స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితి కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితి కల్పించాలి

Oct 31 2026 6:20 AM | Updated on Oct 31 2026 6:20 AM

● పోలింగ్‌ ప్రక్రియ కట్టుదిట్టంగా చేపట్టాలి

● రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి

రాజంపేట : మున్సిపాలిటీ, మండల పరిషత్‌ ఎన్నికల్లో ఓటు పడితే ఫ్యాన్‌కే అన్నది గర్వంగా చెప్పుకోవచ్చునని, అందుకు కారణం ప్రజావ్యతిరేక విధానాలే అని రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి పేర్గొన్నారు. మేడాభవన్‌లో శుక్రవారం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పలు మండలాలకు చెందిన నాయకులు ఎంపీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారాన్ని ఉపయోగించుకుని చేస్తున్న అరాచకాన్ని ఓటర్లు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారన్నారు. ఓటరును పోలింగ్‌ కేంద్రానికి వెళ్లనీయకుండా చేయాలనే కూటమి నేతల ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు సిద్ధమవుతున్నారన్నారు. పోలింగ్‌ రోజుకు ముందు నుంచి స్థానికేతరలను గుర్తించి, తిరిగి పంపాల్సిన ఆవశక్యత ఎంతైనా ఉందన్నారు. నామినేషన్ల పర్వంలో జరిగిన అరాచకం ఇప్పుడు పోలింగ్‌ ప్రక్రియలో జరగకుండా పోలీసు అధికారులు బ్రేక్‌ వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పోలింగ్‌ కేంద్రంలో ఓటరు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఉందన్నారు. ఈ మేరకు ఇక్కడి పోలీసులు ఽఅధికారులకు, ఎన్నికల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కొండూరు ప్రభావతమ్మ మేనల్లుడు రమేష్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వరీరెడ్డి, డీఆర్‌యూసీసీ మాజీ సభ్యుడు తంబెళ్ల వేణుగోపాల్‌రెడ్డి, నాయకులు పాలగిరి సుధాకర్‌రెడ్డి, ఒంటిమిట్ట, నందలూరు మండలాల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement