ఎస్పీ చెప్పినా.. అడ్డుకుంటున్న పోలీసులు | - | Sakshi
Sakshi News home page

ఎస్పీ చెప్పినా.. అడ్డుకుంటున్న పోలీసులు

Nov 23 2026 5:18 AM | Updated on Nov 23 2026 5:18 AM

– మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి

మైదుకూరు: వైఎస్సార్‌సీపీ మద్దతుదారులైన సర్పంచ్‌ అభ్యర్థులకు రక్షణ కల్పించి నామినేష వేయించాలని ఎస్పీ ఆదేశించినా మైదుకూరు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ మద్దతు ఇస్తున్న అభ్యర్థులను పోలీసులే అడ్డుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ఆరోపించారు. ఆదివారం జీవీ సత్రంలో టీడీపీ మద్దతుదారుల దాడి బాధితులు వైఎస్సార్‌సీపీ నాయకులను పోలీస్‌స్టేషన్‌కు తీసుకురావడంతో.. రఘురామిరెడ్డి స్టేషన్‌కు చేరుకుని పోలీసు అధికారులతో మాట్లాడారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మైదుకూరు నియోజకవర్గంలో పోలీసు అధికారులు ఎస్పీ ఆదేశాలనే బేఖాతరు చేస్తున్నారని విమర్శించారు. శనివారం నామినేషన్‌ వేసేందుకు వచ్చిన మైదుకూరు మండలం తువ్వపల్లె, బ్రహ్మంగారిమఠం మండలం దిరసవంచ పంచాయతీ సర్పంచ్‌ అభ్యర్థులను టీడీపీ మద్దతుదారులకు రక్షణ కల్పించి నామినేషన్‌ వేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎస్పీ పోలీసులను ఆదేశించారని తెలిపారు. ఆ మేరకు ఆదివారం నామినేషన్‌ వేసేందుకు వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారన్నారు. పోలీసుల వ్యవహారం ఫ్యాక్షన్‌ను ప్రోత్సహించినట్టు కాదా అని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement