కడప సెవెన్‌రోడ్స్ : జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తుది ఘట్టానికి వేళయింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించేందుకు యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. జిల్లాలోని ఐదు రెవెన్యూ డివిజన్ల పరిధిలో కౌంటింగ్ కేంద్రాలను పక్కాగా ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి వెల్లడించారు. శనివారం జరిగే కౌంటింగ్‌లో లెక్కింపు సిబ్బంది, అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు.
● బద్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని బి.కోడూరు, మైదుకూరు, శ్రీ అవదూత కాశీ నాయన, బి. మటం, గోపవరం, కలసపాడు, పోరుమామిళ్ల మండలాలకు సంబంధించి బద్వేల్‌లోని అంబేడ్కర్ గురుకులం కేంద్రంలో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
● జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్ పరిధిలోని మైలవరం, దువ్వూరు, పెద్దముడియం, ప్రొద్దుటూరు మండలాలకు సంబంధించి జమ్మలమడుగులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
● కడప రెవెన్యూ డివిజన్ పరిధిలోని సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలకు సంబంధించి కడపలోని మౌలానా ఆజాద్ ఉర్దూ విశ్వవిద్యాలయం పాలటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
● పులివెందుల రెవెన్యూ డివిజన్ పరిధిలోని లింగాల, పులివెందుల, వేముల, వేంపల్లె మండలాలకు సంబంధించి పులివెందులలోని రమనప్ప సత్రం, జడ్ .పి హై స్కూల్ లో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
● రాజంపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని నంద లూరు, రాజంపేట, టి.సుండుపల్లి, వీరబల్లి మండలాలకు సంబంధించి రాజంపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. కౌంటింగ్ నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ముందస్తు ఏర్పా ట్లు పూర్తి చేయాలని, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించినట్లు జిల్లా ఎన్ని కల అధికారి డాక్టర్ శ్రీధర్ చెరుకూరి వివరించారు.
5 రెవెన్యూ డివిజన్లలో
కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటు


