● పులివెందుల ఎంపీపీ ఎస్టీకి రిజర్వ్‌.. కానీ ఒక్క ఎంపీటీసీ స్థానమూ దక్కని వైనం ● తలాతోక లేకుండా వ్యవహరించిన యంత్రాంగం.. ఎస్‌ఈసీ, ఈఓల మధ్య సమన్వయ లోపం ● అత్యుత్సాహంతో ఏకగ్రీవం చేసుకుని, ఇప్పుడు నాలుక కరుచుకుంటున్న టీడీపీ | - | Sakshi
Sakshi News home page

● పులివెందుల ఎంపీపీ ఎస్టీకి రిజర్వ్‌.. కానీ ఒక్క ఎంపీటీసీ స్థానమూ దక్కని వైనం ● తలాతోక లేకుండా వ్యవహరించిన యంత్రాంగం.. ఎస్‌ఈసీ, ఈఓల మధ్య సమన్వయ లోపం ● అత్యుత్సాహంతో ఏకగ్రీవం చేసుకుని, ఇప్పుడు నాలుక కరుచుకుంటున్న టీడీపీ

Nov 15 2026 1:02 PM | Updated on Nov 15 2026 1:02 PM

● పులివెందుల ఎంపీపీ ఎస్టీకి రిజర్వ్‌.. కానీ ఒక్క ఎంపీటీసీ స్థానమూ దక్కని వైనం ● తలాతోక లేకుండా వ్యవహరించిన యంత్రాంగం.. ఎస్‌ఈసీ, ఈఓల మధ్య సమన్వయ లోపం ● అత్యుత్సాహంతో ఏకగ్రీవం చేసుకుని, ఇప్పుడు నాలుక కరుచుకుంటున్న టీడీపీ ● అత్యుత్సాహంపై నాలుక కరుచుకుంటున్న టీడీపీ..

పులివెందుల మండల పరిధిలోని మొత్తం 5 ఎంపీటీసీ స్థానాల్లో ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు కనీసం ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు చేయకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఫలితంగా ప్రత్యర్థులెవరూ లేకపోవడంతో ఐదు స్థానాల్లోనూ టీడీపీ అభ్యర్థులే ఏకగ్రీవమయ్యారు. తీరా ఇప్పుడు ఎంపీపీ ఎన్నిక సమయానికి అసలు పీఠాన్ని దక్కించుకోవాల్సిన ఎస్టీ అభ్యర్థే లేకపోవడం గమనార్హం. రిజర్వేషన్ల ప్రక్రియపై కనీస అవగాహన లేకుండా, అధికారుల అండతో అత్యుత్సాహం ప్రదర్శించి ఏకపక్షంగా వ్యవహరించడం వల్లే నేడు టీడీపీ నేతలు నాలుక కరుచుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

సాక్షి ప్రతినిధి, కడప: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్య స్ఫూర్తిని అపహాస్యం చేస్తోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) , జిల్లా ఎన్నికల అధికారి (డీఈఓ) తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. నోటిఫికేషన్‌ వెలువడిన నాటి నుంచి రాజ్యాంగ విలువలను తిలోదకాలు ఇస్తూ విధి నిర్వహణలో పారదర్శకతకు పాతరేశారు. ఇందుకు పులివెందుల ఎంపీపీ పీఠం కేటాయింపే ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది.

అధికారుల ఏమరపాటు..

ఎంపీపీ ఎన్నిక అగమ్యగోచరం!

పులివెందుల మండల పరిషత్‌ అధ్యక్ష (ఎంపీపీ) స్థానాన్ని ఎస్టీ జనరల్‌కు కేటాయిస్తూ ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే, ఆ మండల పరిధిలో కనీసం ఒక్క ఎంపీటీసీ స్థానాన్ని అయినా ఎస్టీ జనరల్‌కు కేటాయించడంలో జిల్లా ఎన్నికల అధికారి (డీఈఓ) తీవ్ర నిర్లక్ష్యం, ఏమరపాటు ప్రదర్శించారు. మండలంలో మొత్తం 5 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, వాటిలో రెండింటిని ఓసీ మహిళలకు, ఒక్కొక్కటి చొప్పున ఓసీ జనరల్‌, బీసీ జనరల్‌, ఎస్సీ మహిళలకు రిజర్వ్‌ చేశారు. ఈ లెక్కన ఆయా కేటగిరీలకు చెందిన అభ్యర్థులు ఎన్నికయ్యారు. తీరా ఇప్పుడు ఎంపీపీ ఎన్నిక సమయానికి, మండల పరిధిలో ఒక్క ఎస్టీ జనరల్‌ ఎంపీటీసీ కూడా లేని విచిత్ర పరిస్థితి నెలకొంది. అసలు ఎస్టీ అభ్యర్థి లేకుండానే ఎంపీపీ పీఠాన్ని ఎలా భర్తీ చేస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది.

ప్రశ్నార్థకంగా మారిన రిజర్వేషన్ల పారదర్శకత..

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియ పారదర్శకతపై ఇప్పుడు తీవ్ర స్థాయిలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిబంధనలను పక్కనపెట్టి, అధికార పార్టీ నేతలకు కావాల్సిన రీతిలో రిజర్వేషన్లు కేటాయిస్తూ వెళ్లారనే ఆరోపణలకు ఈ ఘటన మరింత బలం చేకూరుస్తోంది. జనాభా ప్రాతిపదికన, రోటేషన్‌ పద్ధతి నిబంధనలకు లోబడి రిజర్వేషన్లు ఖరారు చేసి ఉంటే, నేడు పులివెందుల ఎంపీపీ ఎంపిక విషయంలో యంత్రాంగం తలదించుకునే దుస్థితి దాపురించేది కాదని పలువురు సీనియర్‌ అధికారులే అభిప్రాయపడుతున్నారు.

సాధారణంగా జిల్లాల నుంచి వెళ్లే నివేదికల ఆధారంగానే ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ జారీ చేస్తుంది. ఆ నివేదికల ప్రకారమే ఎంపీపీ పీఠం ఎస్టీ జనరల్‌కు రిజర్వ్‌ అయింది. కానీ, క్షేత్రస్థాయిలో ఎంపీటీసీల రిజర్వేషన్ల కేటాయింపులో జరిగిన ‘మతలబు’ వల్లే ఎస్టీ జనరల్‌ స్థానం గల్లంతైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల ఇష్టారాజ్యపు వ్యవహారశైలి కారణంగా నేడు జిల్లా యంత్రాంగం పరువు బజారున పడిందని పలువురు వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement