27న
26న
గంధం
● భక్తుల కొంగుబంగారంగా
నిలుస్తున్న అమీన్‌పీర్ (పెద్ద) దర్గా
● కళకళలాడుతున్న కడప నగరం
● పూర్తయిన ఏర్పాట్లు
ఉరుసు
ముషాయిరా
నేటి నుంచి పెద్ద దర్గా ఉరుసు
కడప సిటీ : దేశంలోనే గొప్ప దర్గాలలో ఒకటిగా ఖ్యాతిగాంచిన కడప అమీన్‌పీర్ దర్గా (పెద్ద దర్గా) మొదటి వరుసలో ఉంది. ఆధ్యాత్మిక చింతనకు.....మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న అమీన్‌పీర్ దర్గా ఉరుసు మహోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఉరుసు ఉత్సవాలకు దర్గాను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇప్పటికే ఆ ప్రాంతం విద్యుద్దీపశోభతో ఉత్సవ కాంతులను వెదజల్లుతోంది. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో దర్గా ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడుతోంది. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం గంధం, సోమవారం ఉరుసు , 29న పీఠాధిపతి నగరోత్సవం నిర్వహించనున్నారు.
విలక్షణ సూఫీ ఆధ్యాత్మిక కేంద్రం
ఈ దర్గాకు సంబంధించిన ప్రథమ సూఫీ హజరత్ ఖ్వాజా సయ్యద్‌షా పీరుల్లా మహమ్మద్ చిష్ఠివుల్‌ఖాద్రీ కర్ణాటకలోని బీదర్ ప్రాంతం నుంచి 16వ శతాబ్దంలో ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చారు. సూఫీ తత్వాలతో ప్రజల్లో దైవ చింతనను పెంచిన ఈయనకు నాటి కడప నవాబులు ప్రియ శిష్యులుగా ఉండేవారు. ఆయన వారసునిగా ప్రస్తుతం హజరత్ ఖ్వాజా సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ 11వ పీఠాధిపతిగా వ్యవహరిస్తున్నారు. చిన్న వయస్సులోనే అనేక మత గ్రంథాలను అధ్యయనం చేసి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సాధించిన ఈయన శిష్య కోటికి కొంగు బంగారంగా నిలిచారు. దర్గాపై అపార విశ్వాసం గల భక్తులు మన దేశంతోపాటు ఇతర దేశాలలో కూడా ఉన్నారు. ప్రముఖ సినీ ప్రముఖులు ఏఆర్ రెహ్మాన్ తన కుటుంబంతో ఏడాదికి కనీసం ఆరేడుసార్లు దర్గా గురువుల దర్శనానికి వస్తుంటారు. బాలీవుడ్ స్టార్లు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యబచ్చన్, అమీర్‌ఖాన్, సల్మాన్‌ఖాన్‌లతోపాటు తెలుగు, తమిళ సినీ ప్రముఖులు కూడా ఈ దర్గాను తరచూ దర్శిస్తుంటారు. ఉత్స వాలకు లక్షలాదిగా భక్తులు తరలిరానున్నారు.
29న
28న


