అర్చకుడి కుటుంబంపై దాడి: కేసు నమోదు | - | Sakshi
Sakshi News home page

అర్చకుడి కుటుంబంపై దాడి: కేసు నమోదు

Nov 21 2026 2:26 AM | Updated on Nov 21 2026 2:26 AM

కడప అర్బన్‌: కడపలోని వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న వెంకటాద్రి అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న హౌసింగ్‌బోర్డ్‌ రామాలయ ప్రధాన అర్చకుడు (పెద్దాయన స్వామీజీ), ఆయన కుటుంబ సభ్యులపై దాడి జరిగింది. ఈ నెల 19 న లక్ష్మీనారాయణ రెడ్డి, శైలజలు ఈ దాడికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్‌ఐ ఎన్‌. రాజరాజేశ్వర్‌ రెడ్డి వెల్లడించారు. గాయపడిన అర్చకుడు, ఆయన కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జ రిపి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ బాధితులకు భరోసా ఇచ్చారు.

మానసిక దివ్యాంగుడి అదృశ్యం

అట్లూరు: మండల పరిధిలోని ఎస్‌.వెంకటాపురం తూడూరు కాలనీకి చెందిన ఎర్రబల్లి చెన్నయ్య (46) అనే మానసిక దివ్యాంగుడు అదృశ్యమైనట్లు ఎస్‌ఐ మోహన్‌ కుమార్‌ గౌడ్‌ తెలిపారు. ఈ నెల 18న మధ్యాహ్నం వరకు తన అన్న చెండ్రాయుడుతో ఉన్న చెన్నయ్య, ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అటవీ ప్రాంతంలో డ్రోన్‌ కెమెరా సహాయంతో గాలిస్తున్నా శుక్రవారం సాయంత్రం వరకు జాడ తెలియలేదని, ఆచూకీ లభ్యమయ్యే వరకు గాలింపు కొనసాగిస్తామని ఎస్‌ఐ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement