ఒంటరి వృద్ధురాలిపై కర్కశత్వం! | - | Sakshi
Sakshi News home page

ఒంటరి వృద్ధురాలిపై కర్కశత్వం!

Nov 14 2026 1:05 AM | Updated on Nov 14 2026 1:05 AM

జమ్మలమడుగు: దిక్కులేని ఒంటరి వృద్ధురాలిపై ఓ వ్యక్తి కర్కశత్వం ప్రదర్శించాడు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాల కోసం ఆశపడి, వాహనంలో తీసుకువచ్చి నిర్మానుష్య ప్రాంతంలో వదిలేసి వెళ్లిపోయాడు. స్థానికుల అప్రమత్తతతో ఎట్టకేలకు ఆ పండుటాకు సురక్షితంగా తన ఇంటికి చేరుకుంది. వైఎస్‌ఆర్‌ కడప జిల్లా జమ్మలమడుగు మండల పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఆభరణాలు లాక్కెళ్లి.. చీకట్లో వదిలేసి..

మైలవరం మండలం వేపరాల గ్రామంలోని కొత్త రూములు ప్రాంతానికి చెందిన బేల్లాల వెంకట లక్ష్మి (భర్త పేరు బి.లక్ష్మయ్య)కి ఎవరూ లేకపోవడంతో ఆమె ఒంటరిగా నివసిస్తోంది. ఇదే అదనుగా భావించిన జమ్మలమడుగు మండలం పొన్నతోట పంచాయతీ పరిధికి చెందిన ఓ వ్యక్తి, రాత్రి సమయంలో ఆమెను వాహనంలో ఎక్కించుకుని అంబవరం వైపాస్‌ (జగనన్న కాలనీ) ప్రాంతానికి తీసుకువచ్చాడు. అక్కడ జనావాసాలు లేకపోవడంతో ఆమెను దింపేసి వెళ్లిపోయాడు. అయితే, వృద్ధురాలిని వదిలి వెళ్లే సమయంలో ఆమె చెవుల్లో ఉన్న బంగారు కమ్మలతో పాటు, ముక్కురాయిని కూడా బలవంతంగా తీసుకెళ్లారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

అన్నం తినిపించి.. నిందితుడికి

ఫోన్‌ చేసి హెచ్చరించిన స్థానికులు

ఎవరూ లేని ఆ నిర్మానుష్య ప్రాంతంలో ఆకలిదప్పులతో అలమటిస్తూ విలపిస్తున్న వృద్ధురాలి ఆర్తనాదాలు రెండు వీధుల దూరంలో నివసిస్తున్న స్థానికులకు వినిపించాయి. వెంటనే పరుగున అక్కడికి చేరుకున్న వారు, ఆమె దయనీయ స్థితిని చూసి చలించిపోయారు. సమయానికి వారు గమనించకపోయి ఉంటే ఆకలిదప్పులతోనే ఆమె ప్రాణాలు విడిచే పరిస్థితి ఉండేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఆమెను ఆప్యాయంగా లేపి మంచి నీళ్లు తాగించి, అన్నం తినిపించి ఓదార్చారు. ఆమె వద్ద ఉన్న ఆధార్‌ కార్డు ద్వారా వివరాలను తెలుసుకున్న స్థానికులు, వృద్ధురాలిని అక్కడ వదిలి వెళ్లిన వ్యక్తిని గుర్తించి అతనికి ఫోన్‌ చేశారు. శ్రీఆమెను ఎక్కడి నుంచి తీసుకొచ్చావో తిరిగి అక్కడే సురక్షితంగా వదిలిపెట్టకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం్ఙ అని గట్టిగా హెచ్చరించారు. దీంతో భయపడిపోయిన ఆ వ్యక్తి తిరిగి అక్కడికి వచ్చి, వృద్ధురాలిని తీసుకెళ్లి ఆమె నివాసం ఉండే వేపరాల గ్రామంలో సురక్షితంగా వదిలిపెట్టినట్లు సమాచారం. అయితే, వృద్ధురాలి వద్ద నుంచి లాక్కెళ్లిన బంగారు కమ్మలు, ముక్కురాయిని తిరిగి ఇచ్చాడా లేదా అనే దానిపై అధికారులు, పోలీసులు విచారణ జరిపి ఆ పండుటాకుకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

బంగారు కమ్మలు, ముక్కురాయి లాక్కెళ్లి..

నిర్మానుష్య కాలనీలో వదిలేసిన వైనం

ఆకలిదప్పులతో విలపిస్తున్న పండుటాకుకు

అన్నం తినిపించి ఆదుకున్న స్థానికులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement