జమ్మలమడుగు : నవంబర్ 1వ తేదీన(ఆదివారం) ఉదయమే మున్సిపాలిటీ పరిధిలోని ఓటర్లు మీ ఓటు హక్కు వినియోగించుకోకపోతే.. ఆ తర్వాత మీరు ఓటు వేయటానికి వెళ్లినా గల్లంతై ఉంటుందని, మీ ఓటును కూటమి నాయకులే దౌర్జన్యంగా వేసుకుంటారని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఓటర్లు త్వరగా మీ ఓటును మీరే వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. గురువారం సాయంత్రం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో స్థానిక సంస్ధల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నా.. కాపాడవలసిన పోలీసు వ్యవస్థ, జిల్లా కలెక్టర్, ఎన్నికల కమిషన్ పట్టించుకోకపోవడం దారుణం అన్నారు.
ఫ్యాషన్ ముసుగులో ఫ్యాక్షన్‌కు ఆజ్యం
జమ్మలమడుగులోనే కాకుండా, జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్‌రెడ్డి ఫ్యాషన్ ముసుగులో ఫ్యాక్షన్ రాజకీయాలకు ఆజ్యం పోయడంతోపాటు జమ్మలమడుగులో పాత కాల ఫ్యాక్షన్‌ను జిల్లాకు అంటించడం జరుగుతోందని ధ్వజమెత్తారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆరు మండలాలు, రెండు మున్సిపాలిటీలు ఉండగా.. ఎర్రగుంట్ల మున్సిపాలిటీతోపాటు ఐదు మండలాల్లో నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడంతోపాటు నామినేషన్‌లు వేసిన వారిపై దౌర్జన్యాలకు పాల్పడటం, అది కూడా వద్దిరాల ఎంపీటీసీ మహాలక్ష్మీతోపాటు మరో నలుగురు పోతుండగా.. వారిపై దాడి చేసి, కారును ధ్వంసం చేశారన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతోందని, గెలవలేమనే భయంతోనే వారు దాడులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈసీ సభ్యుడు గిరిధర్‌రెడ్డి, హనుమంతరెడ్డి, పొన్నపురెడ్డి వెంకట శివారెడ్డి, ముల్లాజానీ, కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్యం ఖూనీ చేస్తున్న
కూటమి నాయకులు
దౌర్జన్యాలకు పాల్పడి ఓటర్లను
భయభ్రాంతుల గురికి సన్నాహాలు
ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి


