తొలిసారి మోదీ నోట అభినందన్‌ మాట

Every Indian Proud Off For Abinandha From Tamil Nadu Says Modi - Sakshi

సాక్షి, చెన్నై: భారత వింగ్ కమాండర్ విక్రం అభినందన్ ధైర్యసాహసాలను చూసి ప్రతీ భారతీయుడు గర్వపడుతున్నాడని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. తమిళనాడులోని కన్యాకుమారిలో శుక్రవారం ఆయన పర్యటించారు. ఈసందర్భంగా మోదీ మాట్లాడుతూ.. పాకిస్తాన్‌ చెరలో చిక్కుకున్న అభినందన్‌ గురించి తొలిసారి ప్రస్తావించారు. అభిందన్‌ తమిళనాడు పౌరుడు అయింనందుకు ప్రతి భారతీయుడు గర్వ పడుతున్నాడని అన్నారు.  కేంద్ర తొలి మహిళా రక్షణ శాఖమంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా ఈ రాష్ట్రానికే చెందినవారేనని గుర్తుచేశారు.

కాంగ్రెస్ హయాంలో ఉగ్రవాదంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఉగ్రవాదాన్ని అంతంచేయడం కోసం తమ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని మోదీ పేర్కొన్నారు. పార్లమెంట్‌పై ఉ‍గ్రవాదుల కాల్పులు, ముంబై బ్లాస్టింగ్స్‌తో పాటు అనేక ఉగ్రదాడులు జరిగినా గత పాలకులు ప్రతీకార చర్యలు తీసుకోలేపోయ్యారని మండిపడ్డారు. పఠాన్‌కోటా, పుల్వామా దాడికి తాము ఏవిధంగా బదులిచ్చామో దేశమంతటా తెలుసని అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమ పోరాటం ఎప్పటికీ ఉంటుందని మోదీ స్పష్టం చేశారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top