‘శవ’రాజకీయాల్లో తమ్ముళ్లు! | - | Sakshi
Sakshi News home page

‘శవ’రాజకీయాల్లో తమ్ముళ్లు!

Nov 23 2026 5:18 AM | Updated on Nov 23 2026 5:18 AM

‘నారా’వారి డైరెక్షన్‌లో తెలుగు తమ్ముళ్లు యాక్షన్‌

అదరగొడుతున్నారు. ‘శవ’ రాజకీయాలు చేయడంలో

ఆరితేరారు. తాము చేసిన తప్పును ఇతరులపైకి నెట్టడంలో అధినేతను మించిపోయారు. కూటమిలో మూడు పార్టీలు ఉన్నా తమదే పై చేయని.. బీజేపీ..జనసేన నేతలు తమ బానిసలేనని నిరూపించారు. అధికారం తమకు మాత్రం సొంతమని ‘స్థానిక సంస్థల’ ఎన్నికల సాక్షిగా రుజువు చేస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, కడప : రాష్ట్రంలో కూటమి సర్కార్‌ కొలువుదీరినప్పటికీ క్షేత్రస్థాయిలో టీడీపీ మాత్ర మే అధికారాన్ని వెలగబెడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలే దీనికి సాక్ష్యం. టీడీపీ కాకుండా బీజేపీ, జనసేన నామినేషన్లు వేస్తే పచ్చ నేతలు భగ్గుమంటున్నారు. అధికారులు సైతం వీరికే ఊడిగం చేస్తున్నారు. ఫలితంగా కూటమిలో ఉన్నామనే మాటేగానీ అటు బీజేపీ.. ఇటు జనసేన కార్యకర్తలు బానిసల్లాగా బతుకుతున్నారు. తమ బతుకులు రోడ్డు పాలైనా ‘అధినేత’లు కనికరించడం లేదంటూ తమ బూట్లతో తామే కొట్టుకుంటున్నారు. శనివారం రాత్రి జనసేన కార్యకర్త వీరాంజనేయులు టీడీపీ శ్రేణుల తోపులాటలో చనిపోతే.. బాధతో జనసైనికులు రోడ్డుపై మృతదేహంతో ధర్నా చేశారు. కూటమిలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ నేతలు జరిగిన ఘటనపై సంఘీభావం తెలపాల్సింది పోయి పోలీసులను ఉసిగొల్పారు. ఇంకేముంది రెచ్చిపోయిన ఖాకీలు జనసేన నేతలు, కార్యకర్తలపైనే లాఠీచార్జ్‌ చేశారు. కూటమిలో ఉన్నా జనసేన నేతలు ఎప్పటికీ తమకు బానిసలేనని.. అధికారులు కూడా సహకరించరని చెప్పకనే చెప్పారు.

జనసేన కార్యకర్త మృతిపై

బీటెక్‌ రవి హైడ్రామా..

జనసేన కార్యకర్త వీరాంజనేయులు మృతిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో టీడీపీ ఇన్‌ఛార్జి బీటెక్‌ రవి హైడ్రామాకు తెరతీశారు. వీరాంజనేయులు చనిపోయిన తరువాత తెల్లవార్లు బేరాలు, బెదిరింపులతో వారిని మెత్తబరచుకొని ఆదివారం ఉదయాన్నే బీటెక్‌ రవి నాగలగుట్టపల్లెకు వెళ్లి వీరాంజనేయులు మృత దేహం వద్ద నివాళులర్పించారు. టీస్టాల్‌ దగ్గర వీరాంజనేయులకు గుండెపోటు వచ్చిందంటూ చెప్పుకొచ్చారు. బాధలో ఉన్న వారితో బలవంతంగా మీడియా ఎదుట తీసుకొచ్చి టీడీపీకి సంబంధం లేదని కుటుంబ సభ్యులతో చెప్పించే ప్రయత్నం చేశారు. కాగా, తోపులాట కారణంగానే చనిపోయాడని వీరాంజనేయులు కుమారుడు కిరణ్‌ స్పష్టం చేయగా.. టీడీపీకి సంబంధం లేదని బీటెక్‌ రవి బలవంతంగా చెప్పించడం గమనార్హం. మరోవైపు జనసేన ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తే, వైఎస్సార్‌సీపీకి అంటగట్టే ప్రయత్నం చేశారు. వైఎస్సార్‌సీపీ వాళ్లు ఆందోళనలో చేసి వాహనాలు తగులబెట్టారంటూ బుకాయించారు. జనసేన అధిస్థానం పంపిన కేకే రాకముందే బీటెక్‌ రవి.. వీరాంజనేయులు ఇంటికెళ్లారు. తమ మూకలు నామినేషన్‌ కేంద్రం వద్ద ఎందుకు ఉన్నారన్న విషయాన్ని మాత్రం దాటవేశారు.

టీడీపీ తోపులాటే కారణం..

జనసేన కార్యకర్త వీరాంజనేయులు మృతికి బీటెక్‌ రవి కారణమని జనసేన ఆరోపిస్తోంది. అల్లరి మూకలను ఉసిగొల్పి విచ్చలవిడిగా ప్రవర్తించి, తాజాగా తనవరకు వ్యవహారం రాకుండా ఎత్తుగడలు వేస్తున్నారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. తోపులాటలోనే వీరాంజనేయులు చనిపోయాడని ఏకంగా డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ ట్వీట్‌ చేశారు. పవన్‌ కళ్యాణ్‌ ట్వీట్‌తో బీటెక్‌ రవి మాటలు అబద్ధమని తేలిపోయింది. పవన్‌ పంపిన జనసేన నేత కేకే వచ్చేలోపే చక్కదిద్దుకోవాలని బీటెక్‌ రవి తాపత్రయం పడ్డారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

పదవుల దాహంతోనే అరాచకం..

అధికారం అండతో తెలుగుదేశం పార్టీ నేతలు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. పదవుల దాహంతో అరాచకం సాగిస్తున్నారు. మొన్నటి కడప కార్పొరేషన్‌ ఎన్నికల్లో నామినేషన్‌ వేసేందుకు వెళ్లిన బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పుటిక వెంకటరమణపై దాడి చేసి గాయపరిచారు. నిన్న పెండ్లిమర్రి మండలం ఇసుకపల్లె సర్పంచ్‌ నామినేషన్‌ వేసేందుకు వెళ్లిన లంకా చిన్నపరెడ్డిపై దాడికి పాల్పడ్డారు. తాజాగా చక్రాయపేట మండలంలోని సురభి గ్రామ సర్పంచ్‌ అభ్యర్థిగా జనసేన మద్దతుదారుడిగా జలపాతి నాగమల్లయ్య నాగలగుట్టపల్లె సచివాలయంలో నామినేషన్‌ వేయగా ఉపసంహరించుకునేలా టీడీపీ మండల ఇంచార్జ్‌ మహేశ్వరరెడ్డి నామినేషన్‌న్‌పరిశీలనకు బీటెక్‌ రవి, ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డిలను రప్పించుకొని నామినేషన్‌ కేంద్రం వద్ద హల్‌చల్‌ చేశాడు. ఈ క్రమంలో జనసేన సర్పంచ్‌ అభ్యర్థి బంధువు ముంతల వీరాంజనేయులు మృతికి కారణమయ్యారు.

తోపులాట వల్లే వీరాంజనేయులు మృతిచెందారని జనసేన నిర్ధారణ

తమకు సంబంధం లేదంటూ బుకాయిస్తున్న బీటెక్‌ రవి

మధ్యలో వైఎస్సార్‌సీపీపై నిందలు వేస్తున్న వైనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement