అట్లూరు (బద్వేలు): స్థానిక మైదుకూరు రోడ్డులోని శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయం, అయ్యప్పస్వామి ఆలయాలకు భారతి సిమెంట్ యాజమాన్యం తరఫున అధికారులు గురువారం గోడ గడియారాలను వితరణగా ఇచ్చారు. ఆలయ ఈఓ కృష్ణయ్య, అయ్యప్పస్వామి ఆలయ మేనేజర్ మల్లికార్జునలకు వీటిని అందజేశారు. ఈ సందర్భంగా భారతి సిమెంట్ సీనియర్ సేల్స్ ఆఫీసర్ జయరామ్‌రెడ్డి, టెక్నికల్ ఆఫీసర్ నాగేంద్ర మాట్లాడుతూ.. తమ సంస్థ నిత్యం ఏదో ఒక రూపంలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో భారతి సిమెంట్ డీలర్ పుల్లారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


