వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను గెలిపించండి | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను గెలిపించండి

Nov 23 2026 5:18 AM | Updated on Nov 23 2026 5:18 AM

ఎంపీ మిథున్‌ రెడ్డి పిలుపు

సాక్షి, మదనపల్లె : మదనపల్లె మండలంలో వైఎస్సార్‌సీపీ మద్దతు ఇచ్చే సర్పంచ్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని రాజంపేట ఎంపీ, లోక్‌ సభలో వైఎస్సార్‌సీపీ పక్షనేత పెద్దిరెడ్డి వెంకట మిథున్‌ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి ఆయన మదనపల్లెకు వచ్చారు. ఈ సందర్భంగా కర్ణాటక సరిహద్దులోని చీకలబైలు వద్ద నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మిథున్‌ రెడ్డి మాట్లాడుతూ కుటమిపాలనలో ఏ ఎన్నిక స్వేచ్ఛగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించడం లేదని మండిపడ్డారు.స్థానిక ఎన్నికల్లో పార్టీ శ్రేణులు చూపించిన తెగువ ప్రశంసనీయమని కొనియాడారు. ఇదే స్ఫూర్తితో పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు.

కూటమి అరాచకాలను ఎదుర్కోవాలి

రాజంపేట : పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థులను కలిసికట్టుగా గెలిపించుకోవాలని లోక్‌సభ పక్షనేత, ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పేర్కొన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గాల్లో బరిలో ఉన్న పార్టీ మద్దతుదారులకు పూర్తిస్థాయిలో అండగా నిలవాలన్నారు. వైఎస్‌ జగన్‌ హయాంలో గ్రామాల్లో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించి, అభ్యర్థుల గుర్తులను విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.కూటమి ప్రభుత్వంపై గ్రామీణ ఓటర్లలో తీవ్ర వ్యతిరేకత మొదలైందని, మున్సిపల్‌,ఎంపీటీసీ ఎన్నికల్లో అధికార పక్షం చేసిన అరాచకాలను ప్రజలు గమనించారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement