మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు | - | Sakshi
Sakshi News home page

మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు

Nov 13 2026 3:47 AM | Updated on Nov 13 2026 3:47 AM

కడప సెవెన్‌రోడ్స్‌ : జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో ప్రశాంతంగా, కట్టుదిట్టంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి శ్రీధర్‌ చెరుకూరి అధికారుల ను ఆదేశించారు. గురువారం రాష్ట్ర రాజధాని నుంచి స్థానిక సంస్థల పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠాతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా ఎన్నికల అధికారి శ్రీధర్‌ చెరుకూరితోపాటు ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌, జేసీ డాక్టర్‌నిధి మీనా హాజరయ్యారు. ఈ సందర్భంగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానున్న నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లు, భద్రతా చర్యలు, ఎన్నికల సిబ్బంది నియామకం తదితర అంశాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షించారు. వీసీ ముగిసిన అనంతరం జిల్లా ఎన్నికల అధికారి అధికారులతో మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికల నిర్వహణపై శిక్షణ తరగతులు కూడా నిర్వహించాలని డీపీఓకు కలెక్టర్‌ సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. డీఆర్‌ఓ కె. మల్లికార్జునుడు, ఎస్డీసీలు ప్రతాప్‌ రెడ్డి, శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికలను

పకడ్బందీగా నిర్వహించాలి

జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికలను పూర్తి పారదర్శకంగా, నిబంధనల ప్రకారం నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ శ్రీధర్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసిన ఎన్నికల నోటిఫికేషన్‌, షెడ్యూల్‌లో పేర్కొన్న ప్రతి విధివిధానాన్ని ఖచ్చితంగా పాటించాలన్నారు. వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికల కోసం నవంబర్‌ 23 ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపా రు. జిల్లాలో రాజంపేట, ప్రొద్దుటూరు, పులివెందుల, బద్వేలు, మైదుకూరు, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, కమలాపురం మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వైస్‌ చైర్‌పర్సన్‌ పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు వివరించారు. అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించాలని సూచించారు.

జిల్లా ఎన్నికల అధికారి శ్రీధర్‌ చెరుకూరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement