పుట్టగొడుగుల పెంపకంతో స్వయం ఉపాధి | - | Sakshi
Sakshi News home page

పుట్టగొడుగుల పెంపకంతో స్వయం ఉపాధి

Nov 7 2026 1:48 AM | Updated on Nov 7 2026 1:48 AM

కడప ఎడ్యుకేషన్‌ : తక్కువ పెట్టుబడి, తక్కువ స్థలంతో ఇంటి వద్దనే పుట్టగొడుగుల పెంపకం చేపట్టి అదనపు ఆదాయం పొందవచ్చని ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) ప్రధాన శాస్త్రవేత్త డా. కె.సునీల్‌కుమార్‌ తెలిపారు. ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కేవీకేలో రైతులు, మహిళలు, యువత, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ఏర్పాటు చేసిన రెండు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు.ఈ శిక్షణలో పుట్టగొడుగుల రకాలు, కంపోస్ట్‌, బెడ్‌ తయారీ, సాగు సాంకేతికతలు, కోత అనంతర నిర్వహణ, మార్కెటింగ్‌, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై ప్రత్యక్ష ప్రదర్శనల ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు డా. కె.సాయి మహేశ్వరి, డా.ప్రసూన, డా.ఎస్‌. మానస, డా. టి.మహేష్‌ బాబు, డా. ఐ.సురేష్‌ కుమార్‌ రెడ్డి మరియు ల్యాబ్‌ అసిస్టెంట్లు రసూల్‌, దిలీప్‌ పాల్గొని అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement