క్యూఆర్‌ కోడ్‌తో వేగంగా కార్గో సేవలు | - | Sakshi
Sakshi News home page

క్యూఆర్‌ కోడ్‌తో వేగంగా కార్గో సేవలు

Oct 30 2026 1:27 AM | Updated on Oct 30 2026 1:27 AM

కడప కోటిరెడ్డిసర్కిల్‌ : ఏపీఎస్‌ ఆర్టీసీలో కార్గో సేవలను మరింత సులభతరం చేస్తూ క్యూఆర్‌ కోడ్‌ ద్వారా ఫ్రీ బుకింగ్‌ సౌకర్యాన్ని ప్రవేశపెట్టామని ఏపీఎస్‌ ఆర్టీసీ కడప రీజినల్‌ మేనేజర్‌ రమేష్‌బాబు తెలిపారు. గురువారం కడప ఆర్టీసీ బస్టాండులో ఈ విధానంపై వినియోగదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఆర్‌ఎం మాట్లాడుతూ క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి పార్శిల్‌ పంపే ప్రాంతం, చేరవలసిన ప్రాంతం, పంపేవారి, స్వీకరించే వారి పేర్లు, ఫోన్‌ నంబర్లు, పార్శిల్‌ వివరాలు, చెల్లింపు విధానం వంటి అవసరమైన సమాచారం నమోదు చేసే విధానాన్ని వినియోగదారులు తెలుసుకోవాలన్నారు.

అన్ని వివరాలను నమోదు చేసి నిర్ధారించిన అనంతరం జనరేట్‌ అయ్యే ఫ్రీ బుకింగ్‌ కోడ్‌ను బుకింగ్‌ కౌంటర్‌ వద్ద చూపిస్తే పార్శి బుకింగ్‌ను త్వరగా పూర్తి చేసుకోవచ్చని తెలియజేశారు. ఈ క్యూఆర్‌ కోడ్‌ ఫ్రీ బుకింగ్‌ సదుపాయం ద్వారా బుకింగ్‌ కౌంటర వద్ద వేచి ఉండే సమయాన్ని తగ్గించుకోవచ్చని, పార్శిల్‌ బుకింగ్‌ ప్రక్రియను సులభంగా పూర్తి చేయవచ్చన్నారు. వినియోగదారులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement