టీమ్‌–డి, సి జట్ల విజయం | - | Sakshi
Sakshi News home page

టీమ్‌–డి, సి జట్ల విజయం

Nov 19 2026 2:55 AM | Updated on Nov 19 2026 2:55 AM

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) ఆధ్వర్యంలో 2026–27 సీజన్‌కు సంబంధించి నిర్వహిస్తున్న అండర్‌–15 మహిళల రెండో విడత రాష్ట్ర ప్రాబబుల్స్‌ వన్డే మ్యాచ్‌లు బుధవారం ఉత్సాహంగా సాగాయి. కడప నగర శివార్లలోని రెండు వేదికల్లో జరిగిన వేర్వేరు మ్యాచ్‌ల్లో టీమ్‌–డి, టీమ్‌–సి జట్లు ఘనవిజయం సాధించాయి.

రాణించిన లక్ష్య, షణ్ముఖ

కెఎస్‌ఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో జరిగిన పోరులో టీమ్‌–డి, టీమ్‌–ఎ జట్లు తలపడ్డాయి. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమ్‌–డి నిర్ణీత 35 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. ఆ జట్టులో చైత్ర (43), తరుణిక (43) రాణించారు. టీమ్‌–ఎ బౌలర్లలో రితిక 2 వికెట్లు, మేఘవరెడ్డి ఒక వికెట్‌ పడగొట్టారు. అనంతరం 199 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్‌–ఎ 26 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌట్‌ అయింది. విశ్వశ్రీ (27), ఆయాతి (22) మాత్రమే కాస్త ప్రతిఘటించారు. టీమ్‌–డి బౌలర్లు లక్ష్య మోహన్‌ (4 వికెట్లు), షణ్ముఖ దుర్గ ప్రియ (3 వికెట్లు) విజృంభించి ప్రత్యర్థిని కట్టడి చేశారు. దీంతో టీమ్‌–డి 95 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది.

మెరిసిన యోధిక, సన ఆఫ్రిన్‌

కెఓఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో జరిగిన మరో మ్యాచ్‌లో టీమ్‌–సి జట్టు 24 పరుగుల తేడాతో టీమ్‌–బిపై గెలుపొందింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన టీమ్‌–సి నిర్ణీత 35 ఓవర్లలో 5 వికెట్లకు 230 పరుగులు చేసింది. యోధిక వెంకట శ్రీ (88), సన ఆఫ్రిన్‌ (52) అర్ధ సెంచరీలతో మెరిశారు. టీమ్‌–బి బౌలర్లలో అక్షర 2, గాయత్రి, జాహ్నవి యాదవ్‌ తలో వికెట్‌ తీశారు. 231 పరుగుల లక్ష్యఛేదనలో టీమ్‌–బి గట్టిగా పోరాడినా నిర్ణీత 35 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగులకే పరిమితమైంది. వర్షిణి (61) అర్ధ సెంచరీతో ఆకట్టుకోగా, సంకీర్తన (28) సహకారం అందించింది. టీమ్‌–సి బౌలర్లు శేష, వైష్ణవి, షేక్‌ దిల్‌షాద్‌ బీ, హారిక తలో వికెట్‌ తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

ఉత్సాహంగా ఏసీఏ అండర్‌–15 ఉమెన్‌ వన్డేలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement