బస్సు దిగుతుండగా ప్రమాదం.. ప్రయాణికుడి కాలు నుజ్జునుజ్జు | - | Sakshi
Sakshi News home page

బస్సు దిగుతుండగా ప్రమాదం.. ప్రయాణికుడి కాలు నుజ్జునుజ్జు

Nov 21 2026 2:26 AM | Updated on Nov 21 2026 2:26 AM

మైదుకూరు: ఆర్టీసీ డ్రైవర్‌, కండక్టర్ల నిర్లక్ష్యం కారణంగా బస్సు కింద పడి ఓ ప్రయాణికుడు తీవ్రంగా గాయపడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మైదుకూరు మండలం ముదిరెడ్డిపల్లెకు చెందిన అమ్మిరెడ్డి ఓబుళరెడ్డి (56) గత నెల 24న వనిపెంటకు వెళ్లేందుకు మైదుకూరు డిపో బస్సు ఎక్కాడు. వనిపెంట వద్ద దిగుతుండగా కండక్టర్‌ శ్రీరైట్‌శ్రీ చెప్పడంతో డ్రైవర్‌ బస్సును ముందుకు కదిలించాడు. దీంతో కింద పడిన ఓబుళరెడ్డి ఎడమ కాలిపై బస్సు టైరు ఎక్కి పాదం నుజ్జునుజ్జయింది. స్థానికులు కేకలు వేసినా సిబ్బంది బస్సు ఆపకుండా వెళ్లిపోయారు. క్షతగాత్రుడిని 108లో ప్రొద్దుటూరు, అక్కడి నుంచి కడప రిమ్స్‌కు తరలించగా.. ప్రస్తుతం తిరుపతిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆలస్యంగా శుక్రవారం బావమరిది మహేశ్వరరెడ్డి మైదుకూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

మేకల షెడ్డు సందర్శన

బ్రహ్మంగారిమఠం: మండలంలోని రేకలకుంట గ్రామంలో నేషనల్‌ లైవ్‌స్టాక్‌ మిషన్‌ పథకం కింద ఏర్పాటు చేసిన మేకల షెడ్డును జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిణి డాక్టర్‌ విజయలక్ష్మి, పశువైద్యాధికారి డాక్టర్‌ మహేశ్వర్‌ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మేకల పెంపకందారులకు పచ్చిమేత, ఎండుమేత సమతుల్య వినియోగం, వేసవిలో పశుగ్రాస ప్రణాళిక, షెడ్డు పరిశుభ్రత, నట్టల నివారణ, టీకాల ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. శాసీ్త్రయ పద్ధతుల్లో మేకల పెంపకం చేపడితే అధిక ఆదాయం పొందవచ్చని సూచించారు.

బైకులు ఢీకొని

నలుగురికి తీవ్ర గాయాలు

మదనపల్లె టౌన్‌: రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కురబలకోట మండలం అంగళ్లు సమీపంలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. బి.కొత్తకోట మండలం కాండ్లమడుగు క్రాస్‌కు చెందిన వెంకటరమణారెడ్డి, మహమ్మద్‌ రఫీ ద్విచక్ర వాహనంలో అంగళ్లు నుంచి బయలుదేరారు. అదే సమయంలో అంగళ్లుకు చెందిన ఉదయ్‌ కిరణ్‌ రెడ్డి, సోను మరో బైక్‌లో ఎదురుగా వస్తున్నారు. మిట్స్‌ కళాశాల సమీపంలోకి రాగానే రెండు బైకులు అతివేగంతో ఒకదానికొకటి ఢీకొన్నాయి.ప్రమాదంలో నలుగురూ రోడ్డుపై పడి తీవ్ర గాయాలపాలయ్యారు. భారీ శబ్దం విని పరుగున వచ్చిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తుండగా, కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement