ఆర్టీసీ దసరా ఆదాయం అదుర్స్‌ | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ దసరా ఆదాయం అదుర్స్‌

Oct 28 2026 5:54 AM | Updated on Oct 28 2026 5:54 AM

కడప కోటిరెడ్డిసర్కిల్‌ : దసరా పండుగను పురస్కరించుకుని కడప జోన్‌ వ్యాప్తంగా (కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, శ్రీ సత్యసాయి) 1140 బస్సులను నడపడం ద్వారా ఆదాయం అదుర్స్‌ అనిపించిందని కడప జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆర్‌ఆర్‌కే కిశోర్‌ తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాదిలో గణనీయంగా ఆదాయం వచ్చిందన్నారు. ఎనిమిది జిల్లాల నుంచి రూ. 3,04,60,951 సమకూరిందన్నారు. 1,62,154 మంది ప్రయాణీకులు ఆర్టీసీని ఆదరించారన్నారు. గతేడాదితో పోలిస్తే రూ. 66,46,457 అదనపు ఆదాయం వచ్చిందన్నారు.

ప్రతి స్టాల్‌ వద్ద అగ్నిమాపక

పరికరాలు తప్పనిసరి

కడప కోటిరెడ్డిసర్కిల్‌ : దీపావళి పండుగను పురస్కరించుకుని కడప నగరంలో ఏర్పాటు చేయనున్న బాణాసంచా తాత్కాలిక స్టాల్స్‌ నిర్వహణకు సంబంధించి తప్పనిసరిగా అగ్నిమాపక పరికరాలు, ఇసుక బకెట్లతోపాటు నీటిని అందుబాటులో ఉంచుకోవాలని కడప ఆర్డీఓ మురళి ఆదేశించారు. స్టాల్స్‌ నిర్వహణపై డీఎఫ్‌ఓ, ఏపీఎస్‌ పీడీసీఎల్‌ డీఈ, కడప, సీకే దిన్నె తహసీల్దార్లు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ వైరింగ్‌ విషయంలో ఏపీఎస్‌పీడీసీఎల్‌ నిబంధనలు పాటించాలని, అనుమతి లేని విద్యుత్‌ కనెక్షన్లు, లూజ్‌ వైరింగ్‌ ఉండకూదడని సూచించారు. లైసెన్సులో పేర్కొన్న దానికంటే ఎక్కువ బాణాసంచా నిల్వ ఉంచరాదని, స్టాల్స్‌ మధ్య తగిన దూరం పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో కడప తహసీల్దార్‌ మాహబూబ్‌చాంద్‌, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement