టార్గెట్‌.. వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు! | - | Sakshi
Sakshi News home page

టార్గెట్‌.. వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు!

Oct 31 2026 6:20 AM | Updated on Oct 31 2026 6:20 AM

జమ్మలమడుగు : జమ్మలమడుగు నియోజకవర్గంలోని పెద్దముడియం మండలంలో ఖాకీల దౌర్జన్యం పతాకస్థాయికి చేరింది. ముఖ్యంగా వైఎస్సార్‌సీపీ నేతలనే టార్గెట్‌గా చేసుకుంటూ బెదిరింపులకు దిగుతున్నారు. నియోజకవర్గంలో 6 మండలాలు ఉండగా.. 5 మండలాల్లో ఎంపీటీసీ స్థానాలన్నీ కూటమి నేతలు దౌర్జన్యంగా ఏకగ్రీవం చేసుకున్నారు. ఒక్క పెద్దముడియం మండలంలోని 9 ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీంతోపాటు జెడ్పీటీసీ అభ్యర్థి కూడా నామినేషన్‌లు దాఖలు చేసి బరిలో ఉన్నారు. దీంతో ఎన్నికలు అనివార్యం అయ్యాయి. ఈ పరిస్థితే ఇటు కూటమి నేతలకు.. అటు ఖాకీ బాసులకు కంటగింపుగా మారింది. ఇంకేముంది సామ భేద దండోపాయాలన్నీ కూటమి ప్రయోగిస్తోంది. ఇందులో భాగంగానే పోలీస్‌స్టేషన్‌కు రావాలంటూ ఫోన్లు వస్తున్నాయి. తీరా అక్కడికి వెళితే ‘ఎన్నికల్లో ప్రచారం చేసుకోకూడదని, రాజీ కావచ్చు కదా’ అనే మాటలతో బెదిరింపులు చేస్తున్నారని తెలుస్తోంది. ఎన్నికల రోజున ఎటువంటి గొడవలు జరిగినా తమ నుంచి వైఎస్సార్‌సీపీ నాయకులకు సహకారం ఉండదని, ఇంకా ఏమైనా జరిగితే మీపైనే కేసులు నమోదు చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని సమాచారం.

వైఎస్సార్‌సీపీ నాయకులకే పిలుపులు..

మండలంలో ఎంపీటీసీలుగా వైఎస్సార్‌సీపీ నాయకులతోపాటు బీజేపీ, టీడీపీ నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. అందరినీ పిలిచి ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో అన్ని పార్టీలకు చెందిన నాయకులు ఎన్నికల ప్రచారం జరుపుకోవాలని, గొడవలు చేసుకోవద్దు అని సూచనలు చేయవలసిన పోలీసులు.. అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారు. మండలంలోని ఎన్‌.కొట్టాలపల్లి, పెద్దపసుపల, చదిపిరాళ్లదిన్నె తదితర గ్రామాలకు చెందిన వైఎస్సార్‌సీపీ నేతలను స్టేషన్‌కు పిలిపించుకుని మాట్లాడుతుండటంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు.

పోలీసు స్టేషన్‌కు రావాలంటూ ఫోన్లు

రూరల్‌ స్టేషన్‌కు క్యూకట్టిన

వైఎస్సార్‌సీపీ నాయకులు

ప్రచారం చేసుకోవద్దంటూ సూచనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement