వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పంకజ ముండే

Pankaja Munde Shocking Comments By Should Have Strapped Bomb On Rahul Gandhi - Sakshi

ముంబై : ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీలు.. భద్రతా దళాలను వాడకోకూడదంటూ ఈసీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కానీ నాయకులు మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో బీజేపీ నాయకురాలు పంకజ ముండే సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మీద పేలుడు పదార్థాలు ప్రయోగిస్తే.. సర్జికల్‌ స్ట్రైక్స్‌ గురించి అనుమానం వ్యక్తం చేసేవారు నోరు ముస్తారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జల్నా లోక్‌సభ నియోజకవర్గంలో పర్యటించారు పంకజ ముండే.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘మన సైనికుల మీద దాడి చేసిన ఉగ్రవాదులపై సర్జికల్‌ దాడులు జరిపాము. కానీ కొందరు ‘అసలు దాడులు ఎక్కడ జరిపారు.. ఆధారాలేవ’ని ప్రశ్నిస్తున్నారు. వారికి అర్థమవ్వాలంటే ఒకటే దారి.. రాహుల్‌ గాంధీ మెడలో బాంబు కట్టి.. వేరే దేశానికి పంపించాలి’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పంకజ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఆమెపై ఈసీ చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి



 

Read also in:
Back to Top