● ప్రస్తుత పరిస్థితులను ప్రజలు గమనిస్తున్నారు
● వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి
వేంపల్లె : కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లెలో మెయిన్‌బజార్‌లో గల ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేసి స్థానిక ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను, సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. కూటమి పాలన ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో ప్రజల ఆస్తి, మాన, ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. చంద్రబాబు ప్రెస్‌మీట్లు చూస్తే అసహ్యం కలుగుతోందన్నారు. ప్రజలకిచ్చిన హామీలను గాలికొదిలేశారన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశన్నంటుతున్నాయని మండిపడ్డారు. ప్రజల ఆగ్రహం నుంచి తప్పించుకునేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై బురద చల్లుతున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ విషయాలు మాట్లాడే స్థాయికి చంద్రబాబు దిగజారారని, స్థాయి మరిచి వ్యక్తిగత విమర్శలకు దిగడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు కుటుంబం గురించి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పుడైనా మీడియాలో మాట్లాడారా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ చెల్లెలి హక్కుల గురించి మాట్లాడే ముందు తన కుటుంబ వ్యవహారాలను పరిశీలించుకోవాలని చంద్రబాబుకు సూచించారు. కుటుంబ ఆస్తుల గురించి మాట్లాడేందుకు చంద్రబాబుకు ఏ అర్హత ఉందని సతీష్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. లోకేశ్ చేస్తున్న పనులకు చంద్రబాబు బాధ్యత వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా అధికారులు ప్రజలకు సహకరించాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు రాచినేని వేణుగోపాల్, నంబూరు కులాయప్ప, మునీర్ భాష, రాఘవయ్య, అజయ్‌కుమార్‌రెడ్డి, ఎంహెచ్ హబీబుల్లా తదితరులు పాల్గొన్నారు.


