బాలాకోట్‌లో 250 మంది ఉగ్రవాదులు మృతి!

Over 250 Killed in Air Strike, Says Amit Shah - Sakshi

న్యూఢిల్లీ: గతవారం పాకిస్థాన్‌ బాలాకోట్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం  జరిపిన దాడిలో ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారన్నదని కేంద్ర ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా మాత్రం గుజరాత్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఓ సంఖ్య చెప్పారు. ఐఏఎఫ్‌ ఆపరేషన్‌లో 250 మందికిపైగా ఉగ్రవాదులు చనిపోయారని ఆయన తేల్చేశారు.

వైమానిక దాడుల్లో ఎంతమంది చనిపోయారో అధికారికంగా తెలుపాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్‌చేస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ అధ్యక్షుడైన అమిత్‌ షా అధికారికంగా ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘ఉడీ ఉగ్రవాద దాడి అనంతరం మన బలగాలు పాకిస్థాన్‌ వెళ్లి సర్జికల్‌ స్ట్రైక్స్‌ నిర్వహించాయి. మన జవాన్ల మృతికి సైన్యం ప్రతికారం తీర్చుకుంది. పూల్వామా దాడి తర్వాత సర్జికల్ స్ట్రైక్స్‌ నిర్వహించకపోవచ్చునని అందరూ భావించారు. కానీ, ఏం జరిగింది? ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో 13 రోజులకే మన ప్రభుత్వం వైమానిక దాడులు నిర్వహించి 250మందికిపైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది’ అని అహ్మదాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో అమిత్‌ షా ప్రకటించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top