● ప్రచారానికి తెర | - | Sakshi
Sakshi News home page

● ప్రచారానికి తెర

Oct 31 2026 6:20 AM | Updated on Oct 31 2026 6:20 AM

● ప్రచారానికి తెర

జిల్లాలో నవంబర్‌ 1న జరిగే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి సైలెన్స్‌ పీరియడ్‌ అమలులోకి వచ్చిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి పేర్కొన్నారు. మద్యం దుకాణాలు, మద్యం విక్రయాలను పూర్తిగా నిలిపివేయాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఓటర్లకు నగదు, మద్యం, ఇతర వస్తువుల పంపిణీ వంటి ప్రలోభాలకు పాల్పడరాదని హెచ్చరించారు. ఎవరైనా అక్రమంగా మద్యం విక్రయించినా, ఎక్కడైనా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనల అమలుపై పోలీసు, ఎన్నికల అధికారులు నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. – కడప సెవెన్‌రోడ్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement