రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

Nov 7 2026 1:48 AM | Updated on Nov 7 2026 1:48 AM

మైదుకూరు : రాష్ట్రస్థాయి సైక్లింగ్‌ పోటీలకు మైదుకూరులోని జెడ్పీ బాలుర హైస్కూల్‌కు చెందిన విద్యార్థులు ఎంపికయ్యారు. కడపలోని వైఎస్సార్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌లో శుక్రవారం జరిగిన అండర్‌ –14, 17, 19 సైక్లింగ్‌ పోటీల్లో మైదుకూరు విద్యార్థులు పరమ వీర ధనుష్‌, భానుప్రకాష్‌, పాశం నవీన్‌ కుమార్‌, హర్షవర్ధన్‌, బాబు ప్రతిభకనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్టు పాఠశాల పీఈటీ రామ్‌ నాయక్‌ తెలిపారు. హెచ్‌ఎం గోశెట్టి రామమోహన్‌, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.

‘కడప బాలోత్సవం’ వాయిదా

కడప ఎడ్యుకేషన్‌ : నవంబర్‌ 1 తేదీల్లో జరగాల్సిన 4వ కడప బాలోత్సవం పిల్లల పండుగ ఎన్నికల కోడ్‌ కారణంగా వాయిదా పడింది. ఉన్నతాధికారుల సూచనల ప్రకారం డిసెంబర్‌ 4 వరకు ఎలక్షన్‌ కోడ్‌ అమలులో ఉంటుందని, ఆ తర్వాతే కొత్త తేదీలను ప్రకటిస్తామని కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు వి. నాగముని రెడ్డి, బి. రాజశేఖర్‌ రాహుల్‌ తెలిపారు.ఎన్నికలు, విద్యార్థుల పరీక్షల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు శుక్రవారం ఎస్వీ ఇంజనీరింగ్‌ కాలేజీలో జరిగిన సమావేశంలో వారు పేర్కొన్నారు. అయితే, పండుగ రిజిస్ట్రేషన్లు యథావిధిగా కొనసాగుతాయని, ఇప్పటికే రిజిస్టర్‌ చేసుకున్న విద్యార్థులు, పాఠశాలల వివరాలు చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బాలోత్సవ కమిటీ సభ్యులు డా. వీరసుదర్శన రెడ్డి, డా. వెల్లల వెంకటేశ్వరాచారి , సునీత, సత్తార్‌ ఫైజీ,వెంకట సుబ్బయ్య, లక్ష్మి రాజా, కార్యదర్శులు వెంకటేశ్వర రెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

అండర్‌–19 జిల్లా స్థాయి క్రీడా ఎంపికలు

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : స్కూల్‌ గేమ్‌ ఫెడరేషన్‌ అండర్‌–19 జిల్లాస్థాయి ఎంపిక పోటీలు శుక్రవారం జరిగాయి. ఈ మేరకు వివరాలను ఎస్‌జీఎఫ్‌ అండర్‌–19 జిల్లా సెక్రెటరీ మురళీ కృష్ణారెడ్డి వెల్లడించారు. డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ క్రీడా పాఠశాల మైదానంలో అండర్‌–19 బాలబాలికల ఆర్చరీ (విలువిద్య) ఎంపికలను ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ జూనియర్‌ లెక్చరర్‌ మహేశ్వర్‌ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ పోటీలకు జిల్లాలోని వివిధ విద్యా సంస్థల నుంచి 56 మంది క్రీడాకారులు హాజరయ్యారు. కడప నగర శివారులోని జిల్లా కేంద్రీయ విశ్వవిద్యాలయ మైదానంలో జిల్లా స్థాయి సైక్లింగ్‌ ఎంపిక పోటీలు జరిగాయి. వ్యాయామ ఉపాధ్యాయురాలు సుశీలమ్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎంపికల్లో దాదాపు 58 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో కోచ్‌లు రాజు, గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement