కడప కేవ్స్‌ | - | Sakshi
Sakshi News home page

కడప కేవ్స్‌

Nov 14 2026 1:05 AM | Updated on Nov 14 2026 1:05 AM

చలికి వణకకుండా.. సొంతంగా ‘గూళ్లు’ కట్టుకున్న శునకాలు

కడప సెవెన్‌రోడ్స్‌: చలికాలం మొదలవడంతో మనుషులే కాదు, మూగజీవాలు సైతం చలి నుంచి రక్షణ పొందేందుకు తమదైన మార్గాలను వెతుక్కుంటున్నాయి. కడప నగరంలోని జిల్లా పరిషత్‌ భవనం వెనుక వైపు ఉన్న షటిల్‌ కోర్టు వద్ద ఆ పరిసరాల్లో తిరిగే వీధి కుక్కలు సొంతంగా ‘గూళ్లు’ నిర్మించుకోవడం చూపరులను ఆశ్చర్యపరుస్తోంది.

శుద్ధ కుప్పలను తొలిచి గుహల్లా..

షటిల్‌ కోర్టు సమీపంలో నిర్మాణ పనుల కోసం తోలిన తెల్లటి శుద్ధ (మట్టి/సున్నపు పొడి) కుప్పలను ఈ శునకాలు తమ కాళ్లతో ఎంతో నేర్పుగా తోడి, లోపలికి వెళ్లేందుకు వీలుగా చిన్నపాటి గుహల్లా మలుచుకున్నాయి. రాత్రి వేళల్లో చలి తీవ్రత పెరగగానే, తల్లి కుక్కతో పాటు పిల్లలన్నీ కలిసి ఈ గూళ్లలోకి దూరి ఎంతో వెచ్చగా, ప్రశాంతంగా నిద్రిస్తున్నాయి. మరుసటి రోజు ఉదయం సూర్యుడు వచ్చి చలి కాస్త తగ్గిన తర్వాతే అవి గూళ్ల నుంచి బయటకు అడుగుపెడుతున్నాయి. నిత్యం ఉదయం పూట అక్కడికి షటిల్‌ ఆడేందుకు వచ్చే ఉద్యోగులు, స్థానికులు ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోవడంతో పాటు ముచ్చటపడుతున్నారు. కుక్కలు చాకచక్యంగా నిర్మించుకున్న ఈ మట్టి గూళ్లను చూసి సరదాగా ‘కడప కేవ్స్‌’ (కడప గుహలు) అని అభివర్ణిస్తున్నారు. ప్రకృతి సిద్ధంగా మూగజీవాలు తమను తాము రక్షించుకునే తీరుకు ఈ దృశ్యం అద్దం పడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement