‘మా చిన్నారి అభినందన్‌ ఎలా ఉన్నాడు’

Newborn Babies Named After IAF Pilot Go Viral - Sakshi

న్యూఢిల్లీ : గడిచిన మూడు రోజులు దేశవ్యాప్తంగా అభినందన్‌ నామస్మరణే. అతనికి సంబంధించిన వార్తలతోనే ఈ మూడు రోజులు తెల్లవారింది.. చీకటి పడింది. శత్రు సైనికులకు చిక్కినప్పడు అతడు చూపిన తెగువ వల్ల ఒక్కసారిగా నేషనల్‌ హీరో అయ్యారు అభినందన్‌. ‘ప్రాణాలు పోయే పరిస్థితుల్లో కర్తవ్యం మరవలేదని.. రియల్‌ హీరో’ అంటూ అభినందిస్తున్నారు జనాలు. తమ భూభాగంలో దిగిన అభినందన్‌ను పాకిస్తాన్‌ శుక్రవారం రాత్రి 9:21 నిముషాలకు వాఘా సరిహద్దు వద్ద భారత్‌కు అప్పగించింది. అయితే ఈ మూడు రోజుల పాటు సోషల్‌ మీడియాలో అభినందన్‌ గురించి వచ్చే మెసేజ్‌ల ప్రవాహానికి అంతే లేకుండా పోయింది.

అభినందన్‌ ధైర్య సాహసాలకు గౌరవంగా.. పుట్టిన బిడ్డలకు అతని పేరు పెడుతున్నారు. ప్రస్తుతం ట్విటర్‌ నిండా ఇలాంటి మెసేజ్‌లే. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ వింగ్‌ కమాండర్‌ ధైర్యాన్ని మెచ్చుకుంటూ.. ‘‘అభినందన్‌’ అనే ఈ సంస్కృత పదానికి నేడు కొత్త అర్థం రూపొందింది’ అంటూ ప్రశంసించారు. శత్రు దేశానికి చిక్కిన అభినందన్‌ను తిరిగి తీసుకురావడానికి భారత్‌ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. దాంతో జెనీవా ఒప్పందం ప్రకారం పాక్‌ మన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ను శుక్రవారం వాఘా సరిహద్దు వద్ద అప్పగించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top