‘ఛోటా ముంబై’లో ఐపీల మోత! | - | Sakshi
Sakshi News home page

‘ఛోటా ముంబై’లో ఐపీల మోత!

Nov 13 2026 4:05 AM | Updated on Nov 13 2026 4:05 AM

ప్రొద్దుటూరు క్రైం: బంగారు వ్యాపారానికి, నమ్మకానికి ప్రొద్దుటూరు పెట్టింది పేరు. నాణ్యతకు మారుపేరుగా నిలిచే ఇక్కడి పసిడికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో డిమాండ్‌ ఉంది. వందలాది దుకాణాలు, వేలాది మంది స్వర్ణకారులతో నిత్యం కళకళలాడే ఈ పట్టణానికి శ్రీరెండో ముంబైశ్రీ (ఛోటా ముంబై)గా గుర్తింపు ఉంది. అలాంటి ప్రొద్దుటూరు పసిడి మార్కెట్‌ను ఇప్పుడు శ్రీఐపీశ్రీ (దివాలా పిటిషన్లు) భూతం వణికిస్తోంది. ఒకప్పుడు నమ్మకమే పెట్టుబడిగా సాగిన ఈ వ్యాపారంలో, ఇటీవల కొందరు వ్యాపారులు కిలోల కొద్దీ బంగారం, కోట్లాది రూపాయల అప్పులు తీసుకుని చేతులెత్తేస్తున్నారు. ఏటా ఐదారుగురు బడా వ్యాపారులు ఐపీ బాట పడుతుండగా, అనధికారికంగా ఈ సంఖ్య రెట్టింపు ఉంటుందని మార్కెట్‌ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

పాతతరం కష్టం.. కొత్తతరం నష్టం!

కొన్నేళ్ల క్రితం వరకు ప్రొద్దుటూరులో బంగారు వ్యాపారాలు ఎంతో పద్ధతిగా, పకడ్బందీగా సాగేవి. పాతతరం వ్యాపారులు రెక్కలు ముక్కలు చేసుకుని, నిజాయితీనే పెట్టుబడిగా పెట్టి వ్యాపారాలను నిర్మించారు. కానీ, ప్రస్తుతం వ్యాపారాల్లోకి అడుగుపెట్టిన కొత్తతరంలో కొందరు విలాసవంతమైన జీవనశైలి, ఖరీదైన కార్లు, జల్సాలకు అలవాటు పడుతున్నారు. దీనికి తోడు క్రికెట్‌ బెట్టింగ్‌, మట్కా వంటి వ్యసనాల బారిన పడి, వ్యాపార లాభాలను పక్కదారి పట్టిస్తూ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నారు.

వడ్డీల ఉచ్చు.. రియల్‌ ఎస్టేట్‌ దెబ్బ!

అధిక వడ్డీల ఊబి: వ్యాపార నష్టాలను పూడ్చుకోవడానికి నూటికి రూ. 5 నుంచి రూ. 10 వరకు అధిక వడ్డీలకు అప్పులు తెస్తున్నారు. ఒకరి అప్పు తీర్చడానికి మరొకరి వద్ద బంగారం, నగదు తీసుకుంటూ చివరకు అప్పుల ఊబిలో చిక్కుకుని ఐపీ దాఖలు చేస్తున్నారు.

రియల్‌ ఎస్టేట్‌ నష్టాలు: బంగారు వ్యాపారంలో సంపాదించిన సొమ్మును కొందరు రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లలో పెట్టుబడిగా పెడుతున్నారు. భూముల క్రయవిక్రయాలు మందగించడంతో పెట్టుబడులు నిలిచిపోయి, వడ్డీలు కట్టలేక ఉన్న ఆస్తులు అమ్ముకుని చివరకు దివాలా తీస్తున్నారు.

హంగూ ఆర్భాటాల మోసాలు: ఎలాంటి స్థిరాస్తులు లేకపోయినా ఖరీదైన కార్లు, ఆర్భాటాలతో బంగారు వ్యాపారులుగా చలామణి అవుతూ లక్షల్లో లావాదేవీలు నడిపే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

మళ్లీ మొదలవుతున్న పాత కథలు!

గతంలో ఐపీ పెట్టి ఎంతో మందిని ముంచేసిన కొందరు వ్యక్తులు, కొన్నేళ్ల విరామం తర్వాత తిరిగి ప్రొద్దుటూరుకు వచ్చి కొత్త దుకాణాలు తెరవడం బాధితులను విస్మయానికి గురిచేస్తోంది.

పసిడిపురిలో ‘దివాలా’ దందా..

నమ్మకానికి నిలువునా తూట్లు

కిలోల బంగారం మాయం..

రూ. కోట్లలో అప్పులు హాంఫట్‌

జల్సాల జోరు.. రియల్‌ ఎస్టేట్‌ హోరు.. చివరకు దివాలా బేజారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement