క్షుద్రపూజలు, గుప్తనిధుల తవ్వకాల కలకలం | - | Sakshi
Sakshi News home page

క్షుద్రపూజలు, గుప్తనిధుల తవ్వకాల కలకలం

Nov 21 2026 2:26 AM | Updated on Nov 21 2026 2:26 AM

బద్వేలు అర్బన్‌: బద్వేలు పట్టణం సుందరయ్య కాలనీలోని శ్రీశ్రీవిద్యశ్రీ ప్రైవేటు పాఠశాలలో గుప్తనిధుల కోసం సాగిన క్షుద్రపూజలు, తవ్వకాలు కలకలం రేపాయి. గత వారం రోజులుగా పాఠశాల ప్రిన్సిపాల్‌, కొందరు పూజారులతో కలిసి ఆవరణలో క్షుద్రపూజలు నిర్వహిస్తూ ఆఫీసు గదిలో పది అడుగుల లోతు గుంత తవ్వారు. గురువారం అర్ధరాత్రి తవ్వకాలు జరుపుతుండగా అనుమానంతో లోపలికి వెళ్లిన స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆ గుంతను చూసి నిలదీశారు. మరుగుదొడ్డి కోసమే తవ్వామని ప్రిన్సిపాల్‌ వారిని నమ్మించే ప్రయత్నం చేశాడు. ఆవరణలో పూజా సామగ్రి బయటపడటంతో ఆయనతో పాటు పూజారులు అక్కడి నుంచి పరారయ్యారు. శుక్రవారం ఉదయం తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బద్వేలు అర్బన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు, పాఠశాలను పరిశీలించిన గోపవరం ఎంఈఓ చెన్నయ్య తదుపరి చర్యల కోసం డీఈఓకు నివేదిక పంపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement