ఎర్రగుంట్ల : తన కుటుంబంతో సన్నితంగా ఉన్నారనే అనుమానంతో రామాంజనేయులు అనే వ్యక్తి రాంప్రసాద్పై దాడి చేసి గొంతు కోసిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎర్రగుంట్ల ఎస్ఐ నాగమురళి తెలిపిన వివరాల మేరకు తీసుకుంటే.. మండల పరిధిలోని వలసపల్లి గ్రామానికి చెందిన రాంప్రసాద్ సమీపంలోని సిమెంట్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. అయితే అదే గ్రామానికి చెందిన రామాంజనేయులు కుటుంబంతో రాంప్రసాద్ సన్నితంగా ఉన్నాడు. దీనిపై అనుమానం పెంచుకొని రాంప్రసాద్పై రామాంజనేయులు దాడి చేశారు. ఫ్యాక్టరీ నుంచి తుమ్మలపల్లి గ్రామం మీదుగా వలసపల్లికు రాంప్రసాద్ వస్తుండగా రామాంజనేయులు మరో వ్యక్తితో కలసి రాంప్రసాద్పై కత్తితో దాడి చేసి గొంతు కోశాడు. దీంతో రక్త గాయాలతో పడి ఉన్న రాంప్రసాద్‌ను స్థానికులు ప్రొద్దుటూరు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రాంప్రసాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటనపై ఎస్ఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
చింతకొమ్మదిన్నె : కడప–చిత్తూరు జాతీయ రహదారిపై జమాలపల్లె సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున భారీ లారీ బోల్తా పడింది. దాచేపల్లి నుంచి బెంగళూరుకు వాల్ కేర్ పౌడర్ లోడుతో వెళ్తున్న 12 టైర్ల లారీ అదుపు తప్పడంతో రోడ్డుపైన ఉన్న బ్రిడ్జిపై అడ్డంగా పడింది. దీంతో తెల్లవారుజామున నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు ట్రాఫిక్ స్తంభించింది. ఈ ప్రమాద సమయంలో డ్రైవర్ భయపడి దూకేయడంతో ఎటువంటి గాయాలు కాలేదు. ఎదురుగా కూడా వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండగా ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. చింతకొమ్మదిన్నె సీఐ బాలమద్దిలేటి ఉదయాన్నే సిబ్బందితో వచ్చి క్రేన్లు పిలిపించి లారీని పక్కకు తొలగింప చేశారు. వెంటనే ట్రాఫిక్ క్లియర్ చేశారు.


