కడప వైఎస్ఆర్ సర్కిల్: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఆధ్వర్యంలో అండర్–15 ఉమెన్ ప్రాబబుల్ వన్డే మ్యాచ్లు ఆదివారం కడప వేదికగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు జరిగిన మ్యాచ్లలో టీమ్–బి, టీమ్–డి జట్లు ఘన విజయాలు సాధించాయి. కెఎస్ఆర్ఎం మైదానంలో జరిగిన మ్యాచ్లో టీమ్–బి 43 పరుగుల తేడాతో టీమ్–ఎ పై గెలుపొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమ్–బి 34.4 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌట్ అయింది. జాహ్నవి రెడ్డి (31), షాలిని చౌదరి (23) రాణించగా, టీమ్–ఎ బౌలర్లలో రితిక 3, రేష్మ 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో టీమ్–ఎ 27.2 ఓవర్లలో 120 పరుగులకే పరిమితమైంది. ఆయతి (59), విశ్వశ్రీ (35) పోరాడినా ఫలితం లేకపోయింది. టీమ్–బి బౌలర్లలో గాయత్రి 3, అక్షర 2, కార్తీక 2 వికెట్లు పడగొట్టారు.
– కెఓఆర్ఎం మైదానంలో జరిగిన మరో మ్యాచ్లో టీమ్–డి 7 వికెట్ల తేడాతో టీమ్–సి పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమ్–సి 35 ఓవర్లలో 9 వికెట్లకు 162 పరుగులు చేసింది. హర్షిత గౌడ కుమార్ (65 బంతుల్లో 88 పరుగులు చేసింది. అనంతరం టీమ్–డి 27.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసి గెలిచింది. రక్షిత (86), షేక్ రిహాన (24) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.


