దమ్ముంటే ఎన్నికలకు రా.. | - | Sakshi
Sakshi News home page

దమ్ముంటే ఎన్నికలకు రా..

Nov 16 2026 1:20 AM | Updated on Nov 16 2026 1:20 AM

రామాపురం: ప్రజాబలం, రాజకీయ ధైర్యం ఉంటే స్వేచ్ఛాయుత ఎన్నికలకు సిద్ధమై ప్రజల తీర్పును ఎదుర్కోవాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌ రెడ్డి అధికార పార్టీ నాయకులకు సవాల్‌ విసిరారు. రాయచోటి నియోజకవర్గంలో జరిగే ఏ ఎన్నికలనైనా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తే 90 శాతం స్థానాలను వైఎస్‌ఆర్‌సీపీ గెలుచుకోకపోతే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ప్రకటించారు. ఆదివారం రామాపురం వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికార పార్టీ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యంలో అధికారం అంటే ప్రజలను భయపెట్టడం కాదని, ప్రజల అభిప్రాయాన్ని గౌరవించడమని పేర్కొన్నారు.

● రాయచోటి మున్సిపల్‌ చైర్మన్‌ పదవికి ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని, అందులో వైఎస్‌ఆర్‌సీపీ 20 వేల మెజారిటీతో విజయం సాధించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్‌ విసిరారు.

85 గ్రామాల్లో అభ్యర్థులను అడ్డుకుంటున్నారు

రాయచోటి నియోజక వర్గంలోని 85 గ్రామాల్లో ఒక్కో గ్రామానికి 100 నుండి 150 మంది వరకు రౌడీ మూకలను ఏర్పాటు చేసి ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కోర్టు ఆదేశాలతో నామినేషన్లు వేయడానికి వచ్చిన వారిని సైతం అడ్డుకోవడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. దాడులు, బెదిరింపులతో గ్రామా ల్లో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని విమర్శించారు.

అభ్యర్థుల కుటుంబ సభ్యులకూ బెదిరింపులు..

ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు.

మంత్రిని బర్తరఫ్‌ చేయాలి..

రాయచోటి ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలపై ఎన్నికల సంఘం సుమోటోగా స్వీకరించి కేసులు నమోదు చేయాలని గడికోట శ్రీకాంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు సంబంధిత మంత్రి రాం ప్రసాద్‌ రెడ్డిని వెంటనే పదవి నుంచి బర్తరఫ్‌ చేయా లని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ రామాపురం మండల కన్వీనర్‌ గడికోట జనార్ధన్‌ రెడ్డి పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

గడికోట శ్రీకాంత్‌ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement