ఎయిడ్స్‌ సురక్ష లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఎయిడ్స్‌ సురక్ష లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలి

Nov 13 2026 4:05 AM | Updated on Nov 13 2026 4:05 AM

పులివెందుల రూరల్‌: రాష్ట్ర ఎయిడ్స్‌ నియంత్రణ మండలి నిర్వహిస్తున్న ‘మొబిలైజేషన్‌ ఆఫ్‌ ఎయిడ్స్‌ సురక్ష’ కార్యక్రమాలను ఎన్జీవోలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని క్లస్టర్‌ ప్రోగ్రామ్‌ అధికారి (సీపీఓ) వేంపల్లె భాస్కర్‌ పేర్కొన్నారు. స్థానిక సీడీఎస్‌ ఎన్జీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన రికార్డులను పరిశీలించారు. హైరిస్క్‌ గ్రూపులను గుర్తించి హెచ్‌ఐవీ స్క్రీనింగ్‌ 95 శాతం పూర్తి చేయాలని, బాధితుల్లో 95 శాతం మందికి చికిత్స, వైరల్‌ లోడ్‌ నియంత్రణ సాధించాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని ఐసీటీసీ, డీఎస్‌ఆర్‌సీ, రక్తనిధి, లింక్‌ ఏఆర్‌టీ కేంద్రాలను సందర్శించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రివెన్షన్‌ ఆఫీసర్‌ ఆనంద్‌ కుమార్‌, కౌన్సిలర్లు సుబ్బయ్య, బాదర్‌ వలి, టెక్నీషియన్‌ రాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement