కరువు మండలాలను ప్రకటించిన మాత్రాన సరిపోదు. రైతు రుణాలు మాఫీ చేయాలి. పశుగ్రాసాన్ని ఉచితంగా సరఫరా చేయాలి. కూలీలకు ఉపా ధి హామీ పనిదినాలు పెంచాలి. జిల్లాలో ఇసుక మాఫియాను అరికట్టడం ద్వారా భూగర్భ జలాలను రక్షించాలి. రబీలో రైతులు కొన్ని ప్రాంతాల్లో దుక్కులు చేసుకుని ఎరువులు కూడా చల్లుకున్నారు. ఇప్పుడు వర్షాలు లేకపోవడం వల్ల వారికి పెట్టుబడి సాయం అందించాలి.
– గాలి చంద్ర, సీపీఐ జిల్లా కార్యదర్శి, కడప
కరువు వల్ల రైతులు సంక్షోభంలోకి నెట్టబడ్డారు. అప్పుల బాధలు భరించలేక ఆత్మహత్యలకు పాల్ప డే దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. కరువు మండలాలను ప్రకటించిన ప్రభు త్వం సహాయక చర్యలు అమలు చేసే విషయంలో నిర్లక్ష్యం వహిస్తోంది. స్థానిక సంస్థలను కై వ సం చేసుకోవడంలో చూపుతున్న శ్రద్ధ కరువు సహాయక చర్యల్లో లేకపోవడం విచారకరం. – జయవర్ధన్,
రాష్ట్ర కార్యదర్శి, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ, కడప
కరువు మండలాల ప్రకటనతో సరిపెట్టి సహాయక చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వ తీరుపై పోరాటాలు నిర్వహిస్తాం. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనివిధంగా జిల్లాలో కరువు పరిస్థితులు తలెత్తాయి. వేసిన పంటలు వేసినట్లు ఎండిపోయాయి. బోర్లలో నీరు లేక తాగునీటికి కటకటలాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతులు తీవ్రంగా నష్టపోయారు. వీరిని తక్షణమే ఆదుకునే దిశగా చర్యలు తీసుకోవాలి.
– చంద్రశేఖర్, సీపీఎం జిల్లా కార్యదర్శి, కడప


