తూ.. ఉగ్రవాద నిర్మూలన లక్ష్యంతో తాను పనిచేస్తుండగా ప్రతిపక్షాలు మాత్రం తనను తొలగించేందుకు యత్నిస్తున్నాయని ఆరోపించారు. నేడు మన ప్రతిపక్ష నేతలు చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ పత్రికల్లో ప్రధాన శీర్షికలతో ప్రచురితమవుతాయంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయం కాబట్టే ప్రభుత్వం బాలాకోట్ దాడికి పూనుకుందని ప్రతిపక్షాలు భావిస్తే..సర్జికల్ స్టైక్స్(2016)సమయంలో ఏ ఎన్నికలున్నాయి? అని ఆయన ప్రశ్నించారు. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు పేలవమైన స్వల్పకాలిక విధానాలకు బదులు నిర్మాణాత్మక, దీర్ఘకాలిక చర్యలు అవసరమని తెలిపారు. పదేళ్లకోసారి రైతు రుణాలు మాఫీ చేయడం, ఓట్లు దండుకోవడమే కాంగ్రెస్ పని అంటూ విమర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని బాంద్రా–జామ్‌నగర్ హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును, అహ్మదాబాద్ మెట్రో మొదటి దశ(6.5కిలోమీటర్లు)ను ప్రారంభించి వస్త్రాల్– అప్పారెల్ పార్కు ఏరియా మార్గంలో కొంతదూరం మెట్రో రైలులో ప్రయాణించారు. -
మేము ఆ లెక్కలు వేయం
కోయంబత్తూర్: పాకిస్తాన్ భూభాగం బాలాకోట్‌లో జైషే మహ్మద్ ఉగ్ర శిబిరాలపై జరిపిన దాడిలో ఎంత మంది ఉగ్రవాదులు అంతమయ్యారన్న విషయంలో ఎడతెగని చర్చ నడుస్తున్న వేళ వైమానిక దళ చీఫ్ బీఎస్ ధనోవా సోమవారం స్పందించారు. వైమానిక దాడుల్లో చోటుచేసుకున్న నష్టం వివరాల్ని ప్రభుత్వమే వెల్లడించాలని, మృతుల సంఖ్యను తాము లెక్కించమని చెప్పారు. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని ఛేదించామా? లేదా? అన్నదే తమకు ముఖ్యమన్నారు. పుల్వామా దాడికి ప్రతీకార చర్యగా ఫిబ్రవరి 26న పాక్‌లోని ఖైబర్ ఫక్తున్ఖ్వా ప్రావిన్సులో జైషే శిక్షణశిబిరాలపై భారత వైమానిక దళం బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో 350 మంది ఉగ్రవాదులు హతమయ్యారని ప్రభుత్వ వర్గాలు తెలపగా, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా 250 మంది మరణించారని చెప్పారు. ఉగ్రవాదులకు వాటిల్లిన నష్టం తక్కువేనని మీడియాలో కొన్ని కథనాలు వచ్చాయి. ఇప్పటి దాకా ఈ విషయంలో ఎలాంటి అధికారిక సమాచారం బయటకురాలేదు. ఈ నేపథ్యంలో కోయంబత్తూరులో జరిగిన మీడియా సమావేశంలో ధనోవా మాట్లాడారు. ‘ వైమానిక దాడిలో ఎందరు చనిపోయారో మేము లెక్కించం. ఆ సమయంలో అక్కడ ఎందరున్నారన్న దానిపై ఆ సంఖ్య ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వమే ఆ వివరాలు ప్రకటించాలి’ అని అన్నారు. బాంబులు లక్ష్యానికి దూరంగా జారవిడిచారని వచ్చిన వార్తల్ని ఖండించారు. అది నిజమైతే పాక్ అంత తీవ్రంగా ఎందుకు స్పందిస్తుందని ఆయన అన్నారు. అభినందన్ ఫిట్‌గా ఉంటేనే.. పాకిస్తాన్ నిర్బంధం నుంచి విడుదలైన వింగ్ కమాండర్ అభినందన్ పూర్తి ఫిట్నెస్ సాధించాకే యుద్ధ విమానం నడుపుతారని ధనోవా చెప్పారు. కూలిపోయిన మిగ్ విమానం నుంచి ప్రాణాలతో బయటపడిన అభినందన్‌కు అవసరమైన అన్ని వైద్య పరీక్షలు చేస్తున్నామని, ఆయన మళ్లీ విమానం నడుపుతాడా? లేదా? అన్నది మెడికల్ ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుందన్నారు. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేస్తున్న రఫేల్ యుద్ధ విమానాలు సెప్టెంబర్ నాటికి వైమానిక దళానికి అందుతాయని చెప్పారు. బాలాకోట్ దాడి సమయంలో రఫేల్ విమానాలు అందుబాటులో ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై స్పందించేందుకు నిరాకరించారు. పాకిస్తాన్ ఎఫ్–16 యుద్ధ విమానాల వాడకంపై అమెరికాతో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకుందో తనకు తెలియదని, ఒకవేళ ఆ విమానాన్ని దాడులకు వాడొద్దని అందులో ఉంటే, ఒప్పందం ఉల్లంఘనకు గురైనట్లేనని పేర్కొన్నారు. పాకిస్తాన్ దాడుల్ని తిప్పికొట్టేందుకు వినియోగించిన మిగ్–21 విమానం అత్యంత అధునాతనమైనదని తెలిపారు. పోఖ్రాన్లో ‘బాలాకోట్’కు రిహార్సల్! పుల్వామాలో ఉగ్ర దాడి తరువాత ప్రతీకార చర్య తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ రెండింటి మధ్య నిర్వహించిన సైనిక కసరత్తు కార్యక్రమంలో కొన్ని మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 14న ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు అసువులుబాసిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన రెండు రోజుల తరువాత రాజస్తాన్‌లోని పోఖ్రాన్లో ‘వాయుశక్తి’ పేరిట వైమానిక దళం విన్యాసాలు నిర్వహించింది. ఉగ్రమూకలపై ప్రతీకారం తీసుకునేందుకు సన్నద్ధమయ్యేలా ఈ కార్యక్రమంలో కొన్ని మార్పులు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వాయుశక్తి కార్యక్రమం షెడ్యూల్ అంతకుముందే ఖరారైనా, పుల్వామా ఘటనకు వైమానిక దళం ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఐఏఎఫ్ అధికారులకు సమాచారం అందినట్లు భావిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఒక రిహార్సల్‌లా ఉపయోగించుకుని పుల్వామా ఘటనకు కారణమైన జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థపై దాడులకు పాల్పడాలని ప్రణాళికలు రచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి సంకేతాలు రాగానే భారత్–పాక్ నియంత్రణ రేఖ అవతలి వైపున గగనతలంలో దాడులు నిర్వహించేలా వాయుశక్తి కార్యక్రమంలో మార్పులు జరిగినట్లు తెలిసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు తగిన సమయంలో ప్రతీకార చర్యకు దిగుతామని వైమానిక దళ చీఫ్ బీఎస్ ధనోవా ఈ సందర్భంగా ప్రకటించడం ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది. నాడు బాలాకోట్ శిబిరంలో 300 మొబైల్స్ యాక్టివ్ బాలాకోట్‌లో మృతి చెందిన ముష్కరులకు సంబంధించిన సాక్ష్యాధారాలు చూపించాలని రాజకీయ పక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ది నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్టీఆర్వో) ఆసక్తికర విషయాలను వెల్లడించింది. బాలాకోట్‌లో జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై దాడులకు దిగడానికి ముందు ఆ ప్రదేశంలో నిఘా ఉంచగా 300 మొబైల్ ఫోన్లు పనిచేస్తున్నట్టుగా తమకు సిగ్నల్స్ అందాయని, అంటే ఆ సమయంలో స్థావరంలో అందరు ఉగ్రవాదులు ఉన్నట్టుగా తమకు అర్థమైందని ఆ సంస్థ అధికారి తెలిపారు. ‘ఫిబ్రవరి 26న భారత వాయుసేన నుంచి దాడులకు గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే ఆ ప్రాంతం మొత్తాన్ని సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి జల్లెడ పట్టాం. దాదాపుగా 300 మొబైల్స్ అక్కడ వాడుతున్నట్టుగా మాకు సిగ్నల్స్ అందాయి. ఇదే విషయాన్ని వైమానిక దళం దృష్టికి తీసుకువెళ్లాం. దీంతో ఐఏఎఫ్ జవాన్లు మొదట ఆ ఫోన్ సిగ్నల్స్‌ని నాశనం చేశారు. ఆ తర్వాత వెయ్యి కేజీల బరువైన బాంబుల్ని ప్రయోగించారు’ అని ఆ అధికారి చెప్పారు. ‘దాడులకు ముందు ఎన్టీఆర్వో, భారత నిఘా కూడా ఉగ్రవాద స్థావరాల్లో ఉన్న సదుపాయాలపై ఒక అంచనాకు వచ్చింది. ఆ తర్వాతే దాడులకు దిగింది’ అని అధికారి వివరించారు. -
దాడికి ముందు యాక్టివ్‌గా 300 మొబైల్ కనెక్షన్లు!!
న్యూఢిల్లీ : కశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై దాడికి పాల్పడిన ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ ప్రధాన స్థావరం బాలకోట్లో భారత వైమానిక దళం బాంబుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌లోని ఖైబర్ పంక్తువా ప్రావిన్స్‌లోని జైషే క్యాంపులపై సుమారు వెయ్యి కిలోల పేలుడు పదార్థంతో ఐఏఎఫ్ విరుచుకుపడింది. ఈ మెరుపు దాడుల్లో పన్నెండు మిరాజ్- 2000 యుద్ధ విమానాలు పాల్గొనగా... సుమారు 250 మంది 300 మంది ఉగ్రవాదులు మృతి చెందారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రతిపక్షాలు మాత్రం ఇదంతా ప్రభుత్వం హడావుడి మాత్రమేనని విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ(ఎన్టీఆర్ఓ) వర్గాలు కీలక సమాచారం వెల్లడించాయి. మెరుపు దాడులు జరిగిన సమయంలో టార్గెట్ వద్ద 300 మొబైల్స్ యాక్టివ్‌గా ఉన్నాయని పేర్కొన్నాయి. జైషే క్యాంపులపై భారత జెట్ ఫైటర్లు దాడి చేస్తున్నాయనే సమాచారంతో బాలకోట్ వద్ద ఉన్న ఫోన్ కార్యకలాపాలపై దృష్టి సారించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దాడికి ముందు ఆ ప్రాంతంలో సిగ్నల్స్ ట్రేస్ చేసినట్లు పేర్కొన్నాయి. దీంతో సర్జికల్ స్ట్రైక్స్‌లో 300 మంది ఉగ్రవాదులు చచ్చిపోయారనే వార్తలకు బలం చేకూరినట్లైంది. కాగా పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత వైమానిక దళం జరిపిన ఉగ్రదాడుల్లో ఎంత మంది హతమయ్యారనే విషయం గురించి ప్రభుత్వం ఇంతవరకు అధికారిక ప్రకటన చేయలేదు. Sources: NTRO surveillance of JeM Balakot camp in days leading up to air strike by IAF confirmed around 300 active mobile connections in facility pic.twitter.com/uwyzd0qpHB — ANI (@ANI) March 4, 2019 -
మరో సర్జికల్ స్ట్రైక్; పాక్ డ్రోన్ కూల్చివేత!
జైపూర్ : భారత్- పాక్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల తగ్గుముఖం పట్టినట్లుగా కన్పిస్తున్న తరుణంలో సరిహద్దుల వెంబడి మరోసారి అలజడి చెలరేగింది. ఇప్పటికే కశ్మీర్ సరిహద్దుల వెంబడి పదే పదే కాల్పులకు తెగబడుతున్న పాకిస్తాన్ మరో దుందుడుకు చర్యకు పాల్పడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాజస్తాన్‌లోని భారత్- పాక్ సరిహద్దు వెంబడి అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ డ్రోన్‌ను భారత వైమానిక దళం కూల్చివేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సోమవారం ఉదయం భారత గగన తలంలోకి ప్రవేశించేందుకు యత్నించిన పాకిస్తాన్ డ్రోన్‌పై... భారత ఫైటర్ జెట్ సుఖోయ్ 30ఎమ్కేఐ క్షిపణులతో దాడి చేసినట్లు సమాచారం. బికనీర్‌లోని నాల్ సెక్టార్‌లోని సరిహద్దు వెంబడి చోటుచేసుకున్న ఈ ఘటనలో పాక్ యుద్ధ విమాన శకలాలు.. పాకిస్తాన్ సరిహద్దు వైపున ఉన్న ఇసుక దిబ్బలపై పడిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.(చదవండి : తీరు మారని పాక్.. సరికొత్త నాటకాలు!!) ఇదిలా ఉండగా భారత్ మరోసారి మెరుపు దాడులకు పాల్పడిందంటూ పాకిస్తాన్ నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. జైషే ప్రధాన స్థావరం భవల్పూర్కు 100 కిలో మీటర్ల దూరంలోని అబ్బాస్ ఫోర్టుపై భారత వైమానిక దళం దాడి చేసిందంటూ కొన్ని వీడియోలు షేర్ చేశారు. ఆ తర్వాత పాక్ ఎదురుదాడికి దిగిందని పేర్కొన్నారు. ఇక ఈ విషయంపై స్పందించిన పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్ ఈ వార్తల్ని కొట్టిపారేసింది. తాము సరిహద్దు నిబంధనలను ఉల్లంఘించలేదని పేర్కొంది. ఇంధన ట్యాంకులను చేర్చే క్రమంలో పాకిస్తాన్ విమానం వల్లే అక్కడ పేలుడు సంభవించిందని తెలిపింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా పుల్వామా ఉగ్రదాడి, మెరుపు దాడుల నేపథ్యంలో పాక్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధవిమానాలు గత బుధవారం నియంత్రణ రేఖ (ఎల్వోసీ) దాటి భారత గగనతలంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత పైలట్ అభినందన్ వర్ధమాన్ ఆర్-73 అనే మిస్సైల్ ప్రయోగించి పాక్ యుద్ధవిమానాన్ని కూల్చేశారు. అదే సమయంలో అభినందన్ విమానం కూడా ప్రత్యర్థి దాడిలో నేలకూలింది. దాంతో ఆయన ప్యారాచూట్ సాయంతో పాక్ భూభాగంలో దిగిన ఆయన.. జెనీవా ఒప్పందం మేరకు క్షేమంగా భారత్‌కు చేరుకున్నారు. Rajasthan: At 11:30 am today a Sukhoi 30MKI shot down a Pakistani drone at the Bikaner Nal sector area of the border. Drone was detected by Indian Air Defence radars pic.twitter.com/Ijc4B4XzjN — ANI (@ANI) March 4, 2019 -
బుద్ధి చూపించుకున్న పాక్.. సరికొత్త నాటకాలు!!
న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో భారత్ సహా అంతర్జాతీయ సమాజం ఒత్తిడితో ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పిన పాకిస్తాన్ మరోసారి తన బుద్ధి చూపించుకుంది. ఉడి, పుల్వామా ఘటనలకు పాల్పడినట్లుగా భావిస్తున్న ఉగ్ర సంస్థలు జైషే మహ్మద్, లష్కర్-ఎ-తొయిబాలను మాత్రమే నిషేధించిన దాయాది దేశం... నిషేధిత ఉగ్ర సంస్థల సరికొత్త జాబితాలో కొన్నింటిని ‘వాచ్‌లిస్టు’లో పెట్టి తన విధానమేమిటో స్పష్టం చేసింది. లష్కర్-ఎ-తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్ స్థాపించిన జమాత్-ఉద్- దావా(జేయూడీ), ఫతా-ఈ- ఇన్సానియత్(ఎఫ్ఏఐ)లను నిషేధిస్తామన్న పాక్.. వాటిని ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని పేర్కొంది. ఈ మేరకు సోమవారం నిషేధిత ఉగ్ర సంస్థల జాబితాలో వాటికి చోటు కల్పించలేదు. అప్పుడలా..ఇప్పుడేమో ఇలా.. ఉగ్రవాద నిరోధక చట్టం-1997లోని షెడ్యూల్-I ప్రకారం 68 సంస్థలను నిషేధించిన పాకిస్తాన్.. జేయూడీ, ఎఫ్‌ఏఐలను మాత్రం షెడ్యూల్-IIలోని అండర్ వాచ్ జాబితాలో పెట్టింది. అయితే ఫిబ్రవరి 21న విడుదల చేసిన జాబితాలో ఈ రెండు సంస్థలను నిషేధిస్తున్నట్లుగా పాక్ హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి పేర్కొన్నారు. తమ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో చర్చించిన జాతీయ భద్రతా కమిటీ సూచనల మేరకు జేయూడీ, ఎఫ్‌ఏఐలను నిషేధిస్తున్నట్లు తెలిపారు. కానీ తాజా జాబితాలో మాత్రం వాటిని అండర్ వాచ్ లిస్టులో ఉంచడం గమనార్హం. ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్- ఉగ్రవాదులకు డబ్బు చేకూరే మార్గాలను పరిశీలించే సంస్థ)లో తమకు ఉన్న ‘గ్రేలిస్టు’ హోదాను తొలగించుకునేందుకు మొదట ఈ రెండు సంస్థలను నిషేధించినట్లుగా పాక్ ప్రకటించింది. అయితే ప్రస్తుతం ప్రకటించిన జాబితాతో తన బుద్ధి మారదని నిరూపించుకుంది. ఈ నేపథ్యంలో... ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్తాన్ నిజ స్వరూపం మరోసారి బయటపడిందని, ఎఫ్ఏటీఎఫ్ను మోసం చేసేందుకు పాక్ ప్రభుత్వ వర్గాలు ఇలాంటి గిమ్మిక్కులకు పాల్పడ్డాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా కశ్మీర్లో అల్లకల్లోలం సృష్టిస్తున్న లష్కర్-ఏ-తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్ 1990లో ఎఫ్ఏఐను, 2002లో జేయూడీని స్థాపించాడు. ఎఫ్ఏఐ చారిటీ సంస్థగా కొనసాగుతుండగా.. జేయూడీ లష్కర్‌కు అనుసంధానంగా రాజకీయ పార్టీ ముసుగులో పనిచేస్తోంది. ఇక 2001లో భారత పార్లమెంట్‌పై దాడి, 2006లో ముంబై పేలుళ్లు, 26/11 ముంబై ఘటన వంటి పలు ఉగ్రదాడులకు లష్కర్ పాల్పడిన సంగతి తెలిసిందే. -
దయచేసి కామన్ సెన్స్ వాడండి : మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్ ఫైటర్‌జెట్లపై తాను చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తప్పుగా చిత్రీకరిస్తున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఒక రకంగా అంటే.. ప్రతిపక్షాలు మరోరకంగా ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో నిర్వహించిన ఓ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ..అసలు ప్రతిపక్ష నేతలకు కామన్సెన్స్ ఉండా అని ప్రశ్నించారు. నేను చేసిన వ్యాఖ్యలు కొంచెం బుద్దితో ఆలోచించినా అందరికి అర్థం అవుతుందన్నారు.భారత్ దగ్గర రఫేల్ ఫైటర్జెట్లు ఉండుంటే ఇటీవల పాకిస్తాన్‌తో తలెత్తిన ఘర్షణల ఫలితం మరోలా ఉండేదని నరేంద్ర మోదీ అన్న సంగతి తెలిసిందే. రాఫెల్ సమయానికి రాకపోవడానికి స్వార్థ ప్రయోజనాలే కారణమని ఆయన కాంగ్రెస్‌ను నిందించారు. అయితే తాను భారత సైనిక శక్తి, వైమానిక దాడులను శకించిన్నట్లుగా కాంగ్రెస్ నేతలు చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. (రఫేల్ ఉంటే ఫలితం మరోలా ఉండేది) ‘దయచేసి మీ (కాంగ్రెస్ నేతలు) కామన్ సెన్స్‌ను వాడండి. దాడుల సమయంలో మన దగ్గర్ రఫెల్స్ ఉండి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేది. మన విమానం ఒక్కటి కూడా కూలేదు కాదు, పాకిస్తాన్ విమానం ఒక్కటి కూడా మిగిలేది కాదు అని నేను అన్నాను. కానీ నా వాఖ్యలను మీరు(కాంగ్రెస్ నేతలు) తప్పుగా చిత్రీకరిస్తున్నారు. నేను సైనికుల శక్తిని శంకిస్తున్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. రఫెల్‌ను సరైన సమయానికే మనం పొంది ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అన్నది నా ఉద్దేశం. కామెన్ సెన్స్‌తో ఆలోచింని మాట్లాడండి’ అని మోదీ ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సర్జికల్ స్ట్రైక్స్ 2: ఎంత మంది చనిపోయారో లెక్కించలేదు
-
‘బాలాకోట్’పై ఎవరిది రాజకీయం?
సాక్షి, న్యూఢిల్లీ : ‘పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ భూభాగంపై భారత వైమానిక దళం జరిపిన దాడులను ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. మన వైమానిక దాడులను అనుమానిస్తూ శత్రు దేశానికి లబ్ధి చేకూర్చేలా మాట్లాడుతున్నాయి’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నాడు పట్నాలో నిర్వహించిన ఓ సభలో మాట్లాడుతూ విమర్శించారు. దేశం నుంచి ఉగ్రవాదాన్ని తరిమి కొట్టేందుకు తాను ప్రయత్నిస్తుంటే, తననే పదవి నుంచి తప్పించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని కూడా ఆరోపించారు. ఆయన మాటల్లో నిజం ఎంత ? ప్రతిపక్ష పార్టీలు నిజంగా పాక్‌పై దాడులను రాజకీయం చేస్తున్నాయా ? మోదీ, ఆయన పార్టీ భారతీయ జనతా పార్టీ రాజకీయం చేయడం లేదా ? బాలాకోట్‌పై భారత్ జరిపిన దాడులు గురి తప్పాయని, అక్కడ ఉగ్రవాదులకు ఎలాంటి నష్టం వాటిల్లలేదంటూ ప్రపంచ మీడియా కోడై కూస్తుంటే దాడుల్లో ఎంత నష్టం జరిగిందో చెప్పండి, వాటికి సంబంధించిన సాక్ష్యాధారాలుంటే చూపండంటూ ప్రశ్నించడం రాజకీయం చేయడం అవుతుందా ? అంతకుముందు రోజు శనివారం నాడు ప్రధాని నరేంద్రమోదీ ‘ఇండియా టుడే’ ఏర్పాటు చేసిన సదస్సులో మాట్లాడుతూ ‘ఈ పాటికి రఫేల్ యుద్ధ విమానాలు ఉండి ఉంటేనా....!’ అంటూ వ్యాఖ్యానించారు. అంటే ఆయన ఉద్దేశం ఏమిటీ ? ‘అంటే రఫేల్ యుద్ధ విమానాలు ఉంటే రఫ్వాడించే వాణ్ణి.... ఉగ్రవాదులను నామరూపాలు లేకుండా చేసే వాడిని’ అని అర్థమా ? లేదా ‘నాటి యూపీఏ ప్రభుత్వం రఫేల్ యుద్ధ విమానాల కొనుగోళ్ల కోసం చర్చల ప్రక్రియను సుదీర్ఘంగా కొనసాగించడం వల్ల నేటికి ఈ విమానాలు భారత్‌కు అందలేక పోయాయన్న ఆందోళన?’ వీటిలో ఏ అర్థాన్ని తీసుకున్నా దాన్ని రాజకీయం చేయడమే అవుతుంది. మోదీ 2015లో కుదుర్చుకున్న రఫేల్ ఒప్పందం ప్రకారం మొదటి రఫేల్ యుద్ధ విమానం వచ్చే సెప్టెంబర్ నెలలో భారత్‌కు చేరాల్సి ఉంది. పాకిస్థాన్‌లో బాలాకోట్‌పై భారత వైమానిక దళం మెరపు దాడులు జరిపిన రోజునే కర్ణాటకలో బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప మాట్లాడుతూ, బాలాకోట్ దెబ్బతో కర్ణాటకలో బీజేపీకి కనీసం 22 లోక్‌సభ స్థానాలు వస్తాయని చెప్పడం రాజకీయం చేయడం కదా? ఆ మరుసటి రోజే ఎన్నికల ప్రచారంలో ఉన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ఉగ్రవాదుల పీచమణచేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్న మోదీనే మరోసారి ప్రధాన మంత్రిగా గెలిపించడంటూ పిలుపునివ్వడం రాజకీయం కాదా ? ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ సైనిక దుస్తుల్లో ఎన్నికల ప్రచారం చేయడం రాజకీయం చేయడం కాదా ? భారత వైమానిక దాడుల్లో ఎంత మంది చనిపోయారో లెక్కతేల్చి చెప్పడం కష్టమంటూ గురువారం నాడు సైనికాధికారులు పునరుద్ఘాటించినప్పటికీ 250 మందికి పైగా చనిపోయారని అమిత్ షా ఆదివారం ప్రకటించడం రాజకీయం కాదా? కశ్మీర్‌లోని ఉడి సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడులు జరిపి మూడేళ్లు అవుతున్నా ఉగ్రవాదుల నిర్మూలనకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోని మోదీ ప్రభుత్వం మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉన్నప్పుడు ఈ దాడులు జరపడం రాజకీయం కాదా? రాజకీయ ప్రయోజనాల కోసం కాదా ?!? -
ఎంత మంది చచ్చారో లెక్కించలేదు : బీఎస్ ధనోవా
కోయంబత్తూరు : పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత వాయుసేన మెరుపు దాడులు జరిపిన విషయం తెలిసిందే. అయితే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారత్‌లోని రాజకీయం ఈ సర్జికల్ స్ట్రయిక్స్ చుట్టే తిరుగుతోంది. ఈ దాడుల్లో ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారో లెక్క చెప్పాలని, వాటికి ఆధారాలు ఇవ్వాలని ప్రతిపక్షపార్టీలు ప్రశ్నిస్తుండగా.. 250 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామని అధికార పార్టీ పేర్కొంది. ఇక భారత వాయుసేన ఐఏఎఫ్ చీఫ్ బీఎస్ ధనోవా మాత్రం ఈ మెరుపు దాడుల్లో ఎంత మంది చచ్చారో లెక్కించలేదని తెలిపారు. భారత వాయుసేన ఆ పనిచేయలేదని పేర్కొన్నారు. ‘ఎంత మంది చనిపోయారనేది లెక్కించలేం. అది అక్కడ ఎంత మంది ఉన్నారనే సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. మృతుల సంఖ్యను లెక్కించడం భారత వాయుసేన పనికాదు. దాడి చేయడమే మా పని. ఆ లెక్కలు ప్రభుత్వం చూసుకుంటుంది. బాల్కోట్లోని ఉగ్రస్థావరాలను మాత్రం ధ్వంసం చేశాం.’ అని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 26న భారత వాయుసేన పాకిస్తాన్‌లోని బాలకోట్‌పై మెరుపు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. -
300 మంది చనిపోయారా? లేక చెట్లు కూలాయా?
న్యూఢిల్లీ: పాకిస్థాన్ బాలాకోట్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం (ఐఏఎఫ్) జరిపిన దాడుల్లో నిజంగానే 300 మంది ఉగ్రవాదులు చనిపోయారా అంటూ ప్రతిపక్షాలు ఇదే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. భద్రతా దళాల ధైర్యసాహసాలను రాజకీయ ప్రయోజనం కోసం వాడుకుంటున్నాయని, ఆర్మీ దాడులను రాజకీయం చేస్తున్నాయని ప్రతిపక్షాలు మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ప్రతిపక్షాలకు తాజాగా పంజాబ్ మంత్రి, కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ గొంతు కలిపారు. విదేశీ శత్రు దేశంతో పోరాడుతున్నామంటూ దేశంలోని ప్రజలను మోసం చేస్తున్నారని, నిజానికి మీరు ఉగ్రవాదులను చంపారా? లేక చెట్లను కూల్చారా? ఇదంతా ఎన్నికల గిమ్మిక్కేనా అని సిద్ధూ ప్రశ్నించారు. ‘300 మంది ఉగ్రవాదులు నిజంగా చనిపోయారా? లేదా? మీ ఉద్దేశం ఏమిటి? ఉగ్రవాదులను నేలమట్టం చేయడమా? చెట్లను కూల్చడమా? ఇది ఎన్నికల గిమ్మిక్కా? శత్రుదేశంతో పోరాడుతున్నామంటూ.. దేశాన్ని మోసం చేస్తున్నారు. ఆర్మీతో రాజకీయం చేయడం మానండి. ఆర్మీ దేశమంతా పవిత్రమైనది’ అని సిద్ధూ ట్వీట్ చేశారు. -
భారత్-పాక్ గొడవ.. ఆగిన పెళ్లి
జైపూర్ : భారత్, పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఓ జంట పెళ్లి ఆగిపోయింది. రాజస్తాన్‌లోని బర్మార్ జిల్లాకు చెందిన మహేంద్ర సింగ్‌కు, పాకిస్తాన్, సింధ్ ప్రావిన్స్‌లోని అమర్ కోట్ జిల్లాకు చెందిన చగన్ కర్వార్‌కు ఈ నెల 8న పెళ్లి జరగాల్సింది. కానీ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ జరిపిన ఆత్మహుతి దాడిలో 40 మంది భారత సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందడంతో ఇరుదేశాల మధ్య యుద్దవాతావరణం నెలకొంది. దీంతో ఇరు కుటుంబాల సభ్యులు పెళ్లిని వాయిదా వేసుకున్నారు. పరిస్థితులు చక్కబడిన తర్వాతనే వివాహం జరిపిస్తామని తెలిపారు. ‘గత నెలనే మా పెళ్లి నిశ్చయించారు. పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. వివాహ ఆహ్వాన పత్రికలు కూడా పంచాం. పాకిస్తాన్ నుంచి వీసాలు కూడా తీసుకున్నాం. అక్కడికి వెళ్లడానికి థార్ ఎక్స్‌ప్రెస్ టికెట్లు కూడా బుక్ చేశాం. కానీ ఇప్పుడు మా పెళ్లిని వాయిదా వేయాలనే నిర్ణయానికి వచ్చాం. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గిన తర్వాతే పెళ్లి చేసుకుంటాం’ అని వరుడు మహేంద్ర మీడియాకు తెలిపారు. ఇక సరిహద్దుల్లో సీమాంతర వివాహలు సర్వసాధారణం. రాజ్‌పుత్, మెగవాల్, బీల్, సింధి, కాత్రి కమ్యూనిటీలు ఈ తరహా పెళ్లిలు చేసుకుంటాయి. -
బాలాకోట్‌లో 250 మంది ఉగ్రవాదులు మృతి!
న్యూఢిల్లీ: గతవారం పాకిస్థాన్ బాలాకోట్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం జరిపిన దాడిలో ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారన్నదని కేంద్ర ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాత్రం గుజరాత్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఓ సంఖ్య చెప్పారు. ఐఏఎఫ్ ఆపరేషన్‌లో 250 మందికిపైగా ఉగ్రవాదులు చనిపోయారని ఆయన తేల్చేశారు. వైమానిక దాడుల్లో ఎంతమంది చనిపోయారో అధికారికంగా తెలుపాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్చేస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ అధ్యక్షుడైన అమిత్ షా అధికారికంగా ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘ఉడీ ఉగ్రవాద దాడి అనంతరం మన బలగాలు పాకిస్థాన్ వెళ్లి సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించాయి. మన జవాన్ల మృతికి సైన్యం ప్రతికారం తీర్చుకుంది. పూల్వామా దాడి తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించకపోవచ్చునని అందరూ భావించారు. కానీ, ఏం జరిగింది? ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో 13 రోజులకే మన ప్రభుత్వం వైమానిక దాడులు నిర్వహించి 250మందికిపైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది’ అని అహ్మదాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా ప్రకటించారు. -
పాక్ ఉగ్రవాదాన్ని వ్యతిరేకించాల్సిందే : బ్రిటన్
లండన్ : పాక్ ఉగ్రవాద సంస్థల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిదేనంటూ బ్రిటన్ ప్రధాని థెరిసా మే సూచించారు. పుల్వామా ఉగ్ర దాడులు - మెరుపు దాడుల ఫలితంగా భారత్ - పాక్‌ల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో థెరిసా, ఆదివారం ఇమ్రాన్ ఖాన్‌తో మాట్లాడారు. ఈ విషయం గురించి బ్రిటన్ ప్రధాని కార్యలయ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘ప్రధాని థెరిసా మే పాక్ పీఎం ఇమ్రాన్ ఖాన్‌తో మాట్లాడారు. భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను విడుదల చేయడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులను చక్కదిద్దేందుకు పాక్ ప్రధాని చూపిన చొరవను థెరిసా స్వాగతించారు. అంతేకాక ఉగ్రవాద సంస్థల పట్ల పాక్ కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు అంతర్జాతీయంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని.. పాక్ కూడా ఇందుకు మద్దతు ఇవ్వాలని థెరిసా, ఇమ్రాన్ ఖాన్‌కు తెలిపారన్నా’రు. పుల్వామా ఉగ్ర దాడిలో 40 మంది జవాన్ల మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడికి కారణమైన జైషే మహ్మద్ ఉగ్ర సంస్థను యూకే 2001లోనే బ్యాన్ చేసింది. బాలాకోట్ మెరుపు దాడి అనంతరం థెరిసా మే పరిస్థితులను గమనిస్తున్నామని.. తాము ఇరు దేశాల అధ్యక్షులతో మాట్లాడుతున్నామని తెలిపారు. భారత్ - పాక్ దౌత్యపరమైన విధానాలతో ముందుకు వెళ్లి సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని థెరిసా కోరారు. (మసూద్ బతికేఉన్నాడు : పాక్ మీడియా) -
‘మెరుపు దాడులకు రాజకీయ మరక’
సాక్షి, న్యూఢిల్లీ : ఉగ్ర సంస్థ జైషే మహ్మద్‌పై భారత వైమానిక దాడులను బీజేపీ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని మాజీ కేంద్ర మంత్రి మనీష్ తివారీ ఆరోపించారు. మెరుపు దాడుల్లో 250 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని బీజేపీ చీఫ్ అమిత్ షా చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. మన యుద్ధవిమానాలు నిర్ధేశిత లక్ష్యాలను ఛేదించాయని, అయితే ఎంతమంది దాడుల్లో మరణించారని ఇప్పుడే వెల్లడించడం తొందరపాటు అవుతుందని వాయుసేన పేర్కొంది. వాయుసేన వివరణను ప్రస్తావిస్తూ అమిత్ షా ప్రకటనను మనీష్ తివారీ తప్పుపట్టారు. అమిత్ షా వ్యాఖ్యలు మెరుపుదాడులను రాజకీయం చేయడం కాదా అని ఆయన నిలదీశారు. వాయుసేన ప్రకటనకు భిన్నంగా 250 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని చెప్పడం రాజకీయ ప్రయోజనాలతో ముడిపెట్టడమేనని అన్నారు. మరోవైపు బాలాకోట్‌లో ఉగ్రవాదుల మరణంపై ఎలాంటి ఆధారాలు లేవని విదేశీ మీడియా కథనాలు ప్రచురించిందని మరో కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్ ప్రస్తావించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదాన్ని రాజకీయాలతో ముడిపెట్టడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా పీఓకేలో భారత్ చేపట్టిన వైమానిక దాడుల్లో 300 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని పాలక బీజేపీ శ్రేణులే ప్రచారంలో పెట్టాయని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరం వ్యాఖ్యానించారు. బాధ్యతకలిగిన పౌరుడిగా, ప్రభుత్వం వెల్లడించే సమాచారాన్ని తాను విశ్వసిస్తానని,అయితే ప్రపంచాన్ని మనం నమ్మించాలంటే విపక్షాలను నిందించడం మానేసి ఆ దిశగా చర్యలు చేపట్టాలని హితవు పలుకుతూ చిదంబరం ట్వీట్ చేశారు. -
అరుదైన ఘనత సాధించిన అభినందన్
న్యూఢిల్లీ : పాక్ చెర నుంచి విడుదలైన భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ప్రస్తుతం నేషనల్ హీరోగా నీరాజనాలందుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సంతోష సమయంలో అభినందన్ పేరిట మరో అరుదైన రికార్డు నమోదయ్యింది. పాకిస్తాన్ ఎఫ్-16 విమానాన్ని నేల కూల్చిన తొలి ఐఏఎఫ్ కంబాట్ పైలట్‌గా అభినందన్ అరుదైన ఘనత సాధించారు. ఈ విషయాన్ని స్వయంగా ఎయిర్ చీఫ్ మార్షల్ ఎస్ కృష్ణస్వామి అయ్యర్ తెలిపారు. ఎఫ్-16 విమానాన్ని కూల్చడం సాహసోపేతమైన చర్య అని ఆయన కితాబునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘మిగ్-21 బైసన్ అత్యాధునిక ఫైటర్ జెట్టే అయినా.. ఎఫ్-16కు ఇది సాటిరాదు. ఎఫ్-16కు ఎయిర్ సుపీరియారిటీ ఫైటర్‌గా పేరుంది. అయితే మిగ్-21 బైసన్ నడిపే పైలట్లు తమ నైపుణ్యం పెంచుకునేందుకు అప్పుడప్పుడూ మిరాజ్ - 2000, మిత్ర దేశాల ఎఫ్-16 విమానాలతో శిక్షణ పొందుతుంటారు. అలా అభినందన్ పొందిన శిక్షణ ఎఫ్-16ను కూల్చేందుకు పనికొచ్చింది. క్షణాల్లో జరిగిపోయే గగనతల యుద్ధ సమయంలో ప్రత్యర్థి కంటే వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఇటువంటి సమయంలో మన పైలట్లు ఎల్వోసీ దాటి వెళ్లిపోయే ప్రమాదమూ ఉంటుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అభినందన్.. ఎఫ్-16 జెట్‌ను కూల్చడం సాధారణ విషయమేం’ కాదని ఆయన ప్రశంసించారు. అంతేకాక ‘పాకిస్థాన్ ఎఫ్-16 విమానాల్ని పెద్ద సంఖ్యలో అమెరికా నుంచి కొన్నది. ఐఏఎఫ్ కూడా ఎప్పట్నుంచో 100 అత్యాధునిక యుద్ధ విమానాలు కావాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ వస్తోంది. కానీ, ఇప్పటికీ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం జరగలేదు. ప్రభుత్వాల అలసత్వంతో రక్షణ శాఖ సామాగ్రి కొనుగోలుకు చాలా ఆలస్యం అవుతోంది. అంతేకాక ఐఏఎఫ్ రెండు దశాబ్దాలుగా ఎస్‌యూ - 30 ఎమ్కేఐలను వినియోగిస్తుంది. వీటిని కూడా ఆధునికీకరించడం అవసరం. కానీ ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుని, అమల్లోకి రావడానికి పుష్కర కాలం పడుతుంది. అంతేకాక బడ్జెట్లో కూడా రక్షణ రంగానికి చాలా నామమాత్రంగానే కేటాయిస్తారు. ఈ అరకొర నిధులతో కొత్తవి కొనలేం. పాతవాటిని కూడా పూర్తిగా అప్‌గ్రేడ్ చేయలేం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం ఒకరిపై మరొకరు నిందలు వేసుకునే సమయం కాదని తెలిపారు. రక్షణ వ్యవస్థల్ని ఆధునికీకరించాలని కోరారు. పాక్ విమానాన్ని అభినందన్ నేలకూల్చాడిలా..! సరిహద్దుకు అటూ.. ఇటూ.. -
భారత్, పాక్ ప్రధానులకు విజ్ఞప్తి
న్యూఢిల్లీ: పరిస్థితి చేయి దాటి యుద్ధం రాక ముందే భారత్, పాకిస్తాన్‌లు ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని కోరుతూ 59 మంది నోబెల్ పురస్కార గ్రహీతలు ఇరు దేశాల ప్రధాన మంత్రులను కోరారు. నోబెల్ శాంతి బహుమతి పొందిన భారతీయుడు కైలాశ్ సత్యార్థి స్థాపించిన ‘లారెట్స్ అండ్ లీడర్స్ ఫర్ చిల్డ్రన్’ అనే సంస్థ ఈ మేరకు ఐక్యరాజ్య సమితిలో ఇరు దేశాల శాశ్వత ప్రతినిధులకు శనివారం లేఖలను అందించింది. ఆ లేఖలపై మలాలా యూసఫ్‌జాయ్, మహ్మద్ యూనస్, లీమాహ్ జిబోవీ, షిరిన్ ఎబడి, తవక్కోల్ కర్మాన్ తదితర నోబెల్ గ్రహీతలు సంతకాలు చేశారు. (మానసికంగా వేధించారు) ‘మన బిడ్డల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తెలివైన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించాలి. యుద్ధం రాకుండా ఉండేందుకు ఈ కీలక సమయంలో సంయమనం పాటించాలి. నాగరిక ప్రపంచంలో హింస, తీవ్రవాదం, ఉగ్రవాదాలకు తావు లేదు. ఈ అంటువ్యాధులను గట్టి చర్యల ద్వారా వేళ్లతోసహా పెకలించాలి’ అని ఆ లేఖల్లో నోబెల్ గ్రహీతలు పేర్కొన్నారు. (‘బాలాకోట్’ దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది) -
అభినందన్ వెన్నెముకకు గాయం
న్యూఢిల్లీ: పాకిస్తాన్ చెర నుంచి విడుదలైన భారత వాయుసేన(ఐఏఎఫ్) వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌కు వెన్నెముక కింది భాగంలో గాయమైనట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అలాగే పాకిస్తాన్లో అల్లరిమూకలు చేసిన దాడిలో అభినందన్ పక్కటెముక ఒకటి దెబ్బతిందని వెల్లడించాయి. ఎంఆర్ఐ స్కాన్‌లో ఆయన శరీరంలో ఎలాంటి బగ్స్(సూక్ష్మ నిఘా పరికరాలు) లేనట్లు తేలిందని పేర్కొన్నాయి. ఢిల్లీ కంటోన్మెంట్‌లోని రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆసుపత్రిలో అభినందన్‌కు చికిత్స కొనసాగుతోంది. భారత భూభాగంలోకి ప్రవేశించిన పాక్ ఎఫ్–16 యుద్ధ విమానాన్ని తన మిగ్–21 ద్వారా అభినందన్ కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తన విమానం కూడా దెబ్బతినడంతో పారాచూట్‌తో అభినందన్ ఎజెక్ట్ అయ్యారు. విమానం నుంచి బయటకొచ్చే క్రమంలోనే ఆయన వెన్నెముకకు గాయమై ఉంటుందని భావిస్తున్నారు. అభినందన్ ఆరోగ్యస్థితిని అంచనా వేసే ‘కూలింగ్ డౌన్’ ప్రక్రియలో భాగంగా మరిన్ని పరీక్షలు చేయనున్నారు. కొనసాగుతున్న విచారణ.. పైలట్ అభినందన్‌ను ఆదివారం భద్రతాసంస్థల ఉన్నతాధికారులు విచారించారు. పాక్ ఆర్మీకి చిక్కాక ఐఏఎఫ్ రహస్యాలను ఏమైనా బయటపెట్టారా? అనే కోణంలో ఈ విచారణ సాగుతోంది. ఈ విచారణ మరికొన్ని రోజులు కొనసాగవచ్చని అధికారులు వెల్లడించారు. వీలైనంత త్వరగా తిరిగి కాక్‌పిట్‌లో కూర్చునేందుకు అభినందన్ ఆత్రుతగా, ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారన్నారు. ఎఫ్–16 యుద్ధ విమానాన్ని కుప్పకూల్చిన తొలి భారత పైలట్‌గా అభినందన్ చరిత్ర సృష్టించారన్నారు. ‘మహవీర్ అహింసా పురస్కారం’.. అభినందన్‌కు ‘భగవాన్ మహవీర్ అహింసా పురస్కారం’ను అందజేస్తామని అఖిల భారతీయ దిగంబర్ జైన్ మహాసమితి ప్రకటించింది. ఈ పురస్కారాన్ని అందుకోబోతున్న తొలి వ్యక్తి అభినందనేనని సమితి చైర్మన్ మందిరా జైన్ తెలిపారు. త్వరలో బెంగళూరుకు.. సాక్షి, బెంగళూరు: భారత పైలట్ అభినందన్ వర్ధమాన్ త్వరలో బెంగళూరుకు రానున్నట్లు ఐఏఎఫ్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. యుద్ధవిమానాలు నడిపేందుకు అభినందన్ ఫిట్‌గా ఉన్నారా? లేదా? తెలుసుకునేందుకు బెంగళూరులోని హెచ్ఏఎల్లో ఉండే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్లో సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ పరీక్షల్లో ఫిట్నెస్ చాటుకుంటే మళ్లీ యుద్ధవిమానాలు నడిపేందుకు అభినందన్‌ను అనుమతిస్తామని పేర్కొన్నారు. -
ఉగ్ర మసూద్ మృతి?
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: పేరుమోసిన ఉగ్రవాది, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధిపతి మసూద్ అజార్ (50) పాకిస్తాన్లో చనిపోయినట్లుగా మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో ఆదివారం వార్తలు వచ్చాయి. ఈ వార్తలు నిజమో కాదో కనుగొనేందుకు నిఘా వర్గాలు ప్రయత్నిస్తున్నాయని భారత అధికారులు చెప్పారు. అయితే మసూద్ చనిపోయాడంటూ వచ్చిన వార్తలు అవాస్తవమని పాకిస్తాన్‌కు చెందిన జియో ఉర్దూ న్యూస్ ఆ వార్తలను కొట్టిపారేసింది. మసూద్ బతికే ఉన్నాడన్న విషయాన్ని అతని కుటుంబానికి సన్నిహితుల ద్వారా తాము తెలుసుకున్నామంది. మరోవైపు ఇప్పటివరకు దీనిపై పాకిస్తాన్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన, సమాచారం లేదు. మూత్రపిండాల వైఫల్యం కారణంగా మసూద్ అజార్ ఇస్లామాబాద్‌లోని సైనిక వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడన్న సమాచారం మాత్రమే తమకు ప్రస్తుతానికి తెలుసుననీ, అంతకు మించి వివరాలు లేవని అధికారులు అంటున్నారు. 2001లో భారత పార్లమెంటుపై దాడి, ఆ తర్వాతి కాలంలో జమ్మూ కశ్మీర్ శాసనసభపై ఆత్మాహుతి దాడి, 2016లో పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడి, తాజాగా పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై దాడి తదితర కీలక కేసుల్లో మసూద్ అజార్ సూత్రధారి అన్న ఆరోపణలు ఉన్నాయి. మసూద్ అజార్ తమ దేశంలోనే ఉన్నాడనీ, అయితే అతను తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడని పాక్ విదేశాంగ శాఖ మంత్రి షా ముహ్మద్ ఖురేషీ ఇటీవల సీఎన్ఎన్ ఇంటర్వ్యూలో ఒప్పుకున్నారు. అయితే భారత్ గట్టి ఆధారాలను సమర్పిస్తే తప్ప ఉగ్రవాద దాడుల విషయంలో మసూద్‌పై చర్యలు తీసుకోలేమని స్పష్టం చేశారు. కాగా, పుల్వామా దాడిలో జైషే మహ్మద్ కుట్రను వివరిస్తూ భారత్ ఒక ఫైల్‌ను కూడా ఇటీవలే పాకిస్తాన్‌కు అప్పగించి, ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన మాట నిలుపుకోవాలని సవాల్ చేసింది. 1999లో భారత్ నుంచి విడుదల మసూద్ అజార్ 1968లో పాకిస్తాన్ పంజాబ్‌లోని బహవాల్పూర్లో జన్మించాడు. తొలుత పోర్చుగీస్ పాస్‌పోర్టు మీద అతను జమ్మూ కశ్మీర్లోకి ప్రవేశించి అనేక ఉగ్రవాద సంస్థలు, బృందాలతో పరిచయాలు ఏర్పరచుకున్నాడు. ఉగ్రవాదం ఆరోపణలపై 1994లో భారత అధికారులు అతణ్ని అరెస్టు చేయగా, ‘మీరు నన్ను ఎక్కువ రోజులు లోపల ఉంచలేరు’ అని జైలు సిబ్బందితో అనేవాడని చెబుతారు. జైలు నుంచి పారిపోయేందుకు తోటి ఉగ్రవాదులతో కలిసి సొరంగం తవ్వాడనీ, అందులో ఇరుక్కుపోవడంతో ఆ ప్రయత్నం విఫలమైందని ఓ అధికారి చెప్పినట్లు ఏఎఫ్‌పీ పేర్కొంది. అతను 1999 వరకు జైలులోనే ఉన్నాడు. ఆ ఏడాది కఠ్మాండు నుంచి ఢిల్లీ వస్తున్న, ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసి, కాందహార్‌కు తరలించారు. అందులోని ప్రయాణికులను విడిపించడం కోసం మసూద్ అజార్‌తోపాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను జైలు నుంచి భారత్ విడుదల చేసింది. ఆ హైజాకర్లలో మసూద్ అజార్ తమ్ముడు ఇబ్రహీం అథార్ కూడా ఉన్నాడని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మసూద్ అజార్ 2000 ఏడాదిలో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. అల్కాయిదాచీఫ్ ఒసామా బిన్ లాడెన్, తాలిబన్‌ను స్థాపించిన ముల్లా మహ్మద్ ఒమర్‌లను మసూద్ అఫ్గానిస్తాన్‌లో కలిశాడని అమీర్ రాణా అనే భద్రత విషయాల విశ్లేషకుడు చెప్పారు. 2001లో భారత పార్లమెంటుపై దాడి కేసులో అజార్‌ను పాక్ గృహనిర్బంధంలో ఉంచింది. ఈ కేసులో ఆధారాల్లేవంటూ లాహోర్ కోర్టు తీర్పునివ్వడంతో 2002లో విడుదలయ్యాడు. 2016లో ఉడీ సైనిక శిబిరంపై దాడి అనంతరం కూడా మసూద్‌ను పాక్ కస్టడీలోకి తీసుకున్నప్పటికీ నేరారోపణలేవీ మోపలేదు. గతేడాది జూలైలో అతను గుర్తు తెలియని ప్రదేశం నుంచి ఫోన్ ద్వారా పీవోకేలోని ముజఫరాబాద్‌లో మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తర్వాత నుంచి అతని జాడ లేదు. త్వరలో మసూద్‌పై పాక్ చర్యలు భారత్‌తో ఉద్రిక్తతలను తగ్గించడం కోసం మసూద్‌పై చర్యలు తీసుకునేందుకు పాకిస్తాన్ నిర్ణయించిందని ఆ దేశ ప్రభుత్వంలోని ఓ ఉన్నతాధికారి చెప్పారు. మరోవైపు మసూద్‌పై ఐక్యరాజ్య సమితి ‘ప్రపంచ ఉగ్రవాది’ అని ముద్ర వేసే విషయంలో తరచూ అడ్డు చెబుతున్న పాక్.. ఈసారి అందుకు వ్యతిరేకత తెలపకపోవచ్చని ఆ దేశంలోని ఓ మీడియా సంస్థ పేర్కొంది. భారత్, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తదితర దేశాలు మసూద్ అజార్‌పై ఐరాస చేత ఉగ్రవాదిగా ముద్ర వేయించేందుకు ప్రయత్నిస్తున్నా ఇన్నాళ్లూ చైనా అడ్డుతగులుతుండటం తెలిసిందే. మసూద్ స్థాపించిన జైషే మహ్మద్‌ను ఐక్యరాజ్య సమితి ఇప్పటికే నిషేధించింది. మసూద్‌పై కూడా ఉగ్రవాదిగా ముద్ర వేయించేందుకు మరోసారి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు భద్రతా మండలిలో గత బుధవారం ప్రతిపాదించాయి. -
జైషే మహమ్మద్ ఉగ్రసంస్థ చీఫ్ మసూద్ అజర్ మృతి?
-
అభినందన్ శరీరంలో ఎలాంటి బగ్స్ లేవు
న్యూఢిల్లీ: దాయాది పాకిస్తాన్ చెర నుంచి మాతృ దేశంలో అడుగుపెట్టిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌కు ఆదివారం మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఢిల్లీలోని ఎయిర్‌ఫోర్స్ సెంట్రల్ మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ వైద్యులు ఆయనకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేపడుతున్నారు. కూలింగ్ డౌన్ విధానంలో భాగంగా ఆయన మానసిక, శారీరక ఆరోగ్య స్థితిగతులను అధికారులు సమీక్షిస్తున్నారు. అతనికి ఎంఆర్ఐ స్కాన్ చేపట్టిన వైద్యులు.. వెన్నుముక్క కింది భాగంలో గాయమైనట్టు గుర్తించారు. అలాగే అభినందన్ శరీరంలో ఎటాంటి బగ్స్‌ను వైద్యులు గుర్తించలేదు. అతనికి మరో పది రోజుల పాటు మరిన్ని మెరుగైన వైద్య పరీక్షల చేపట్టనున్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. శనివారం రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. అభినందన్‌ను కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పాక్ చెరలో అనుభవాల్ని ఆయన మంత్రితో పంచుకున్నారు. అభినందన్‌కు ఆరోగ్య పరీక్షలు ముగిసిన తరువాత పాకిస్తాన్ నిర్భంధంలో ఎదుర్కొన్న పరిస్థితులపై అధికారులు ఆయనను విచారిస్తారు. -
జైషే చీఫ్ మసూద్ మృతి?
సాక్షి, న్యూఢిల్లీ : జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ మరణించినట్టు వార్తలు వెలువడ్డాయి. పీఓకేలోని జైషే స్ధావరాలపై భారత్ ఇటీవల చేపట్టిన వైమానిక దాడుల్లో తీవ్రంగా గాయపడిన మసూద్ అజర్ మరణించాడని పాకిస్తాన్లో స్థానిక మీడియా వెల్లడించింది. శనివారం మసూద్ మరణించినట్లు ప్రచారం సాగుతోంది. కాగా, మసూద్ మృతిని పాకిస్తాన్ అధికారికంగా ధృవీకరించలేదు. గత కొన్ని నెలలుగా కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతున్న మసూద్ పాక్ ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. మసూద్ అనారోగ్యంతో ఇంటికే పరిమితమయ్యారని పాక్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషి సైతం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మసూద్ పాకిస్తాన్‌లోనే ఉన్నాడని ఆయన నిర్ధారించినట్లయ్యింది. తమ భూభాగంలోనే మసూద్ ఉన్నాడని పాకిస్తాన్ అంగీకరించడం అదే తొలిసారి కావడం గమనార్హం. కాగా, మసూద్ అజర్ మృతి వార్తలపై ఇంకా స్పష్టత రాలేదు. ఇది పాకిస్తాన్ ప్రణాళికలో భాగమా.. లేక నిజంగానే మసూద్ మరణించాడా అనేది తేలాల్సి ఉంది. మసూద్ అజర్‌ను తమకు అప్పగించాలంటూ భారత్ ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో అతను మృతి చెందాడనే వార్త అనేక అనుమానాలకు తావిస్తోంది. (ఇక్కడ చదవండి: ‘జైషే క్యాంపులపై సర్జికల్ స్ట్రైక్స్ నిజమే’) -
సర్జికల్ స్ట్రైక్స్‌పై మసూద్ సోదరుడి ఆడియో..!
-
ఆమె జై హింద్ అంది, తీసేయండి : పాక్
ఇస్లామాబాద్ : పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా ఉగ్రవాద శిభిరాలే లక్ష్యంగా భారత వాయుసేన జరిపిన మెరుపు దాడులను కొనియాడుతూ ‘జై హింద్’ అని ట్వీట్ చేసిన బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రాపై దాయాదీ దేశం ఆగ్రహంగా ఉంది. ఆర్మీ వైద్యులైన డాక్టర్ అశోక్ చోప్రా, మధు చోప్రాల కూతురైన ప్రియాంక కూడా భారత వాయుసేన మెరుపు దాడులను కొనియాడుతూ తన దేశంపై ఉన్న ప్రేమను చాటుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన పాకిస్తానీయులు ఆమెను వెంటనే యునిసెఫ్ ప్రచారకర్తగా తొలిగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆమె కామెంట్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆన్లైన్లో ఓ పిటషన్ కూడా దాఖలు చేశారు. ఇరుదేశాల మధ్య యుద్దాన్ని తలపించే ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో శాంతిని కోరుకోవాల్సిన యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్ ప్రియాంక.. ఇలా ఒక దేశానికి మద్దతుగా ఎలా మాట్లాడుతుందని ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంలో తటస్థంగానన్న ఉండాలి.. కానీ భారత వాయుసేనను యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్ కొనియాడుతారని, ఆమె యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా అనర్హురాలన్నారు. ఇక ఈ పిటిషన్ వేల సంతకాలు చేయగా.. దానిలో పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన 40 మంది భారత జవాన్ల విషయాన్ని ప్రస్తావించలేదు. -
సర్జికల్ స్ట్రైక్స్‌పై మసూద్ సోదరుడి ఆడియో..!
న్యూఢిల్లీ : భారత సర్జికల్ దాడులతో ఎలాంటి నష్టం జరుగలేదని పాకిస్తాన్ చెప్తున్న మాటలు తప్పని రుజువయ్యాయి. తమపై ఐఏఎఫ్ మెరుపుదాడులు చేసింది నిజమేనని జైషే చీఫ్ మసూద్ అజార్ తమ్ముడు మౌలానా అమర్ వెల్లడించారు. సర్జికల్ స్ట్రైక్స్ జరిగిన మరుసటి రోజున జైషే సీనియర్లతో జరిగిన సమావేశంలో అమర్ మాట్లాడినట్టు ఓ ఆడియో షోషల్ మీడియా చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం.. ‘బాలాకోట్‌లోని జైషే క్యాంపులపై వైమానిక దాడులు జరిగింది నిజమే. అయితే, మార్కజ్ (జిహాద్ బోధనా కేంద్రం)పై మాత్రమే దాడులు జరిగాయి. భారత్ చెప్తున్నట్టు జైషే కీలక స్థావరాలకు ఎలాంటి నష్టం జరగలేదు. మా భూభాగంలోకి వచ్చి మరీ జిహాద్ బోధనా కేంద్రంపై భారత్ దాడులకు దిగడం తీవ్ర వేదనకు గురిచేసింది. దీంతో ప్రతీకారానికి భారత్ మంచి అవకాశం ఇచ్చింది. మాపై దాడి చేసి యుద్ధానికి కాలు దువ్వింది’ అని వ్యాఖ్యానించాడు. (మసూద్‌కు సైనిక ఆస్పత్రిలో చికిత్స) భారీ స్థాయిలో మృతులు.. కశ్మీర్‌ను రక్షించుకునేందుకు జిహాద్ శిక్షణ పొందుతున్న వారిపై ఐఏఎఫ్ బాంబులతో విరుచుకుపడిందని అమర్ తెలిపారు. తద్వారా కశ్మీర్‌లోని ముస్లింలకు భారత్ మరింత కోపం తెప్పించిందని పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. మిరాజ్ జెట్ ఫైటర్స్ దాడుల్లో ‘జబా టాప్’ అనే కొండ ప్రాంతంలో చాలా మంది మరణించినట్టు వార్తలు వచ్చాయి. అక్కడ పడి ఉన్న దాదాపు 30 శవాలను తరలించేందుకు అంబులెన్సులు వచ్చాయని స్థానికులు చెప్తున్నారు. ఉగ్రవాద శిక్షణనిస్తున్న మాజీ ఐఎస్ఐ అధికారి, కల్నల్ సలీం కూడా ఈ దాడుల్లో మరణించినట్టు సమాచారం. (సరిహద్దుకు అటూ.. ఇటూ..) -
హృదయాలను కదిలించిన ‘సిపాయికా మా’
-
రఫేల్ ఉంటే ఫలితం మరోలా ఉండేది
న్యూఢిల్లీ: భారత్ దగ్గర రఫేల్ ఫైటర్జెట్లు ఉండుంటే ఇటీవల పాకిస్తాన్‌తో తలెత్తిన ఘర్షణల ఫలితం మరోలా ఉండేదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రస్తుతం రఫేల్ యుద్ధవిమానాలు లేనిలోటు స్పష్టంగా తెలుస్తోందని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్‌లోని జైషే ఉగ్రస్థావరాలపై దాడి సందర్భంగా ప్రపంచమంతా భారత్ కు మద్దతు పలికితే, దేశంలోని కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం ఈ దాడుల యధార్థతను ప్రశ్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కొందరు వ్యక్తుల స్వార్థ ప్రయోజనాలకు తోడు ప్రస్తుతం రఫేల్ ఒప్పందంపై జరుగుతున్న రాజకీయాలతో దేశం ఇప్పటికే చాలా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీపై ఉన్న విద్వేషం హఫీజ్ సయీద్, మసూద్ అజహర్ లాంటి ఉగ్రవాదులకు లబ్ధిచేకూర్చరాదని హితవు పలికారు. ప్రబుత్వ విధానాల్లోని లోపాలపై ప్రతిపక్షాలు విమర్శిస్తే స్వాగతిస్తామనీ, అయితే దేశభద్రతకు సంబంధించిన విషయాల్లో అడ్డంకులు కల్పించవద్దని సూచించారు. ఢిల్లీలో శనివారం జరిగిన ‘ఇండియాటుడే కాన్క్లేవ్ 2019’లో మాట్లాడిన ప్రధాని మోదీ, విపక్షాల తీరును తీవ్రంగా ఎండగట్టారు. భయం మంచిదే.. భారత్ ఐక్యతను చూసి ఇంటాబయటా చాలామంది భయపడుతున్నారని ప్రధాని అన్నారు. ‘భారత వ్యతిరేక శక్తులు, రుణఎగవేతదారులు, అవినీతిపరులు, కొందరు పెద్దనేతలకు ఇప్పుడు భయం కనిపిస్తోంది. జైలుకు పోతామేమో అని వారంతా భయపడుతున్నారు. నిజానికి భయం మంచిదే. ఎందుకంటే 2009లో తమకు 1.86 లక్షల బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు కావాలని భద్రతాబలగాలు కోరాయి. కానీ 2009–14 మధ్యకాలంలో ఒక్కటంటే ఒక్క బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్‌ను కూడా బలగాలకు అందించలేకపోయారు. ఎన్డీయే ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2.30 లక్షల బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లను అందించాం. మా ప్రభుత్వ హయాంలో మధ్యవర్తులు పత్తా లేకుండా పోయారు. ఎందుకంటే మేం అవినీతిని ఎంతమాత్రం సహించబోమని వారికి తెలుసు’ అని మోదీ వెల్లడించారు. నామీద చాలా అనుమానాలు ఉండేవి.. మోదీ లాంటి నేతలు వస్తూపోతూ ఉంటారనీ, దేశం మాత్రం శాశ్వతంగా ఉంటుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ‘మోదీపై విమర్శలదాడి చేసేక్రమంలో వీళ్లు(ప్రతిపక్షాలు) దేశ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారు. మోదీపై మీ ద్వేషం హఫీజ్ సయీద్, మసూద్ అజహర్ వంటి ఉగ్రవాదులకు లబ్ధిచేకూర్చేలా మారకూడదు. మన సాయుధ బలగాలు ఏం చెబుతున్నాయో మీరు వినరా? లేదా మాకంటే మీరు శత్రువులనే ఎక్కువగా నమ్ముతున్నారా?’ అని ప్రధాని విపక్షాలను నిలదీశారు. 2014లో ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు తన పై ప్రజలకు చాలా అనుమానాలు ఉండేవని మోదీ గుర్తుచేశారు. ‘అప్పటివరకూ సీఎంగా మాత్రమే ఉన్న నేను ప్రధానిగా ఏ చేస్తానో, విదేశీ విధానం ఏమవుతుందో అని ప్రజలకు అనుమానం ఉండేది. అది మామూలే. ఎందు కంటే నా కుటుంబానికి రాజకీయ నేపథ్యమేదీ లేదు. అలాగే నా ఇంట్లో ఆరుగురు అధికారం వెలగబెట్టలేదు’ అని మోదీ చెప్పగానే సభికులు హర్షధ్వానాలు చేశారు. ప్రజల అంచనాలు అందుకోవడంలో సఫలమయ్యాననే తాను భావిస్తున్నట్లు మోదీ తెలిపారు. 21వ శతాబ్దం భారత్‌దేనని ప్రధాని స్పష్టం చేశారు. -
సరిహద్దుకు అటూ.. ఇటూ..
శత్రు దేశానికి చిక్కినా ప్రాణాలతో తిరిగొచ్చిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్‌కు యావత్ జాతి జేజేలు పలుకుతోంది. సరిగ్గా ఇదే సమయంలో పాకిస్తాన్లో ఒక పైలట్ కుటుంబం తమ కొడుకు చేసిన త్యాగాన్ని బయటకు చెప్పుకోలేక, బడబాగ్నిలాంటి నిజాన్ని మనసులో దాచుకోనూలేక మౌనంగా రోదిస్తోంది. ఇద్దరూ పైలెట్లే. ఇద్దరి కుటుంబ నేపథ్యం ఒక్కటే. ఇద్దరూ ఆగ్రహావేశాలతో ఊగిపోయే అల్లరిమూక చేతికి చిక్కారు. కానీ ఒకరి కథ సుఖాంతం. మరొకరిది అంతులేని విషాదం. పాకిస్తాన్ వాయుసేన భారత సైనిక స్థావరాలపై దాడికి దిగినప్పుడు ఒక ఎఫ్16 యుద్ధ విమానాన్ని షాహాజుద్దీన్ అనే పైలట్ నడుపుతున్నారు. ఆ విమానాన్ని మన సైనికులు కూల్చేశారు. ఆఖరి నిమిషంలో ప్రాణాలు కాపాడుకోవడానికి ఆయన పారాచూట్ సాయంతో పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లోని నౌషెరా సెక్టార్లో దిగారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో పీవోకే యువతలో భావోద్వేగాలు తారాస్థాయికి చేరుకున్నాయి. పారాచూట్ నుంచి కిందకి దిగుతున్న షాహాజుద్దీన్‌ను చూసి లామ్వ్యాలీ గ్రామంలో అల్లరిమూక భారత పైలట్ అని పొరపడింది. చుట్టుముట్టి విచక్షణారహితంగా దాడిచేయడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. అభినందన్ వర్ధమాన్ కూడా అల్లరిమూకకు చిక్కినప్పటికీ పాక్ ఆర్మీ ఆయన్ను కాపాడగలిగింది. ఇద్దరిదీ ఒకటే కథ అభినందన్ వర్థమాన్, షాహాజుద్దీన్‌ది ఇంచుమించుగా ఒక్కటే కథ. అభినందన్ తండ్రి సింహకుట్టి వర్ధమాన్ మాజీ ఎయిర్‌మార్షల్ కాగా, షాహాజుద్దీన్ తండ్రి వసీముద్దీన్ కూడా పాకిస్తాన్ వైమానిక దళంలో ఎయిర్మార్షలే. ఎఫ్–16, మిరాజ్ విమానాలను నడపడంలో ఆయన దిట్ట. ఆ ఇద్దరి పైలెట్ల కుమారులు తమ కర్తవ్యాన్ని నిర్వహించడానికి, తమ దేశాల రక్షణ కోసం యుద్ధవిమానాల్లో గగనతలంలో ఒకరితో మరొకరు తలపడ్డారు. కానీ ఆ యుద్ధంలో ఒకరు వీరుడై తిరిగొచ్చి కోట్లాది గుండెల్లో విజేతగా నిలిస్తే, మరొకరు తోటి పాకిస్తానీల చేతుల్లోనే ప్రాణాలు పోగొట్టుకుని కోట్లాది గుండెల్లో విషాదాన్ని నింపేశారు. పాక్వి ఎప్పుడూ కట్టుకథలే యుద్ధ సమయాల్లో నిజాలు చెప్పే చరిత్ర పాక్‌కి లేనేలేదు. 1965 యుద్ధం, 1971 యుద్ధం, కార్గిల్ ఇలా అన్ని సమయల్లో కట్టు కథలే చెప్పింది. ఈసారి కూడా తమ సొంత పైలట్ విషయంలోనూ సరైన సమాచారం లేక మొదట నోరుజారింది. పాక్ మిలటరీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ గఫూర్ ఫిబ్రవరి 28న ఇద్దరు భారతీయ పైలెట్లను పట్టుకున్నామన్నారు. ఒకరు ఆర్మీ కస్టడీలో ఉన్నారని, మరొకరు ఆస్పత్రిలో ఉన్నారని చెప్పారు. ఆ తర్వాత మాట మార్చి ఒక్కరే తమ చేతికి చిక్కారని వెల్లడించారు. ఆ రెండో పైలట్ ఎక్కడున్నారన్న ప్రశ్నలు తలెత్తాయి. అయితే ఈ విషయం లండన్‌కి చెందిన లాయర్ ఖలిద్ ఉమర్ ద్వారా వెలుగులోకి వచ్చింది. అల్లరి మూక చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన పాక్ పైలట్ షాహజుద్దీన్ ఉమర్‌కు బంధువు కావడంతో ఈ విషయం బయటకు పొక్కింది. -
పోయిన పాక్ పరువు
భారత్ వైమానిక దళం బాలాకోట్‌పై దాడి చేసిన దగ్గర నుంచి ఇంతవరకు జరిగిన పరిణామాలు పాకిస్తాన్‌కు కొన్ని గుణపాఠాలు నేర్పాయి. వాటిలో మొదటిది, పాక్ దగ్గరున్న అణుబాంబులను చూసి భారత్ భయపడబోదన్న వాస్తవం. భారత వైమానిక దళం పాకిస్తాన్ భూభాగంలోకి చొరబడి చేసిన దాడిపై పాకిస్తాన్ స్పందనను బట్టి రెండు ‘అణ్వస్త్ర’ దేశాల మధ్య యుద్ధం జరిగినా అణుబాంబులు బయటకు రావని, సంప్రదాయ యుద్ధమే జరుగుతుందని తేలింది. పాకిస్తాన్ ఇలాగే భారత్‌పై పరోక్ష యుద్ధం కొనసాగించే పక్షంలో అవసరమైతే పాక్ భూభాగంలోకి చొరబడైనా చర్య తీసుకునే అవకాశాన్ని భారత్‌కు ఇచ్చింది. ఇక రెండోది, పాకిస్తాన్ యుద్ధ విమానాలు భారత సరిహద్దులోపలి సైనిక కార్యాలయంపై దాడికి యత్నించడం, దానిని భారత్ తిప్పికొట్టడాన్ని బట్టి ఆత్మరక్షణకోసం భారత్ యుద్ధానికి కూడా వెనకాడదన్నది రెండో పాఠం. పరువు కాపాడుకోవడం కోసం ప్రతీకారానికి దిగి పాక్ పెద్ద తప్పు చేసింది. భారత సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకోవడం వల్ల ప్రతి చర్య తీసుకునే అవకాశాన్ని భారత్‌కు కల్పించింది. భారత సైనిక స్థావరంపై పాక్ దాడికి యత్నించడం పాక్ సైన్యానికి ఉగ్రవాదులకు ఉన్న బంధాన్ని ప్రపంచదేశాల ముందు ఎత్తి చూపింది. ఆర్థికంగా, దౌత్యపరంగా భారత్ పైచేయిగానే ఉందన్నది పాక్ తెలుసుకున్న మూడో పాఠం. బాలాకోట్ దాడి, అభినందన్‌ను పాక్ బందీగా పట్టుకోవడం విషయాల్లో అంతర్జాతీయ సమాజం ముక్తకంఠంతో భారత్‌కు మద్దతు పలికింది. భారతదేశం పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకుపోయినా దాన్నెవరూ తప్పుపట్టలేదు. ఆత్మరక్షణకు తీసుకున్న చర్యగా సమర్థించారు. అంతేకాకుండా పాకిస్తాన్ తనగడ్డమీద ఉగ్రవాదులను పోషిస్తోందంటూ ప్రపంచం నిందించింది. పాకిస్తాన్‌కు మంచి స్నేహితుడైన చైనా సంయమనం పాటించాలని అడిగిందే కానీ, భారత్ చర్యలను తప్పు పట్టలేదు. భారత్ ఆత్మరక్షణ హక్కును అమెరికా, ఫ్రాన్స్ సమర్థించాయి. పుల్వామా దాడిని ఖండించిన జపాన్, తీవ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని పాక్‌కు సూచించింది. ఆస్ట్రేలియా కూడా భారత్ వైఖరిని సమర్థించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి పాకిస్తాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. పాక్‌తో చెట్టాపట్టాలేసుకునే అరబ్ దేశాలు సైతం ఉద్రిక్తతల్ని పెంచవద్దని పాక్‌కు స్పష్టం చేయడంతో పాటు అభినందన్‌ను విడుదల చేయాలని ఒత్తిడి తెచ్చాయి. ఇమ్రాన్‌కు ఎదురు దెబ్బ అభినందన్‌తో పాక్ పరువు దక్కించుకోవడం నాలుగో విషయం. అభి సాయంతో భారత్‌ను దారికి తెద్దామన్న ఆలోచన ఫలించలేదు. అమెరికా, యూఏఈ, సౌదీల ఒత్తిడితో ఇమ్రాన్‌ఖాన్ శాంతిదూత అవతారం దాల్చి అభినందన్ విడుదలకు సిద్ధపడ్డాడు. అభినందన్ వ్యవహారంలో పాకిస్తాన్ అవివేకం బయటపడటం ఐదో విషయం. బందీగా ఉన్న అభినందన్‌తో తనను పొగిడించుకుంటూ పాక్ విడుదలచేసిన వీడియో జెనీవా నిబంధనలకు విరుద్ధం. ఈ ఘటనతో పాక్ అపరిపక్వత బయటపడి పరువు పూర్తిగా పోగొట్టుకుంది. -
ఎఫ్16 వాడకంపై అమెరికా గుర్రు
వాషింగ్టన్: ఎఫ్–16 యుద్ధ విమానం దుర్వినియోగానికి సంబంధించి మరింత సమాచారం ఇవ్వాల్సిందిగా పాకిస్తాన్‌ను అమెరికా కోరింది. ఎఫ్–16 విమానాలను తీవ్రవాద వ్యతిరేక పోరాటానికే ఉపయోగించాలని, ఇతర దేశాలపై దాడికి వాడరాదని అమెరికా షరతు విధించింది. దీన్ని ఉల్లంఘించి పాకిస్తాన్ ఎఫ్–16 విమానాన్ని భారత్‌పై దాడికి ఉపయోగించినట్టు అమెరికాకు తెలిసిందని ఆ దేశ విదేశాంగ శాఖ పేర్కొంది. ఎఫ్–16ను వాడలేదు.. భారత్‌పై దాడికి తాము ఎఫ్–16 విమానాలను ఉపయోగించలేదని పాకిస్తాన్ బుధవారం ప్రకటించింది. భారత్ తమ ఎఫ్–16 విమానాన్ని కూల్చివేసిందనడాన్ని కూడా ఖండించింది. అయితే, పాక్ ఆ విమానాలను వాడినట్టు భారత త్రివిధ దళాధిపతులు గురువారం నాటి సమావేశంలో ఆధారాలు సహా నిరూపించారు. పాకిస్తాన్ ఉపయోగించిన ఏఐఎం–120 క్షిపణి శకలాలను ఈ సమావేశంలో చూపించారు. ఈ క్షిపణులను ఎఫ్–16 విమానాల ద్వారా మాత్రమే ప్రయోగించగలరని, పాక్ వద్ద ఉన్న మరే విమానం దీన్ని ప్రయోగించలేదని భారత వైమానిక దళాధికారులు చెప్పారు. అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి ఈ విషయాలను ప్రస్తావిస్తూ దీనికి సంబంధించి మరిన్ని వివరాలను ఇవ్వాలని పాక్‌ను కోరామన్నారు. వివరాలు వెల్లడించలేం.. విదేశాలకు సంబంధించిన మిలటరీ కాంట్రాక్టుల్లోని ఒప్పందాలను బయటకు వెల్లడించరాదని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి అన్నారు. అందువల్ల ఎఫ్–16ల విషయంలో పాక్‌తో కుదుర్చుకున్న ఒప్పందంలోని అంశాలు వెల్లడించలేమన్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు పెద్ద ఎత్తున ఆయుధాలు విక్రయించే అమెరికా వాటి వినియోగానికి సంబంధించి కొనుగోలుదారులతో ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. ఆ ఒప్పందాలను ఉల్లంఘించడాన్ని ఆ దేశం తీవ్రంగా పరిగణిస్తుంది. పాక్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ఏమిటో అమెరికా చెప్పనప్పటికీ, దాదాపు 12 నిబంధనలు విధించినట్టు తెలుస్తోంది. ఎఫ్–16 విమానాలను పాకిస్తాన్ బయట ఉపయోగించాలన్నా.. సైనిక విన్యాసాల్లో వినియోగించాలన్నా, మూడో దేశంపై ప్రయోగించాలన్నా ముందుగా అమెరికా ప్రభుత్వం అనుమతి పొందాలని గతంలో ఆ దేశ హోం శాఖలో పనిచేసిన ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. తొలుత అభ్యంతరం.. షరతులతో విక్రయం.. ఒబామా సర్కార్ 2016లో పాకిస్తాన్‌కు ఎనిమిది ఎఫ్–16 విమానాలు విక్రయించాలని నిర్ణయించింది. అయితే, అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ వీటిని భారత్‌పైకి ప్రయోగిస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సభ్యుల ఒత్తిడితో ఒబామా ప్రభుత్వం తన నిర్ణయాన్ని పక్కన పెట్టేసింది. అప్పట్లో భారత ప్రభుత్వం కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. తర్వాత కొన్ని షరతులతో అమెరికా పాకిస్తాన్‌కు వీటిని విక్రయించింది. -
బాలాకోట్‌లో దాడులు నిజమే: అజర్ సోదరుడు
న్యూఢిల్లీ: భారత వైమానిక దళం(ఐఏఎఫ్) విమానాలు పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉన్న తమ శిక్షణ శిబిరాలపై దాడులు చేయడం వాస్తవమేనని జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజార్ సోదరుడు మౌలానా అమ్మార్ ధ్రువీకరించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. భారత యుద్ధ విమానాలు ఐఎస్ఐ, పాక్ సైన్యంపై కాకుండా బాలాకోట్‌లోని శిక్షణ శిబిరాలపై దాడులు జరిపాయని మౌలానా అమ్మార్ వెల్లడిస్తున్నట్లుగా అందులో ఉంది. అయితే, పాక్ సైన్యానికి పట్టుబడిన వింగ్ కమాండర్ అభినందన్‌ను విడిచిపెట్టినందుకు పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను అతడు విమర్శించాడు. ‘భారత విమానాలు బాంబులు వేసింది ఉగ్ర సంస్థల ప్రధాన కేంద్రంపైనో, కీలక నేతల సమావేశ ప్రాంతంపైనో కాదు.. జిహాద్ లక్ష్యాలపై తరగతులు నిర్వహించే కేంద్రంపైన బాంబులు వేశాయి’ అని వివరించాడు. ఐఏఎఫ్ దాడుల్లో పాక్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)కు చెందిన కల్నల్ సలీమ్ కరీ, జైషే సంస్థ శిక్షకుడు మౌలానా మోయిన్ చనిపోయినట్లు సమాచారం. పుల్వామా ఘటనకు ప్రతీకారంగా జైషే సంస్థకు చెందిన అతిపెద్ద ఉగ్ర శిక్షణ శిబిరంపై బాంబు దాడులు జరిపినట్లు భారత్ ఇంతకుముందే ప్రకటించింది. -
అభి మీసం
న్యూఢిల్లీ: పాకిస్తాన్ నుంచి తిరిగొచ్చిన వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ మీసాలకు ఇప్పుడు బాగా ప్రాచుర్యం ఏర్పడింది. అదొక ‘అభినందన్ బ్రాండ్’గా, భూషణంగా మారిపోయింది. దేశంలోని అనేక మంది యువకులు ఆ తరహా గడ్డం, మీసాలను ఇష్టపడుతున్నారు. తాము కూడా ఆయనలా మీసకట్టు పెంచుతామని అంటున్నారు. అభినందన్ గడ్డం, మీసాల స్టైల్‌పై సామాజిక మాధ్యమాల్లో జోరుగా వ్యాఖ్యలు, చర్చలు నడుస్తున్నాయి. అభినందన్ నడుపుతున్న మిగ్–21 విమానం పాకిస్తాన్ భూభాగంలో కూలిపోవడం, ఆయనను ఆ దేశ ఆర్మీ తొలుత బంధించి అనంతరం శుక్రవారం భారత్‌కు అప్పగించడం తెలిసిందే. పాకిస్తాన్లో ఉన్న అభినందన్ తన క్షేమ వివరాలు చెబుతున్న వీడియో గత బుధవారం బయటకొచ్చినప్పటి నుంచి ఆయనకు దేశంలో క్రేజ్ పెరిగిపోయింది. అభినందన్ గురించి, పాకిస్తాన్లో ఆయన ప్రదర్శించిన ధైర్య సాహసాల గురించి ఒక్కో వివరం బయటకొచ్చే కొద్దీ అందరిలో ఆసక్తి ఎక్కువైంది. ఆయన తెగువను మెచ్చిన భారత ప్రజలు ఇప్పుడు ఆయన ‘తమిళ’ స్టైల్‌ను అనుసరించాలనుకుంటున్నారు. ట్విట్టర్లో ఓ వ్యక్తి ఓ పోస్ట్ చేస్తూ ‘అభినందన్‌కు ఉన్నటువంటి మీసాలు నాకూ కావాలి. జయహో’ అని పేర్కొన్నారు. ‘మొత్తం భారత దేశంలో తర్వాతి స్టైల్ సంచలనంగా అభినందన్ మీసాలు ఉండబోతున్నాయి. ఈసారి మీరు క్షౌ ర శాలకు వెళ్లినప్పుడు అక్కడి వ్యక్తి మిమ్మల్ని అభినందన్ స్టైల్ కావాలా? అని అడిగితే ఆశ్చర్యపోకండి’ అని మరొకరు ట్విట్టర్లో రాశారు. ముందుగా గుర్తొచ్చేది మీసాలే.. అభినందన్‌ను ఎవరైనా గుర్తుపట్టేది ముందుగా ఆయన మీసాలతోనేనని బ్రాండ్ వ్యూహకర్త రమేశ్ తహిలియాని అంటున్నారు. ‘దేశభక్తి, ఇతర ఉద్రేకాలు ప్రస్తుతం ప్రజల్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. టీవీ, ఇంటర్నెట్ల్లో అభినందన్‌ను చూసిన వారిని మీరు అడగండి. ఆయనను తలచుకుంటే మీకు ముందుగా గుర్తొచ్చేది ఏంటి అంటే అత్యధిక శాతం మంది ఆయన గడ్డం, మీసాలేనంటారు. ఆయన చూపిన ధైర్య సాహసాలే ఇప్పుడు ఆ స్టైల్‌ను సూపర్ బ్రాండ్‌గా మార్చాయి. అయితే ప్రస్తుతానికి అయితే ఇదంతా తాత్కాలిక హాంగామానేననీ, ఆయన స్టైల్ ఇకపై ఫ్యాషన్‌గా మారుతుందా, లేదా అనే విషయాన్ని కాలమే చెబుతుందని తహిలియాని పేర్కొన్నారు. మరో బ్రాండ్ నిపుణుడు మాట్లాడుతూ ‘అభినందన్ మీసాలు ఆయన చెక్కిళ్లపైకి వ్యాపించి ఉంటాయి. ఆకాశంలో ఎంతో నైపుణ్యంతో విమానం విన్యాసాలు చేసిన గుర్తుల్లా అది ఉంటుంది. ఆ స్టైల్‌ను ఇప్పుడు ఎంతోమంది కావాలనుకుంటున్నారు’ అని అన్నారు. -
మానసికంగా వేధించారు
న్యూఢిల్లీ: పాకిస్తాన్ చెరలో ఉన్న సమయంలో తనను శారీరకంగా హింసించకున్నా మానసికంగా చాలా వేధింపులకు గురిచేశారని భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ శనివారం వైమానిక దళ ఉన్నతాధికారులకు చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. శనివారం ఆరోగ్య పరీక్షల సమయంలో తనను కలవడానికి వచ్చిన రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, అధికారులతో ఆయన ఈ విషయాలు పంచుకున్నట్లు తెలిసింది. పాకిస్తాన్లో వేధింపులకు గురైనా అభినందన్ మానసికంగా ఎంతో దృఢంగా ఉన్నారని అధికారులు తెలిపారు. తమ భూభాగంలో దొరికిపోయిన తరువాత అభినందన్‌పై కొందరు స్థానికులు భౌతిక దాడికి పాల్పడ్డారని, కానీ తాము ఆయనని రక్షించి జెనీవా ఒప్పంద మార్గదర్శకాల ప్రకారం చికిత్స అందించామని పాకిస్తాన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. గాయాలతో రక్తం కారుతుండగా అభినందన్‌ను పాకిస్తాన్ సైనికులు తీసుకెళ్తున్న వీడియో బహిర్గతం కావడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత అక్కడి సైనికులతో మాట్లాడుతూ అభినందన్ టీ తాగుతున్న మరో వీడియో విడుదలైంది. భారత్‌కు అప్పగించే ముందు అభినందన్‌తో పాకిస్తాన్ సైన్యాన్ని పొగుడుతూ ఓ వీడియోను రూపొందించినట్లు శుక్రవారం మీడియాలో కథనాలు వచ్చాయి. అల్లరి మూక నుంచి పాకిస్తాన్ ఆర్మీయే తనను కాపాడిందని చెప్పిన ఆ వీడియో షూటింగ్ వల్లే అభినందన్ అప్పగింత ఆలస్యమైందని కూడా భావిస్తున్నారు. పాకిస్తాన్ నుంచి తిరిగొచ్చిన తరువాత అభినందన్ కుడి కన్ను ఉబ్బినట్లు కనిపించింది. నిర్మలకు వివరించిన అభినందన్.. ఢిల్లీలోని ఎయిర్‌ఫోర్స్ సెంట్రల్ మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ కేంద్రంలో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అభినందన్‌ను కలుసుకున్నారు. ఆయన ధైర్యసాహసాల పట్ల దేశం గర్విస్తోందని ఆమె కొనియాడినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ చెరలో ఉన్న 60 గంటల పాటు తానెదుర్కొన్న అనుభవాలు, పరిస్థితుల్ని అభినందన్ నిర్మలా సీతారామన్‌కు వివరించినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో అభినందన్ భార్య స్క్వాడ్రన్ లీడర్ తాన్వి మార్వా(రిటైర్డ్), ఏడేళ్ల కొడుకు, సోదరి అదితి కూడా అక్కడే ఉన్నారు. ‘కూలింగ్ డౌన్’ పరీక్షలు పాక్ నిర్బంధం నుంచి విడుదలైన పైలట్ అభినందన్‌కు శనివారం వైద్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం వాఘా సరిహద్దులో ఆయన్ని పాక్ అధికారులు అప్పగించాక నేరుగా ఢిల్లీకి తరలించిన సంగతి తెలిసిందే. ‘కూలింగ్ డౌన్’ విధానంలో భాగంగా అభినందన్ మానసిక, శారీరక ఆరోగ్య స్థితిగతుల్ని మదింపు చేయడానికి జరుగుతున్న పరీక్షలు ఆదివారం వరకు కొనసాగే అవకాశాలున్నాయి. ఆర్మీ, నిఘా అధికారుల సమక్షంలో ఎయిర్‌ఫోర్స్ సెంట్రల్ మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్(ఏఎఫ్‌సీఎంఈ) కేంద్రంలో అభినందన్ హెల్త్ చెకప్ కొనసాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత, పాకిస్తాన్ నిర్బంధంలో ఉన్నప్పుడు ఎదుర్కొన్న పరిస్థితుల గురించి పూర్తి సమాచారం రాబట్టేందుకు ఆయన్ని విచారిస్తామని అధికారులు తెలిపారు. అంతకుముందు, అభినందన్‌ను ఆయన తల్లిదండ్రులు, వైమానిక దళ ఉన్నతాధికారులు కలుసుకున్నారు. అభినందన్ రాకతో శనివారం ఢిల్లీలో బీజేపీ కార్యకర్తల సంబరాలు -
‘ఐఏఎఫ్ దాడుల్లో కుట్ర ఉందేమో’
బెంగళూరు/ఇండోర్: పుల్వామాలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మృతికి ప్రతీకారంగా పాక్ భూభాగంలోని ఉగ్ర శిబిరాలపై ఐఏఎఫ్ జరిపిన దాడుల్లో కుట్ర కోణం ఉందేమోనని కర్ణాటక మంత్రి ఒకరు అనుమానం వ్యక్తం చేశారు. ‘44 మందికి 22 సీట్లు అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప చేసిన ప్రకటనతో ప్రజల్లో అనుమానాలున్నాయి. సైనికుల త్యాగాలను వాడుకుని కర్ణాటకలోని 22 సీట్లు గెలుచుకోవచ్చని ఆ పార్టీ భావిస్తోంది’అని మంత్రి ప్రియాంక్ ఖర్గే అన్నారు. పాక్‌లోని ఉగ్ర శిబిరాలపై ఐఏఎఫ్ జరిపిన దాడితో ప్రధాని మోదీ ఆదరణ పెరిగిపోయిందనీ, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 28 లోక్‌సభ సీట్లలో 22 తమ పార్టీనే గెలుచుకుంటుందంటూ యడ్యూరప్ప ప్రకటన చేశారు. దీంతో బీజేపీపై ఆరోపణలు వెల్లువెత్తాయి. -
ప్రతిపక్షాలవి చిల్లర రాజకీయాలు: అమిత్ షా
ఉమారియా(మధ్యప్రదేశ్): బాలాకోట్‌లో ఉగ్రవాద సంస్థ శిక్షణ శిబిరాలపై భారత వైమానిక దళం చేసిన వైమానిక దాడుల్ని ప్రతిపక్షాలు విమర్శించడం సరికాదని, ప్రతిపక్షాల తీరు భారత సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. వైమానిక దాడులపై ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తూ పాకిస్తాన్‌కు వంత పాడుతున్నాయని అమిత్ షా ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లోని ఉమారియాలో విజయ సంకల్ప పేరుతో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మోటార్ బైక్ ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఓవైపు భారత సైనిక దళాలు మీడియా సమావేశం నిర్వహించి పాక్ భూభాగంలోని ఉగ్ర శిబిరాలపై దాడులు చేసి ఉగ్రవాదుల్ని మట్టుబెట్టామని చెబుతుంటే ప్రతిపక్షాలు మాత్రం సందేహాలు వ్యక్తం చేస్తున్నాయన్నారు. భారత సైన్యం ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా విమర్శిస్తూ చిల్లర రాజకీయాలు చేయొద్దన్నారు. భారత్ వింగ్‌కమాండర్ అభినందన్ తిరిగి మాతృదేశానికి చేరుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. -
దాడులు, దౌత్యంతో దారికొచ్చిన పాక్
జమ్మూ నుంచి శ్రీన గర్ వెళ్లే దారిలో పుల్వామా జిల్లా అవంతిపుర సమీ పంలో గత నెల 14న ఉగ్ర వాది ఒకడు మానవ బాం బుగా మారి 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్ట నబెట్టుకున్న ఘటన అనం తర పరిణామాలు అంతర్జా తీయంగా సంచలనం కలిగించాయి. ఈ ఉద్రిక్తతల తీరు గమనించిన ప్రపంచ దేశాలన్నీ భారత్– పాకిస్తాన్ల మధ్య యుద్ధం వచ్చే అవకాశం ఉన్నదని ఆందోళన చెందాయి. పాకిస్తాన్ గడ్డపై ఉన్న ఉగ్రవాద శిబిరాలను కూకటివేళ్లతో పెకిలించి తీరా లన్న కృతనిశ్చయాన్ని మన దేశం ప్రదర్శించడమే ఇందుకు కారణం. గత నెల 26 తెల్లవారుజామున పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్ మీదుగా భారత వైమానిక దళం(ఐఏఎఫ్)కు చెందిన 12 మిరాజ్ యుద్ధ విమానాలు దూసుకెళ్లి పాక్ భూభా గంలో ఉన్న బాలాకోట్‌లో ఉన్న ఉగ్రవాద శిక్షణ కేం ద్రాన్ని ధ్వంసం చేశాయి. అనంతరం మన సరి హద్దులకు సమీపంగా ఉన్న ముజఫరాబాద్, చకోతి ల్లోని ఉగ్రవాద శిబిరాలను కూడా నేలమట్టం చేశా యి. మన యుద్ధ విమానాల రాకను గుర్తించి వాటిని ఎదుర్కొనాలని ప్రయత్నించి పాకిస్తాన్ భంగప డింది. ఈ దాడులు ఐక్యరాజ్యసమితి చార్టర్‌కు అను గుణమైనవే. అందులోని 51వ అధికరణ ప్రకారం ఏ దేశమైనా తన ప్రజల రక్షణ కోసం, తనపై జరిగే దాడుల నుంచి రక్షించుకోవడం కోసం శత్రుదేశంపై దాడి చేయవచ్చు. ఇందుకు భద్రతామండలి అను మతి తీసుకోనవసరం లేదు. ఆ దేశం ఒంటరిగా లేదా వేరే దేశాల సహకారంతో శత్రుదేశంపై దాడులు చేయవచ్చునని ఆ అధికరణ స్పష్టం చేస్తోంది. మన ఐఏఎఫ్ దాడులతో ఖంగుతిన్న పాకిస్తాన్ సైన్యం ఫిబ్రవరి 27న ఎఫ్–16 యుద్ధ విమానాలతో సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులకు ప్రయత్నించింది. కానీ ఐఏఎఫ్ అప్రమత్తంగా వ్యవహరించి ఆ చర్యను వెంటనే తిప్పికొట్టింది. ఒక ఎఫ్–16ను కూల్చింది కూడా. ఈ క్రమంలో మన మిగ్ యుద్ధ విమానం సాంకేతిక కారణాల వల్ల కూలటం, దాని పైలట్ వింగ్ కమాండర్ అభినందన్‌ను పాకిస్తాన్ సైన్యం నిర్బంధించటం జరిగాయి. మన దేశం వెనువెంటనే పాకిస్తాన్ అనుసరిస్తున్న పోకడలను ప్రపంచ దేశాల దృష్టికి తీసుకొచ్చి దౌత్యపరంగా పావులు కదిపి చురుగ్గా వ్యవహరించడంతో పాకిస్తాన్ ఒంటరైంది. పాకిస్తాన్‌తో సత్సంబంధాలున్న చైనా సైతం పాకి స్తాన్‌ను హెచ్చరించడం మన దౌత్యవేత్తల నేర్పరిత నానికి అద్దం పడుతుంది. గత్యంతరంలేని పరిస్థి తుల్లో అభినందన్‌ను అరెస్టు చేసిన రెండో రోజే ఆయ నను మార్చి 1న భారత్‌కు అప్పగిస్తామని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించడానికి దౌత్య పరంగా పాకిస్తాన్‌పై వచ్చిన ఒత్తిళ్లే కారణం. ఉద్రిక్తతలకు కారణం ఎవరు? పుల్వామా విషాద ఘటన జరిగిన వెంటనే పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ జైషే మొహ మ్మద్ దానికి తామే బాధ్యులమని ప్రకటించింది. ఆ సంస్థకు పాక్ సైన్యానికి చెందిన గూఢచార సంస్థ ఐఎస్ఐ అండదండలున్నాయన్నది బహిరంగ రహ స్యం. పాకిస్తాన్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే జైషే చీఫ్ మసూద్ అజర్‌ను అదుపులోనికి తీసుకు నేది. అతడిని విచారించి తగిన ఆధారాలు సేకరించేది. మన దేశానికి అప్పజెప్పేది. కానీ అందుకు భిన్నంగా మీరే ఆధారాలు ఇవ్వాలని అది మన దేశాన్ని కోరుతోంది. ముంబైపై ఉగ్రదాడి మొదలుకొని అనేక ఘటనలపై మన దేశం ఇచ్చిన ఆధారాలను బుట్టదాఖలా చేసిన చరిత్ర ఉన్న పాకిస్తాన్ ఇప్పుడు మరోవిధంగా స్పందిస్తుందని భ్రమపడవలసిన అవసరం లేదు. అత్యంత సాధా రణ కుటుంబాలనుంచి వచ్చి దేశ రక్షణలో నిమగ్న మైన సీఆర్పీఎఫ్ జవాన్లను ఉగ్రవాది బలితీసుకున్న ఉదంతంతో దేశమంతా కంటతడి పెట్టింది. కనుకనే ఈ మతిమాలిన ఉగ్రమూకల చర్యలకు చరమగీతం పాడాలని మన ప్రభుత్వం నిర్ణయించింది. ఇమ్రాన్ ఖాన్ స్వోత్కర్ష అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గి తప్పనిసరి పరిస్థితుల్లో అభినందన్‌ను విడుదల చేసిన పాకిస్తాన్ ఆ చర్య శాంతి కోసమేనని అందరినీ నమ్మించడానికి విఫల యత్నం చేస్తున్నది. యుద్ధం ప్రారంభమైతే ఎక్కడికి వెళ్తుందో తెలియదని, అందుకే ఉద్రిక్తతలను తగ్గిం చడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని ఇమ్రాన్ చెబుతున్నారు. ఇందులో నిజమెంత? మన దేశంతో ఆయన నిజంగా శాంతిని కోరుకునేటట్లయితే గద్దెనెక్కిన వెంటనే తమ భూభాగంలోని ఉగ్రవాద ముఠాలను నిర్మూలించేవారు. అందులో విఫలం కావడం వల్లే భారత్ చర్యలు తీసుకోవలసి వచ్చింది. మన దేశం ఎంతో బాధ్యతగా మెలిగి సైనిక స్థావ రాలపై, పౌర నివాస ప్రాంతాలపై దాడులు చేయ కుండా కేవలం ఉగ్రవాదులనే లక్ష్యంగా చేసుకుంది. అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గి అభినందన్‌ను విడు దల చేసి, అది తమ ఉదారతగా, శాంతి కోసం తీసు కున్న చర్యగా చిత్రించడానికి ఇమ్రాన్ చేసిన ప్రయ త్నం ఎవరినీ నమ్మించలేదు. చాలా తక్కువ సమ యంలో ప్రధాని నరేంద్రమోదీ అత్యంత చాక చక్యంగా ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టడం అభి నందించదగిన విషయం. జెనీవా ఒడంబడిక ఏం చెబుతోంది? యుద్ధం జరిగినప్పుడు దానికి సంబంధించిన నియ మాలు ఏ పక్షమూ ఉల్లంఘించకుండా చూడటం, ప్రపంచ శాంతిని కాపాడటం జెనీవా ఒడంబడిక లక్ష్యం. రణరంగంలో క్షతగాత్రులైనవారికి, రోగగ్రస్తు లైనవారికి మానవీయ దృక్పథంతో సాయం అందిం చాలని అందులోని 9వ అధికరణ చెబుతోంది. గాయపడినవారిని, రోగులను చంపడం నిషిద్ధమని , వారిపై జీవ సంబంధ పరీక్షలు బహిర్గతం చేయడం కూడా సరికాదని 12వ అధికరణ వివరిస్తున్నది. యుద్ధ ఖైదీలుగా పట్టుబడినవారు పురుషులైనా, స్త్రీలైనా వారిపట్ల మర్యాదగా వ్యవహరించాలి. పట్టు బడిన యుద్ధ ఖైదీలు కేవలం వారి పేరు, ర్యాంక్, హోదా, పుట్టిన తేదీ, క్రమ సంఖ్య చెబితే చాలు. యుద్ధ ఖైదీలకు వారి కుటుంబ సభ్యులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుకోవడానికి, తమ జాగ్రత్తకు అవసరమైన వస్తువులు వారు దగ్గర ఉంచుకో వడానికి హక్కుంటుందని జెనీవా ఒప్పందం స్పష్టం చేస్తున్నది. అయితే 1999నాటి కార్గిల్ యుద్ధ సమ యంలోనైనా, అంతక్రితమైనా, ప్రస్తుత ఘటన ల్లోనైనా ఎప్పుడూ పాకిస్తాన్ జెనీవా ఒడంబడికను గౌరవించలేదు. కార్గిల్ యుద్ధ సమయంలో మన పైలట్ నచికేత విడుదలకు 8 రోజులు తాత్సారం చేసింది. అప్పట్లో ఆయనను ఎన్నో రకాలుగా చిత్ర హింసలకు గురిచేశారు. అప్పటి ప్రధాని స్వర్గీయ వాజపేయి చేసిన కృషి పర్యవసానంగా నచికేతను పాకిస్తాన్ అప్పగించక తప్పలేదు. అభినందన్ విష యానికొస్తే ఆయన నడుపుతున్న విమానం సాంకే తిక లోపంతో కిందపడిపోయిన మాట వాస్తవమైనా ఆయనకున్న గాయాలు గమనిస్తే అక్కడివారు ఆయనను చిత్రహింసలకు గురిచేసిన దాఖలాలు కనిపిస్తాయి. తనవైపుగా జరిగిన ఈ తప్పిదాలను పాకిస్తాన్ కప్పిపుచ్చాలని చూసింది. పట్టుబడిన అభి నందన్‌ను జెనీవా ఒడంబడికకు విరుద్ధంగా పాక్ సైన్యం అనేక ప్రశ్నలు వేసింది. ఆయన భారత్‌లో ఏ ప్రాంతానికి చెందినవాడో తెలుసుకోవడానికి అది ప్రయత్నించింది. ఆయన వివాహితుడా, కాదా ఏ యుద్ధ విమానంలో ప్రయాణించారో, ఏ ఉద్దేశంతో ప్రయాణించారో, ఆయనకు అప్పగించిన పనేమిటో అడిగింది. ఈ ప్రశ్నలన్నీ జెనీవా ఒడంబడికను ఉల్లంఘించడం కిందకు వస్తాయి. మొత్తానికి భారత్ కఠిన వైఖరితో పాకిస్తాన్ అంతర్జాతీయంగా ఏకాకి అయింది. తన తీరు మార్చుకుని ఉగ్రవాదుల విష యంలో చర్యలు తీసుకుంటేనే ఆ దేశం పరువు నిలబడుతుంది. ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి వ్యాసకర్త రిజిస్ట్రార్, నల్సార్ విశ్వవిద్యాలయం -
యుద్ధం కాదు పరిష్కారం
ప్రతి చర్యకూ ప్రతిచర్య (రియాక్షన్) ఉంటుందని పాకిస్తాన్‌కూ, ఆ దేశాన్ని స్థావరంగా ఉపయోగించుకొని, ఆ దేశ సైనిక వ్యవస్థ ప్రోత్సాహంతో కశ్మీర్లో కల్లోలం సృష్టిస్తున్న ఉగ్రవాద మూకలకూ స్పష్టం చేయడంలో భారత ప్రభుత్వం సఫలమయింది. 2016లో ఉడీ సైనిక స్థావరంపైన ఉగ్రవాదుల దాడికి ప్రతిగా భారత సైన్యం మెరుపుదాడులు (సర్జికల్ స్ట్రయిక్స్) చేసింది. పక్షం రోజుల కిందట పుల్వామాలో అదిల్ అహ్మద్ దార్ అనే ఇరవై సంవత్సరాల కశ్మీరీ యువకుడు మానవబాంబుగా మారి కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఆర్పీఎఫ్) ప్రయాణిస్తున్న ట్రక్కుల శ్రేణిపై దాడి చేసి తాను పేలిపోయి 40 మంది జవాన్ల మరణానికి కారకుడైనాడు. ఈ దాడి తమ సంస్థ పనేనంటూ జైషే హంతకముఠా నాయకుడు మసూద్ అజహర్ ప్రకటించాడు. ఇందుకు ప్రతీకా రంగా భారత వాయుసేనకు చెందిన 12 మిరాజ్ 2000 యుద్ధవిమానాలు సరి హద్దు దాటి పాక్ భూభాగంలో ప్రవేశించి జైషే ఉగ్రవాద స్థావరాలపై బాంబులు వేసి సుమారు 300 మంది ఉగ్రవాదులనూ, వారి శిక్షకులనూ, కమాండర్లనూ మట్టుబెట్టినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఇందుకు సమాధానంగా పాకిస్తాన్ ఎఫ్–16 యుద్ధ విమానాలతో భారత సైనిక స్థావరాలపైన దాడులు చేయడానికి రాగా వాటిని భారత్ మిగ్ యుద్ధవిమానాలతో ఎదుర్కొని వెనక్కు పంపింది. ఈ క్రమంలో పాకిస్తాన్‌కు చెందిన ఒక ఎఫ్–16 విమానాన్ని మన యుద్ధవిమానాలు కూల్చివేయగా, మన మిగ్ విమానాన్ని పాకిస్తాన్ యుద్ధవిమానాలు పడగొ ట్టాయి.భారత యోధుడు వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ కూలుతున్న మిగ్ విమానం నుంచి పారాచ్యూట్ సాయంతో కిందికి దిగి పాక్ సైనికులకు బందీగా చిక్కాడు. జెనీవా ఒప్పందం ప్రకారం అభినందన్‌ను యుద్ధఖైదీగా పరి గణించి గౌరవంగా చూడాలనీ, భారత్‌కు అప్పగించా లనీ నరేంద్రమోదీ ప్రభు త్వం డిమాండ్ చేసింది. శాంతికోసం అభినందన్‌ను భారత్‌కు అప్పగిస్తానంటూ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పాకిస్తాన్ పార్లమెంటులో ప్రకటన చేశారు. శుక్రవారం రాత్రి అభినందన్ భారత్ గడ్డపైన భద్రంగా అడు గుపెట్టాడు. ఇంతవరకూ జరిగిన పరిణామాలు క్లుప్తంగా ఇవి. యుద్ధమేఘాలు సరిహద్దుల ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి. పరస్పరం కాల్పులు జరుపు కుంటూనే ఉన్నారు. కానీ పూర్తి స్థాయి యుద్ధానికి దిగలేదు. అందుకు భారత్, పాకిస్తాన్ ప్రజలే కాకుండా దక్షిణాసియా ప్రజలూ, అంతర్జాతీయ సమాజం కూడా సంతోషించాలి. పక్షం రోజులుగా భారత్, పాకిస్తాన్ల మధ్య సంభవి స్తున్న పరిణామాలు అసాధారణమైనవి. ప్రమాదకరమైనవి. ఆందోళనకరమై నవి. రెండు అణ్వస్త్ర దేశాల మధ్య ప్రత్యక్షంగా యుద్ధవిమాన దాడులు జరగడం ఇదే ప్రథమం. 1971 తర్వాత భారత్, పాక్ యుద్ధవిమానాలు తలబడి పూర్తి స్థాయి సంప్రదాయ యుద్ధ ప్రమాదాన్ని భారతీయుల, పాకిస్తానీల గడప వరకూ తీసుకురావడం కూడా ఇదే మొదటిసారి. 1999లో కార్గిల్‌లో తిష్టవేసిన పాకిస్తాన్ సైనికులను వెనక్కు పంపేందుకు భారత యుద్ధం చేయవలసి వచ్చింది. అది పరిమితమైన లక్ష్యంకోసం జరిగిన పోరాటం. 2008లో ముంబైపై ఉగ్రవాదులు దాడి చేసినా, అంతకు ముందు 2001లో మన పార్లమెంటు భవనంపైన ఉగ్ర పంజా విసిరినా హెచ్చరికలకూ, దౌత్య చర్యలకే భారత ప్రతిస్పందన పరి మితమైనది కానీ ప్రతీకార దాడులు చేయలేదు. 1999లో సరిహద్దు పొడవునా సైన్యాన్ని మోహరించారు కానీ పూర్తి స్థాయి యుద్ధానికి దిగలేదు. ‘మా జోలికి వస్తే ఊరుకోం. ప్రతీకారం తీర్చుకుంటాం,’ అని భారత్ కార్యాచరణ రూపంలో స్పష్టం చేసింది మోదీ హయాంలోనే. దీని ఫలితం ఆశించినట్టు ఉన్నదా? ఉగ్రవాదులు వెనుకంజ వేశారా? పాకిస్తాన్ జంకుతున్న లక్షణాలు కనిపి స్తున్నాయా? ఉగ్రవాదులను అరికట్టడానికి పాకిస్తాన్ ప్రయత్నిం చిన దాఖలాలు ఉన్నాయా? నాలుగు ప్రశ్నలకూ లేదనే జవాబు. నెహ్రూ నుంచి మన్మోహన్సింగ్ దాకా ప్రధానులందరూ కశ్మీర్ అంతర్గత వ్యవహారమనీ, పాకిస్తాన్‌తో భారత్ ముఖాముఖి చర్చించి పరిష్కరించుకుం టుందనీ, మూడో పక్షం జోక్యాన్ని ఆమో దించబోమనీ కరాఖండిగా చెబుతూ వచ్చారు. సిమ్లాలో ఇందిరాగాంధీ, భుట్టోల మధ్య కుదిరిన ఒప్పందం కూడా అదే. మెరుపుదాడుల వల్లా, యుద్ధవిమానాల ప్రయోగం వల్లా ఏమి జరిగింది? ప్రపంచంలోని అన్ని దేశాలూ శాంతి, శాంతి అంటున్నాయి. నిగ్రహం పాటించాలని కోరుతున్నాయి. రెండు అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధం జరిగే వాతావరణం కనిపిస్తే స్పందించవ లసిన అగత్యం, హక్కు అన్ని దేశాలకూ ఉంటుంది. ఇప్పుడు కశ్మీర్ అంతర్జా తీయ సమస్యగా మారింది. పాకిస్తాన్‌కు దౌత్యపరమైన మద్దతు తగ్గింది. ఉగ్ర వాదానికి పాకిస్తాన్ బలమైన స్థావరంగా మారిందనే అభిప్రాయం చైనాతో సహా అన్ని ప్రపంచ దేశాలలో బలంగా నాటుకున్నది. ఈ ఉగ్రవాదంతో నష్టపోతున్నది భారత్ ఒక్కటే కాదు. ఇరాన్‌పైనా తాలిబాన్ ఉగ్రదాడులు జరుగుతున్నాయి. అఫ్ఘానిస్తాన్ సంగతి సరేసరి. ఆ దేశం మూడు దశాబ్దాలుగా తాలిబన్ దాడులతో, అగ్రరాజ్యాల సైనిక జోక్యంతో, ఆక్రమణలతో, పాకిస్తాన్ ప్రమేయంతో సత మతం అవుతోంది. దౌత్యపరమైన మద్దతు కూడగట్టడం వల్ల భారత్‌కు ప్రయో జనం ఏమిటి? చైనా అండదండలు ఉన్నంత వరకూ పాకిస్తాన్ దారికి వస్తుందా? అభినందన్‌ను భారత్‌కు పంపుతానని ప్రకటించడం ద్వారా ఇమ్రాన్‌ఖాన్ హుందాగా ప్రవర్తిం చినట్టు కనిపించారు. సైన్యాధికారుల ఆమోదంతోనే... సైన్యం ఆమోదం లేకుండా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే భుట్టో, నవాజ్షరీఫ్లకు పట్టినే గతే తనకూ పడుతుందని ఇమ్రాన్‌కు తెలుసు. సైన్యా ధికారులు సైతం జెనీవా ఒప్పందాన్ని గౌరవించాలని నిర్ణయించి ఉంటారు. చిన్న పొరబాటు జరిగితే ఎంతటి తీవ్రమైన పరిణామాలు ఉంటాయో ఊహిం చుకోవాలని నరేంద్రమోదీకి ఇమ్రాన్ చేసిన సూచన కొట్టిపారవేయదగినది కాదు. పరిమిత దాడులైతే నష్టం కూడా పరిమితమే. సంప్రదాయరీతిలో యుద్ధా నికి రెండు దేశాలూ సిద్ధంగా లేవు. యుద్ధమంటూ జరిగితే మారణహోమం అనివార్యం. అది అణ్వస్త్రయుద్ధానికి దారితీస్తే ప్రళయమే. అందుకే అంతర్జాతీయ సమాజం దీన్ని రెండు దేశాల మధ్య వివాదంగా పరిగణించి చేతులు కట్టుకొని కూర్చోజాలదు. రెండు దేశాల అధినేతలకూ ప్రపంచ దేశాధినేతలు సుద్దులు చెబుతారు. చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోమంటారు. ఒక్క అభినందన్ పాకిస్తాన్ సైనికుల చేత చిక్కితేనే దేశం యావత్తూ ఊపిరి బిగపట్టి అతని విడుదల కోసం నిరీక్షించింది. చైనాతో, పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధాలలో అనేక మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా నాలుగు వందల టీవీ చానళ్ళు ఇటువంటి వివరాలన్నీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తే అధికార పార్టీ పరిస్థితి దారుణంగా ఉంటుంది. పరిమిత చర్యలే అయినప్పటికీ ఎన్నికల సమయంలో వచ్చిన అవకాశాన్ని అపరిమితంగా సద్వినియోగం చేసుకోవడానికి రాజకీయ పార్టీలు ప్రయత్ని స్తున్నాయి. దేశంలో ఇప్పుడున్న వాతావరణం అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ)కి అనుకూలం. ఉద్రిక్తలను సొమ్ము చేసుకునే ప్రయత్నం ఎన్డీఏ నిస్సంకోచంగా చేస్తున్నది. ఇందులో నరేంద్రమోదీ సిద్ధ హస్తుడు. అధి కారపార్టీకి ఆ ప్రయోజనం దక్కకుండా ఎట్లా నివారించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తదితరులు ఆలోచిస్తున్నారు. బీజేపీ నాయకుల మాటలు కోటలు దాటుతున్నాయి. రాజకీయ ప్రయోజనాలకోసం దేశాన్ని బలహీన పరచవద్దనీ, సైనికులను అవమానించవద్దనీ ప్రతిపక్షాలకు మోదీ విజ్ఞప్తి చేశారు. జైట్లీ సమరోత్సాహం అమెరికా అధ్యక్షుడుగా ఒబామా ఉండగా అమెరికా కమాండోలు పాకిస్తాన్లో రహస్యంగా జీవిస్తున్న అల్ కాయిదా అధినేత ఒసామా బిన్ లాడెన్‌ను హత మార్చినట్టు మన సేనలు కూడా పాకిస్తాన్లో నివసిస్తున్న మసూర్ అజహర్‌ని అంతం చేయాలని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. ఇది ‘పైలట్ ప్రాజెక్టు’ మాత్రమేనని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. మెరుపు దాడులైనా, పరిమి తమైన యుద్ధవిమానాల ప్రయోగమైనా దేశ ప్రజల ఆవేశాలను తగ్గించడానికీ, ప్రభుత్వం పట్ల, సైన్యం పట్ల విశ్వాసం నిలుపుకోవడానికీ పనికివస్తాయి కానీ అసలు సమస్య పరిష్కారం కాదు. శాశ్వత శాంతి నెలకొనదు. అసలు సమస్య ఏమిటి? కశ్మీర్‌లోయలో అశాంతి. ఎన్ని వేల కోట్ల రూపాయలు లోయలో కుమ్మరించినా, ఎన్ని లక్షలమంది సైనికులను మోహరిం చినా, ఎంతమంది ఉగ్రవాదులూ, సాధారణ పౌరులూ, సాయుధబలగాలూ ప్రాణాలు కోల్పోయినా సమస్య క్రమంగా జటిలం అవుతున్నదే కానీ సమసి పోవడం లేదు. కశ్మీర్ సమస్య స్వభావం అటువంటిది. 1990 నుంచి ఇప్పటి వరకూ కశ్మీర్లో 70 వేలమంది పౌరులూ, పోలీసు ఉద్యోగులూ, ఉగ్రవాదులూ మరణించి ఉంటారు. పెల్లెట్ గన్ గాయాలతో అంధులైనవారూ, కాల్పులలో వికలాంగులైనవారూ వేలమంది ఉంటారు. కశ్మీర్ ప్రజల మనోభావాలు ఏమిటో పాకిస్తాన్‌కు పట్టించుకోదు. భారత్‌కూడా కశ్మీర్‌ను కాపాడుకోవాలనే ఆరాటంలో కశ్మీరీల మనోగతం తెలుసుకునే ప్రయత్నం చేయవలసినంత చేయడం లేదు. సాయుధ బలగాలతో కశ్మీర్ సమస్య పరిష్కారం కాదని అందరికీ తెలుసు. ఎట్లా పరిష్కరించాలో తెలియక ఆ సమస్యను మరింత జటిలం చేస్తున్నారు. కశ్మీర్ ప్రజల దృష్టికోణం నుంచి చూసి వారి సమస్యను గుర్తించే అవకాశం ఉన్నప్పటికీ ఆ సాహసం ఎవరు చేయగలరు? కశ్మీర్ లోయలో అత్యధికులు కోరుకుంటున్న ఆజాదీ వారికి అందని ద్రాక్ష. వారి అభీష్ఠాన్ని మన్నించే వాతావరణం దేశంలో లేదు. వీలైనంత మేరకు స్వతంత్ర నిర్ణయాధికారాలు కల్పించడం ఆచరణ సాధ్యౖ మెన విధానం. అందుకే రాజ్యాంగంలో 370వ అధికరణను చేర్చింది. కశ్మీరీలు ప్రశాంతంగా భారతపౌరులుగా జీవించాలంటే వేర్పాటువాదానికి స్వస్తి చెప్పాలి. అది జరగాలంటే భారత ప్రజలు కశ్మీరీల హృదయాలు గెలుచుకోవాలి. అందుకు రాజకీయ పార్టీలకూ, ప్రభుత్వాలకీ అతీతంగా సమగ్రమైన కార్యక్రమం నిరంత రాయంగా అమలు జరగాలి. వాజపేయి చెప్పినట్టు జమ్రూ హియత్ (ప్రజాస్వా మ్యం), కశ్మీరియత్(కశ్మీర్ సంస్కృతి), ఇన్సానియత్(మానవత్వం) అనే మూడు మూల సూత్రాలు ప్రాతిపదికగా నూతన కశ్మీర్ విధాన రూపకల్పన జరగాలి. కశ్మీర్‌వైపు తేరిపార చూడకుండా పాకిస్తాన్‌ను శాసించే స్థితికి భారత్ చేరుకోవాలి. బంగ్లాదేశ్ ఆవిర్భవించి తూర్పు పాకిస్తాన్ అంతర్థానం కావడంతో ప్రతీకారేచ్ఛతో రగిలిపోయిన పాకిస్తాన్ పాలకవర్గం భారత్ నుంచి కశ్మీర్‌ను వేరు చే సేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నది. సంప్రదాయ యుద్ధంలో భారత్‌ను ఓడిం చడం అసాధ్యం కనుక పరోక్షంగా జిహాదీ శక్తులకు అండదండలు సమకూర్చి కశ్మీర్‌ని రావణకాష్టం చేయాలన్నది జనరల్ జియా–ఉల్–హక్ సంకల్పం. అం తకు ముందు జుల్ఫికర్ అలీభుట్టో సైతం భారత్‌పైన వేయి సంవత్సరాల యుద్ధం చేస్తామంటూ ప్రగల్భాలు పలికారు. భారతదేశానికి వేయి గాయాలు చేసి రక్తం పారించాలని ప్రతిన పూనారు. పాకిస్తాన్ ప్రజలకు భారత్‌పట్ల ద్వేషాన్ని నూరిపోశారు. ఉగ్రవాదులలో మంచి ఉగ్రవాదులూ, చెడు ఉగ్రవా దులూ అంటూ జనరల్ ముషార్రఫ్ విభజించారు. కశ్మీర్లో రక్తపాతం సృష్టించే జిహాదీలను మంచి ఉగ్రవాదులుగా పరిగణించి వారికి అవసరమైన సహాయ సహకారాలు ప్రభుత్వాలూ, సైన్యం అందిస్తున్నాయి. పాకిస్తాన్ బుద్ధి మారదు. ప్రజలు ఎన్నుకున్న ప్రధానులు భారత్‌తో శాంతికోసం ప్రయత్నించినా పాకిస్తాన్ సైన్యాధిపతులు సహకరించరు. ఎన్నికైనవారిని గద్దె దింపి తామే పగ్గాలు చేపడతారు. భారత్‌తో వైరంలో వారి ప్రయోజనాలు ఉన్నాయి. కశ్మీర్లో చిచ్చు ఆరకుండా రగిలించాలనే దుర్మార్గపు విధానం వల్ల పాకిస్తాన్ బావుకున్నది ఏమీ లేదు. ఉగ్రవాదుల దాడులలో పాకిస్తాన్‌లోనూ సుమారు 70 వేలమంది పౌరులు మృతి చెందారు. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైపోయింది. మొన్న అమె రికా, నిన్న చైనా, ఇప్పుడు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) ఆదుకుంటే తప్ప నిలబడలేని పరిస్థితి. పాకిస్తాన్ ఉగ్రవాదులను కశ్మీర్‌పైన ప్రయోగించ కుండా ఉండాలంటే ఆర్థికంగా, సైనికంగా భారత్ ఇంకా ఎదగాలి. అందుకోసం శాంతిసుస్థిరతలు కావాలి. యుద్ధం వద్దు. ఇదే భారత ప్రజల అభిమతం. -కె. రామచంద్రమూర్తి -
నన్ను బాగా వేధించారు : అభినందన్
సాక్షి, న్యూఢిల్లీ : శత్రు దేశ యుద్ధ విమానాన్ని తరుముతూ సరిహద్దు దాటి వెళ్లి పాకిస్తాన్‌కు చిక్కిన భారత వైమానిక దళ పైలట్ అభినందన్ వర్థమాన్‌ను ఆ దేశ ఆర్మీ శారీరకంగా వేధించనప్పటికీ.. మానసికంగా వేధించినట్లు తెలుస్తోంది. దాదాపు 60గంటల పాటు అభినందన్ పాకిస్తాన్లో ఉన్నారు. ఆసమయంలో ఆయనను పాక్ ఆర్మీ మానసికంగా వేధించిందని అభినందన్ భారత అధికారులకు తెలిపినట్లు ఏఎన్ఐ వార్తా ఏజెన్సీ వెల్లడించింది. అయితే..దీనిపై పూర్తి సమాచారం రావాల్సి ఉంది. (అభినందన్ ఆగయా..) పాకిస్తాన్ ప్రతీకార దాడుల్ని తిప్పికొట్టే క్రమంలో ఫిబ్రవరి 27న పీఓకేలో మిగ్–21 విమానం కూలిపోయి అభినందన్ పాకిస్తాన్ బలగాలకు దొరికిపోయిన సంగతి తెలిసిందే.ముందుగా అతడిపై అక్కడి స్థానికులు దాడి చేసినా తర్వాత పాక్ ఆర్మీ ఆయనను అదుపులోకి తీసుకొని జాగ్రత్తగా చూసుకున్నట్లు పాక్ అధికారులు వెల్లడించారు. భారత్‌తో పాటు అంతర్జాతీయ సమాజం తీసుకొచ్చిన ఒత్తిడికి తలొగ్గిన పాకిస్తాన్.. అభినందన్‌ను శుక్రవారం రాత్రి 9.20 గంటలకు వాఘా బార్డర్ దగ్గర భారత్‌కు పాక్ అప్పగించింది. స్వదేశంలో అడుగుపెట్టిన అభినందన్‌ను ఢిల్లీలోని మిలిటరీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుంచి ఎయిర్ ఫోర్స్ ఆసుపత్రికి తరలించారు. (అభినందన్‌ను కలిసిన రక్షణ మంత్రి) A day after his return from Pakistan, Wing Commander Abhinandan informed the top brass of IAF that he was subjected to a lot of mental harassment, though he was not physically tortured by Pakistan military authorities, said a source. Read @ANI Story | https://t.co/5SkjqinLgz pic.twitter.com/sHR3IPjSNU — ANI Digital (@ani_digital) March 2, 2019 -
‘మా చిన్నారి అభినందన్ ఎలా ఉన్నాడు’
న్యూఢిల్లీ : గడిచిన మూడు రోజులు దేశవ్యాప్తంగా అభినందన్ నామస్మరణే. అతనికి సంబంధించిన వార్తలతోనే ఈ మూడు రోజులు తెల్లవారింది.. చీకటి పడింది. శత్రు సైనికులకు చిక్కినప్పడు అతడు చూపిన తెగువ వల్ల ఒక్కసారిగా నేషనల్ హీరో అయ్యారు అభినందన్. ‘ప్రాణాలు పోయే పరిస్థితుల్లో కర్తవ్యం మరవలేదని.. రియల్ హీరో’ అంటూ అభినందిస్తున్నారు జనాలు. తమ భూభాగంలో దిగిన అభినందన్‌ను పాకిస్తాన్ శుక్రవారం రాత్రి 9:21 నిముషాలకు వాఘా సరిహద్దు వద్ద భారత్‌కు అప్పగించింది. అయితే ఈ మూడు రోజుల పాటు సోషల్ మీడియాలో అభినందన్ గురించి వచ్చే మెసేజ్‌ల ప్రవాహానికి అంతే లేకుండా పోయింది. అభినందన్ ధైర్య సాహసాలకు గౌరవంగా.. పుట్టిన బిడ్డలకు అతని పేరు పెడుతున్నారు. ప్రస్తుతం ట్విటర్ నిండా ఇలాంటి మెసేజ్‌లే. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ వింగ్ కమాండర్ ధైర్యాన్ని మెచ్చుకుంటూ.. ‘‘అభినందన్’ అనే ఈ సంస్కృత పదానికి నేడు కొత్త అర్థం రూపొందింది’ అంటూ ప్రశంసించారు. శత్రు దేశానికి చిక్కిన అభినందన్‌ను తిరిగి తీసుకురావడానికి భారత్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. దాంతో జెనీవా ఒప్పందం ప్రకారం పాక్ మన వింగ్ కమాండర్ అభినందన్‌ను శుక్రవారం వాఘా సరిహద్దు వద్ద అప్పగించింది. -
ఈ టెర్రరిస్టుల్లో ఒక్కరినైనా చంపామా!?
సాక్షి, న్యూఢిల్లీ : ‘నేను తక్కువ మాట్లాడుతా, ఎక్కువ పనిచేస్తా! పాకిస్థాన్‌లో తలదాచుకున్న దావుద్ ఇబ్రహీం లాంటి వారిని పట్టుకురావడంలో యూపీఏ ప్రభుత్వం ఎందుకు విఫలం అవుతుందో నాకు ఆశ్చర్యంగా ఉంది. కేవలం మాటలు చెబితే సరిపోదు. టెర్రరిజమ్‌పై పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని ప్రధాని నరేంద్ర మోదీ 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పదే పదే చెప్పారు. టెర్రరిజంపై తాను నిజంగా పోరాడతానని, వట్టి మాటలు చెప్పనన్నది మోదీ వ్యాఖ్యల ద్వారా స్పష్టం అవుతోంది. ఇప్పుడు 2019 వచ్చింది. అంటే మోదీ అధికారంలోకి వచ్చి దాదాపు ఐదేళ్లు కావొస్తోంది. మరి ఆయన ప్రభుత్వం కూడా దావూద్ ఇబ్రహీంను పట్టుకోలేక పోయింది. ఒక్క ఆయన్నే కాదు, టాప్ టెర్రరిస్టులను పట్టుకోవడంగానీ, కాల్చివేయడంగానీ చేయలేక పోయింది. భారత్ హిట్ లిస్ట్‌లో ఉండి పాకిస్థాన్‌లో తలదాచుకుంటున్నట్లు భావిస్తున్న టైగర్ మెమన్, అబ్దుల్ సుబాన్ ఖురేషి, ఇక్బాల్ భక్తల్, మీర్జా షాదాబ్ బేగ్, అమిర్ రాజా ఖాన్, మొహమ్మద్ ఖలీద్ ఆకా సాగిర్, భారత ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఐసీ 814 విమానాన్ని హైజాక్ చేసిన ఖలిస్థాన్ టెర్రరిస్టులు వాధవ సింగ్ బబ్బర్, పరంజిత్ సింగ్ పాంజ్వర్, లఖ్బీర్ సింగ్ రోడే, రంజిత్ సింగ్ నీతా, గజిందర్ సింగ్‌లలో ఏ ఒక్కరిని పట్టుకోలేక పోయారు. చంపలేక పోయారు. ఇక హఫీద్ సయీద్, మసూద్ అజర్, జఖీర్ రహమాన్ లఖ్వీ లాంటి వారిని పట్టుకోవడం మాటలా? నరేంద్ర మోదీ అధికారంలోకి రాగానే టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌పై కఠిన చర్యలు తీసుకుంటారని అందరూ భావించారు. ఆయన ఏడాదిన్నరపాటు పాకిస్థాన్‌తో సత్సంబంధాలను కొనసాగించారు. నరేంద్ర మోదీ అనూహ్యంగా 2015, డిసెంబర్ 25వ తేదీన అప్పటి పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ సొంతూరు రాయ్విండ్కు వెళ్లి ఆయన్ని స్వయంగా కలుసుకొని పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మనమరాలి పెళ్లి వేడుకల్లో పాల్గొన్నారు. అంతకుముందు వారిరువురు యుఫాలో జరిగిన ‘షాంఘై సహకార సంఘం’ సమ్మేళనంలో కలుసుకున్నప్పుడు ఇరుదేశాల జాతీయ భద్రతా సలహాదారుల మధ్య చర్చలకు అంగీకరించారు. గురుదాస్‌పూర్‌లో టెర్రరిస్ట్ దాడి జరగడంతో వారి సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. అయినప్పటికి ఆ ఇరువురు అధికారులు 2015, డిసెంబర్ నెలలో బ్యాంకాక్‌లో రహస్యంగా సమావేశమయ్యారు. అంతకుముందు అంటే, 2014, నవంబర్ నెలలో నేపాల్‌లో జరిగిన సార్క్ సమావేశాల సందర్భంగా నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్‌లు రహస్యంగా కలుసుకున్నారు. ఈ విషయాన్ని సీనియర్ జర్నలిస్ట్ బార్కాదత్ తన ‘ది అన్‌క్వైట్ ల్యాండ్’ పుస్తకం ద్వారా బయటపెట్టారు. ఇదంతా పాకిస్థాన్‌తో దౌత్య సంబంధాలను మెరగుపర్చుకొని తద్వారా టెర్రరిస్టు ముఠాలను అంతం చేయడం లక్ష్యం అనుకుంటే ఆ దిశగా కూడా మోదీ ప్రభుత్వం ఎలాంటి పురోగతి సాధించలేక పోయింది. మోదీ హయాంలో జరిగిన పఠాన్‌కోట్ ఉగ్రదాడి నుంచి మొన్నటి పుల్వామా ఉగ్ర ఆత్మాహుతి దాడి వరకు మూడేళ్ల సమయం దొరికినప్పటికీ మోదీ ప్రభుత్వం పాకిస్థాన్‌లో శిక్షణా శిబిరాలను నిర్వహిస్తున్న జైషే మొహమ్మద్, లష్కరే తాయిబా సంస్థలనుగానీ, పాక్‌లో ఆశ్రయం పొందుతున్న ఖలిస్థాన్, ఇండియన్ ముజాహిదీన్ టెర్రరిస్టులను ఏమీ చేయలేకపోయింది. పాక్‌స్థాన్ సైనికుల చెర నుంచి భారత పైలట్ అభినందన్ వర్థమాన్ విడుదలైన సందర్భంగా శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ‘అభీ అభీ ఏక్ పైలట్ ప్రాజెక్ట్ పూరా హోగయా, పైలేతో ప్రాక్టీస్ తీ, రియల్ ప్రాజెక్ట్ అబ్ ఆగే హై’ అని బాలకోట్లో జైషే మొహమ్మద్ ఉగ్ర స్థావరంపై భారత వైమానిక దళం జరిపిన దాడిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆ దాడిపై అంతర్జాతీయంగా సవాలక్ష అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముందు జరగబోయే దాడి ఎలా ఉంటుందో! తెలియదు. మోదీ చేతల సంగతి పక్కన పెడితే ఆయన మాటలు మాత్రం చాలా బాగుంటున్నాయి. -
‘ఇమ్రాన్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి’
న్యూఢిల్లీ : భారత పైలట్ అభినందన్‌ను క్షేమంగా అప్పగించిన కారణంగా తమ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు నోబెల్ శాంతి ప్రకటించాలని పాకిస్తానీయులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ట్విటర్లో #NobelPeacePrizeForImranKhan అనే హ్యాష్ ట్యాగ్‌తో హల్చల్ చేస్తున్నారు. మరోవైపు చైనా కూడా అభినందన్ విడుదల ద్వారా ఇమ్రాన్ శాంతికి ఆహ్వానం పలికారని ప్రశంసలు కురిపించింది. కాగా ఈ విషయంపై బీజేపీ సీనియర్ నేత రామ్ మాధవ్ స్పందించారు.(ఇమ్రాన్ ఖాన్‌పై చైనా ప్రశంసలు) శనివారం ఇండియా టుడే కాన్క్లేవ్లో మాట్లాడుతూ... ‘ ప్రస్తుతం పాకిస్తాన్లో కొంత మంది ప్రజలు, ఇమ్రాన్ ఖాన్ పార్టీ వాళ్లు తమ ప్రధానికి నోబెల్ శాంతి బహుమతి రావాలని కోరుకుంటున్నారు. సరే ఆయనను బహుమతి తీసుకోమనండి. అయితే అది నిజంగా పాకిస్తాన్ ప్రజలకు పనికి వచ్చే అంశమేనా? ఉగ్రవాదాన్ని రూపుమాపాలని ఇమ్రాన్ నిజంగా భావిస్తే పాక్, భారత్‌లతో పాటు ప్రపంచం మొత్తానికీ కూడా మంచిదే. కానీ వాళ్లు మారతారని అనుకోవడం లేదు. వారి విధానంలో భాగంగానే ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్తాన్ పన్నాగంలో చిక్కాలని ఎవరూ అనుకోవడమూ లేదు’ అని రామ్ మాధవ్ ఘాటు విమర్శలు చేశారు. కాగా పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్ నేఫథ్యంలో భారత్- పాకిస్తాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు.. భారత పైలట్ అభినందన్ అప్పగింతతో తగ్గినట్లుగా కన్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే శాంతి చర్చలకు ఆరంభంగానే అభినందన్‌ను విడిచిపెట్టామని పాక్ చెబుతుండగా.. జెనీవా ఒప్పందాన్ని అనుసరించి మాత్రమే అతడిని స్వదేశానికి అప్పగించారని భారత సైన్యం పేర్కొంది.(పాక్ జెనీవా ఒప్పందాన్ని ఉల్లంఘించిందా?) Alhamdolilah #PakistanLeadsWithPeace @ImranKhanPTI @OfficialDGISPR Nobel Peace Prize is waiting for you @ImranKhanPTI — Ayaz Shoukat (@AyazACMA) March 1, 2019 Nobel peace prize winner for 2019 is Mr. Imran Khan, Prime minister of Islamic state of Pakistan . Salute to Pak Army https://t.co/adgndxM9e7 — hasan (@hasanchand) March 1, 2019 -
పాక్ విమానాన్ని అభినందన్ నేలకూల్చాడిలా..!
సాక్షి, న్యూఢిల్లీ : సర్జికల్ స్ట్రైక్స్‌తో ఉలిక్కిపడ్డ పాకిస్తాన్ భారత్‌పై వైమానిక దాడులకు దిగిన సంగతి తెలిసిందే. పాక్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధవిమానాలు గత బుధవారం నియంత్రణ రేఖ (ఎల్వోసీ) దాటి భారత గగనతలంలోకి ప్రవేశించాయి. ప్రత్యర్థి దాడులను ఐఏఎఫ్ దీటుగా తిప్పి కొట్టింది. ఈ క్రమంలో పాకిస్తాన్‌కు చెందిన ఒక ఎఫ్-16 విమానాన్ని మనోళ్లు కూల్చేశారు. పాక్ యుద్ధ విమానం ఎఫ్-16ను కూల్చడానికి అభినందన్ వర్ధమాన్ ఆర్-73 అనే మిస్సైల్ ప్రయోగించాడు. అదే సమయంలో అభినందన్ విమానం కూడా ప్రత్యర్థి దాడిలో నేలకూలింది. దాంతో ఆయన ప్యారాచూట్ సాయంతో పాక్ భూభాగంలో దిగాల్సి వచ్చింది. యుద్ధ ఖైదీగా పట్టుబడ్డ అభినందన్‌ను జెనీవా ఒప్పందంలో భాగంగా శుక్రవారం రాత్రి పాకిస్తాన్ భారత్‌కు అప్పగించింది. (అభినందన్ ఆగయా..) ఆర్-73 మిస్సైల్.. లక్ష్యం గురి తప్పదు.. ఆర్-73 మిస్సైల్.. ఏ సమయంలోనైనా ప్రత్యర్థి విమానాలపై దాడి చేయగలదు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా.. దశ దిశా మార్చుకుని కావాల్సిన లక్ష్యాన్ని ఛేదించగలదు. ఏరో డైనమిక్ సిస్టమ్ ద్వారా దీనిని కంట్రోల్ చేయవచ్చు. దాంతో ఇది సమర్థవంతంగా పనిచేసి ప్రత్యర్థి యుద్ధ విమానలను నేల కూల్చగలదు. గంటకు 2500 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న విమాలను.. 30 కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతూ వేటాడగలదు. (ట్రెండింగ్‌లో అభినందన్ ‘గన్స్లింగర్’..!) 58 ఏళ్ల వయసు..అయినా భారత వైమానిక దళంలో సేవలందిస్తున్న మిగ్-21యుద్ధ విమానం వయస్సు సుమారు 58 సంవత్సరాలు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది. ప్రతిష్టాత్మక హిందుస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ దీన్ని రూపొందించింది. 1961లో తొలిసారిగా భారత వైమానిక దళంలో చేరింది. మారుతున్న కాలానికి అనుగుణంగా రూపురేఖలు మార్చుకుంది. ఐఏఎఫ్ అమ్ములపొదిలో ప్రధాన అస్త్రంగా అందుబాటులో ఉంది. మిగ్- 21 దెబ్బకు పేలిపోయిన ఎఫ్-16తో పోల్చుకుంటే.. దాని సత్తా తక్కువే. మిగ్ పూర్తి పేరు.. మికోయన్-గురేవిచ్. మొదట్లో రష్యా సంయుక్త రాష్ట్రాలు దీన్ని డిజైన్ చేశాయి. రష్యా నుంచి అనుమతి పొందిన హెచ్ఏఎల్ మిగ్-21 ఎఫ్ ఎల్, మిగ్-21ఎం, మిగ్-21 బైసన్ రకాలను రూపొందించింది. ఇక పాక్ వైమానిక దళంలో ఉన్న ఎఫ్-16 విమానలకు వైపర్ యుద్ధ విమానాలు అని కూడా అంటారు. 1980 ప్రాంతంలో వీటిని పాక్ దిగుమతి చేసుకుంది. -
భారత్- పాక్‌పై చైనా కీలక వ్యాఖ్యలు
బీజింగ్ : భారత్, పాకిస్తాన్లను అణ్వాయుధ దేశాలుగా తాము ఎన్నడూ గుర్తించలేదని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లూ కంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధాల వ్యాప్తి నివారణపై తమ వైఖరిలో ఎటువంటి మార్పు రాలేదని స్పష్టం చేశారు. శుక్రవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. భారత పైలట్ అభినందన్‌ను క్షేమంగా అప్పగించారంటూ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ప్రశంసించారు. భారత్- పాక్ ఎల్లప్పుడూ పొరుగుదేశాలే కాబట్టి పరస్పరం సహాయ సహకారాలు అందించుకోవాలని సూచించారు. ‘ ఒక్కోసారి ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొంటాయి. అయితే అన్ని వేళలా ఇరు దేశాలకు మా సహకారం ఉంటుంది. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని, తద్వారా శాంతి స్థాపనకు కృషి చేయాలని మేము సూచిస్తాం’ అని లూ వ్యాఖ్యానించారు. కాగా పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్ నేఫథ్యంలో భారత్- పాకిస్తాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు.. భారత పైలట్ అభినందన్ అప్పగింతతో తగ్గినట్లుగా కన్పిస్తున్న సంగతి తెలిసిందే. ఉగ్రవాదాన్ని విడనాడాలని, సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలని అమెరికా సహా రష్యా, చైనా పాక్‌కు సూచించాయి. ఈ క్రమంలో అంతర్జాతీయ సమాజం ఒత్తిడి మేరకే అభినందన్‌ను సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చారనేది జగమెరిగిన సత్యం. ఈ నేపథ్యంలో చైనా కూడా తమకు మద్దతు ప్రకటించకపోవడం పట్ల పాక్ విచారం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే పుల్వామా ఉగ్రదాడికి బాధ్యత వహించిన జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలంటూ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు ఐక్యరాజ్యసమితిని కోరాయి. కానీ ఈ విషయాన్ని చాలా రోజులుగా వ్యతిరేకిస్తున్న చైనా ప్రస్తుత పరిస్థితుల్లో కూడా తన వైఖరిని స్పష్టం చేయలేదు. అదేవిధంగా భారత్‌ను అణ్వాయుధ దేశంగా గుర్తించడానికి కూడా నిరాకరిస్తున్న సంగతి తెలిసిందే. -
‘చిన్న హీరోతో కావడం లేదని పీకేని తెచ్చారా’
సాక్షి, విజయవాడ : దేశ ప్రజలంతా ప్రధాని మోదీ దౌత్యాన్ని, వింగ్ కమాండర్ అభినందన్ ధైర్యసాహసాలను కొనియాడుతుంటే కొందరు మాత్రం కేంద్రం చర్యలను తప్పు పడుతున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. ఓవైపు పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సర్జికల్ స్ట్రైక్స్‌పై ప్రశంసలు వర్షం కురుస్తోంటే.. మరోవైపు రాజకీయ దురుద్దేశంతో చంద్రబాబు, పవన్ కల్యాన్, మమతా బెనర్జీ బీజేపీపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌పై నిందలు మోపీ పాకిస్తాన్లో హీరోలు కావాలని ఉబలాటపడుతున్నారని ఎద్దేవా చేశారు. పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. (ఏపీలో అవినీతి,కుటుంబ పాలన) దేశమంతా తిట్టిపోసింది.. పాకిస్తాన్‌పై భారత్ చర్యలను తప్పుబడుతూ చంద్రబాబు, మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని జీవీఎల్ అన్నారు. చంద్రబాబుకు దేశమంతా చివాట్లు పెట్టిందని చెప్పారు. దాంతో ‘యూటర్న్ బాబు’గా పేరొందిన చంద్రబాబు మాట మార్చారని తెలిపారు. జనసేన అధినేత పవన కల్యాణ్ (పీకే) కూడా ఈ మధ్య పాకిస్తాన్‌పై ప్రతీకారం విషయంలో వింతగా మట్లాడుతున్నారని జీవీఎల్ విమర్శలు గుప్పించారు. పీకే అంటే పాకిస్తాన్ షార్ట్‌కట్ అని అక్కడి జనం భ్రమపడుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభావం వల్లనే పవన్ అలా మాట్లాడుతున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఒకప్పడు పెదబాబు, చినబాబును విమర్శించే పవన్.. ఇప్పుడు వారిని పల్లెత్తు మాట కూడా అనడం లేదని చెప్పుకొచ్చారు. (అభినందన్ ఆగయా..) స్థాయి సరిపోవడం లేదని పీకేని తెచ్చారా.. నిన్నటి వరకు హీరో శివాజీతో అర్థంపర్థంలేని విమర్శలు చేయించిన చంద్రబాబు తాజాగా పవన్‌ను తెరమీదకి తీసుకొచ్చాడని జీవీఎల్ చురకలంటించారు. చిన్న హీరో స్థాయి సరిపోవడం లేదని, పెద్ద హీరోతో మాట్లాడిస్తున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. పవన్ మాటలను ప్రధానంగా పాకిస్తాన్ వాడుకుంటోందని, ఓట్ల కోసం జాతీయ భద్రత అంశాలను వాడుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా పవన్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించాలని కోరారు. ‘ఎక్కడ నెగ్గాలో కాదు. ఎక్కడ తగ్గాలో తెలిస్తేనే పవన్‌కు ప్రజాదరణ ఉంటుంది’ అని సూచించారు. సాధ్యం కాదు కాబట్టే.. విశాఖ రైల్వే జోన్‌తో ప్రధాని మోదీకి పేరొస్తుందని చంద్రబాబు గాబరా పడుతున్నారని జీవీఎల్ విమర్శించారు. కేంద్రం ప్రవేశపెట్టిన అనేక పథకాలకు స్టిక్కర్లు వేసుకునే సీఎం చంద్రబాబు రైల్వే జోన్‌కు అలా చేసే అవకాశం లేకపోవడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని ఎద్దేవా చేశారు. నిన్నటి విశాఖ బహిరంగ సభలో ఏపీకి ఏం చేశామో ప్రధాని మోదీ చెప్పారని.. చంద్రబాబు బండారాన్ని బయటపెట్టారని తెలిపారు. -
దేశమంతా చంద్రబాబును తిట్టిపోసింది
-
సరిహద్దుల్లో ఆగని కాల్పుల మోత..!
-
సరిహద్దుల్లో ఆగని కాల్పుల మోత..!
శ్రీనగర్ : ఓ వైపు అభినందన్ వర్థమాన్ విడుదలతో భారత్ పాక్ మధ్య శాంతి చర్చల ప్రక్రియ మొదలవుందని అందరూ భావిస్తుండగా.. దాయాది దేశం మాత్రం పాత పాటే పాడుతోంది. జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదేపదే ఉల్లంఘిస్తోంది. పూంచ్, రాజౌరీ జిల్లాల్లో నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి ఉన్న భారత సైనిక స్థావరాలు, జనావాసాలే లక్ష్యంగా భారీ తుపాకులు, 105 ఎంఎం హోవిట్జర్లతో విరుచుకుపడుతోంది. మోర్టార్ షెల్స్‌తో దాడికి తెగబడింది. పాక్ రేంజర్ల దాడులను భారత భద్రతా దళాలు దీటుగా తిప్పికొడుతున్నాయి. ఈ క్రమంలో ఐదుగురు భద్రతా సిబ్బంది, ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు, ఇద్దరు పోలీసులు ప్రాణాలు కొల్పోయారు. ఒక పౌరుడు, మరో ఐదుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. పూంచ్ జిల్లాలో పాక్ రేంజర్ల దాడిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయమై ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. పాక్ రేంజర్ల దాడిలో రుబానా కోసర్ (24), ఆమె కుమారుడు ఫజాన్ (5)తో పాటు తొమ్మిది నెలల కుమార్తె ఫబ్నమ్ చనిపోయినట్టు తెలిపారు. ఈ ఘటనలో రుబానా భర్త యూనిస్ గాయలతో బయటపడ్డాడని వెల్లడించారు. అంతకు ముందు పాక్ కాల్పుల్లో నసీమ్ అనే పౌరుడు తీవ్రంగా గాయపడ్డాడని తెలిపారు. గత వారం రోజుల్లో పాక్ 60 సార్లు కాల్పువ ఉల్లంఘనకు పాల్పడిందన్నారు. ఈ నేపథ్యంలో రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో ఎల్వోసీకి 5 కిలోమీటరల పరిధిలో ఉన్న విద్యాసంస్థలన్నింటినీ మూసివేయాలని ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. గతేడాది పాక్ 2,936 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. భయాందోళనలతో సరిహద్దు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్టు సమాచారం.ఉగ్రవాదుల స్థావరాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. -
ట్రెండింగ్‌లో అభినందన్ ‘గన్స్లింగర్’..!
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌పై పాక్ వైమానిక దాడులను తిప్పికొట్టే క్రమంలో మన దేశానికి చెందిన మిగ్-21 విమానం కూలిపోయిన సంగతి తెలిసిందే. దాంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ప్యారాచూట్ సాయంతో పాకిస్తాన్ భూభాగంలో దిగిపోవాల్సి వచ్చింది. అభినందన్ క్షేమంగా తిరిగి భారత్‌కు తిరిగి రావాలని యావత్ భరత ఖండం వేయి కళ్లతో ఎదురు చూసింది. పూజలు, యాగాలు చేసింది. గడిచిన మూడు రోజులుగా దేశమంతా ‘అభినందన’ స్మరణే. ఇక ప్రాణాలు పోయే పరిస్థితుల్లో కర్తవ్యం మరువలేదని, అభినందన్ ధైర్య సాహసాలపై పాక్ మీడియా కథనం కూడా ప్రచురించింది. శత్రు దేశానికి చిక్కిన అభినందన్‌ను తిరిగి తీసుకురావడానికి భారత్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. దాంతో జెనీవా ఒప్పందం ప్రకారం పాక్ మన వింగ్ కమాండర్ శుక్రవారం రాత్రి 9:21 నిముషాలకు వాఘా సరిహద్దు వద్ద అప్పగించింది. (అభినందన్ ఆగయా..) మరచిపోలేని మీసం.. ఓవైపు భారత్ వింగ్ హీరో అభినందన్ తిరిగి రావడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతోంటే.. మరోవైపు అందంగా, ఒడుపుగా తీర్చిద్దిన అభినందన్ మీసం పట్ల ఆకర్షణ మొదలైంది. తమిళ సంస్కృతిలోని ఆయన కట్టూ బొట్టూను అనుసరిచేందుకు మనోళ్లు రెడీ అయిపోయారు. ఆయనలా ‘గన్స్లింగర్’ మీసం తిప్పేందుకు సిద్ధమైపోయారు. ఇప్పుడీ గన్స్లింగర్ మీసం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇక టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అభినందన్ వీరత్వంపై ప్రశంసలు కురిపించాడు. ‘మీ వల్లే మేమేంతా నిశ్చింతగా.. గర్వంగా ఉండగలుగుతున్నాం. మీకు శిరస్సు వంచి ప్రణామాలు చేస్తున్నాం’ అంటూ ట్వీట్ చేశారు. ఇంతకూ గన్స్లింగర్ అంటే..! పురాతన కాలంలో ప్రత్యర్థి ఎత్తులకు చిక్కకుండా.. వారి సైన్యంపై గుళ్ల వర్షం కురిపిస్తూ గన్‌తో తుత్తునియలు చేసేవారిని గన్స్లింగర్ అనేవారు. ధీరత్వం, ఠీవీ కలగలిసిన గన్స్లింగర్ శత్రువుల కంటబడినా చాకచక్యంగా తప్పించుకోవడం అతని నైజం. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా తరపున పోరాడిన జనరల్ అలెగ్జాండర్ షాలర్ అభినందన్ మాదిరి గుర్రెపు డెక్క మీసం కలిగి ఉండడం గమనార్హం. అసాధారణ పోరాటపటిమ చూపిన ఈ అమెరికా జనరల్‌కు మిలటరీలో అత్యున్నతమైన మెడల్ ఆఫ్ హానర్ దక్కడం విశేషం. (‘పాక్ జవాన్లే నన్ను రక్షించారు’) (చదవండి : ఎవరీ విక్రమ్ అభినందన్?) How proud we are to have you ! Bow down to your skills and even more your grit and courage 🙏 #WelcomeBackAbhinandan . We love you and are filled with pride because of you.#WeAreSupposedToTellYouThis pic.twitter.com/IfqBFNNa3T — Virender Sehwag (@virendersehwag) 1 March 2019 -
స్వదేశానికి తిరిగొచ్చిన అభినందన్
-
ఓఐసీ సదస్సుకు పాకిస్తాన్ డుమ్మా
-
ట్రెండ్‌ని టైటిల్ చేసుకుంటున్నారు
కొత్త ట్రెండ్, హాట్ టాపిక్స్‌ను క్యాచ్ చేసి సినిమా టైటిల్స్‌గా ఫిక్స్ చేస్తుంటారు. తాజాగా ఇండియా, పాకిస్థాన్ మధ్య ఏర్పడ్డ యుద్ధ వాతావరణం సంగతి తెలిసిందే. ఈ హీట్‌ను సినిమా టైటిల్స్ రూపంలో వాడుకోవాలనుకుంటున్నారు బాలీవుడ్ దర్శక–నిర్మాతలు. ఆల్రెడీ ‘పుల్వామా ఎటాక్, సర్జికల్ స్ట్రైయిక్ 2.0, అభినందన్, హిందుస్తాన్ హమారా హై’ అనే టైటిల్స్‌ను కూడా రిజిస్టర్ చేశారట. అంతే కాకుండా ప్రస్తుతం బోర్డర్లో నెలకొన్న పరిస్థితుల ఆధారంగా వెబ్‌సిరీస్ ఐడియాలు కూడా రెడీ చేస్తున్నారట. మరి ఈ టైటిల్స్, ఐడియాలన్నీ సినిమా నిర్మాణం వరకూ వెళ్తాయా? వేచి చూడాలి. -
20వ స్క్వాడ్రన్..4 పైలట్లు...
యుద్ధం లేని సమయంలో తొలిసారి పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకుని పోయి బాలాకోట్‌లోని ఉగ్రవాద శిక్షణ శిబిరాలపై చేసిన మెరుపుదాడి భారత వైమానిక దళ ధైర్యసాహసాలకు ఓ ప్రతీక. మనదేశానికి చెందిన యుద్ధవిమానాలు వాస్తవాధీన రేఖను, పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను కూడా దాటి పాక్‌లోకి చొచ్చుకుపోవటంలో చూపిన తెగువను 1971 నాటి బంగ్లా యుద్ధంలోనూ మన వాయుసేన ప్రదర్శించింది. మన దేశానికి చెందిన ఓ నలుగురు యువ పైలట్లు ఇలాగే పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి శత్రు వైమానిక స్థావరాన్ని నాశనం చేశారు . ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్క్వాడ్రన్ లీడర్ ఆర్ఎన్ భరద్వాజ్, ఫ్లైయింగ్ ఆఫీసర్లు వీకే హెబ్లే, బీసీ కరంబయ, ఫ్లైట్ లెఫ్టినెంట్ ఏఎల్ దియోస్కర్లు ఆ ఏడాది డిసెంబర్ 8న జెట్ విమానాల్లో మురిద్ వైపు దూసుకుపోయారు. పాకిస్తాన్ సరిహద్దు నుంచి 120 కిలోమీటర్ల లోపల ఉన్న మురిద్ వైమానిక స్థావరంలో నిలిపి ఉంచిన శత్రు విమానాలను ధ్వంసం చేశారు. నాటి సాహస కృత్యాలను ఫ్లైయింగ్ ఆఫీసర్‌గా పనిచేసిన బీసీ కరంబయ నెమరు వేసుకున్నారు. ఆయన మాటల్లోనే.. ఈ ఆపరేషన్‌కు నలుగురం బయల్దేరాం. ముందు రెండు, తర్వాత రెండు విమానాలు. మొదటి రెండు విమానాలు అనుకున్న ప్రకారం ముందుకెళ్లాయి. వెనకనున్న రెండు విమానాలను ముందు వాటి కంటే ఒకటిన్నర నిముషం ఆలస్యంగా బయలు దేరమన్నాం. ఆకాశంలో కాల్పుల శబ్దం వినపడింది. నేను విమానంలో రేడియో ఆన్‌చేశాను. ముందువెళ్లిన విమానం నుంచి ‘నేను ఇప్పుడే నాలుగు ఇంజన్ల విమానాన్ని షూట్ చేశాను’అని వినిపించింది. చుట్టూ చీకటిగా ఉంది. నేను మిగ్–19 ఎస్‌ను చూశానని అనుకున్నాను. (నిజానికి అది చైనా తయారీ ఎఫ్–6 విమానం, చూడ్డానికి రష్యా మిగ్–19లాగే ఉంటుంది). దియోస్కర్ మరో విమానాన్ని గుర్తించాడు. నేను కాల్పులు జరిపాను. విమానాలకు ఇంధనాన్ని నింపే ట్యాంకరుకు మంటలంటుకున్నాయి. నేను కాల్పులు జరుపుతూనే ఉన్నాను. అప్పుడు నేను భూమికి కేవలం 300 అడుగుల ఎత్తులోనే ఉన్నాను. విమానం ఊగటం మొదలుపెట్టింది. శత్రువులు నా విమానాన్ని కాల్చారని గుర్తించాను. నేను దూకేస్తున్నానని మిగతా వారికి చెప్పాను. బయటకు దూకేందుకు విమానం తలుపు తెరుస్తుండగా, శత్రువులకు యుద్ధ ఖైదీగా చిక్కకూడదని నిర్ణయించుకున్నాను. దాంతో దూకే ఆలోచనను విరమించుకుని తక్కువ ఎత్తులో ప్రయాణించసాగాను. నా విమానం రెక్క ముందు కుడి భాగం, ఇంధన ట్యాంకులు పేలిపోవడం చూశాను. అయినా విమానం ఎగురుతూనే ఉంది. విమానం బాగా ఊగిపోయింది. అవసరమైనంత ఎత్తులో నడుపుతూ ఇండస్,సట్లైజ్ నదుల్ని దాటి భారత భూభాగంలో దిగాను’’అని తన అనుభవాన్ని చెప్పారు. 1971లో కరంబయకు వీర్‌చక్ర పురస్కారం లభించింది. ఆ తర్వాత చాలా ఏళ్లకు ఆయన పదవీ విరమణ చేశారు. మురిద్‌పై దాడి చేసిన కరంబయకు కాని ఇతర పైలట్లకు కాని తామెంత గొప్ప పని చేశామో అప్పట్లో తెలియలేదు. బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత 47 ఏళ్లకు వచ్చిన ఒక పుస్తకంలో వీరి సాహసోపేత ఘనకార్యాన్ని పొందుపరిచారు. పాకిస్తాన్‌కు చెందిన మాజీ ఎయిర్‌కమాండర్ ఎం.కైసర్ తుఫైల్ ‘ఇన్ ద రింగ్ అండ్ ఆన్ ఫస్ట్ ఫీట్– పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఇన్ ద 1971 ఇండో–పాక్ వార్’పేరుతో రాసిన తాజా పుస్తకంలో ఈ ఘటనను వివరించారు. భారత వైమానిక దళం 20వ స్క్వాడ్రన్‌కు చెందిన హంటర్ విమానాలు ముదిర్ స్థావరంలో ఉన్న 5ఎఫ్–86 విమానాలను నాశనం చేశాయని ఆయన పేర్కొన్నారు. అయితే, బంగ్లాయుద్ధం తర్వాత భారత రక్షణ మంత్రిత్వ శాఖ భారత వైమానిక దళంపై ప్రచురించిన పుస్తకంలో దీని గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
వీడియో రికార్డింగ్ వల్లే ఆలస్యం
లాహోర్: వింగ్ కమాండర్ అభినందన్‌ను భారత్‌కు అప్పగించే ముందు పాకిస్తానీ అధికారులు ఆయన చేత మాట్లాడించి ఓ వీడియోను రికార్డ్ చేశారనీ, ఈ కారణంగానే అభినందన్‌ను భారత్‌కు పంపే విషయంలో జాప్యం చోటు చేసుకుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే ఆయన చేత బలవంతంగా మాట్లాడించి ఈ వీడియో రికార్డ్ చేశారా అన్న విషయం మాత్రం స్పష్టంగా తెలియరాలేదు. వీడియోను అనేక చోట్ల భారీగా ఎడిట్ చేసిన అనంతరం పాకిస్తానీ మీడియాకు అక్కడి ప్రభుత్వం విడుదల చేసింది. అభినందన్ కొంత పాకిస్తాన్ అనుకూల వ్యాఖ్యలు చేసినట్లుగా ఆ వీడియోలో ఉంది. వర్ధమాన్ ఆ వీడియోలో చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే.. ‘నేను ఒక లక్ష్యాన్ని (దాడి చేసేందుకు) వెతుకుతుండగా పాకిస్తాన్ వైమానిక దళం నా విమానంపై దాడి చేసింది. దాంతో విమానం దెబ్బతినగా, నేను ప్యారాచూట్ సాయంతో కిందకు దూకాను. ఆ సమయంలో నా దగ్గర తుపాకీ ఉంది. అక్కడ చాలా మంది జనం ఉన్నారు. నన్ను నేను కాపాడుకోవడానికి ఒకే దారి ఉంది. తుపాకీని పడేసి పరుగెత్తేందుకు ప్రయత్నించాను. ప్రజలు నన్ను వెంబడించారు. వారు అప్పుడు తీవ్ర ఆవేశంతో ఉన్నారు. అప్పుడే ఇద్దరు పాకిస్తానీ ఆర్మీ అధికారులు నన్ను వారి నుంచి రక్షించారు. వాళ్ల యూనిట్‌కు తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేయించిన అనంతరం ఆసుపత్రిలో చేర్పించారు. పాకిస్తాన్ ఆర్మీ వృత్తి పట్ల చాలా నిబద్ధత కలిగినది. అది నన్ను ఆకట్టుకుంది’ అని అభినందన్ ఆ వీడియోలో అన్నారు. అభినందన్ విడుదలకు పాక్ హైకోర్టూ ఓకే ఇస్లామాబాద్: భారత వైమానిక పైలట్ అభినందన్ విడుదలను నిలిపేయాలని పాకిస్తాన్ పౌరుడు దాఖలుచేసిన పిటిషన్‌ను శుక్రవారం ఇస్లామాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. అభినందన్ నిబంధనలు ఉల్లంఘించి పాకిస్తాన్ గగనతలంలోకి చొరబడ్డాడని, బాంబులు విసిరి దేశానికి వ్యతిరేకంగా నేరానికి పాల్పడ్డాడని పిటిషనర్ ఆరోపించారు. ఆయనపై పాకిస్తాన్‌లోనే విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అభినందన్‌ను భారత్‌కు అప్పగించకుండా అడ్డుకోవాలని కోరారు. ఈ పిటిషన్ విచారణకు అంగీకరించిన ఇస్లామాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆదేశాలిచ్చేందుకు నిరాకరించారు. -
‘బాలాకోట్’ దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉన్న జైషే మహ్మద్ ఉగ్రవాద క్యాంపుపై భారత వాయుసేన జరిపిన దాడికి కారణాలను వివరించాల్సిందిగా పార్లమెంటరీ కమిటీ కేంద్రాన్ని కోరింది. కాంగ్రెస్ నేత శశి థరూర్ నేతృత్వంలో విదేశీ వ్యవహారాలపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీకి ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఘటన తర్వాత భారత్, పాక్‌ల మధ్య చోటుచేసుకున్న సంఘటనలను విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే శుక్రవారం వివరిం చారు. ఈ సందర్భంగా బాలాకోట్‌లో భారత వాయుసేన జరిపిన దాడి ఘటనను, ఆ తర్వాత పాకిస్తాన్ జెట్ విమానాలు భారత భూభాగంలోకి వచ్చిన అంశాన్నీ చెప్పారు. భారత్‌లోని మిలటరీ స్థావరాలపై దాడికి పాకిస్తాన్ వాయుసేన ప్రయత్నిం చిందని, అయితే భారత్ ఆ దేశ విమానాలను చాకచక్యంగా తిప్పికొట్టిందని తెలిపారు. ఆ విమానాలను వెనక్కి పంపే క్రమంలో భారత్‌కు చెందిన ఓ విమానాన్ని కోల్పోవాల్సి వచ్చిందని చెప్పారు. పాక్‌లోని ఉగ్రవాద క్యాంపుపై దాడి చేయ డానికి గల కారణాలు చెప్పాలని కమిటీ సభ్యులు ప్రశ్నించగా, ఈ విషయంలో రక్షణశాఖ సరైన సమాధానం చెప్పగలదని గోఖలే పేర్కొన్నారు. అంతర్జాతీయ ఇస్లామిక్ సమాఖ్య సభ్య దేశాలు ఈ విషయంలో భారత్‌కు మద్దతివ్వడాన్ని ఈ సందర్భంగా చెప్పారు. ఐఏఎఫ్తో పాటు భద్రతా బలగాలను కమిటీ సభ్యులు కొనియాడారు. బాలాకోట్ ఎయిర్ స్ట్రయిక్స్‌ను ఎంతో ఘనమైన, పరాక్రమమైన దాడిగా అభివర్ణించారు. పాక్ కాల్పుల ఉల్లంఘన.. ముగ్గురు దుర్మరణం జమ్మూ: దాయాది దేశం పాకిస్తాన్ వరుసగా 8వ రోజు కూడా కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. పూంచ్, రాజౌరీ జిల్లాల్లో నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంట ఉన్న భారత సైనిక స్థావరాలు, జనావాసాలే లక్ష్యంగా భారీ తుపాకులు, 105 ఎంఎం హోవిట్జర్లతో విరుచుకుపడింది. మోర్టార్ షెల్స్‌తో దాడికి తెగబడింది. దీంతో పూంచ్ జిల్లా సలోట్రి ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయమై ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. పాక్ రేంజర్ల దాడిలో రుబానా కోసర్(24), ఆమె కుమారుడు ఫజాన్(5)తో పాటు తొమ్మిది నెలల కుమార్తె షబ్నమ్ చనిపోయినట్లు తెలిపారు. ఈ ఘటనలో రుబానా భర్త యూనిస్ గాయాలతో బయటపడ్డాడని వెల్లడించారు. పాక్ జరిపిన మోర్టార్ల దాడితో పూంచ్ జిల్లాలో పలు ఇళ్లు ధ్వంసమయ్యా యని పేర్కొన్నారు. అంతకుముందు పాక్ కాల్పుల్లో నసీమ్ అక్తర్ అనే పౌరుడు తీవ్రంగా గాయపడ్డాడని అన్నారు. పాక్ రేంజర్ల దాడిని భారత బలగాలు దీటుగా తిప్పికొట్టాయని తెలిపారు. గత వారం రోజు ల్లో పాక్ 60 సార్లు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిందన్నారు. ఈ నేపథ్యంలో రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో ఎల్వోసీకి 5కి.మీ పరిధిలో ఉన్న విద్యాసంస్థలన్నింటిని మూసివేయాలని ఆదేశాలు జారీచేశామని తెలిపారు. గతేడాది పాక్ 2,936 సార్లు కాల్పులు విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. ఓ సరిహద్దు గ్రామంలో పాక్ మోర్టార్లు దాడిలో ధ్వంసమైన ఇల్లు వీరుడి తల్లిదండ్రులకు జేజేలు... న్యూఢిల్లీ: మృత్యువు ముంచుకొస్తోందని తెలిసినా కళ్లల్లో ధీరత్వం, అల్లరి మూక చావబాదుతున్నా స్థిరచిత్తంతో కూడిన మనో నిబ్బరం, మన దేశ రహస్యాలు శత్రువులకు చిక్కకూడదని డాక్యుమెంట్లు, మ్యాప్‌లు నమిలి మింగేసే సాహసం.. ఎంత మంది ఇలా చేయగలరు ? పాకిస్తాన్ చెరలో ఉన్న వైమానిక పైలట్ అభినందన్ వర్ధమాన్ నిజమైన హీరో. ఆ వీరుడి తల్లిదండ్రులకు ఢిల్లీ విమానాశ్రయంలో తోటి ప్రయాణికులు జేజేలు పలికారు. చెన్నై నుంచి బయల్దేరిన విమానం గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత రాజధాని ఢిల్లీ చేరుకుంది. కన్న కొడుక్కి స్వాగతం పలకడానికి వాఘా సరిహద్దుకు వెళ్లేందుకు అభినందన్ తల్లిదండ్రులు రిటైర్డ్ ఎయిర్ మార్షల్ సింహకుట్టి వర్ధమాన్, డాక్టర్ శోభ వర్ధమాన్లు ఆ విమానంలోనే ప్రయాణించారు. ఢిల్లీలో వారు విమానం దిగే ముందు తోటి ప్రయాణికులంతా గౌరవసూచకంగా లేచి కరతాళ ధ్వనులతో వర్ధమాన్ దంపతులే మొదట దిగడానికి దారిచ్చారు. వారు విమానంలో నడుస్తుంటే గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించారు. తామే తొందరగా దిగాలని, లగేజీని తీసుకోవాలనే ఆత్రుత ప్రయాణికుల్లో కనిపించలేదు. కొందరు యువతీ యువకులు అభినందన్ తల్లిదండ్రులకు శిరస్సు వంచి నమస్కారాలు చేశారు. మరికొందరు వారితో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. వాయు మార్గంలో కుదరదు: పాక్ న్యూఢిల్లీ: వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను అత్తారీ–వాఘా సరిహద్దులో కాకుండా వాయు మార్గంలో అప్పగించాలన్న భారత్ అభ్యర్థనను పాకిస్తాన్ తోసిపుచ్చింది. అభినందన్‌ను విడుదల చేస్తామని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ప్రకటించిన తరువాత, ఆయన్ని వాయు మార్గంలో అప్పగించాలని భారత్ కోరింది. కానీ అభినందన్‌ను రోడ్డు మార్గం ద్వారా అత్తారీ–వాఘా సరిహద్దులోనే అప్పగిస్తామని పాకిస్తాన్ స్పష్టం చేసింది. పాకిస్తాన్ అంగీకరిస్తే అభినందన్‌ను తీసుకొచ్చేం దుకు ప్రత్యేక విమానం పంపాలని రక్షణ శాఖ ప్రణాళికలు కూడా సిద్ధం చేసింది. మిగ్ విమానం కూలిపోయి పాకిస్తాన్ చెరలో ఉన్న మన పైలట్ అభినందన్‌ను భారత్‌కు తీసుకొచ్చేందుకు రెండు మార్గాలున్నాయి. ఒకటి.. ఇస్లామాబాద్ నుంచి నేరుగా ఢిల్లీకి తీసుకురావడం. రెండోది..వాఘా సరిహద్దులో స్వాగతం పలకడం. రెండో మార్గంలో అయితే వాఘా సరిహద్దులో జనసందోహాన్ని నియంత్రించడం కష్టమవుతుందని, మీడియా కంటపడకుండా అభినందన్‌ను విమానంలో తీసుకురావడమే ఉత్తమమని భారత్ భావించింది. ఇదే విషయమై పాకిస్తాన్ అధికారులతో సంప్రదింపులు జరిపారు. -
ఆ వీడియోలే కాపాడాయి
వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ విషయంలో నక్కజిత్తుల మారి అయిన పాకిస్తాన్ అంత ఔదార్యంగా ఎందుకు వ్యవహరించిందన్న ప్రశ్నలు అందరి మనసులను తొలుస్తున్నాయి. అభినందన్ నడుపుతున్న మిగ్ విమానం కూలిపోయిన ప్రాంతంలో స్థానికులు ఆయనను తీవ్రంగా కొట్టడమే కాకుండా వీడియోలు తీసి, సోషల్ మీడియాలో పోస్టు చేయడమే ఆయన ప్రాణాలు కాపాడాయన్న విశ్లేషణలు వస్తున్నాయి. సోషల్ మీడియా విస్తృతి పెరగడమే అభినందన్‌ను రక్షించిందని 1971 పాకిస్తాన్ యుద్ధం సమయంలో పాక్ ఆర్మీకి చిక్కి దాదాపు ఏడాది పాటు బందీగా ఉన్న ఎయిర్ కమాండర్ జేఎల్ భార్గవ అభిప్రాయపడుతున్నారు. ‘అభినందన్‌పై ఆ అల్లరి మూక దాడి చేసి, వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టకపోతే ఏం జరిగేదో మనం ఊహించలేం. అభినందన్ ప్రాణాలతో ఉన్నాడని చెప్పడానికి ఎలాంటి ఆధారాలుండేవి కావు. అభినందన్ తమ దగ్గరే లేడని పచ్చి అబద్ధాలు చెప్పే పాకిస్తాన్ బుకాయించి ఉండేది. ఇక మిగిలిన జీవితం అంతా ఆయన పాక్‌లోనే ఊచలు లెక్కించాల్సి వచ్చేది. అభినందన్ అదృష్టవంతుడు కాబట్టి ఆయన వీడియోలు విపరీతంగా ప్రాచుర్యం పొందాయి. దెబ్బకు పాక్ దారికి వచ్చి అభినందన్‌ను భారత్‌కు అప్పగించింది’అని 77 ఏళ్ల భార్గవ పేర్కొన్నారు. 1971 పాక్ యుద్ధం సమయంలో ఆ దేశానికి పట్టుబడ్డ 12 మంది భారత పైలట్లలో భార్గవ ఒకరు. హరియాణాలోని పంచ్కులలో ఆయన విశ్రాంత జీవితం గడుపుతున్నారు. ఒకప్పుడు తనకు ఎదురైన అనుభవాల్ని ఆయన పంచుకున్నారు. అల్లరి మూకలతో ఎప్పుడూ ప్రమాదమే పాకిస్తాన్లో పనీపాట లేకుండా భారత్‌పై ద్వేషభావంతో రగిలిపోయే అల్లరిమూకలతో ఎప్పుడూ ప్రమాదమే. అభినందన్ వారి బారిన పడినా ప్రాణాలతో బయటపడటానికి అక్కడి ఆర్మీయే కారణం. ఆర్మీ అప్పుడు రాకపోయింటే అభినందన్ పరిస్థితి ఊహించుకోవడానికే భయంగా ఉంది. 1965 యుద్ధం సమయంలో కూడా లెఫ్టినెంట్ హుస్సేన్ ఇలాగే పాక్‌లో అల్లరి మూకలకు చిక్కారు. వాళ్లు కొట్టిన దెబ్బలకి అతడు చనిపోయేవాడే. తన పేరు చెప్పడంతో ముస్లిం కాబట్టి కొట్టిన వారే ఆసుపత్రికి తీసుకువెళ్లి రక్తం ఇచ్చి బతికించారు. పాక్ ఆర్మీ ప్రశ్నలతో చంపేస్తుంది 1971 డిసెంబర్ 5న పాక్‌తో యుద్ధం తీవ్రస్థాయిలో జరుగుతున్న సమయంలో బర్మార్ నుంచి పైలట్ భార్గవ హిందూస్తాన్ ఫైటర్ 24 విమానాన్ని నడుపుతుండగా పాక్ ఆర్మీ దాన్ని కూల్చేసి ఆయన్ను నిర్బంధించింది. ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి తీవ్రమైన ఒత్తిడికి లోను చేసింది. నిద్ర కూడా పోనివ్వకుండా అధికారులు వచ్చి అడిగిన ప్రశ్నలే మళ్లీ అడుగుతుంటారు. ఎంతటి శిక్షణ పొందిన సైనికుడికైనా ఆ ఒత్తిడి భరించడం కష్టం. ఒకసారి ఏం చెబితే మళ్లీ అదే చెప్పాలి. లేదంటే దొరికిపోతాం. ‘‘భారత వాయుసేన గురించి వాళ్లు నన్ను ఎన్నో ప్రశ్నలు వేశారు. తోటి పైలట్ల వివరాలు అడిగారు. మీ బ్యాచ్‌లో అత్యుత్తమ పైలట్ ఎవరు అని వారు అడిగితే, ‘అతను మీ ముందే కూర్చున్నాడు’అని బదులిచ్చాను’’అని భార్గవ చెప్పారు. ఇది జరిగిన ఏడాది తర్వాత కానీ భార్గవ పాక్‌కు బందీగా చిక్కారన్న విషయం ప్రపంచానికి తెలియలేదు. మొత్తానికి భారత్ ప్రయత్నాలు ఫలించి ఆయన క్షేమంగా వెనక్కి వచ్చారు. అప్పటి పంజాబ్ సీఎం జ్ఞానీ జైల్‌సింగ్ వాఘా సరిహద్దుల దగ్గర తనకు స్వాగతం పలికారని ఆ నాటి అనుభవాల్ని గుర్తు చేసుకున్నారు. -
అభినందన్ ఈ పరీక్షలు... పాసైతేనే...
ఎట్టకేలకు అభినందన్ భారత్‌లో అడుగుపెట్టారు. అన్ని ప్రక్రియలు ముగిసినా 2 రోజులపాటు పాక్ ఆర్మీకి చిక్కడంతో అభినందన్‌కు కొన్ని పరీక్షలైతే తప్పనిసరిగా నిర్వహించాలి. పరాయిదేశానికి చిక్కిన వారు తిరిగి మాతృభూమికి చేరుకున్నప్పుడు కచ్చితంగా కొన్ని నియమ నిబంధనలైతే పాటిస్తారు. అవేంటంటే.. ► అభినందన్‌ను నేరుగా భారత వాయుసేన ఇంటెలిజెన్స్ యూనిట్‌కు అప్పగిస్తారు. ► అభినందన్ శారీరకంగా ఎంత ఫిట్నెస్తో ఉన్నారో కొన్ని వైద్య పరీక్షలు చేస్తారు. ► శత్రు దేశం ఆయన దుస్తుల్లో కానీ, శరీర భాగాల్లో కానీ ఏమైనా బగ్‌లు.. అంటే గూఢచర్యానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలు అమర్చిందేమోనన్న అనుమానం తీర్చకోవడానికి శరీరం మొత్తం బగ్ స్కాన్ చేస్తారు. ► వింగ్ కమాండర్ మానసిక స్థితి ఎలా ఉందో కూడా పరీక్షలు చేసి తెలుసుకుంటారు. శత్రు దేశానికి చిక్కిన తర్వాత వాళ్లేమీ అతిథి మర్యాదలు చేయరు. ప్రత్యర్థి దేశ రక్షణ రహస్యాలను తెలుసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేస్తారు. ఎవరైనా పెదవి విప్పకపోతే చిత్రహింసలు పెడతారు. ఆ ఒత్తిడిని తట్టుకోలేక దేశ రహస్యాలేమైనా చెప్పారేమోనన్న దిశగా అభినందన్‌ను విచారిస్తారు. ► ఆ తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), రీసెర్చ్ అనాలసిస్ వింగ్ (రా) అధికారులు కూడా అభినందన్‌ను క్షుణ్నంగా విచారిస్తారు. ► సాధారణ యుద్ధ ఖైదీలైతే ఈ రెండు సంస్థల విచారణ చేయనక్కర్లేదు. కానీ అభినందన్‌ను యుద్ధఖైదీగా పరిగణించాలో అక్కర్లేదో అన్న సందేహాలు ఉండటంతో ఐబీ, రా అధికారులు కూడా ప్రశ్నలు వేస్తారు. సందేహాల నివృత్తి తర్వాతే ఇంటికి.. మొత్తం వ్యవహారంలో ఐఏఎఫ్ ఇంటెలిజెన్స్ అధికారుల విచారణే అత్యంత క్లిష్టమైన ప్రక్రియని పేరు చెప్పడానికి ఇష్టపడని ఐఏఎఫ్ అధికారి ఒకరు వెల్లడించారు. అభినందన్ పాక్ ఆర్మీకి బందీగా ఉన్న సమయంలో ఎంత ధీరత్వాన్ని ప్రదర్శించినప్పటికీ, భారతీయ అధికారులకు ఆయనంటే ఎంత గౌరవం ఉన్నప్పటికీ ఇంటెలిజెన్స్‌కి ఉండే అనుమానాలు ఉంటాయి. పాక్‌లో బందీగా ఉన్నప్పుడు వాళ్లు ఏ ప్రశ్నలు వేశారు? ఎలాంటి సమాచారం రాబట్టడానికి ప్రయత్నించారు? వాళ్లు పెట్టే టార్చర్ భరించలేక లొంగిపోయి వారి గూఢచారిగా తిరిగి మన దేశానికి వచ్చారా? ఇలాంటి సందేహాలన్నీ పూర్తిస్థాయిలో నివృత్తి అయ్యాకే అభినందన్‌ను ఇంటికి వెళ్లనిస్తారు. ఆ తర్వాతే విధుల్లోకి తీసుకుంటారని వివరించారు. చదవండి...(అభినందన్ ఆగయా..) కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు పాక్‌కి చిక్కి భారత్‌కు తిరిగి వచ్చిన పైలట్ కె.నచికేతను విచారించిన సమయంలో దగ్గరుండి ఈ వ్యవహారాలన్నీ చూశానన్నారు. ఫీల్డ్ మార్షల్ కరియప్ప కుమారుడు కేసీ నంద కరియప్పను 1965 యుద్ధ సమయంలో బంధించి తిరిగి వచ్చాక జరిగిన ఘటనలపై ఆ అధికారి పూర్తిస్థాయిలో అధ్యయనం చేశారు. పాక్ వారిని ఎన్ని రకాలుగా ఒత్తిడి చేసినా భారత్ రహస్యాలు వాళ్లు బయటపెట్టలేదని చెప్పారు. అభినందన్ విషయంలో కూడా తమకు ఆ నమ్మకం ఉందని, కానీ తప్పనిసరిగా చేయాల్సిన పరీక్షలు, విచారణలు చేయాల్సిందేనని చెప్పారు. అభినందన్ అయినా, మరో యుద్ధ ఖైదీ అయినా ఈ విధివిధానాలు పూర్తి చేసినప్పుడు ఎంతో గౌరవం ఇస్తామని చెప్పారు. -
నిర్ణయం పాక్ చేతుల్లోనే...
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం పాకిస్తాన్‌కు గట్టి సందేశం ఇచ్చిందనీ, ఇక మనతో సంబంధాలు ఎలా ఉండాలన్నది ఇప్పుడు ఇస్లామాబాద్ నిర్ణయించుకోవాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పేర్కొన్నారు. దేశ వర్తమాన పరిస్థితులపై ప్రముఖులతో చర్చలు నిర్వహించేందుకు ఇండియా టుడే మీడియా గ్రూపు నిర్వహిస్తున్న ఇండియా టుడే కాంక్లేవ్–2019 శుక్రవారం ఢిల్లీలో ప్రారంభమైంది. శనివారం కూడా ఈ కార్యక్రమం కొనసాగనుంది. తొలి రోజు సదస్సును ప్రారంభిస్తూ ఇండియా టుడే ఎడిటర్ ఇన్ ఛీఫ్ అరుణ్ పురీ స్వాగతోపాన్యాసం ఇచ్చారు. ‘రానున్న ఎన్నికలు అనేక మౌలిక ప్రశ్నలకు సమాధానం ఇచ్చేవి. సంకీర్ణ ప్రభుత్వాల కంటే సంపూర్ణ మెజారిటీ గల ప్రభుత్వం మంచి పాలన అందిస్తుందా? దేశం ఒక గట్టి ఆధిపత్యం ఉండే నాయకుడిని కోరుకుంటోందా? లేక కేవలం మంచి టీమ్‌ను కోరుకుంటోందా? పుల్వామా దాడి ఘటన ఎన్నికలపై ఏమేర ప్రభావం చూపుతుంది.. వంటి అనేక ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది’ అని పేర్కొన్నారు. ఇక కాంక్లేవ్‌లో తొలి వక్త బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ‘ఎన్నికల డైరీలు: విజయాలు, ఓటములు, ప్రజాస్వామిక రణక్షేత్ర సారాంశం’ అనే అంశంపై ప్రసంగించారు. ‘మోదీ నాయకత్వంలో దేశం పాకిస్తాన్‌కు గట్టి సందేశం ఇచ్చింది. సంబంధాలు ఎలా ఉండాలన్నది ఇప్పుడు ఇస్లామాబాద్ నిర్ణయించుకోవాలి’ అని పేర్కొన్నారు. పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ఖాన్ పుల్వామా దాడిని ఖండించకపోవడంపై ఆయన మండిపడ్డారు. సాంస్కృతిక వైరాలపై కాంగ్రెస్ నేత శశిథరూర్, బీజేపీ నేత వినయ్ సహస్ర బుద్దే ప్రసంగించారు. మహిళా శక్తిపై క్రీడాకారులు మేరీకోమ్, మిథాలీ రాజ్ ఉపన్యాసాలు ఇచ్చారు. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ దేశభక్తి అనే అంశంపై ప్రసంగించారు. శనివారం మోదీతోపాటు పలువురు వక్తలు ప్రసంగించనున్నారు. ప్రధాని రేసులో లేను: గడ్కరీ ఈ సదస్సులో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ‘బీజేపీ రాజకీయ విజయాలకు రోడ్‌మ్యాప్’ అన్న అంశంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా సమన్వయకర్త అడిగిన ప్రశ్నకు గడ్కరీ స్పందిస్తూ ‘మేమంతా మోదీ వెనక ఉన్నాం. ఆయన విజన్ విజయవంతం చేయడంలో నేనొక కార్యకర్తను. ఇక ప్రధాన మంత్రి పదవి రేసులో నేనున్నానన్న ప్రశ్న ఎక్కడ తలెత్తుతుంది?’ అని ప్రశ్నించారు. ‘మోదీ ప్రధానమంత్రి. తదుపరి ప్రధాన మంత్రి కూడా ఆయనే. నేను ప్రధాన మంత్రి రేసులో లేను. అలాంటి కల నేను కనలేదు’ అని వ్యాఖ్యానించారు. పైలట్ పాక్ చెరలో ఉంటే.. ఎన్నికల భేటీలా? ‘కాంగ్రెస్ సన్నాహాలు, ఆత్మపరిశీలన’ అన్న అంశాలపై కాంగ్రెస్ నేతలు సచిన్ పైలట్, జ్యోతిరాధిత్య సింధియా ప్రసంగించారు. ‘పాక్ ప్రతీకార దాడుల్ని వీరోచితంగా అడ్డుకొని పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్– 16 యుద్ధ విమానాన్ని నేలకూల్చిన మన పైలట్ ఆ క్రమంలో తన విమానం శత్రు భూభాగంలో నేలకూలడంతో పాక్‌కు బందీగా చిక్కాడు. ఈ పరిస్థితుల్లో దేశం మొత్తం తీవ్ర ఉద్విగ్న స్థితిలో ఉంటే మన ప్రధాని మాత్రం బూత్ కమిటీ సభ్యులతో రాజకీయ సమావేశం నిర్వహించడం నన్ను విస్మయానికి గురిచేసింది. పైలట్ పాక్‌లో చిక్కుకుంటే మోదీ ఎన్నికల భేటీలు నిర్వహించడం ఎంత వరకు సమంజసం?’ అని సింధియా ప్రశ్నించారు. రాజస్తాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మాట్లాడుతూ ‘ఒకవైపు పాక్ దాడులకు తెగబడుతుంటే ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి ముందుండి దేశానికి దిశా నిర్దేశం చేయాలి. ఆ సమయంలో ప్రధాని జాతినుద్దేశించి మాట్లాడి ఉండాల్సింది. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తే దేశంలోని రాజకీయ పార్టీలన్నీ ఏకతాటిపై ఉన్నాయని ప్రపంచానికి చాటిచెప్పినట్లయ్యేది’ అని అన్నారు. -
పాక్‌లోనే మసూద్ అజార్
ఇస్లామాబాద్: ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ పాక్‌లోనే ఉన్నాడని పాక్ విదేశాంగ మంత్రి మహమూద్ ఖురేషి అంగీకరించారు. అజార్ ప్రస్తుతం ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టలేనంతగా అనారోగ్యంతో బాధపడుతున్నాడన్నారు. అజార్‌కు సంబంధించి పాకిస్తాన్ కోర్టుల్లో గట్టి సాక్ష్యాలను భారత్ సమర్పిస్తే అతనిపై తమ ప్రభుత్వం∙చర్యలు తీసుకుంటుందని చెప్పారు. చట్టపరమైన ప్రక్రియ చేపట్టడానికి తగిన ఆధారాలు ఉండాలన్నారు. పుల్వామా ఉగ్రదాడి, భారత్ సర్జికల్ దాడుల తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో మసూద్ తమ దేశంలోనే ఉన్నాడని పాక్ ప్రకటించడం గమనార్హం. ఇప్పటికే మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని ఐక్యరాజ్యసమితిలో భారత్ ప్రతిపాదించిన విషయం తెల్సిందే. పుల్వామా దాడుల్లో జైషే పాత్ర, పాక్‌లో జైషే ఉగ్ర శిబిరాల వివరాలపై పాక్‌కు భారత్ అనేక సాక్ష్యాలను ఇప్పటికే అందించింది. కాగా, పైలట్ అభినందన్‌ను భారత్‌కు అప్పగించడం శాంతి ప్రక్రియలో భాగమని ఖురేషి తెలిపారు. -
అభినందన్ ఆగయా..
వాఘా/అట్టారీ : శత్రు దేశ యుద్ధ విమానాన్ని తరుముతూ సరిహద్దు దాటి వెళ్లి పాకిస్తాన్‌కు చిక్కిన భారత వైమానిక దళ పైలట్ అభినందన్ వర్థమాన్ సురక్షితంగా స్వదేశం చేరుకున్నారు. పాకిస్తాన్ అధికారులు అభినందన్‌ను శుక్రవారం రాత్రి అట్టారీ–వాఘా సరిహద్దులో భారత అధికారులకు అప్పగించారు. వైమానిక దళ అధికారులు, వేలాది మంది ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. డాక్యుమెంటేషన్, విధానపర ప్రక్రియ కారణంగా ఆయన అప్పగింత కొన్ని గంటల పాటు ఆలస్యమైంది. స్వదేశం తిరిగొచ్చినందుకు సంతోషంగా ఉందని ఆయన అధికారులకు చెప్పారు. అభినందన్‌ను ఆ వెంటనే ప్రత్యేక వాహనంలో అక్కడి నుంచి తీసుకెళ్లారు. తరువాత వైద్య పరీక్షల నిమిత్తం ప్రత్యేక విమానంలో అమృత్సర్ నుంచి ఢిల్లీకి తరలించారు. ఆర్మీ, నిఘా అధికారుల పర్యవేక్షణలో శనివారం అభినందన్ మానసిక, భౌతిక ఆరోగ్య పరిస్థితిని పరిశీలించనున్నారు. అభినందన్ రాకతో దేశవ్యాప్తంగా సంబరాలు ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తదితరులు అభినందన్ స్వదేశం చేరుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. అభినందన్ యుద్ధఖైదీయే అని ఆయన్ని అప్పగించిన తరువాత పాకిస్తాన్ వ్యాఖ్యానించింది. పాకిస్తాన్ ప్రతీకార దాడుల్ని తిప్పికొట్టే క్రమంలో ఫిబ్రవరి 27న పీఓకేలో మిగ్–21 విమానం కూలిపోయి అభినందన్ పాకిస్తాన్ బలగాలకు దొరికిపోయిన సంగతి తెలిసిందే. భారత్‌తో పాటు అంతర్జాతీయ సమాజం తీసుకొచ్చిన ఒత్తిడికి తలొగ్గిన పాకిస్తాన్‌ను ఆయన్ని విడుదలచేసేందుకు అంగీకరించింది. తాజా పరిణామంతో ఇరు దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం తొలగిపోయేందుకు ముందడుగు పడినట్లయింది. ఆలస్యంగా అప్పగింత.. అభినందన్‌ను విడుదల చేస్తామని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ప్రకటించడంతో తమ యుద్ధ హీరో రాక కోసం భారత్ ఎంతో ఉద్వేగంగా ఎదురుచూడసాగింది. శుక్రవారం ఉదయం నుంచే అభినందన్‌కు స్వాగతం పలికేందుకు అట్టారీ–వాఘా సరిహద్దుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. కానీ కొన్ని లాంఛనాల వల్ల అభినందన్ అప్పగింత ప్రక్రియ ఆలస్యమైంది. తొలుత సాయంత్రం నాలుగు గంటలకు అప్పగిస్తారని భావించినా, తరువాత సాయంత్రం 6.30 గంటలకు వాయిదా పడింది. చివరకు నలుపు రంగు జాకెట్, ఖాకీ ప్యాంటు ధరించిన అభినందన్ రాత్రి 9.10 గంటలకు పాకిస్తాన్ వైపున్న వాఘా చెక్‌పోస్టును దాటి రెండు దేశాలను వేరుపరుస్తున్న గేటు వైపు నడిచారు. ఆ సమయంలో ఆయన వెంట పాకిస్తాన్ రేంజర్లు, ఇస్లామాబాద్ హైకమిషనర్‌లో భారత వైమానిక దళ అధికారి ఉన్నారు. అట్టారీ–వాఘా సరిహద్దులో అధికారిక లాంఛనాలు ముగిసిన తరువాత 9.21 గంటలకు పాకిస్తాన్ అధికారులు అభినందన్‌ను బీఎస్ఎఫ్ అధికారులకు అప్పగించారు. తరువాత వైమానిక దళ అధికారులు ఆయన్ని అక్కడి నుంచి తీసుకెళ్లారు. అభినందన్ ధైర్యసాహసాల పట్ల దేశం గర్విస్తోందని ప్రధాని మోదీ అన్నారు. సాయుధ బలగాలు 130 కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తిగా నిలుస్తారని కొనియాడారు. ఉప్పొంగిన దేశభక్తి.. భారత్ మాతాకీ జై, వందేమాతరం..నినాదాలతో భారత్–పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతం మార్మోగింది. పాకిస్తాన్ నుంచి విడుదలవుతున్న వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌కు ఘన స్వాగతం పలికేందుకు అట్టారీ–వాఘా సరిహద్దులో శుక్రవారం ఉదయం నుంచే ప్రజలు భారీ ఎత్తున గుమిగూడారు. దేశభక్తి గీతాలు ఆలపిస్తూ, డప్పులు వాయిస్తూ, త్రివర్ణ పతాకాలు ప్రదర్శిస్తూ, మిఠాయిలు పంచుకుంటూ కోలాహలం సృష్టించారు. ఒక్కడి కోసం గంటల తరబడి నిరీక్షిస్తూ తమ దేశభక్తిని చాటుకున్నారు. పలువురు తమ ముఖాలపై త్రివర్ణ పతాకాలను పచ్చబొట్టుగా వేసుకున్నారు. అమృత్సర్ డిప్యూటీ మేయర్ రమణ్ బక్షి కూడా ప్రజలతో కలసి పాటలు పాడారు. గజమాలతో సమీప ప్రాంతానికి చెందిన ఓ సిక్కు యువకుడు, డోలు వాయిస్తూ ఓ వృద్ధుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అధికారులు అనుమతిస్తే తన వద్ద ఉన్న గజమాలతో అభినందన్‌కు స్వాగతం పలుకుతానని ఆ యువకుడు సంబరంతో చెప్పాడు. తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి దేశం కోసం పోరాడిన యోధుడిని నేరాగా చూడబోతున్నందుకు గర్వంగా ఉందని ఢిల్లీకి చెందిన యువ పర్యాటకురాలు నేహ ఆనందంతో ఉబ్బితబ్బిబయింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. పంజాబ్ పోలీసులను కూడా భారీ సంఖ్యలో మోహరించారు. నిరీక్షణ.. నిరీక్షణ.. అట్టారీ–వాఘా సరిహద్దులో వేలాది మంది ప్రజలు, మీడియా ప్రతినిధులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు వెయిటింగ్....దేశవ్యాప్తంగా కోట్లాది మంది టీవీలకు అతుక్కుపోయి వెయిటింగ్. అందరూ ఎదురుచూస్తున్నది ఒక్కడి కోసమే. మధ్యాహ్నం గడిచింది. సాయంత్రం వచ్చింది. అంతలోనే చీకటి కూడా పడింది. అమృత్సర్ వర్షంలో తడిసి ముద్దయింది. అయినా అదే ఉత్కంఠ, ఉత్సాహం. అభినందన్‌ను విడుదల చేస్తామని పాకిస్తాన్ ప్రకటించినా.. ఆయన ఎప్పుడు మాతృభూమిపై అడుగుపెడుతాడని రోజంతా దేశం నిరీక్షించింది. ప్రాంతీయ, జాతీయ స్థాయి అనే తేడా లేకుండా అన్ని టీవీ చానెళ్లలో భారత్, పాకిస్తాన్ సంబంధాలపై ఎడతెగని చర్చ, నిపుణుల వ్యాఖ్యలు, అభినందన్ విడుదలపై సమాచారం కోసం ఎదురుచూపులతో రోజంతా హడావుడిగా గడిచిపోయింది. దేశభక్తితో దేశం మొత్తం కనెక్ట్ అయిపోయింది. అహ్మదాబాద్‌లో గార్బా నృత్యాలు, బెంగళూరులో జోష్ నృత్యాలు, పూరిలో సైకత శిల్పం, పలు ప్రాంతాల్లో యజ్ఞాలు నిర్వహించారు. రోజూవారీ పనులు చేసుకుంటూనే..అభినందన్ భారత్‌లో అడుగుపెట్టాడన్న సమాచారం కోసం ఓ కన్ను టీవీలు, మొబైల్లపై వేశారు. అట్టారీ అవతలి నుంచి ఏ కారొచ్చినా, అందులో అభినందన్ ఉన్నాడా? అన్న ఆసక్తి పెరుగుతూనే ఉంది. లేకపోతే ఆయన్ని నేరుగా ఢిల్లీకే తీసుకెళ్తారా? మీడియాతో మాట్లాడనిస్తారా?..ఇలా అధికారిక సమాచారం కొరవడి, ఊహాగానాలు ఊపందుకున్నాయి. అత్తారీలో పొద్దుపోయే వరకూ వేచి చూసిన ప్రజలు నెమ్మదిగా వెనుదిరగగా, కొందరు పాత్రికేయులు అక్కడే ఉన్నారు. ఏదేమైనా అభినందన్ రాకకోసం సుదీర్ఘ నిరీక్షణ కొనసాగింది. హర్షం వ్యక్తం చేసిన ప్రముఖులు వింగ్ కమాండర్ వర్ధమాన్ అభినందన్‌కు సుస్వాగతం. మీ అసమాన ధైర్యసాహసాల పట్ల యావత్ దేశం గర్విస్తోంది. భారత సాయుధ బలగాలు దేశ ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. వందేమాతరం’ – ప్రధాని నరేంద్ర మోదీ అభినందన్ వర్ధమాన్ మీ హుందాతనం, స్థిర చిత్తం, ధైర్య సాహసాలు మాలో ప్రతీఒక్కరినీ గర్వపడేలా చేశాయి. సొంతగడ్డకు సుస్వాగతం. మిమ్మల్ని మేమంతా ప్రేమిస్తున్నాం – కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రియమైన అభినందన్.. దేశమంతా మీ ధైర్యసాహసం, పరాక్రమంపై గర్వపడుతోంది. మీరు సురక్షితంగా తిరిగిరావడంపై భారతీయులందరూ సంతోషంగా ఉన్నారు. ఇదే అంకితభావం, ఉత్సాహంతో మీరు ఐఏఎఫ్, భారత్‌కు సేవలందించాలని ఆశిస్తున్నా. – బీజేపీ చీఫ్ అమిత్ షా భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ క్షేమంగా, ఆరోగ్యంగా తిరిగి రావాలని భగవంతుడిని ప్రార్థించాను. ఈ సమయంలో అభినందన్‌కు, ఆయన కుటుంబసభ్యులకు దేవుడు మనోస్థైర్యం, శక్తి, ధైర్యాన్ని ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నాను. – వైఎస్ జగన్మోహన్రెడ్డి చదవండి: ‘అభినందన్ వీడియోలను తొలగించిన యూట్యూబ్’ ట్రెండింగ్: వెల్కమ్ బ్యాక్ అభినందన్ తొలిసారి మోదీ నోట అభినందన్ మాట ‘బాలకోట్’లో భారత్ గురి తప్పిందా?! -
ఐదు నిమిషాలు ఉండలేరు
ధులే: పుల్వామా దాడి తర్వాత దేశమంతా ఐక్యమైందంటూనే మోదీ కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ మండిపడ్డారు. అప్పుడే ఐక్యతారాగం.. అంతలోనే రాజకీయం చేయడం ఆయనకే చెల్లిందన్నారు. పబ్లిసిటీ లేకుండా కేవలం 5 నిమిషాలు కూడా ప్రధాని ఉండలేరని ధ్వజమెత్తారు. మహారాష్ట్రలోని ధులే జిల్లాలో నిర్వహించిన ర్యాలీలో రాహుల్ మాట్లాడారు. పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ కాగితపు విమానాలు కూడా తయారు చేయలేరని ఎగతాళి చేశారు. ‘పుల్వామా దాడి తర్వాత ప్రభుత్వాన్ని ఎవరూ విమర్శించొద్దని మా పార్టీ నేతలకు, కార్యకర్తలకు చెప్పాను. మనదేశం చేస్తున్న పోరాటానికి అందరం అండగా నిలవాలి’అని ఆయన అన్నారు. ‘పుల్వామా ఉగ్రదాడుల తర్వాత దేశం మొత్తం ఒక్కటైందని మీడియా ముందు చెబుతారు. వెనువెంటనే ఢిల్లీలో జరిగిన అమర వీరుల స్మారకం ప్రారంభోత్సవంలో మమ్మల్ని విమర్శిస్తారు. ఈ ప్రధాని పబ్లిసిటీ లేకుండా 5 నిమిషాలు ఉండలేరు’ అని విమర్శించారు. పీఎం కిసాన్ సమ్మన్ పథకం ద్వారా ఒక్కో రైతు కుటుంబానికి రోజుకు రూ.17 అందుతాయన్నారు. ‘కుటుంబంలోని ఒక్కొక్కరికి విడిగా లెక్కేస్తే రూ.3.5 వస్తుంది. రూ.3.5 లక్షల పంట రుణం ఉంటే మరోవైపు రూ.3.5 ఇవ్వడానికి మోదీ సిగ్గుపడాలి’ అని అన్నారు. -
వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం
సాక్షి ప్రతినిధి, చెన్నై/కన్యాకుమారి: ఉగ్రవాదులపై పోరాటం విషయంలో భారత్ ఇకపై నిస్సహాయంగా ఉండబోదని ప్రధాని మోదీ తెలిపారు. ఉగ్రమూకలు దుశ్చర్యలకు పాల్పడితే వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు. తమిళనాడు పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన మోదీ, విపక్షాల తీరును ఎండగట్టారు. ఎవరివైపు ఉన్నారో స్పష్టం చేయండి.. ఐఏఎఫ్ పైలెట్, వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పట్ల దేశమంతా గర్వపడుతోందని మోదీ తెలిపారు. భారత తొలి మహిళా రక్షణమంత్రిగా తమిళనాడుకు చెందిన నిర్మలా సీతారామన్ ఉండటంపై నేను గర్వపడుతున్నానని వెల్లడించారు. బాలాకోట్ జైషే స్థావరంపై వైమానిక దాడి, పాక్‌కు చెందిన ఎఫ్–16ను కుప్పకూల్చడం ద్వారా భారత సాయుధ బలగాల సామర్థ్యం మరోసారి తేటతెల్లమయిందన్నారు. కానీ కొందరు రాజకీయ నేతల వ్యాఖ్యలు దేశానికి చేటు చేసేలా, పాకిస్తాన్‌కు లబ్ధి చేకూర్చేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా నేతలు భారత బలగాలవైపు ఉన్నారా? లేక స్వదేశంలో ఉగ్రవాదానికి ఊతమిచ్చేవారి తరఫున ఉన్నారా? అన్నది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఐఏఎఫ్ సిద్ధమైనా యూపీఏ ఒప్పుకోలేదు మోదీ తాత్కాలికమనీ, దేశమే శాశ్వతమని ప్రధాని అన్నారు. 2008లో ముంబై ఉగ్రదాడుల సందర్భంగా ఉగ్రవాదులను శిక్షిస్తారని దేశమంతా భావించినప్పటికీ అప్పటి యూపీఏ ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. అప్పట్లో భారత వాయుసేన సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ కేంద్రం అనుమతించలేదని ఆరోపించారు. కానీ ఎన్డీయే ప్రభుత్వం ఉగ్రవాదుల ఏరివేత విషయంలో సాయుధ బలగాలకు పూర్తిస్వేచ్ఛ ఇచ్చామన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 1.1 కోట్ల మంది రైతులకు రూ.2,000 చొప్పున ఆర్థిక సాయం అందించామని తెలిపారు. -
అగ్గి తిరునాళ్లు
భారత పౌరుషానికి, ప్రతీకారాగ్నికి బాలాకోట్ బూడిదగుట్టయింది. మన వీరుల ధైర్యసాహసాలకి గురి తప్పని దృఢ సంక ల్పానికి బాలాకోట్ బాంబుదాడి చిన్న శాంపిల్. కోట్లాదిమంది భారత ప్రజానీకానికి కొండంత ధైర్యం మన త్రివిధ దళాలు. వారిని మనసారా అభినందిస్తూ, వారి త్యాగనిరతికి నీరాజనాలర్పిస్తోంది. మన బలగాల్లో నలభైమందిని దొంగదెబ్బతో పొట్టన పెట్టుకున్న ఉగ్రమూకను సరిగ్గా అది జరిగిన పన్నెండో రోజున ఉగ్రవాద శిబిరాన్ని సమాధి చేశారు. ప్రాణానికి పది ప్రాణాలు బలి తీసుకుని మన వీరులకు ఆత్మశాంతి కావించారు. అప్పటిదాకా ఉడికిపోతున్న భారత జాతి కొద్దిగా చల్లబడింది. అయినా, అకారణంగా పోయిన మనవారు తిరిగిరారు. ఆ నష్టం, ఆ బాధ ఎన్నటికీ తీరనిది. యుద్ధ క్షేత్రంలో ఎన్నో దళాలు, ఎన్నో శాఖలు ప్రాణాలకు తెగించి పనిచేస్తుంటాయ్. వాహనాలకి ఇంధనం నింపేవారి నించి, వైద్య సేవలందించే కాంపౌండర్లు, నర్సుల దాకా యుద్ధం గెలుపుకి కీలక కారకులే. ఆ రోజు అత్యంత విజయవంతంగా నడిపించిన ఉగ్ర శిబిర విమాన దాడిని ప్రధాని మోదీ స్వయంగా పర్యవేక్షించినట్టు వార్తా కథనాలు వెలువడ్డాయ్. గురి తప్పకుండా బాంబులవాన కురిపించి, ఉగ్రమూకల్ని బూడిదగుట్టలుగా మిగిల్చి, అన్ని యుద్ధ విమానాలూ విజయోత్సాహంతో మాతృభూమిపై వాలిన తర్వాతే ప్రధాని నిద్రకు ఉపక్ర మించారట. ఇంత మాత్రం చొరవ దేశ ప్రధానికి ఉండటం అభినందనీయమే గానీ ఆశ్చర్య కారకం కాదు. సొంతగడ్డమీది భారతీయులే కాదు, ప్రపం చంలో ఉన్నవారంతా ఊగిపోయారు. ఉత్సవాలు చేసుకున్నారు. ప్రధాని మోదీ ‘నేనున్నా నేనున్నా. ఈ దేశం సురక్షిత దేశాల్లో ఉంది. నిశ్చింతగా ఉండండి’ అంటూ అభయ సందేశం ఇచ్చారు. అసలే గందరగోళంలో ఉన్న మోదీ వ్యతిరేక వర్గానికి ఈ దాడితో బుర్ర శ్రుతి తప్పింది. మన సైనిక బలాల శక్తి సామర్థ్యాలను, దేశభక్తిని మోదీ ఖాతాలో జమ చేసుకోవడం, ఈ సన్నివేశాన్ని రాజకీయం చేయడం పరమ దివాలాకోరుతనం అంటూ మైకుల్లో ఆక్రోశించారు. నిజమే, ఇలాంటి సందర్భంలో ఏ ప్రధాని పీఠం మీదున్నా ఈ మాత్రం తెగువ చేస్తాడు. మోదీకి సమయం కలిసి వచ్చింది. అసలా మాటకొస్తే త్రివిధ దళాధిపతి మన రాష్ట్రపతి, రక్షణమంత్రి నిర్మలా సీతారామన్– ఎక్కడా వారిపేర్లు రాలేదు. ఎక్కడైనా అధినాయకుని పేర్లు, ఫొటోలు మాత్రమే తెరకెక్కుతాయి. మనం జాగ్రత్తగా గమనిస్తే, రాజు యువరాజు పేర్లు మినహా ఎంతమంది మంత్రుల పేర్లు వినిపిస్తున్నాయ్? పాపం, మంత్రులు మాట్లాడినా, ‘... గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారి ఆదేశం మేరకు...’ అని ప్రారంభించి ఆ విధంగా ముందుకు వెళ్తారు. ‘ఆయన పేరు లేకుండా స్పీచి సాగితే సారుకి బీపర్లు వెళ్తాయట. అసలే టెక్నాలజీ మా సారు గుప్పెట్లో ఉంటది’ అన్నాడొక పెద్దాయన వ్యంగ్యంగా. ఇంత జరిగితే ఏమీ జరగనట్టు శత్రు దేశం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. అలాంటి ఫైవ్ స్టార్ ఉగ్రవాద శిబిరాలు రాజ లాంఛనాలతో పాకిస్తాన్ నేలమీద నడుస్తున్న మాట నిజం. తేలుకుట్టిన దొంగలాగా కిక్కురుమనక ఊరుకున్నారు. శాంతి మంత్రాలు వల్లిస్తున్నారు. యుద్ధం ఎవరికీ లాభదాయకం కాదని పాక్ ప్రధాని ధర్మపన్నాలు చెబుతున్నారు. జెనీవా ఒప్పందాన్ని గౌరవించి అభినందన్ విడుదలకి మడత పేచీలు లేకుండా అంగీకరించారు. అంతవరకు సంతోషం. ప్రపంచ అగ్రదేశా లన్నీ భారత్‌ని సమర్థించాయి. సంయమనం పాటించమని సూచిస్తున్నాయ్. చైనా మునుపటి వైఖరిని మార్చుకున్న ధోరణి పొడసూపింది. దీంతో పాకిస్తాన్ చాలా వైనంగా మాట్లాడుతూనే, బీరాలు పోతోంది. మోదీ వ్యతిరేక శక్తులకు ఇది ఆకస్మికంగా వచ్చిన సమస్య. ఇప్పుడు చంద్రబాబు మోదీని దేశద్రోహిగా ఏపీ విరోధిగా, ఓర్వలేని కుళ్లుమోతు నేతగా జన హృదయాల్లోకి ఎక్కించడం కొంచెం చాలా కష్టం అనిపిస్తోంది. అతి త్వరలో వచ్చే అనేక పరిణామాలు మోదీని ఇంకో రెండు మెట్లు పైకి ఎక్కిస్తే చాలా కష్టం వ్యతిరేక వర్గానికి. వ్యాసకర్త : శ్రీరమణ, ప్రముఖ కథకుడు -
స్వీయ విధ్వంసం దిశగా పాక్
భారత్‌తో వెయ్యేళ్ల పవిత్రయుద్ధాన్ని కొనసాగిస్తానని నాటి పాక్ ప్రధాని జుల్ఫికర్ ఆలీ భుట్టో ప్రకటించి 50 ఏళ్లు గడిచాయి. ఈ యాభై ఏళ్లలోనే పాక్ తన సైనిక బలాన్ని మినహాయిస్తే ఉజ్వల గతాన్ని కోల్పోయింది. జనాభా పెరుగుదలలో తప్పిస్తే ఏ రంగంలోనూ భారత్‌తో పోటీ పడే స్థాయి పాక్‌కు లేదు. పుల్వామా ఘటన తర్వాత పాక్ భూభాగంపై భారత్ యుద్ధ విమానాలు దాడి చేసినా అరబ్ దేశాలతో సహా యావత్ ప్రపంచం భారత్‌నే బలపర్చాయి. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే విధానాలను పక్కనబెట్టి పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ కొత్త అడుగు వేయకపోతే పాక్ ఒక జాతిగా, దేశంగా మరింత దిగజారిపోవడం ఖాయం. ఇమ్రాన్‌కు ఆ శక్తి ఉందా అన్నదే కీలకం. నేటి పాకిస్తాన్ గురించి మాట్లాడుతున్నప్పుడు రెండు సవాళ్లు ఎదురవుతాయి. పాక్ చరిత్ర, దాని భూభాగం లేదా రాజకీయాలపై లేక ఆ దేశం గురించిన ఏ అంశంమీద అయినా సరే మాట్లాడాలని ఉన్నా ఎక్కడి నుంచి ప్రారంభించాలన్నదే ప్రశ్న. ఇప్పుడు వింగ్ కమాం డర్ అభినందన్ వర్థమాన్ భారత్‌కి తిరిగి వచ్చే క్షణాల కోసం మనందరం వేచి ఉంటున్నాము. గతంలోకి వస్తే పాక్‌పై చర్చకు నేను 2009, 1999, 1989, 1979 సంవత్సరాలను కూడా ఎంచుకునేవాడిని. అయితే వీటన్నిటికీ బదులుగా నేను మిమ్మల్ని ఇప్పుడు 1969 సంవత్సరంలోకి తీసుకువెళుతున్నాను. కలవరపడవద్దు. మీరు వర్తమానంలోకి త్వరలోనే తిరిగివస్తారు. ముస్లిం దేశాలపై 1967లో సాగించిన ఆరురోజుల యుద్ధంలో ఇజ్రాయెల్ అద్భుత విజయం సాధించిన తర్వాత ముస్లిం దేశాలు 1969లో ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కాన్ఫరెన్స్ (ఓఐసీ)ను నెలకొల్పాలని నిర్ణయించుకున్నాయి. నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఆ సదస్సుకు దూరంగా ఉండటానికి బదులుగా తన మంత్రి పక్రుద్ధీన్ ఆలీ అహ్మద్ (తదువరి భారత రాష్ట్రపతి)ని భారత ప్రతినిధి బృందం అధిపతిగా పంపించాలని నిర్ణయించారు. కానీ ఆమె ప్రయత్నాన్ని పాకిస్తాన్ అడ్డుకుంది. ఆనాటికి ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా కల దేశం (పాక్) ప్రాతినిధ్యం లేకుండా ఓఐసీ ఉనికిలోకి రావడం అసాధ్యమన్న తర్కాన్ని ఇస్లామిక్ ప్రపంచం అంగీకరించింది కూడా. ఆనాటికి పాకిస్తాన్‌ను రెండుగా విడిపోలేదని గుర్తుంచుకోవాలి. దీంతో భారత్ రాకను ఓఐసీ తిరస్కరించింది. భారత్‌కు అవమానమే మిగిలింది. సరిగ్గా 50 ఏళ్ల ముందుకెళ్లి చూడండి. నాలుగో ఇస్లామిక్ దేశాల సమితి సదస్సులో భారత విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ గౌరవనీయ అతిథిగా హాజరయ్యారు. ప్రపంచంలోనే ముస్లిం జనాభా అధికంగా కలి గిన మూడో దేశంగా భారత్‌ను ఎత్తిపడుతూ ఆమె ఆ సదస్సులో అద్భుతంగా ప్రసంగించారు. ముస్లింలు భారతీయ వైవిధ్యతలో భాగమని, భారతీయ ముస్లింలలో కేవలం 100 మంది మాత్రమే ఐసిస్ ఉగ్రవాద సంస్థలో చేరారని ఆమె తెలిపారు. అయితే ఈ అంశానికి సంబంధించి చాలా భిన్నమైన, సరైన వాదనలు కూడా ఉన్నాయనుకోండి. భారత జాతీయ స్రవంతిలో ఉన్న ముస్లింలను సుష్మా స్వరాజ్ పార్టీ వేరుగా చూడడం, జాతి మొత్తం నుంచి వారిని దూరంగా ఉంచడం, కశ్మీర్‌లను రాక్షసులుగా చిత్రీకరించడంపై చాలా వ్యతిరేకత కూడా ఉంటోంది. కానీ ఒక మతవాద హిందూ జాతీయ మూలాలున్న భారత ప్రభుత్వానికి చెందిన ఒక అత్యున్నత మహిళా నేత ప్రపంచ ముస్లింలకు తన దేశ ముస్లింల గురించి ఇలా చెప్పడంలోని ప్రాధాన్యతను తక్కువ చేసి చూడవద్దు. పైగా భారత్‌ను ఆతిథ్య దేశంగా ఆహ్వానించారన్న దుగ్ధతో పాకిస్తాన్ ఇస్లామిక్ దేశాల కూటమి సదస్సుకు గైర్హాజర్ కావడాన్ని మనం విస్మరించకూడదు. సరిగ్గా 50 ఏళ్ల క్రితం ఇదే పాక్ ఇస్లామిక్ దేశాల కూటమిలో భారత్ చేరికనే వీటో చేయగలిగేటంతటి శక్తిని కలిగి ఉండేది. ఈరోజు భారత్‌కు ఆహ్వానం పట్ల తీవ్ర వ్యతరేకతతో సరిపెట్టుకోవడమే కాకుండా అవమానకరంగా ఆ సదస్సునే పాక్ బహిష్కరించే స్థితిలో పడిపోయింది. తన అణ్వాయుధాలతో, క్షిపణులతో, 20 కోట్లమంది ముస్లిం జనాభాతో ఇస్లామిక్ దుర్గంగా తన్ను తాను పిలుచుకుంటూ వచ్చిన పాకిస్తాన్ ఎలాంటి విషాద స్థితిలోకి కూరుకుపోయిందో ఆలోచించాల్సిందే. 1979లో సోవియట్ యూనియన్ ఆప్ఘనిస్తాన్‌ను దురాక్రమించిన తర్వాత పాకిస్తాన్ ఉన్నట్లుండి అమెరికాకు, దాని మిత్ర దేశాలకు, సౌదీ ఆరేబియా, చైనాలకు కూడా ఆప్తమిత్రురాలైపోయింది. 1971 యుద్ధం తర్వాత పునర్నిర్మాణంలో ఉంటున్న పాకిస్తాన్‌కు దీంతో తన సైన్యాన్ని సాయుధం చేయడం సులభమైపోయింది. ఉన్నట్లుండి పాక్ నియంత జియా ఉల్ హక్ జిహాదీల నిజమైన నేతగా అవతరించేశారు. ఆప్ఘనిస్తాన్‌లో ప్రచ్చన్నయుద్ధం ప్రభావంతో పాకిస్తాన్ సాధించిన ఈ కొత్త శక్తి జియాకు పూర్తిగా తలకెక్కేసింది. సోవియట్ యూనియన్ వంటి అగ్రరాజ్యంపై యుద్ధానికి నాయకత్వం వహిస్తున్న తమకు భారత్‌తో యుద్ధం చేయడం ఒక లెక్కా అనేంత గర్వం జాతీయస్థాయిలో పెరిగిపోయింది. ఆ తర్వాతే భారత్‌లోని పంజాబ్‌లో 1981లో తీవ్రవాదం మొదలైంది. పాక్ ఆధిపత్యం శిఖరస్థాయిలో ఉన్న ఈ దశలోనే నేను పాక్‌లో తొలిసారిగా పర్యటించాను. ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేసిన సిక్కు తీవ్రవాదులపై పాక్‌లో జరుగుతున్న విచారణను నివేదించడానికి 1985 వేసవిలో పాక్ వెళ్లాను. అక్కడి ప్రజల సంపద, జీవన ప్రమాణాలు, మౌలిక వసతుల అభివృద్ధి, నాణ్యమైన టెలికామ్ సర్వీసులు వంటి అంశాల్లో సగటు పాకిస్తానీయులు 1985లో సగటు భారతీయులకంటే ఎంతో మిన్నగా జీవించేవారు. ఎందుకంటే పాక్ తలసరి ఆదాయం అప్పట్లో భారత్ కంటే 60 శాతం అధికంగా ఉండేది. మళ్లీ ఇప్పుడు 2019కి వద్దాం. నేడు సగటు భారతీయుడు పాకిస్తానీయుల కంటే 25 శాతం అధికంగా సంపాదిస్తున్నాడు. ప్రచ్చన్నయుద్ధ విజయం ద్వారా సరికొత్త భౌగోళిక వ్యూహాత్మక ప్రాధాన్యత సాధించిన పాకిస్తాన్ 60 శాతం సంపదను పొగొట్టుకుని భారత్ కంటే చాలా వెనుకబడిపోయింది. ప్రతియేటా ఈ అంతరం 5 శాతం మేరకు పెరిగిపోతోంది. భారత ఆర్థిక వ్యవస్థ నేడు పాక్ కంటే 3 శాతం అధిక పాయిం ట్లతో ముందుకెళుతోంది. పాక్‌ను దాటి మనం ఈ స్థాయికి ఎలా చేరుకున్నాం. 50 ఏళ్ల క్రితం నాటి పాక్ ప్రధాని జుల్ఫికర్ ఆలీ భుట్టో భారత్‌పై వెయ్యేళ్ల యుద్ధానికి పిలుపిచ్చారు. అయితే 1969 తర్వాత గడచిన 50 ఏళ్ల కాలంలో పాకిస్తాన్ తన ప్రాధాన్యతను ఎంతగా కోల్పోయిందంటే, ఇస్లామిక్ దేశాల కూటమి సైతం భారత్‌కే ప్రాధాన్యం ఇస్తోంది. మరీ ముఖ్యంగా జిహాద్‌ను జీవనంగా మార్చుకున్న గత 40 ఏళ్ల కాలంలోనే పాక్ ఆర్థిక వ్యవస్థ అడుగంటిపోయింది. భారత్‌తో శాశ్వత రక్తపాత ఘర్షణలకు గాను పాక్ చెల్లించాల్సి వచ్చింది దీంతోనే ముగియలేదు. 1989లో ఓటమిని అంగీకరించిన సోవియట్ యూనియన్ ఆప్ఘనిస్తాన్ నుంచి సైన్యాన్ని వెనక్కు పిలిచేందుకు చర్చలు ప్రారంభించింది. దాంతో విజయోన్మాదం తలకెక్కిన పాక్ పాలనా యంత్రాంగం తన దృష్టిని తూర్పువైపు మళ్లించింది. ఆ తర్వాత మూడేళ్లపాటు కశ్మీర్, పంజాబ్ రక్తమోడాయి. వేలాది మంది శవాలుగా మిగిలారు. ఆ తర్వాత పాక్‌లో అంతర్గత మార్పులు సంభవించి నవాజ్ షరీఫ్ నూతన ప్రధానిగా ఎంపికై 1999 జనవరిలో నాటి భారత ప్రధాని వాజ్‌పేయితో శాంతి చర్చలను ప్రారంభించారు. అదే సమయంలో ఆయన సైన్యం కార్గిల్‌లో యుద్ధరంగాన్ని సృష్టించింది. పాక్ ఆ యుద్ధాన్ని కోల్పోయింది. దాంతోపాటు రెండు ముఖ్య ఘటనలు చోటు చేసుకున్నాయి. కశ్మీర్ వివాదాస్పద భూభాగం అనే అభిప్రాయం ప్రపంచ స్థాయిలో ముగిసిపోయింది. ఆధీన రేఖ వాస్తవ సరిహద్దుగా ఉంటుం దని, దాన్ని ఇరుదేశాలూ గౌరవించాలనే అభిప్రాయం బలపడింది. పెర్వేజ్ ముషారఫ్ సైనిక తిరుగుబాటు ద్వారా నవాజ్ షరీప్‌ను దించేశారు. దీంతో పాక్ ప్రజాస్వామ్యం మళ్లీ కనుమరుగైంది. ఆ పదేళ్ల కాలంలో పాకిస్తాన్ కశ్మీర్‌పై తన నైతికాధికారాన్ని చేజార్చుకుని సైనిక పాలనన కౌగలించుకుంది. దీనంతటికీ ఒకే ఒక్క కారణం. స్వీయ విధ్వంసకరమైన ఆలోచనా తత్వం. అప్పటినుంచి మనం చాలా దూరం వచ్చేశాం. 2008 ముంబైలో ఉగ్రవాద దాడి ఉన్మాదంతో పాకిస్తాన్ గ్లోబల్ జిహాద్ కేంద్రంగా తన స్థానాన్ని చక్కగా పదిలిపర్చుకుంది. భారత్ విషయానికి వస్తే కార్గిల్ యుద్ధం, పార్లమెంటుపై ఉగ్రదాడి తర్వాత తీవ్రంగా స్పందించకుండా సంయమనం పాటించిన భారత్ తక్కిన ప్రపంచాన్ని తనవైపునకు లాక్కుంది. ఫలితంగా ఈరోజు పుల్వామా దాడి తర్వాత పాక్‌పై ఎదురుదాడి చేసినప్పటికీ సౌదీ అరేబియా, యూఏఈతో సహా యావత్ ప్రపంచ మద్దతును భారత్ పొందుతోంది. ఈ మొత్తం చరిత్రను అవలోకిద్దాం. కేవలం 50 ఏళ్ల కాలంలో పాకిస్తాన్ ఇస్లామిక్ ప్రపంచంలో తన ప్రాధాన్యతను కోల్పోయింది. అరబ్ దేశాలు దాన్ని నిరోధిస్తున్నాయి. ఇరాన్ శత్రుపూరితంగా ఉంది. గత 40 ఏళ్ల కాలంలో పాక్ తలసరి ఆదాయం భారత్‌తో పోలిస్తే 90 శాతం లోటుతో కునారిల్లుతోంది. ఈ అంతరం ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. గత 30 ఏళ్ల గతాన్ని చూస్తే పంజాబ్, కశ్మీర్లో తన సైనిక కేంపెయిన్లను పాక్ కోల్పోయింది. అదే సమయంలో పాక్ నగరాలు, వ్యవస్థలు శాశ్వతంగా జిహాద్ దుర్గాలుగా మారాయి. గత 20 ఏళ్ల కాలంలో ఆధీనరేఖ కశ్మీరులో వాస్తవ సరిహద్దుగా మారిపోయింది. ఉగ్రవాదాన్ని ఒక విధానంగా కొనసాగించడాన్ని ఏ ఒక్కరూ ఇప్పుడు సహించడం లేదు. అన్నిటికంటే ముఖ్యంగా పాకిస్తాన్ భూభాగంపై భారత్ వైమానిక దాడులు చేసినప్పటికీ ఏ ఒక్క దేశమూ దాన్ని ఖండించిన పాపాన పోలేదు. పైగా పాక్ పదే పదే ప్రదర్శిస్తున్న అణు బూచిని భారత్, ప్రపంచం కూడా లెక్కచేయడం లేదు. ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గత పాలకుల విధానాలనే కొనసాగించవచ్చు లేక సరికొత్త ఆలోచనలతో నూతన ఇన్నింగ్స్‌ని ప్రారంభించవచ్చు. ఇమ్రాన్ సాహసంగా అడుగులేస్తే అది ప్రమాదకరమే కానీ దానివల్ల పాకిస్తాన్ విజయపథంలో నడిచే అవకాశం ఉంది. ఇమ్రాన్ అలా చేయలేకపోతే, రెండు విషయాలు మాత్ర పక్కాగా జరుగితీరుతాయి. వ్యక్తిగా ఇమ్రాన్ వైఫల్యం. ప్రతిభావంతులైన ప్రజలు, బలమైన జాతీయవాదం, భౌగోళిక సంపన్నత, బలమైన సైన్యం ఉన్నప్పటికీ పాకిస్తాన్ ఒక జాతిగా దిగజారిపోవడం కొనసాగుతుంది. పాక్ భవిష్యత్తుకు సంబంధించిన అతి ముఖ్యమైన అంశం ఇదే మరి. వ్యాసకర్త : శేఖర్ గుప్తా, ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
భారత గడ్డపై అడుగుపెట్టిన అభినందన్
-
వీరుడి కోసం వేయి కళ్లతో..
-
అభినందన్ విడుదలపై అలస్యం
-
భారత్‌లో అడుగుపెట్టిన అభినందన్
-
వైరల్: అభినందన్ భార్యనంటూ ఫేక్ వీడియో
సాక్షి, న్యూఢిల్లీ: భారత వింగ్ కమాండర్ విక్రం అభినందన్ భార్య పేరుతో గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఫేక్ అని తేలింది. ‘‘నేను పాకిస్తాన్ చెరలో చిక్కుకున్న అభినందన్ భార్యని. భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులను రాజకీయ నాయకులు సొంతం లాభం కోసం వాడుకోకండి. సైనికుల త్యాగాలను రాజకీయ లబ్ధి కోసం ప్రచారం చేసుకోకండి’’ అంటూ 1.08 నిమిషాల పాటు సాగే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. వీడియో వైరల్ అవ్వడంతో బూమ్ లైవ్ అనే ఫ్యాక్ట్ చెకింగ్ ఏజన్సీ దానిని గుర్తించి.. అది ఫేక్ వీడియో అని తేల్చింది. ఆ వీడియోలో మాట్లాడుతున్నది హర్యానా రాష్టంలోని గుర్గావ్కు చెందిన శిరీష రావ్‌గా గుర్తించింది. బూమ్ ఏజన్సీ ఆమెను సంప్రదించగా.. ఆ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేసింది తానేని శిరీషరావ్ తెలిపారు. తనకు తెలియకుండా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దానిని మార్ఫింగ్ చేశారనీ, తన భర్త ఇండియన్ ఆర్మీలో ఉద్యోగి అని పేర్కొన్నారు. సైనికుల త్యాగాలను బీజేపీ నేతలు వారి సొంత రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటున్నారనీ వీడియో విమర్శించారు. అయితే ఆమె ఆమ్ఆద్మీ పార్టీకి చెందిన సామాజిక కార్యకర్త అని తెలిసింది. మార్ఫింగ్ చేసి వీడియోను యూత్ కాంగ్రెస్‌కు సంబంధించిన యువ దేశ్ అనే ట్విటర్ ఖాతానుంచి షేర్ చేశారు. కాగా సర్జికల్ స్ట్రైక్స్-2కు సంబంధించిన ఫేక్ వీడియో కూడా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇది తాలిబన్ ఉగ్రవాదులను టార్గెట్ చేస్తూ 2015లో తయారైన ‘ఆర్మా-2’ అనే వీడియో గేమ్ అని బూమ్ లైవ్ అనే ఫ్యాక్ట్ చెకింగ్ ఏజన్సీ గుర్తించింది. సర్జికల్ స్ట్రైక్స్-2 ఫేక్ వీడియో -
‘బాలకోట్’లో భారత్ గురి తప్పిందా?!
సాక్షి, న్యూఢిల్లీ : భారత యుద్ధ విమానాలు ఫిబ్రవరి 26వ తేదీ తెల్లవారు జామున మూడున్నర గంటలకు పాకిస్థాన్ భూభాగంలోకి దూసుకుపోయి బాలకోట్‌లోని జైషే మొహమ్మద్ స్థావరంపై బాంబుల వర్షం కురిపించిందని, ఈ దాడిలో దాదాపు 350 మంది ఉగ్రవాదులు మరణించి ఉంటారని ఆ రోజే భారత సైనిక వర్గాలు ప్రకటించాయి. దాంతోని ఒక్కసారి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడం, ఆ మరుసటి రోజు భారత సైనిక స్థావరాలపైకి పాక్ యుద్ధ విమానాలు దూసుకురావడం, వాటిని భారత యుద్ధ విమానాలు తరమి కొట్టడం, అందులో ఓ యుద్ధ విమానం కూలిపోవడం, భారత పైలట్ అభినందన్ వర్థమాన్ పాక్ సైనికులకు చిక్కడం, ఆ తర్వాత ఆయన్ని పాక్ అధికారులు వదిలేయడం తదితర పరిణామాలు చకచకా జరిగిపోయిన విషయం తెల్సిందే. (‘బాలకోట్’లో జరిగిన నష్టం ఎంత?) ఇంతకు ఇన్ని పరిణామాలకు దారి తీసిన బాలకోట్‌పై భారత యుద్ధ విమానాలు చేసిన దాడిలో ఏ మేరకు నష్టం సంభవించింది? నిజంగా అక్కడ ఉగ్ర స్థావరం ధ్వంసం అయిందా? ఎంత మంది ఉగ్రవాదులు మరణించారు? భారత వైమానిక దళానికి చెందిన పన్నెండు మిరేజ్–2000 యుద్ధ విమానాలు ఉగ్ర స్థావరంపైకి దాడికి వెళ్లాయని, వెయ్యి కిలోల బాంబులను కురిపించి వచ్చాయని, ఉగ్ర స్థావరం ధ్వంసం అయిందని భారత సైనిక వర్గాలు ప్రకటించాయి. భారత యుద్ధ విమానాలు తొందరపాటులో ఖాళీ ప్రదేశంలో బాంబులు కురిపించి వెళ్లాయని, ఎవరికి, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదంటూ అదే రోజు పాకిస్థాన్ సైనిక దళాల అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ కొన్ని ఫొటోలను ట్వీట్ చేశారు. వాటిల్లో ఇజ్రాయెల్ తయారు చేసిన ‘స్పైస్–2000’ క్షిపణి తాలూకు రెక్క ముక్కలు కనిపించాయి. ఇతర ఫొటొల్లో ఓ చెట్టు కూలిన దృశ్యం, చిన్న మట్టిదిబ్బలో గుంత పడిన దృశ్యాలు ఉన్నాయి. పాక్ అధికార ప్రతినిధి అక్కడి వీడియో దృశ్యాలను కూడా పోస్ట్ చేశారు. వాటిలో బాంబు దాడుల గురించి స్థానికులు మాట్లాడుకోవడం, బాంబు పేలుడు వల్ల ఓ శకలం వచ్చి దురంద్ షా అనే ఓ పౌరుడు గాయపడినట్లు తెలిసింది. (‘అష్ట’దిగ్బంధనం..) అంతర్జాతీయ జల సహకారానికి సంబంధించి యునెస్కో చెయిర్‌గా నియమితులైన స్వీడన్ యుప్ప్సాలా యూనివర్శిటీలో ‘డిపార్ట్మెంట్ ఆఫ్ పీస్ అండ్ కాన్ఫ్లిక్ట్ రీసర్చ్’ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న అశోక్ స్వేన్ ట్విటర్లో పోస్ట్ చేసిన దృశ్యాలు కూడా పాక్ సైనిక అధికార ప్రతినిధి పోస్ట్ చేసిన ఫొటోలకు దగ్గరగా ఉన్నాయి. వీటిలో వాస్తవాలను తెలుసుకునేందుకు అట్లాంట కౌన్సిల్‌కు చెందిన డీఎఫ్‌ఆర్‌ల్యాబ్ (డిజిటల్ ఫోరెన్సిక్ రీసర్చ్ ల్యాబ్) శాటిలైట్ చిత్రాల ద్వారా పరిశోధించి బాంబులు పడిన చోటును గుర్తించింది. శాటిలైట్ ఫిబ్రవరి 25–27 తేదీల మధ్య రికార్డు చేసిన ఆ ప్రాంతం చిత్రాలను కూడా పోల్చి చూసింది. తద్వారా పాక్ సైనికాధికారి, అశోక్ స్వేన్ పోస్ట్ చేసిన చిత్రాలన్ని బాంబులు పడిన చోటునే చూపిస్తున్నాయని డీఎఫ్‌ఆర్‌ల్యాబ్ ధ్రువీకరించింది. (ఇంటిగుట్టు పాక్‌కు చేటు) బాంబులు పడిన చోటు బాలకోట్ పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ ప్రాంతాన్ని స్థానికులు ‘జాబా టాప్’ అని పిలుస్తారు. ఇది జాబా గ్రామానికి సమీపంలో ఉంది. అక్కడ ఇజ్రాయిల్ తయారీ ‘స్పైస్–2000’ క్షిపణులు ప్రయోగించినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయని, వెయ్యి కిలోల బాంబులు కురిపించిన దాఖలాలు లేవని డీఎఫ్ఆర్లాబ్ స్పష్టం చేసింది. మొత్తానికి బాంబు దాడుల్లో ఒక్కరు కూడా మరణించలేదన్న విషయం స్పష్టం అవుతోంది. ‘స్పైస్–2000’ క్షిపణలు ‘ప్రిసిషన్ గైడెడ్ మునిషన్స్ (పీజీఎం) వ్యవస్థ ఉంటుందని, అవి ఎప్పుడు గురితప్పవని, అలాంటిది బాలకోట్ లక్ష్యాన్ని ఎలా గురి తప్పిందో అర్థం కావడం లేదని డీఎఫ్‌ఆర్‌ల్యాబ్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. (పాక్ జెనీవా ఒప్పందాన్ని ఉల్లంఘించిందా?) -
వాఘా సరిహద్దుకు చేరుకున్న అభినందన్
-
తొలిసారి మోదీ నోట అభినందన్ మాట
సాక్షి, చెన్నై: భారత వింగ్ కమాండర్ విక్రం అభినందన్ ధైర్యసాహసాలను చూసి ప్రతీ భారతీయుడు గర్వపడుతున్నాడని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. తమిళనాడులోని కన్యాకుమారిలో శుక్రవారం ఆయన పర్యటించారు. ఈసందర్భంగా మోదీ మాట్లాడుతూ.. పాకిస్తాన్ చెరలో చిక్కుకున్న అభినందన్ గురించి తొలిసారి ప్రస్తావించారు. అభిందన్ తమిళనాడు పౌరుడు అయింనందుకు ప్రతి భారతీయుడు గర్వ పడుతున్నాడని అన్నారు. కేంద్ర తొలి మహిళా రక్షణ శాఖమంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఈ రాష్ట్రానికే చెందినవారేనని గుర్తుచేశారు. కాంగ్రెస్ హయాంలో ఉగ్రవాదంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఉగ్రవాదాన్ని అంతంచేయడం కోసం తమ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని మోదీ పేర్కొన్నారు. పార్లమెంట్‌పై ఉగ్రవాదుల కాల్పులు, ముంబై బ్లాస్టింగ్స్‌తో పాటు అనేక ఉగ్రదాడులు జరిగినా గత పాలకులు ప్రతీకార చర్యలు తీసుకోలేపోయ్యారని మండిపడ్డారు. పఠాన్‌కోటా, పుల్వామా దాడికి తాము ఏవిధంగా బదులిచ్చామో దేశమంతటా తెలుసని అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమ పోరాటం ఎప్పటికీ ఉంటుందని మోదీ స్పష్టం చేశారు. -
అభినందన్‌ను భారత్‌కు అప్పగించిన పాక్
ఇస్లామాబాద్ / న్యూఢిల్లీ : వాఘా సరిహద్దుకు భారత వాయుసేన(ఐఏఎఫ్) పైలట్, వింగ్ కమాండర్ వర్ధమాన్ అభినందన్ చేరుకున్నారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో అభినందన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికే మధ్యవర్తిగా అప్పగింత ప్రక్రియను రెడ్‌క్రాస్ పూర్తిచేసింది. అయితే దౌత్యపరమైన టెక్నికాలిటీస్ పూర్తి చేయడంలో ఆలస్యం అవుతోంది. మరి కాసేపట్లో అభినందన్‌ను అప్పగించినట్లు భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనుంది. జయహో అభినందన్ నినాదాలతో వాఘా సరిహద్దు మార్మోగిపోయింది. పాక్ చెర నుంచి విడుదలై అభినందన్ క్షేమంగా రావడంతో జై హింద్, భారత్ మాతాకీ జై నినాదాలతో వాఘా సరిహద్దులో ఆనందోత్సాహలు వెల్లివిరిశాయి. భారత్ సహా అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న ఒత్తిడికి దాయాది దేశం పాకిస్తాన్ తలొగ్గిందిన విషయం తెలిసిందే. తాము అరెస్ట్ చేసిన వర్ధమాన్ అభినందన్‌ను శుక్రవారం విడుదల చేస్తామని ప్రకటించింది. పాక్‌లోని బాలాకోట్‌లో ఉన్న జైషే మొహమ్మద్ ఉగ్రవాదుల స్థావరంపై భారత్ మంగళవారం తెల్లవారుజామున వైమానిక దాడులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పాక్ యుద్ధ విమానాలు మరుసటిరోజు భారత గగనతలంలోకి ప్రవేశించాయి. ఈ సందర్భంగా పాక్‌కు చెందిన ఎఫ్–16 యుద్ధ విమానాన్ని భారత్ నేలకూల్చగా, ఇండియాకు చెందిన రెండు ఫైటర్ జెట్లను కూల్చేశామనీ, వర్ధమాన్ అభినందన్ అనే పైలట్‌ను అరెస్ట్ చేశామని పాకిస్తాన్ ప్రకటించుకుంది. వర్ధమాన్ అరెస్టును ధ్రువీకరించిన భారత విదేశాంగ శాఖ.. జెనీవా నిబంధనల ప్రకారం అభినందన్ విషయంలో మానవతాదృక్పథంతో వ్యవహరించాలనీ, ఆయన్ను సురక్షితంగా విడిచిపెట్టాలని డిమాండ్ చేసింది. దీనికితోడు వర్ధమాన్ విడుదల విషయంలో అమెరికా, రష్యా, ఫ్రాన్స్, యూరోపియన్ యూనియన్ సహా పలుదేశాలు పాక్‌పై ఒత్తిడి తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో గురువారం పార్లమెంటు ఉభయసభలను సమావేశపర్చిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, వర్ధమాన్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. -
భారత్ రాకతో పాక్ డుమ్మా..!
అబుదాబి: భారత విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ రాకతో అరబ్ దేశాల కూటమి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(ఓఐసీ) నిర్వహించిన విదేశాంగ మంత్రుల సమావేశానికి పాకిస్తాన్ డుమ్మా కొట్టింది. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత, సరిహద్దుల్లో యుద్ధమేఘాల నేపథ్యంలో పాక్ విదేశాంగ మంత్రి మొహ్మద్ ఖురేషీ సమావేశానికి గైర్హాజరు అయ్యారు. సమావేశంలో సుష్మా పుల్వామా ఉగ్రదాడిని లేవనెత్తారు. పాకిస్తాన్ బెదిరింపులకు భయపడేది లేదని.. ఉగ్రవాద కార్యకలాపాలను అణిచివేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. రెండు రోజుల పాటు దుబాయ్‌లో జరునున్న ఈ సమావేశానికి సుష్మా స్వరాజ్‌ను విశిష్ట అతిథిగా ఆహ్వానించిన విషయం తెలిసిందే. పుల్వామా దాడితో ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ దోషిగా తేలిందని సుష్మా పేర్కొన్నారు. ఉగ్రవాదం పెట్రేగిపోతోందని, దాన్ని నిలువరించేందుకు అన్ని దేశాలు కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాలకు శాంతికి దారి చూపే మార్గంగా భారత్ ఉంటుందని స్పష్టం చేశారు. ఉగ్రవాదం కారణంగా ఎన్నో దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఓఐసీ చేసే పోరాటానికి భారత్ మద్దతు ఎప్పుడూ ఉంటుందని సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. (సుష్మా వస్తే మేం రాం : పాక్) పాకిస్తాన్ పేరు ఎత్తకుండా పరోక్షంగా ఆ దేశంపై సుష్మా మండిపడ్డారు. ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం, ఆర్థిక సాయం చేయడం వెంటనే నిలిపివేయాలని ఆమె డిమాండ్ చేశారు. ‘ఉగ్రవాదులు చేస్తున్న దారుణాల వల్ల ఎటువంటి ఫలితం వస్తుందో అందరం చూస్తూనే ఉన్నాం. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దేశాలు.. వెంటనే దాన్ని నిలిపివేయాలి. అన్ని దేశాలు కలిసి కట్టుగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలి. మతానికి వ్యతిరేంగా ఏ పోరాటం ఉండదు, మన పోరాటం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మాత్రమే ఉండాలి. మహాత్మాగాంధీ నడయాడిన ప్రదేశం నుంచి నేను ఇక్కడికి వచ్చాను. భారత్ ఎల్లప్పుడూ బహుళత్వాన్ని అనుసరిస్తుంది. మానవత్వాన్ని కాపాడాలనుకుంటే.. ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం, ఆర్థిక సహాయం చేయడం నిలిపివేయాలి’ అని పేర్కొన్నారు. -
‘బాలకోట్’లో జరిగిన నష్టం ఎంత?
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్థాన్ చెరలో చిక్కిన భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన వర్థమాన్‌ను సురక్షితంగా విడుదల చేయాలని పాకిస్థాన్ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతో ఇరు దేశాల మధ్య గత మూడు రోజులుగా నెలకొన్ని యుద్ధ మేఘాలు విడిపోయాయి. అయితే పలు చిక్కు ప్రశ్నలకు సమాధానాలు రావల్సి ఉంది. (అణు యుద్ధం వస్తే..?) 1. ఈ మూడు రోజులుగా దేశ సరిహద్దులో పాక్ నుంచి నిరంతరంగా కొనసాగుతున్న కాల్పులు, శతఘ్ని పేలుళ్లు నిలిచిపోతాయా? కాల్పులకు భయపడి ఉన్నఫలంగా సురక్షిత ప్రాంతాలకు తరలివచ్చిన సరిహద్దు గ్రామాల ప్రజలు తిరిగి తమ స్వగ్రామాలకు వెళ్లే పరిస్థితి ఉందా? కశ్మీర్ లోపల గత కొంతకాలంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తొలగిపోతాయా? 2. పాక్ భూభాగంలోని బాలకోట్ ఉగ్ర స్థావరంపై భారత వైమానిక దాడుల వల్ల జరిగిన ధ్వంసం ఏమిటీ? ఉగ్రవాదులు ఎంత మంది చనిపోయారు ? వారు తిరిగి కోలుకొని తమ ఉగ్రశిక్షణ కేంద్రాన్ని పునరుద్ధరించుకునే అవకాశం ఉందా? భారత్ దాడితో పాక్ వైఖరిలో ఏమైనా మార్పు వస్తుందా? ఇంతటితో ఉగ్రవాదుల ఆటకట్టించేందుకు పాకిస్థాన్ ప్రభుత్వమే చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఈ విషయమై ఇరువర్గాలు ఇప్పటి వరకు ఎలాంటి వివరాలను, ఆధారాలను వెల్లడించలేదు. 3. పాక్ జెట్ యుద్ధ విమానాలు భారత భూభాగంలోకి ఎలా చొచ్చుకు రాగలిగాయి? వాటిని తరముతూ వెళ్లిన భారత యుద్ధ విమానాన్ని పాక్ సైనికులు ఎలా పడగొట్టగలిగారు? 4. బుద్గామ్‌లో ఏడుగురు మరణానికి దారితీసిన భారత సైనిక విమానం మిగ్–17 కూలిపోవడానికి కారణం ఏమిటీ? (పాక్ జెనీవా ఒప్పందాన్ని ఉల్లంఘించిందా?) 5. సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు నెలకొన్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలన్నీ తమ రాజకీయ కార్యకలాపాలను రద్దు చేసుకోగా, ప్రధాని నరేంద్ర సహా పాలకపక్ష బీజేపీ తమ రాజకీయ కార్యకలాపాలను ఎందుకు కొనసాగించారు? 6. అభినందన్‌ను పాక్ ప్రభుత్వం విడుదల చేయడం వెనక నిజంగా సౌదీ అరేబియా, అమెరికా ఒత్తిడి ఉందా? ఉన్నట్లయితే విదేశీ మీడియా ఈ అంశాన్ని పూర్తిగా ఎందుకు విస్మరించింది? 6. పాక్ భూభాగంపై ఉగ్రవాద శిక్షణా స్థావరాలను సమూలంగా నిర్మూలించేందుకు భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ? వీటన్నింటికి సమాధానం దొరకాల్సి ఉంది. (‘అష్ట’దిగ్బంధనం..) -
స్పెషల్ ఫ్లైట్‌కు పాక్ నిరాకరణ!
న్యూఢిల్లీ: దాయాది పాకిస్తాన్ చెరలో చిక్కుకున్న భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ శుక్రవారం విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే అభినందన్‌ను పాక్ నుంచి స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఓ ప్రత్యేక విమానాన్ని అక్కడికి పంపడానికి సిద్దమైనట్టుగా తెలుస్తోంది. అయితే భారత ప్రభుత్వ ప్రతిపాదనను పాక్ తోసిపుచ్చింది. అభినందన్‌ను విడుదల చేయనున్నట్టు ప్రకటించిన పాక్ వాఘా సరిహద్దుల్లోనే అతన్ని భారత్‌కు అప్పగించనున్నట్టు తెలిపింది. అభినందన్‌ను రోడ్డు మార్గంలో వాఘా సరిహద్దుకు తీసుకురావడం లేక విమానంలో భారత్‌కు తరలించడం అనే రెండు ప్రత్యామ్నాయాలు ఉన్న నేపథ్యంలో భారత్ మాత్రం రెండో మార్గానికే మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది. అభినందన్‌ను వాఘా సరిహద్దుల్లో స్వాగతం పలకడం ద్వారా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని భారత ప్రభుత్వం భావించినట్టుగా సమాచారం. పెద్ద ఎత్తున మీడియా హడావుడి మధ్య అక్కడి నుంచి అభినందన్‌ను తరలించడం కష్టంగా మారుతుందనే అంచనాతో భారత్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. -
అంతా భారత్‌వైపు ఉంటే.. కాంగ్రెస్ మాత్రం..
న్యూఢిల్లీ : భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచమంతా భారత్‌కు అనుకూలంగా ఉంటే.. దేశంలోని కాంగ్రెస్ పార్టీ మాత్రం పక్క దేశ ప్రధానిని కొనియాడటంలో బిజీగా ఉందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిట్ పాత్రా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, సినీ నటి ఖుష్బూ.. ‘మన ప్రధాని ఇమ్రాన్ చూసి నేర్చుకోవాలి’ అని చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ ఆయన ఘాటు వ్యాఖ్యలను జోడించారు. ఉద్రికత్తల మధ్య కాంగ్రెస్ పార్టీ పాక్ జెండాను, ప్రధానిని ప్రమోట్ చేయడంలో ఎందుకు బిజీగా ఉందో అర్థం కావడం లేదని ట్వీట్లో అసహనం వ్యక్తం చేశారు. పాక్ చెరలో ఉన్న భారత వాయుసేన(ఐఏఎఫ్) పైలట్, వింగ్ కమాండర్ వర్ధమాన్ అభినందన్ రాక కోసం యావత్ భారత్ ఎదురుచూస్తుండగా.. కొందరు మాత్రం ఇమ్రాన్ ఖాన్ గొప్ప నిర్ణయం తీసుకున్నారని కొనియాడుతున్నారు. భారత గగనతంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ విమానాలను తిప్పికొట్టే ప్రయత్నంలో ప్రత్యర్థి భూభాగంలో కూలిన మిగ్–21 బైసన్ విమాన పైలట్‌గా అభినందన్.. ఆ దేశ సైనికుల చేతికి చిక్కిన విషయం తెలిసిందే. జెనీవా ఒప్పందం ప్రకారం అభినందన్‌ను విడుదల చేయాలని భారత్ సహా అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న ఒత్తిడికి తలొగ్గిన దాయాది దేశం.. శాంతిస్థాపనలో తొలి అడుగుగా భారత పైలట్ వర్ధమాన్ అభినందన్‌ను శుక్రవారం విడుదల చేస్తున్నామని ప్రకటించిన విషయం తెలిసిందే. -
ఈ సమయంలో సినిమా ప్రచారమా..?
సాక్షి, ముంబై : భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తత తీవ్రమై యుద్ధమేఘాలు అలుముకున్న సమయంలో బాలీవుడ్ ప్రముఖులు అక్షయ్ కుమార్, కరణ్ జోహార్లు సినిమా ప్రచారంలో నిమగ్నమవడంపై సోషల్ మీడియాలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అక్షయ్ కుమార్ త్వరలో విడుదల కానున్న తన మూవీ కేసరిలోని తొలి పాటను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేయగా, ఈ మూవీని నిర్మించిన కరణ్ జోహార్ సైతం ఈ పాటను ట్విటర్లో షేర్ చేశారు. ఈ పాటకు మిశ్రమ స్పందన లభించగా, భారత్-పాకిస్తాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో వీరు ఇరువురూ సినిమాను ప్రమోట్ చేయడం పట్ల పెద్ద ఎత్తున నెటిజన్లు ట్రోలింగ్ చేశారు. సినిమా పాటను షేర్ చేసేందుకు ఇది సరైన సమయం కాదని కొందరు కామెంట్ చేయగా, వారు తమ మూవీ ప్రమోషన్స్‌ను ఒక్క రోజు కూడా వాయిదా వేయలేకపోతున్నారని మరికొందరు అక్షయ్, కరణ్‌లను ట్రోల్ చేశారు. దేశమంతా ఉద్వేగంతో ఉన్న సమయంలో ఈ ట్వీట్‌ను తాము స్వాగతించలేమని పలువురు నెటిజన్లు మండిపడ్డారు. అక్షయ్ సరసన పరిణీతి చోప్రా నటించిన కేసరి ఈనెల 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మరోవైపు ఈ ఏడాది అక్షయ్ కుమార్ మిషన్ మంగళ్, గుడ్‌న్యూస్, హౌస్‌ఫుల్ 4, సూర్యవంశి చిత్రాల్లో నటిస్తున్నారు. -
అభినందన్ విడుదల; పాక్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
ఇస్లామాబాద్ : శాంతి చర్చలకు సిద్ధపడే భారత పైలట్ అభినందన్‌ను విడుదల చేస్తున్నామంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అభినందన్ వాఘా సరిహద్దు గుండా భారత్‌లో అడుగుపెట్టనున్నారు. దీంతో దేశ ప్రజలంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అభినందన్ విడుదలపై పాకిస్తాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ పార్లమెంటులో కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ప్రభుత్వం భారత పైలట్‌ను విడుదల చేయడాన్ని తాను వ్యతిరేకిస్తున్నానంటూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ ఆలోచనలు వేరుగా ఉంటాయి.. ‘భారత మాజీ ప్రధాని వాజ్‌పేయి పాలనలో ఉన్నట్లుగా ప్రస్తుత పరిస్థితులు లేవు. నరేంద్ర మోదీ ఆలోచనలు వేరుగా ఉంటాయి. యుద్ధ సమయంలో ఒక్క భారత జెట్ ఫైటర్ కూడా కార్గిల్ దాటలేదు. కానీ ఇప్పుడు ఏకంగా 14 జెట్లు వచ్చాయి. ఎన్నికల నేపథ్యంలో మోదీ మనపై కావాలనే దాడులు చేయించారని వార్తలు వస్తున్నాయి. ఇదే గనుక నిజమైతే భారత పైలట్‌ను విడుదల చేసిన తర్వాత మోదీ మరోసారి దాడి చేయరని నమ్మకం ఏముంది. ఒకవేళ రేపటి రోజున మోదీ దాడులు చేయిస్తే మన పరిస్థితి ఏంటి. భారత్‌లోని ప్రతీ ముస్లిం పాకిస్తాన్ గురించి ఆలోచిస్తున్నారు’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా జైషే ఉగ్ర స్థావరాలపై భారత వైమానిక దళం మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రతి దాడికి ప్రయత్నించిన పాక్ విమానాలను తిప్పి కొట్టే క్రమంలో భారత పైలట్ అభినందన్ ఆ దేశ ఆర్మీకి చిక్కారు. అయితే అనేక పరిణామాల అనంతరం ఆయన శుక్రవారం భారత్‌లో అడుగుపెట్టనున్నారు. ఇక అభినందన్‌ను విడుదల చేయాలంటూ తమ దేశమంతా కోరుకుంటోందని చెబుతూనే.. మరోవైపు అతడి విడుదలను సవాలు చేస్తూ పలువురు కార్యకర్తలు పాక్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. -
‘ఈ పిటిషన్‌కు విచారణ అర్హత లేదు’
ఇస్లామాబాద్ : భారత వైమానిక దళ యోధుడు, పైలట్ అభినందన్ స్వదేశానికి తిరిగి వస్తున్నారని దేశమంతా ఆనంద డోలికల్లో మునిగిపోయిన వేళ పాకిస్తానీయులు మరోసారి కపట బుద్ధి ప్రదర్శించారు. అభినందన్‌ను విడుదల చేయాలంటూ తమ దేశమంతా కోరుకుంటోందని చెబుతూనే.. మరోవైపు అతడిని ఎలా విడిచి పెడతారంటూ పలువురు పాక్ కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు అభినందన్ విడుదలను సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఈ పిటిషన్‌ను విచారించిన ఇస్లామాబాద్ కోర్టు.. దీనికి ఎటువంటి విచారణ అర్హత లేదని పేర్కొంటూ కొట్టివేసింది. ఈ మేరకు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అభినందన్ విడుదలపై నెలకొన్న అనుమానాలు పటాపంచలయ్యాయి. కాగా భారత్ సహా అంతర్జాతీయ సమాజం ఒత్తిడికి తలొగ్గిన పాక్... తమ ఆర్మీకి చిక్కిన పైలట్ అభినందన్‌ను భారత్‌కు అప్పగిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాక్ ప్రభుత్వం.. ఆయనను రావల్పిండి నుంచి లాహోరుకు విమానంలో తరలించనుంది. దీంతో శుక్రవారం ఆయన స్వదేశానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి వాఘా సరిహద్దు ద్వారా మధ్యహ్నం రెండు గంటల తరువాత అభినందన్ భారత్‌లో అడుగు పెట్టనున్నారు. -
తల్లిదండ్రులకు ‘అభినందన’లు
న్యూఢిల్లీ : పాక్ చెరలో ఉన్న భారత వాయుసేన(ఐఏఎఫ్) పైలట్, వింగ్ కమాండర్ వర్ధమాన్ అభినందన్ రాక కోసం యావత్ భారత్ ఎదురుచూస్తుండగా.. ఆయనకు స్వాగతం పలికేందుకు బయలు దేరిన అభినందన్ తల్లిదండ్రుల పట్ల సాధారణ పౌరులు తమ గౌరవాన్ని చాటుకున్నారు. గురువారం అర్థరాత్రి చెన్నై నుంచి ఢిల్లీ విమానంలో అమృత్‌సర్‌కు బయలుదేరిన అభినందన్ తల్లిదండ్రులు విమానంలోకి రాగా.. తోటి ప్రయాణీకులంతా లేచి నిలబడి చప్పట్లతో స్వాగతం పలికారు. దేశం గర్వించే హీరోను కన్నారంటూ నినాదాలు చేసి తమ గౌరవాన్ని చాటుకున్నారు. ఇందుకు సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారత్ సహా అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న ఒత్తిడితో తలొగ్గిన దాయాది దేశం పాకిస్తాన్ అభినందన్‌ను నేడు విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. భారత గగనతంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ విమానాలను తిప్పికొట్టే ప్రయత్నంలో ప్రత్యర్థి భూభాగంలో కూలిన మిగ్–21 బైసన్ విమాన పైలట్‌గా అభినందన్ ఆ దేశ సైనికుల చేతికి చిక్కాడు. పాక్ సైన్యం ఎన్ని చిత్రహింసలు పెట్టినా బాధను పంటిబిగువన దిగమింగుతూ ప్రశాంత చిత్తంతో కనిపించిన వీరుడు.. విక్రమ్ అభినందన్ చూపించిన తెగువ, సాహసానికి యావద్భారతం సెల్యూట్ చేస్తోంది. ఆయన రాకకోసం వెయ్యికళ్లతో ఎదురుచూస్తోంది. -
పాకిస్తాన్‌కు దీటుగా బదులిచ్చాం : అమిత్ షా
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో పాకిస్తాన్‌కు భారత్ గట్టిగా బుద్ధిచెప్పిందని బీజేపీ చీఫ్ అమిత్ షా అన్నారు. భారత్‌తో సంబంధాలపై ఇప్పుడు పాకిస్తాన్ తేల్చుకోవాల్సి ఉందని చెప్పుకొచ్చారు. ఇండియా టుడే కాంక్లేవ్ 2019లో శుక్రవారం అమిత్ షా మాట్లాడుతూ ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రదాడితో భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయన్నారు. పాక్ భూభాగంలో ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసేందుకు భారత్ వైమానిక దాడులు చేపట్టిందని, మన దేశంలోకి చొచ్చుకువచ్చిన పాక్ యుద్ధవిమానాలను భారత్ సమర్ధంగా తిప్పికొట్టిందని అమిత్ షా పేర్కొన్నారు. పాక్ చెరలో ఉన్న వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ భారత్‌కు తిరిగి రానున్నారని చెప్పారు. సీబీఐని మోదీ ప్రభుత్వం దుర్వినియోగపరచలేదని అమిత్ షా చెప్పుకొచ్చారు. రాబర్ట్ వాద్రా, మాయావతిలపై కేసులు మోదీ ప్రభుత్వం హయాంలోనివి కాదని గుర్తుచేశారు. ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించడంపై వ్యాఖ్యానిస్తూ రాజకీయాల్లో ఆమె రాక నూతనంగా జరిగింది కాదని, ఆమె గత 12 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారని అమిత్ షా అన్నారు. పుల్వామా ఉగ్రదాడిని బీజేపీ రాజకీయాలకు వాడుకుంటోందన్న కాంగ్రెస్ విమర్శలను ఆయన తిప్పికొట్టారు. దేశంలో ఎమర్జెన్సీ విధించిన కాంగ్రెస్ పార్టీకి తమ సర్కార్ పనితీరును తప్పుపట్టే హక్కు లేదన్నారు. -
అభినందన్ తల్లిదండ్రులకు అభినందనల వెల్లువ
-
పాకిస్తాన్ మరో దురాగతం...
పంజాబ్ : భారత్‌లో అలజడి సృష్టించేందుకు పాకిస్తాన్ చేస్తున్న మరో దురాగతం వెల్లడైంది. ఫిరోజ్పూర్లో బీఎస్ఎఫ్ అవుట్ పోస్ట్ వద్ద రెక్కీ నిర్వహించిన పాక్ గూఢచారిగా అనుమానిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. బీఎస్ఎఫ్ పోస్ట్ ఫోటోలు తీసేందుకు గూఢచారి ప్రయత్నించాడు. యూపీలోని మొరదాబాద్‌కు చెందిన వ్యక్తిగా భావిస్తున్న అనుమానితుడి నుంచి పాకిస్తాన్‌కు చెందిన మొబైల్ ఫోన్, సిమ్ కార్డును బీఎస్ఎఫ్ స్వాధీనం చేసుకుంది. ఈ నెంబర్ 8 పాక్ గ్రూప్‌లతో యాడ్ అయి ఉండగా, మరో ఆరు పాకిస్తాన్ ఫోన్ నెంబర్లను కూడా అధికారులు అతడి నుంచి గుర్తించారు. కాగా, సరిహద్దుల వద్ద భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో బీఎస్ఎఫ్ పోస్ట్‌ల వద్ద అనుమానితుడి రెక్కీ కలకలం రేపింది. -
ఇమ్రాన్‌వి మొసలి కన్నీళ్లు.. నమ్మొద్దు!
న్యూఢిల్లీ : పాకిస్తాన్ భూభాగంలో పొరపాటున పడి ఆ దేశ సైన్యం చేతుల్లో చిక్కుకున్న భారత వాయుసేన(ఐఏఎఫ్) పైలట్, వింగ్ కమాండర్ వర్ధమాన్ అభినందన్‌ను శుక్రవారం విడుదల చేస్తామని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్ సహా అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న ఒత్తిడికి తలొగ్గిన దాయాది దేశం.. శాంతిస్థాపనలో తొలి అడుగుగా భారత పైలట్ వర్ధమాన్ అభినందన్‌ను శుక్రవారం విడుదల చేస్తున్నామని స్పష్టం చేసింది. ఇది భారత్–పాకిస్తాన్ల మధ్య శాంతి చర్చలకు మొదటిమెట్టుగా భావిస్తున్నట్లు ప్రకటించింది. ఇక సోషల్ మీడియా వేదికగా భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ ధైర్యసాహసాలను భారతం ముక్తకంఠంతో అభినందిస్తోంది. పాకిస్తాన్ విమానాలను తిప్పికొడుతూ.. ఆ ప్రయత్నంలో ప్రత్యర్థి భూభాగంలో కూలిన మిగ్–21 బైసన్ విమాన పైలట్‌గా ఆ దేశ సైనికుల చేతికి చిక్కిన హీరోపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. పాక్ సైన్యం ఎన్ని చిత్రహింసలు పెట్టినా బాధను పంటిబిగువన దిగమింగుతూ ప్రశాంత చిత్తంతో కనిపించిన వీరుడు.. విక్రమ్ అభినందన్ చూపించిన తెగువ, సాహసానికి యావద్భారతం సెల్యూట్ చేస్తోంది. తమ హీరోను విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన పాక్ నిర్ణయంపై యావత్ భారతావని హర్షం వ్యక్తం చేస్తోంది. కొందరైతే పాక్ ప్రధాని ఇమ్రాన్‌ను అభినందిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. అయితే ఇమ్రాన్‌ను కొనియాడటం అంటే పుల్వామా దాడిలో మరణించిన 40 మంది భారత హీరోలను మరిచినట్లేనని ఓ నెటిజన్ ఘాటుగా వ్యాఖ్యానించాడు. తప్పని పరిస్థితిల్లో పాక్ ఈ నిర్ణయం తీసుకుంది తప్పా.. శాంతి కోసం కాదని స్పష్టం చేశాడు. అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేకనే ఈ నిర్ణయం తీసుకుందని, ఇమ్రాన్ శాంతి అంటూ మొసలి కన్నీరు కార్చుతున్నారని మరో యూజర్ పేర్కొన్నాడు. అసలు ఇమ్రాన్‌ను నమ్మవద్దని ఘాటుగా కామెంట్ చేశాడు. అభినందన్ విడుదల ప్రకటనతో #WelcomeHomeAbhinandan యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. -
‘మీ ఇంట్లో ఒక్కరైనా సైన్యంలో ఉంటే తెలిసేది’
కోల్‌కతా : ‘ ఇంట్లో కూర్చుని కొంత మంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. మాటలకే పరిమితమైపోతారు తప్ప తమ కుటుంబ సభ్యుల్లో ఒక్కరినైనా భారత ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్సు, పారామిలిటరీ దళాల్లోకి పంపించరు. అందుకే నా లాంటి వారి బాధ.. వారికి ఎన్నటికీ అర్థం కాదు’ అంటూ అమర జవాను భార్య తనను ట్రోల్ చేసిన వారికి గట్టిగా సమాధానం చెప్పారు. జైషే మహ్మద్ ఉగ్రవాది ఆదిల్.. కశ్మీర్‌లోని పుల్వామాలో ఆత్మాహుతికి పాల్పడి 40 మందికి పైగా భారత జవాన్లను పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు ప్రతీకారంగా భారత వైమానిక దళం పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేయడం... వీటిని తిప్పి కొట్టేందుకు పాక్ ప్రయత్నించడం.. ఈ క్రమంలో భారత పైలట్ వారికి చిక్కడం వంటి ఘటనలతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పాకిస్తాన్‌తో యుద్ధం చేయాల్సిందే అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో పుల్వామా దాడిలో అమరుడైన బబ్లూ సంత్రా అనే జవాను భార్య మిథా మాట్లాడుతూ... ‘ భారత్ చర్చలకే మొగ్గు చూపాలి. యుద్ధం వల్ల ఇరు దేశాల సైనికుల ప్రాణాలు పోతాయి. అందుకే శాంతియుతంగా చర్చించి భారత పైలట్‌ను క్షేమంగా తీసుకురావాలి’ అని వ్యాఖ్యానించారు. దీంతో సోషల్ మీడియాలో ఆమెపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. ఈ విషయంపై స్పందిస్తూ... ‘ ఫిబ్రవరి 14న జరిగిన ఘటన నన్ను ఏమాత్రం కుంగదీయలేకపోయింది. శాంతి గురించి మాట్లాడినందుకు నేను యుద్ధ వ్యతిరేకిగా మారానని కొందరు అంటున్నారు. మరికొంత మంది భర్తపై నా ప్రేమను శంకిస్తున్నారు. ఇంట్లో కూర్చుని ఎన్నైనా మాట్లాడతారు. మీ ఇంట్లో ఒక్కరైనా సైన్యంలో ఉంటే తెలిసేది. అయినా అటువంటి వారి గురించి నేను అస్సలు పట్టించుకోను’ అని మిథా ట్రోలర్స్‌కు ఘాటు సమాధానమిచ్చారు. కాగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన మిథా ప్రస్తుతం ఓ ప్రైవేటు పాఠశాలలో టీచరుగా పనిచేస్తున్నారు. మోడ్రన్ హిస్టరీలో మాస్టర్స్ చేసిన ఆమెకు భర్త మరణానంతరం సీఆర్పీఎఫ్లో ఉద్యోగం చేయమని ఆఫర్ వచ్చింది. అయితే ఆరేళ్ల కూతురిని, వృద్ధురాలైన అత్తగారిని చూసుకునేందుకు ఆమె ఈ ఆఫర్‌ను తిరస్కరించారు. భర్త భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు వచ్చిన సమయంలో మంత్రులు ఇచ్చిన హామీ మేరకు.. తనకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని మిథా కోరారు. -
భారత గడ్డపై అడుగుపెట్టిన అభినందన్
వాఘా పోస్ట్: భారత గడ్డపై వింగ్ కమాండర్ అభినందన్ ఎట్టకేలకు అడుగుపెట్టారు. వాఘా సరిహద్దులో పాకిస్తాన్ ప్రతినిధి అభినందన్‌ను భారత అధికారులకు అప్పగించారు. పాక్ చెరనుంచి విముక్తి పొందిన అభినందన్‌కు భారత ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది ఘన స్వాగతం పలికింది. భారత ఐఏఎఫ్ అధికారులు అతన్ని రిసీవ్ చేసుకున్నారు. అతని విడుదల కోసం రెండురోజులుగా యావత్ భారత్ ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న విషయం తెలిసిందే. భారతకాలమాన ప్రకారం రాత్రి9.19 నిమిషాలకు కమాండర్ భరత భూమిపై అడుగుపెట్టాడు. దీంతో భారతమతాకి జై అనే నినాదాలతో వాఘా సరిహద్దు దద్దరిల్లింది. అభినందన్ విడుదలపై దేశ వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఐసీఆర్సీ నిబంధనల ప్రకారం చీకటిపడ్డ తరువాతనే పైలట్‌ను అప్పగించాల్సి ఉన్నందున కొంత ఆలస్యమైందని అధికారులు తెలిపారు. అభినందన్ రాకతో అతని కుటుంబసభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అభినందన్‌కు వైద్య పరీక్షలు... భారత వింగ్ కమాండర్ అభినందన్‌ను పాకిస్తాన్ ప్రతినిధి భారత్‌కు అప్పగించినట్లు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారులు అధికారికంగా ప్రకటించారు. అతనికి వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అతని రాక తమకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఆనందన్ని వ్యక్తంచేశారు. భారత్ పైలట్ అభినందన్ వర్ధమాన్ అప్పగింతపై అయోమయం కొనసాగుతోంది. పాకిస్థాన్ సైన్యం ఆయనను భారత్ దౌత్య అధికారులకు అప్పగించారని, ఆయన సొంత గడ్డపై అడుగుపెట్టేశారని వార్తలు వచ్చాయి. అయితే అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో గందరగోళం నెలకొంది. అయితే ఈరోజు కచ్చితంగా అభినందన్‌ను అప్పగిస్తారని భారత ఉన్నతాధికారులు చెబుతున్నారు. మాతృభూమిపై అడుగుపెట్టిన అభినందన్‌కు ఘనస్వాగతం లభించిందని అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు రిపోర్ట్ చేశారు. పోరాట యోధుడు తిరిగి వచ్చాడన్న సమాచారంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. దాయాది పాకిస్తాన్ చెరలో చిక్కుకున్న భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను భారత్‌కు అప్పగించింది. జెనీవా ఒప్పందాన్ని అనుసరించి పాక్ అధికారులు తొలుత అభినందన్‌ను అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీకి అప్పగించారు. వాఘా బార్డర్లో ఐదుగురు ఐఏఎఫ్ అధికారులు అభినందన్‌ను రిసీవ్ చేసుకున్నారు. కాసేపట్లో ఐఏఎఫ్ అధికారులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. మరి కాసేపట్లో అభినందన్‌ను అప్పగించినట్లు భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనుంది. అభినందన్‌ను ఈ రోజు విడుదల చేయనున్నట్టు పాక్ ప్రకటించిన నేపథ్యంలో ఆయన రాక కోసం దేశ ప్రజలందరు ఎంతగానో ఎదురు చూశారు. దీంతో వాఘా సరిహద్దు వద్ద ఉద్విగ్న పరిస్థితి నెలకొంది. జైహింద్, భారత్‌మాతాకి జై, జయహో అభినందన్ నినాదాలతో ఆ ప్రాంగణమంతా సందడి నెలకొంది. మువ్వెన్నల జెండాతో వేలాది మంది ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అభినందన్‌పై అప్పగింతపై అయోమయం అభినందన్ విడుదలపై ఉత్కంఠ కొనసాగుతోంది. భారత దౌత్యవేత్తలకు ఆయనను అప్పగించినట్టు వార్తలు వచ్చాయి. అయితే అభినందన్‌ను అప్పగించలేదని పాకిస్థాన్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే దౌత్యపరమైన ప్రక్రియలు పూర్తి చేయడానికి ఎక్కువ సమయం పడుతుందని చెబుతున్నారు. అయితే అభినందన్‌పై అప్పగింతపై రెండు దేశాలు అధికారిక ప్రకటన చేయకపోవడంతో అయోమయం నెలకొంది. యోధుడు వచ్చాడు వీరుడు వచ్చాడు. యోధుడు సొంత గడ్డపై అడుగు పెట్టాడు అంటూ వాఘా పోస్ట్ దగ్గర ఉన్న మీడియా ప్రతినిధులు రిపోర్ట్ చేశారు. 48 గంటలుగా ఎదురు చూస్తున్న మహా వీరుడు తిరిగొచ్చాడు. సగర్వంగా పురిటి గడ్డపై కాలుమోపాడు. శత్రుమూకల ముందు రొమ్ము విరుచుకుని నిలబడి దేశం మీసం మెలేసిన వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ శుక్రవారం సాయంత్రం వాఘా సరిహద్దు వద్ద స్వదేశంలో కాలుమోపాడు. అజాత శత్రువుగా శత్రు శిబిరం నుంచి తిరిగొచ్చిన ధైర్యశాలికి దేశం యావత్తు స్వాగతం పలికిందని మీడియా ప్రతినిధులు తెలిపారు. బీటింగ్ రిట్రీట్ వేడుక రద్దు వాఘా సరిహద్దులో ప్రతిరోజూ సాయంత్రం సూర్యాస్తమయానికి రెండు గంటలముందు జరిగే బీటింగ్ రిట్రీట్ వేడుక రద్దు అయింది. భారత వైమానికదళ వింగ్ కమాండర్ అభినందన్ విడుదల నేపథ్యంలో ఈ కార్యక్రమం వాయిదా పడినట్లు అధికారులు తెలిపారు. కాగా భారత్‌కు చెందిన సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) సైనికులు, పాకిస్తాన్‌కు చెందిన పాకిస్తాన్ రేంజర్స్ సైనికులు కలిసి ఈ కవాతును నిర్వహిస్తారు. సూర్యాస్తమయానికి సరిగ్గా వారి దేశ పతాకాలను క్రిందకు దించి పరస్పరం కరచాలనం చేసుకుని వెనుదిరుగుతారు. ఈ కవాతును బీటింగ్ రిట్రీట్ అని పిలుస్తారు. ఈ గగుర్పొడిచే కార్యక్రమాన్ని ఇరుదేశాల పౌరులు ఉత్సాహంగా తిలకిస్తారు. ఇరుదేశాల ప్రజలలో దేశభక్తిని పెంపొందించే ఈ కవాతు ఎటువంటి ప్రతికూల పరిస్థితులలో కూడా నిరాటంకంగా జరుగుతుంది. రాగానే అభినందన్‌కు వైద్య పరీక్షలు మరోవైపు భారత్ చేరిన వెంటనే అభినందన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఎయిర్‌ఫోర్స్ వైద్య నిపుణులు వాఘా చేరుకున్నారు. ఏమైనా నిఘా వస్తువులు, అనుమానాస్పద వస్తువులు ఉన్నాయా అనే కోణంలో తనిఖీలు చేయనున్నారు. అలాగే అభినందన్ దుస్తులు, వస్తువులను సేకరించి పరీక్షలకు పంపనున్నారు. అలాగే పాకిస్తాన్ ఇచ్చిన వైద్య నివేదికలతో పోల్చి మరో నివేదిక తయారు చేయనున్నారు. వైద్య పరీక్షలు అనంతరం అభినందన్‌తో ఇంటలిజెన్స్ డీ బ్రీఫింగ్ ప్రక్రియలో భాగంగా అధికారులు ప్రశ్నించనున్నారు. పాక్‌లో పట్టుబడిన నాటి నుంచి అప్పగింత వరకూ సమాచార సేకరణ చేస్తారు. పాకిస్తాన్ వ్యవహరించిన తీరు, అడిగిన ప్రశ్నలపై సమాచార సేకరణ చేస్తారు. ఈ మొత్తం ఎపిసోడ్‌పై ఐఏఎఫ్...ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించనుంది. అప్పగింత వ్యవహారాలు పూర్తి పైలట్ అభినందన్‌ను అప్పగించే వ్యవహారాలను భారత రాయబారి గౌరవ్ అహ్లువాలియా పూర్తి చేశారు. అభినందన్‌కు సంబంధించిన పత్రాలను గ్రూప్ కెప్టెన్ జె.టి.క్రెయిన్ పూర్తి చేశారు. కెప్టెన్ జె.టి.క్రెయిన్ దగ్గరుండి అభినందన్‌ను తీసుకు రానున్నారు. వాఘాకు అభినందన్ తల్లిదండ్రులు అభినందన్ తల్లిదండ్రులు కొద్దిసేపటి క్రితం వాఘా సరిహద్దుకు చేరుకున్నారు. ఇందుకోసం వారు గత రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. అక్కడి నుంచి వాఘాకు బయలుదేరిన వారికి విమానంలో తోటి ప్రయాణికుల నుంచి నుంచి వారికి అపూర్వ గౌరవంతో పాటు అభినందనలు వెల్లువెత్తాయి. తమిళనాడులో ప్రత్యేక పూజలు.. అభినందన్ తిరిగి భారత్‌లో అడుగుపెట్టనున్న సందర్భంగా తమిళనాడు పోలీసులు కాళికంబాల్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో ప్రజలు సర్వమత ప్రార్థనలు జరిపారు. మధ్యాహ్నం తర్వాత అభినందన్ విడుదల అభినందన్‌ను విడుదల చేసేందుకు పాకిస్తాన్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ విషయాన్ని పాక్ పార్లమెంట్లో ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి ఖురేషి ప్రకటించారు. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య సమయంలో అభినందన్‌ను భారత్‌కు అప్పగించనున్నారు. అభినందన్ విడుదలకు సంబంధించిన పత్రాలను పాకిస్తాన్‌లోని భారత హై కమిషన్ అక్కడి ప్రభుత్వానికి అందజేసింది. అభినందన్ విడుదలపై మరో మలుపు అభినందన్ స్వదేశానికి తిరిగి వస్తున్నారని దేశమంతా ఆనంద డోలికల్లో మునిగిపోయిన వేళ పాకిస్తానీయులు మరోసారి కపట బుద్ధి ప్రదర్శించారు. అభినందన్ విడుదలను సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. లాహోర్‌కు అభినందన్ అభినందన్‌ను భారత్‌కు అప్పగించేందుకు పాక్ ఏర్పాట్లు చేస్తోంది. రావల్పిండి నుంచి లాహోరుకు అభినందన్‌ను విమానంలో తరలించనున్నారు. అక్కడి నుంచి వాఘా సరిహద్దుకు అభినందన్‌ను తీసుకురానున్నారు. మధ్యహ్నం రెండు గంటల తరువాత అభినందన్ వాఘా సరిహద్దుకు చేరుకునే అవకాశం ఉంది. వాఘా వద్ద భద్రత కట్టుదిట్టం వాఘా సరిహద్దు వద్ద అధికారులు భద్రను కట్టుదిట్టం చేశారు. అభినందన్‌కు స్వాగతం పలకడానికి స్థానికులతో పాటు, పౌరులు చాలా మంది వాఘా సరిహద్దుకు చేరుకుంటున్నారు. స్కూలు చిన్నారులు కూడా అక్కడికి చేరుకుని జాతీయ జెండాలను ప్రదర్శిస్తున్నారు. మెరుపుదాడులను రాజకీయం చేయడం సరికాదు: అమిత్ షా ఐఏఎఫ్ జరిపిన మెరుపు దాడులను రాజకీయం చేయడం సరికాదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. గురువారం బీజేపీ నాయకుడు యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో ఆయన ఈ విధంగా స్పందించారు. పాకిస్తాన్‌కు మోదీ ప్రభుత్వం గట్టి హెచ్చరికలు పంపిందని షా వ్యాఖ్యానించారు. పాక్ గూఢచారి అరెస్ట్ పాకిస్తాన్ మరో దుర్మార్గం బట్టబయలైంది. ఫిరోజ్పూర్లో సంచరిస్తున్న పాక్ గూఢచారిని భారత జవాన్లు అదుపులోకి తీసుకున్నారు. బీఎస్ఎఫ్ క్యాంపుల్లో రెక్కీ నిర్వహిస్తున్న ఆ వ్యక్తి.. భారత బలగాలకు సంబంధించిన ఫొటోలు తీస్తున్నాడు. అతని వద్ద నుంచి పాక్ సిమ్ కార్ట్‌తో ఉన్న ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మసూద్ పాకిస్తాన్‌లోనే ఉన్నాడని ప్రకటన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ పాకిస్తాన్‌లోనే ఉన్నాడని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి ప్రకటించారు. అంతేకాకుండా పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి సరైన ఆధారాలు లభిస్తేనే మసూద్‌ను అరెస్ట్ చేస్తామని ఖురేషి స్పష్టం చేశారు. పాక్ అధికారులు మధ్యాహ్నం రెండు గంటల తరువాత అభినందన్‌ను వాఘా సరిహద్దు వద్దకు తీసుకురానున్నట్టు సమాచారం. జెనీవా ఒప్పందాన్ని అనుసరించి పాక్ అధికారులు తొలుత అభినందన్‌ను అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీకి అప్పగించనున్నారు. అభినందన్‌కు స్వాగతం పలకడం కోసం ఆయన తల్లిదండ్రులు గురువారం అర్ధరాత్రి చెన్నై నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. ప్రస్తుతం వారు అమృతసర్‌కు ఫ్లైట్‌లో బయలుదేరారు. విమానంలో తోటి ప్రయాణీకులు నుంచి వారికి అపూర్వ గౌరవంతో పాటు అభినందనలు వెల్లువెత్తాయి. ఇందుకు సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారత వైమానిక దళానికి చెందిన అధికారుల బృందం అభినందన్‌కు స్వాగతం పలకనుంది. కుప్వారాలో ఇద్దరు ఉగ్రవాదుల హతం జమ్ము కశ్మీర్ కుప్వారా జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఎదురుకాల్పులు జరిగాయి. హంద్వారా ప్రాంతంలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఒత్తిడికి తలొగ్గిన పాక్.. భారత్ సహా అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న ఒత్తిడికి దాయాది దేశం పాకిస్తాన్ తలొగ్గింది. తాము అరెస్ట్ చేసిన భారత వాయుసేన(ఐఏఎఫ్) పైలట్, వింగ్ కమాండర్ వర్ధమాన్ అభినందన్‌ను శుక్రవారం విడుదల చేస్తామని ప్రకటించింది. అభినందన్ వీడియోలను తొలగించిన యూట్యూబ్ అభినందన్‌కు సంబంధించిన వీడియోలను వెంటనే తొలగించాలని యూట్యూబ్‌కు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై స్పందించిన యూట్యూబ్.. అభినందన్‌కు సంబంధించిన వీడియోలను తొలగించినట్లు, గూగుల్ సర్వీసెస్‌ను అప్డేట్ చేశామని తెలిపింది. -
ఇమ్రాన్ నిర్ణయానికి కారణం అదే : పాక్ నటుడు
ఇస్లామాబాద్ : పాక్ వైమానిక దాడులను తిప్పి కొట్టే క్రమంలో ఆ దేశ ఆర్మీకి చిక్కిన భారత పైలట్ అభినందన్ శుక్రవారం స్వదేశానికి రానున్నారు. ఈ క్రమంలో యావత్ భారత్ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తోంది. అయితే అభిందనన్‌ను విడుదల చేయాలంటూ భారతీయులు సహా పాకిస్తానీయులు కూడా కోరుకున్నారని పాక్ నటుడు, ఫిల్మ్ మేకర్ జమాల్ షా అన్నాడు. ‘ మా ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్థానంలో నేనున్నా సరే అలాగే చేసేవాడిని. ఎందుకంటే పాకిస్తాన్‌లోని మెజారిటీ ప్రజలు భారత పైలట్‌ను విడుదల చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ప్రజల సెంటిమెంట్‌ను గౌరవించి ఇమ్రాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు’ అని అతడు వ్యాఖ్యానించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధం వస్తే పాక్ ప్రజల పరిస్థితి మరింత దిగజారేదని అభిప్రాయపడ్డాడు. తమ దేశంలో ఇప్పటికే 70 శాతం మంది ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన దయనీయ పరిస్థితుల్లో బతుకుతున్నారని, యుద్ధం వస్తే పేదరికం మరింతగా పెరిగిపోయేదని ఆందోళన వ్యక్తం చేశాడు.(‘భారతీయ సినిమాలను నిషేధిస్తున్నాం’) ఇక పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో పాక్ నటులను భారత్ నిషేధించడం.. అదే విధంగా భారతీయ సినిమాలపై పాక్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి జమాల్ మాట్లాడుతూ... ‘ కళలు, సంస్కృతి.. ప్రజల మధ్య సత్సంబంధాలు నెలకొనడానికి తోడ్పడతాయి. మేము(భారత్- పాకిస్తాన్) సంగీతం, సినిమా ఇలా ఎన్నో మాధ్యమాల కారణంగా మానసికంగా ముడిపడిపోయాం. ఒకవేళ శాంతి చర్చలకు అవకాశం దొరికితే పొరుగుదేశం నటులతో మా అనుబంధం మరింత దృఢపడుతుందనే నమ్మకం ఉంది అని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో భారతీయ సినిమాలపై నిషేధం విధించడంతో పాక్ థియేటర్ల యజమానుల పరిస్థితి ఆందోళనలో పడింది. పాక్ నిర్ణయం బెడిసికొట్టడంతో పాక్ నటులు పునరాలోచనలో పడ్డట్లుగా జమాల్ మాటల ద్వారా తెలుస్తోంది. ఇక అంతర్జాతీయ సమాజం నుంచి మద్దతు లభించకపోవడం, ఆర్థికంగా సంక్షోభం ఎదుర్కొంటున్న కారణంగా భారత్ ముందు పాక్ తలొగ్గిన సంగతి తెలిసిందే.(బ్యాన్ చేసి.. బొక్క బోర్లాపడ్డ పాక్) -
హంజాపై అమెరికా భారీ రివార్డు..!
వాషింగ్టన్: అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ కొడుకు హంజా బిన్ లాడెన్‌ను పట్టించినవారికి అమెరికా భారీ రివార్డు ప్రకటించింది. హంజా ఆచూకీ తెలిపిన వారికి ఒక మిలియన్ డాలర్లు (సుమారు రూ.7కోట్లు) ఇస్తామని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. తండ్రి బిన్ లాడెన్ మరణానంతరం అల్‌ఖైదాలో హంజాకు సీనియర్ స్థానం దక్కిందని, తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు అతను సన్నద్ధమవుతున్నట్లు పలు రిపోర్టులు వెల్లడించిన నేపథ్యంలో అమెరికా ఇంత భారీ మొత్తంలో ఆఫర్ చేసింది. తమ దేశంపై దాడి చేస్తామని హంజా హెచ్చరించినట్టు కూడా వెల్లడించింది. పాకిస్తాన్‌లోని అబోతాబాద్లో తలదాచుకున్న బిన్ లాడెన్ 2011లో అమెరికా సేనలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. (హైజాకర్ కుమార్తెతో లాడెన్ కొడుకు పెళ్లి) హంజా జాడలేదు.. జిహాద్ రాజకుమారుడిగా చెప్పుకునే 30 ఏళ్ల హంజా జాడ కోసం అమెరికా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తొలుత అతను పాకిస్తాన్లో తలదాచుకున్నాడని, అనంతరం అఫ్గనిస్తాన్, సిరియాల్లో ఉన్నాడని వార్తలు వచ్చేవి. హంజాను ఇరాన్ గృహ నిర్బంధంలో ఉంచిందని వార్తలు వినిపించాయి. ఇస్లాం రాజ్యాన్ని స్థాపిస్తామని సిరియాలో నరమేధం సృష్టించిన ఐసిస్ తరహాలో అటు బిన్ లాడెన్ హత్యపై ప్రతీకారం.. ఇటు జిహాద్ విస్తరణకు హంజా సన్నద్ధమవుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. దీంతో పెద్దన్న అమెరికాకు భయం పట్టుకుంది. పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్‌తో భారత్ పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో ఉగ్రవాదాన్ని ఉపేక్షించబోమని అమెరికా గట్టి చర్యలను పూనుకుంది. -
దేశం కోసం ప్రాణమిస్తా : రాఖీ సావంత్
సాక్షి, ముంబై : భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశం కోసం అవసరమైతే తాను ప్రాణత్యాగానికి వెనుకాడనని బాలీవుడ్ నటి రాఖీ సావంత్ అన్నారు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన చర్యలను ఆమె సమర్ధించారు. పుల్వామా దాడి తర్వాత పాక్‌కు దీటుగా బదులిచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న చర్యలన్నీ సరైనవేనని రాఖీ సావంత్ సమర్ధించారు. దేశం కోసం చనిపోయేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, తాను శత్రు శిబిరాల్లోకి 50 నుంచి 100 బాంబులు తీసుకెళతానని, అవసరమైతే వారిని మట్టుబెట్టి వస్తానని చెప్పుకొచ్చారు. పుల్వామా దాడికి మోదీజీ సరైన సమాధానం ఇచ్చారు. పాక్ కస్టడీలో ఉన్న మన పైలట్లు సురక్షితంగా తిరిగి దేశానికి చేరుకోవాలని తాను ప్రార్ధిస్తున్నానని చెప్పారు. పంజాబ్‌లోని లూథియానాలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రాఖీ ఈ వ్యాఖ్యలు చేశారు. -
మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలి
ఐక్యరాజ్యసమితి: జైషే మహ్మద్ ఉగ్రసంస్థ అధినేత మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ప్రతిపాదించాయి. 15 సభ్య దేశాలున్న భద్రతా మండలిలో వీటో అధికారమున్న ఈ మూడు దేశాలు బుధవారం ఈ ప్రతిపాదన చేశాయి. ప్రతిపాదనను భద్రతా మండలి పరిగణనలోకి తీసుకునే అవకాశముంది. పాకి స్తాన్‌ను కేంద్రంగా చేసుకుని భారత్‌లో పలు ఉగ్రదాడులకు సూత్రధారిగా వ్యవహరించిన మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలంటూ భారత్ చాన్నాళ్లుగా అభ్యర్థిస్తోంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఈ విషయంలో భారత్‌కు వివిధ దేశాల మద్దతు లభించింది. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలంటూ మండలిలో ప్రతిపాదించడం ఇది నాల్గోసారి. పాక్‌తో సన్నిహిత సంబంధాలున్న చైనా తన వీటో అధికారంతో ప్రతిసారీ అడ్డుతగులుతోంది. పుల్వామాలో భారత భద్రతా దళంపై జరిగిన దాడిని ఖండించిన చైనా ఈసారి ఎలా వ్యవహరిస్తుందో చూడాల్సి ఉంది. అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తే మసూద్, సంస్థ చరాస్తుల లావాదేవీలు స్తంభించిపోతాయి. ఆర్థిక వనరులు మూసుకుపోతాయి. ప్రతిపాదనకు ప్రపంచ దేశాలు మద్దతు ఇవ్వాలంటూ భారత్ విజ్ఞప్తి చేసింది. పాక్ స్థావరంగా పనిచేస్తున్న అన్ని ఉగ్రసంస్థలను నిషేధించాలని కోరింది. భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త తలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రెండు దేశాలు వెంటనే సమావేశమై తగిన చర్యలు తీసుకోవాలి. పరిస్థితి మరింత దిగజారిపోకుండా సంయమనం పాటించాలి. ఇరు దేశాలు బాధ్యతగా వ్యవహరించి శాంతిని నెలకొల్పాలి. ఐక్యరాజ్య సమితి అందరికీ అందుబాటులో ఉంటుంది. రెండు దేశాల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. – ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యుటెరెస్ -
‘అష్ట’దిగ్బంధనం..
న్యూఢిల్లీ: ఇరవైనాలుగు లోహ విహంగాలతో భారత్‌పైకి దాడికి తెగబడిన పాకిస్తాన్‌ను ఎనిమిది భారత యుద్ధవిమానాలు బెదరగొట్టాయి. దీంతో పాక్ విమానాలు తోకముడుచుకుని పారిపోయా యి. పాక్ ఆక్రమిత కశ్మీర్లో పాక్ దళాలకు చిక్కిన వింగ్ కమాండర్ అభినందన్ క్షేమంగా దేశానికి రావాలని ప్రార్థిస్తున్న వేళ కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎనిమిది ఎఫ్–16లు, నాలుగు మిరాజ్–3 రకం విమానాలు, నాలుగు చైనా తయా రీ జేఎఫ్–17 ‘థండర్’ యుద్ధవిమానాలతో కూడిన ఫైటర్‌జెట్ విమానాల సమూహాన్ని పాకిస్తాన్ భారత్‌పైకి దాడికి పంపింది. భారత వాయుసేన దాడుల గురించి అప్రమత్తం చేసేందుకు ఈ జెట్లకు మరో పాక్ విమానం తోడుగా వచ్చింది. ఈ విమానాలన్నీ ఉదయం 9.45గంటల సమయంలో భారత్ వైపుగా రావడాన్ని సరిహద్దుకు 10 కి.మీ.ల దూరంలో ఉన్నపుడు భారత వాయుసేన దళాలు పసిగట్టాయి. ఒక్కొక్కటిగా అవి భారతభూగంలోకి దూసుకొస్తుండగా వెంటనే భారత్ వాయుసేనకు చెందిన నాలుగు సుఖోయ్ 30 విమానాలు, రెండు ఆధునీకరించిన మిరాజ్ 2000లు, రెండు మిగ్–21 బైసన్లు రంగంలోకి దిగి వెంటబడ్డాయి. భారత యుద్ధవిమానాలు వెంటబడుతుండడంతో పాక్ యుద్ధవిమానాలు విసిరిన బాంబులు లక్ష్యాలను గురితప్పాయి. సరిహద్దు వెంట ఉన్న భారత ఆర్మీ లక్ష్యాలకు సమీపంలో బాంబులు పడ్డాయి. పాక్ ఫైటర్‌జెట్ విమానాల బృందంలోని ఎఫ్–16 జెట్‌ను కూల్చేందుకు వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ మిగ్–21 బైసన్ యుద్దవిమానం ద్వారా ‘ఎఫ్–73 ఎయిర్–టు–ఎయిర్ క్షిపణి’ని ప్రయోగించారు. దీంతో ఎఫ్–16 మంటల్లో చిక్కుకుంది. కానీ, అదే సమయంలో ఎఫ్–16 సైతం అభినందన్ నడుపుతున్న మిగ్పైకి రెండు (అడ్వాన్స్డ్ మీడియం రేంజ్ ఎయిర్–టు–ఎయిర్ మిస్సైల్–అమ్రామ్) క్షిపణులను ప్రయోగించింది. అది ప్రయోగించిన క్షిపణుల్లో ఒకటి తప్పిపోగా, మరొకటి అభినందన్ నడుపుతున్న మిగ్‌ను ఢీకొట్టింది. దీంతో కూలిపోతున్న మిగ్ నుంచి అభినందన్ ప్యారాచూట్‌తో బయటకు దూకేశారు. దెబ్బతిన్న పాక్ ఎఫ్–16 సైతం కుప్పకూలింది. మంటల్లో చిక్కుకుని కూలిపోతున్న ఎఫ్–16 నుంచి ఇద్దరు పాక్ పైలట్లు ప్యారాచూట్ల సాయంతో సరిహద్దు ఆవల ల్యాండ్ అయ్యారు. ‘జమాతే ఇస్లామీ’పై కేంద్రం నిషేధం న్యూఢిల్లీ: వేర్పాటువాద సంస్థ జమాతే ఇస్లామీ జమ్మూకశ్మీర్‌పై గురువారం కేంద్రం నిషేధం విధించింది. దేశ వ్యతిరేక, విద్రోహ చర్యలకు పాల్పడుతున్నందున చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఈ సంస్థపై నిషేధం విధిస్తూ హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర కేబినెట్ భేటీ అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. పుల్వామా దాడి అనంతరం భద్రతా బలగాలు. వివిధ వేర్పాటు వాద సంస్థల నేతలతోపాటు పెద్ద సంఖ్యలో జమాతే ఇస్లామీ శ్రేణులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రధాని అధ్యక్షతన కేబినెట్ కమిటీ భేటీ సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: పాక్‌తో ఉద్రిక్తతలు, వింగ్ కమాండర్ అభినందన్‌ను వెనక్కి పంపించాలన్న పాక్ ప్రకటన నేపథ్యంలో గురువారం ప్రధాని నివాసంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశమైంది. ఉగ్రస్థావరాల ధ్వంసం, మసూద్ అజర్‌పై చర్యలకు సంబంధించి పాక్ నుంచి ఎటువంటి హామీ రానంత వరకు సంయమనం పాటించినా ఎటువంటి ప్రయోజనం ఉండదన్న అభిప్రాయం వ్యక్తమై నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా వచ్చిన ఒత్తిడులకు తలొగ్గిన పాక్ ఐఏఎఫ్ పైలట్ అభినందన్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించిందని ఈ కమిటీ అభిప్రాయపడింది. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభినందన్ సురక్షితంగా స్వదేశానికి చేరుకోవడం మంచి పరిణామమని పేర్కొంది. అయితే, బుధవారం పాక్ యుద్ధ విమానాలు భారత్ గగనతలంలోకి చొచ్చుకు రావడంపై ఆందోళన వ్యక్తం చేసింది. దీంతోపాటు ఎఫ్–16 విమానాల ద్వారా అమెరికా తయారీ అమ్రోన్ క్షిపణులతో దాడికి యత్నించడాన్ని దురాక్రమణ చర్యేనని పేర్కొంది. ఎన్నికల వేళ ఎటువంటి తీవ్ర చర్యలు తీసుకున్నా రాజకీయంగా వికటించే ప్రమాదముందనే అభిప్రాయం ఈ భేటీలో వ్యక్తమైంది. అభినందన్ స్వదేశానికి చేరుకున్న తర్వాతే పాక్‌పై మిగతా చర్యలపై దృష్టిపెట్టాలని నిర్ణయించింది. భేటీలో కేంద్రమంత్రులు సుష్మాస్వరాజ్, నిర్మలా సీతారామన్, రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. పాక్ మోర్టార్ దాడుల్లో మహిళ మృతి జమ్మూ: కశ్మీర్‌లోని రాజౌరీ, పూంచ్ జిల్లాల్లోని ఆరు సెక్టార్లలో పౌర ఆవాసాలపై పాక్ సైన్యం గురువారం జరిపిన మోర్టార్ దాడుల్లో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఒక జవానుకు గాయాలయ్యాయి. పాక్ దాడులకు భారత సైన్యం దీటుగా బదులిస్తోందని అధికారులు చెప్పారు. సరిహద్దు వెంట పాక్ సైన్యం కాల్పుల ఉల్లంఘనకు పాల్పడటం వరుసగా ఇది ఏడవ రోజు. సుందర్బని, మాన్‌కోట్, ఖరికర్మారా, డెగ్వార్ సెక్టార్లలో పాక్ భారీ ఎత్తున మోర్టార్లు, తేలికపాటి ఆయుధాలతో కాల్పు లు జరుపుతోందని రక్షణ ప్రతినిధి వెల్లడించారు. మెందార్లోని చజ్జలలో పాక్ మోర్టార్ శకలం తగిలి ఓ మహిళ మరణించగా, మరో ఘటనలో జవాను గాయపడ్డాడని తెలిపారు. -
సర్జికల్ దాడులు బీజేపీకి లాభం
యశవంతపుర : సరిహద్దు వెంట పాక్ భూభాగంలోని జైషే ఉగ్రస్థావరాలపై భారత్ చేసిన సర్జికల్ దాడులు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూరుస్తాయని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప అన్నారు. సర్జికల్ దాడుల కారణంగా కర్ణాటకలో కనీసం 22 సీట్లను గెలుచుకోగలుగుతామని యడ్యూరప్ప చేసి న వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. బుధవారం చిత్రదుర్గంలో జరిగిన బీజేపీ సమావేశంలో మీడియాతో ఆయన మాట్లాడారు. దాడులు బీజేపీకి లా భం చేకూరుస్తాయన్న వ్యాఖ్యలు ప్రచారం కావడంతో రాష్ట్ర సీఎం కుమారస్వామి, సీఎల్పీ నేత సిద్ధరామయ్య తదితరులు యడ్యూరప్పపై మండిపడ్డారు. బీజేపీ నాయకు ల నిజస్వరూపం బయటపడిందని కుమారస్వామి విమర్శించారు. యడ్యూరప్ప మాటల వీడియోను ట్విట్టర్లో సిద్ధరామయ్య పోస్ట్ చేశారు. సర్జికల్ దాడులపై అనుమానంగా ఉందని వ్యాఖ్యానించారు. తన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో యడ్యూరప్ప గురువారం స్పందించారు. ఉగ్రవాదులపై దాడులను రాజకీయాలకు ఉపయోగించుకోవడం తన అభిమతం కాదని వివరణ ఇచ్చారు.