టీడీపీ హయాంలో (2014–19)లో నిరా దరణకు గురైన కొప్పర్తి పారిశ్రామికవాడపై వైఎస్సార్ సీపీ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక చొరవ పెట్టారు. 801 ఎకరాల్లో వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్షర్ క్లస్టర్ ఏర్పాటు చేశారు. రూ.10వేల కోట్లు పెట్టుబడులు సమీకరించి లక్ష ఉద్యోగాలు సృష్టించేందుకు ప్రణాళికలు చేశారు. అందులోభాగంగా వేగంగా పారిశ్రామిక అడుగులు పడ్డాయి. రూ.80 కోట్లతో ఏర్పాటు చేసిన ఆల్డిక్సన్ కంపెనీ ప్రారంభమైంది. ఈసంస్థలో 1100 మందికి యువతకు ప్రత్యక్ష ఉద్యోగాలు లభించాయి. మరో రూ.127 కోట్లతో 1800 మందికి ఉపాధి లభించేలా విస్తరణ చేపట్టింది.


