కడప రూరల్ : అర్నబ్ తుపాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ యుగంధర్ సూచించారు. మంగళవారం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ముందస్తు జాగ్రత్తలు, అత్యవసర వైద్య సేవల సంసిద్ధతపై డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ, రవాణా శాఖ, అంబులెన్స్‌ల సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుపాను ప్రభావం దష్ట్యా జిల్లాలోని అంబులెన్సులన్నీ పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా వైద్య సేవలు అందించాలన్నారు. అంబులెన్సుల పనితీరు, ఇంధన లభ్యత, వాహనాల సాంకేతిక, ఆక్సిజన్ సిలిండర్లు, అత్యవసర వైద్య పరికరాలు అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో సమన్వయంతో పని చేస్తూ, అవసరమైన ప్రాంతాలకు అంబులెన్సులను తక్షణమే పంపించే విధంగా సిబ్బంది సిద్ధంగా ఉండాలని సూచించారు. సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పని చేస్తూ, ప్రజల ప్రాణ రక్షణకు ప్రాధాన్యతనిస్తూ, తుపాను సమయంలో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వైద్య అత్యవసర సేవలను సిద్ధంగా ఉంచాలని తెలిపారు. సమావేశంలో జిల్లా ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ మహమ్మద్ తాహా, డాక్టర్ ఆరిఫుల్లా, డాక్టర్ బాలంజనేయులు, డాక్టర్ వెంకట చంద్రారెడ్ది, డెమో భారతి, ఎపిడమాలజిస్ట్ ఖాజా, ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


