మెడికల్‌ హబ్‌గా రిమ్స్‌... | - | Sakshi
Sakshi News home page

మెడికల్‌ హబ్‌గా రిమ్స్‌...

Oct 31 2026 6:20 AM | Updated on Oct 31 2026 6:20 AM

మెడికల్‌ హబ్‌గా రిమ్స్‌...

రిమ్స్‌ వైద్యశాల ప్రాంగణం మెడికల్‌ హబ్‌గా తీర్చిదిద్దారు. రూ.322.82 కోట్లతో మూడు ఆధునాతన వైద్యశాలలను నిర్మించా రు. 452 పడకల సూపర్‌ స్పెషాలిటీ వైద్యశాల, 100 పడకల మానసిక వైద్యశాల, 100 పడకల కేన్సర్‌ హాస్పిటల్‌ను నెలకొల్పారు. మహానేత వైఎస్‌ఆర్‌ 180ఎకరాల విస్తీర్ణంలో రూ.220 కోట్లు వ్యయంతో ‘రిమ్స్‌’వైద్య కళాశాల, దంత వైద్య కళాశాల, నర్శింగ్‌ కళాశాలలను ఏర్పాటు చేశారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మరో రూ.322.82 కోట్లు వెచ్చించి, సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. కార్డియాలజీ, పిడియాట్రిక్‌, న్యూరాలజీ, ప్లాస్టిక్‌ సర్జరీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, నెఫ్రాలజీ లాంటి సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు రిమ్స్‌లో లభించనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement