రాజంపేట టీడీపీ నేతలపై కేసు | - | Sakshi
Sakshi News home page

రాజంపేట టీడీపీ నేతలపై కేసు

Oct 30 2026 1:27 AM | Updated on Oct 30 2026 1:27 AM

● వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై దాడి

● ఎమ్మెల్యే వాహనం దగ్ధం చేసిన పచ్చమూకలు

రాజంపేట : మున్సిపాలిటీ ఎన్నికల నేపఽథ్యంలో ఈ నెల 17న జరిగిన ఘర్షణలకు సంబంధించి రాజంపేట టీడీపీ నేతలపై అర్బన్‌ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు. 66 మంది టీడీపీ నేతలపై ఈ కేసు పెట్టడం జరిగింది. ఈనెల 27న కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రాజంపేట పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై పచ్చమూకలు, గంజాయి బ్యాచ్‌లు, రౌడీలు మూకుమ్మడిగా దాడి చేసి ధ్వంసం చేసిన సంగతీ తెలిసిందే. వైఎస్సార్‌ కార్యాలయంపై దాడి చేసిన సంఘటనను ప్రత్యక్షంగా చూసిన వైఎస్సార్‌సీపీ నాయకుడు ఆర్‌.వేములయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అర్బన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులపై (బీఎన్‌ఎస్‌) సెక్షన్లు 191(2), 191(3), 324(4), 329(4), 351(2)తోపాటు 190 సెక్షన్లతో కేసులు నమోదు చేసినట్లు అర్బన్‌ పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement