బద్వేల్ నియోజకవర్గం గోపవరం సమీపంలో ఏర్పాటు చేసిన సెంచురీ ఫ్లైబోర్డ్స్ పరిశ్రమకు శ్రీకారం చుట్టిన రెండేళ్లలోనే ప్రారంభించారు. 589.23 ఎకరాల్లో రూ.956 కోట్లు అంచనాతో శ్రీకారం చుట్టిన ఆ సంస్థ పెట్టుబడులు రూ.1600 కోట్లకు చేరాయి. 2024 డిసెంబర్ నాటికి ఉత్పత్తి లక్ష్యం కాగా, 2023 డిసెంబర్ నాటి రెండు దశల పనులు కూడా పూర్తి చేశారు. 2021 డిసెంబర్ 23న అప్పటి సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేయగా, 2023 డిసెంబర్ 23న ప్రారంభించారు. ఈపరిశ్రమ ద్వారా 2076 మంది స్థానికులకు ప్రత్యక్ష ఉద్యోగ అవకాశాలు లభించాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 75 శాతం స్థానికులకు ఇవ్వాల్సి ఉండగా 78 శాతం ఉద్యోగాలు స్థానికులకు లభించాయి.


