పాక్‌ విమానాన్ని అభినందన్‌ నేలకూల్చాడిలా..!

Wing Commander Abhinandan Brought Down Pakistan Aircraft By R 73 Missile - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సర్జికల్‌ స్ట్రైక్స్‌తో ఉలిక్కిపడ్డ పాకిస్తాన్‌ భారత్‌పై వైమానిక దాడులకు దిగిన సంగతి తెలిసిందే. పాక్‌కు చెందిన ఎఫ్‌-16 యుద్ధవిమానాలు గత బుధవారం నియంత్రణ రేఖ (ఎల్వోసీ) దాటి భారత గగనతలంలోకి ప్రవేశించాయి. ప్రత్యర్థి దాడులను ఐఏఎఫ్‌ దీటుగా తిప్పి కొట్టింది. ఈ క్రమంలో పాకిస్తాన్‌కు చెందిన ఒక ఎఫ్‌-16 విమానాన్ని మనోళ్లు కూల్చేశారు. పాక్‌ యుద్ధ విమానం ఎఫ్‌-16ను కూల్చడానికి అభినందన్‌ వర్ధమాన్‌ ఆర్‌-73 అనే మిస్సైల్‌ ప్రయోగించాడు. అదే సమయంలో అభినందన్‌ విమానం కూడా ప్రత్యర్థి దాడిలో నేలకూలింది. దాంతో ఆయన ప్యారాచూట్‌ సాయంతో పాక్‌ భూభాగంలో దిగాల్సి వచ్చింది. యుద్ధ ఖైదీగా పట్టుబడ్డ అభినందన్‌ను జెనీవా ఒప్పందంలో భాగంగా శుక్రవారం రాత్రి పాకిస్తాన్ భారత్‌కు అప్పగించింది. (అభినందన్‌ ఆగయా..)

ఆర్‌-73 మిస్సైల్‌.. లక్ష్యం గురి తప్పదు..
ఆర్‌-73 మిస్సైల్‌.. ఏ సమయంలోనైనా ప్రత్యర్థి విమానాలపై దాడి చేయగలదు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా.. దశ దిశా మార్చుకుని కావాల్సిన లక్ష్యాన్ని ఛేదించగలదు. ఏరో డైనమిక్‌ సిస్టమ్‌ ద్వారా దీనిని కంట్రోల్‌ చేయవచ్చు. దాంతో​ ఇది సమర్థవంతంగా పనిచేసి ప్రత్యర్థి యుద్ధ విమానలను నేల కూల్చగలదు. గంటకు 2500 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న విమాలను.. 30 కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతూ వేటాడగలదు. (ట్రెండింగ్‌లో అభినందన్‌ ‘గన్‌స్లింగర్‌’..!)

58 ఏళ్ల వయసు..అయినా
భారత వైమానిక దళంలో సేవలందిస్తున్న మిగ్‌-21యుద్ధ విమానం వయస్సు సుమారు 58 సంవత్సరాలు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది. ప్రతిష్టాత్మక హిందుస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ దీన్ని రూపొందించింది. 1961లో తొలిసారిగా భారత వైమానిక దళంలో చేరింది. మారుతున్న కాలానికి అనుగుణంగా రూపురేఖలు మార్చుకుంది. ఐఏఎఫ్‌ అమ్ములపొదిలో ప్రధాన అస్త్రంగా అందుబాటులో ఉంది. మిగ్- 21 దెబ్బకు పేలిపోయిన ఎఫ్-16తో పోల్చుకుంటే.. దాని సత్తా తక్కువే. మిగ్ పూర్తి పేరు.. మికోయన్-గురేవిచ్. మొదట్లో రష్యా సంయుక్త రాష్ట్రాలు దీన్ని డిజైన్ చేశాయి. రష్యా నుంచి అనుమతి పొందిన హెచ్‌ఏఎల్‌ మిగ్-21 ఎఫ్ ఎల్, మిగ్-21ఎం, మిగ్-21 బైసన్ రకాలను రూపొందించింది. ఇక పాక్‌ వైమానిక దళంలో ఉన్న ఎఫ్‌-16 విమానలకు వైపర్‌ యుద్ధ విమానాలు అని కూడా అంటారు. 1980 ప్రాంతంలో వీటిని పాక్‌ దిగుమతి చేసుకుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top