పాక్‌ డ్రోన్‌ పరార్‌

Pakistani military drone shot down in Sri Ganganagar sector - Sakshi

జైపూర్‌: పాక్‌ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. పాక్‌ మిలటరీకి చెందిన డ్రోన్‌ శనివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో భారత భూభాగంలోకి దూసుకొచ్చేందుకు యత్నించిందని బీఎస్‌ఎఫ్‌ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. రాజస్తాన్‌లోని హిందుమాల్‌కోట్‌లోకి పాక్‌ డ్రోన్‌ రావడంతో బీఎస్‌ఎఫ్‌ జవాన్లు దానిపై కాల్పులు జరిపారు. దీంతో వెంటనే ఆ డ్రోన్‌ వెనక్కు మళ్లింది. కాగా, నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) సమీపంలో శనివారం పెను ప్రమాదం తప్పింది.

ఉదయం పదింటికి అఖ్నూర్‌ సెక్టార్‌లో నంద్వాల్‌చౌక్‌ వద్ద రోడ్డు పక్కన ఉగ్రవాదులు అమర్చిన ఇంప్రోవైజ్డ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ డివైజ్‌(ఐఈడీ)ను సైన్యం గుర్తించింది. వెంటనే ఆప్రాంతంలోని వారిని ఖాళీచేయించి ఐఈడీని నిర్వీర్యం చేశారు. ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో అలాంటివి ఇంకా ఏమైనా అమర్చారా అనే అనుమానంతో బలగాలు క్షుణ్నంగా తనిఖీలు చేపట్టాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాంబు అమర్చిన వారిని పట్టుకునేందుకు దర్యాప్తు చేపట్టారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top