కమలాపురం: వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. శుక్రవారం కమలాపురం మండలం పందిళ్లపల్లె నామినేషన్ కేంద్రానికి వెళ్తుండగా సీఐ మోహన్ ఆధ్వర్యంలో పోలీసులు రవీంద్రనాథ్ రెడ్డిని అడ్డుకున్నారు. నల్లలింగాయపల్లె పంచాయతీకు చెందిన 10 మంది వార్డు సభ్యులు, వారి ప్రతిపాదకులతో (ప్రపోజల్స్) కలిసి నామినేషన్ కేంద్రానికి రవీంద్రనాథ్ రెడ్డి వస్తుండగా కేంద్రానికి 100 మీటర్ల దూరంలోనే ఆయన వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. నామినేషన్ కేంద్రం వద్దకు వెళ్లకూడదని సీఐ చెపారు. నామినేషన్ వేసేందుకు తమ పార్టీ మద్దతు దారులు వచ్చారని, వారిని కేంద్రంలోనికి పంపించి వస్తానని రవీంద్రనాథ్ రెడ్డి చెప్పారు. నామినేషన్ వేసే వార్డు సభ్యులను అందర్నీ నేను దగ్గరుండి పంపిస్తామని సీఐ చెప్పగా ముందు మీరు వారందరిని పంపండి.. తర్వాత నేను వెళ్తానని రవీంద్రనాథ్‌రెడ్డి సీఐ కు తెలియజేశారు. దీంతో సీఐ వార్డులకు నామినేషన్లు వేసే సభ్యులందరిని నామినేషన్ కేంద్రానికి పంపించారు. అనంతరం రవీంద్రనాథ్‌రెడ్డి వెనుదిరిగారు.


